India's largestHyperlocal short
news App
Get daily news updates that are tailored for you based on your preferred language & location.

TG: హైదరాబాద్‌లో బయో ఏషియా సదస్సును సీఎం రేవంత్ రెడ్డి ప్రారంభించారు. ఈ సందర్భంగా ప్రొఫెసర్ పాట్రిక్సన్కు జినోమ్ వ్యాలీ ఎక్స్ లెన్స్ అవార్డును అందజేశారు. నానో టెక్నాలజీ సాయంతో వైద్యరంగంలో సరికొత్త విధానాలకు ఆస్కారం ఉందని ఆమె అన్నారు. పరిశోధన రంగం కొత్త పుంతలు తొక్కుతోందని, జినోమ్ థెరపీతో అనేక వ్యాధులకు చికిత్స సులభం అవుతుందని చెప్పారు. రెండు రోజుల పాటు ఈ సదస్సు జరగనుంది.

యూపీలో హిజాబ్ కలకలం రేపింది. జౌన్‌పూర్‌లో పదో తరగతి పరీక్షా కేంద్రంలో వెరిఫికేషన్ కోసం హిజాబ్ తొలగించాలని కోరగా 10 మంది విద్యార్థినులు అందుకు నిరాకరించారు. అంతటితో ఆగకుండా పరీక్ష రాయకుండా ఇంటికి వెళ్లిపోయారు. హిజాబ్‌తో అనుమతిస్తేనే పరీక్షలకు పంపుతామని విద్యార్థినుల తల్లిదండ్రులు తేల్చి చెప్పారు. మరోవైపు ఫేస్ వెరిఫికేషన్ కోసమే తాము హిజాబ్ తీయమని కోరినట్లు కాలేజీ సిబ్బంది వెల్లడించారు.

AP: తెలంగాణ కాంగ్రెస్ సీనియర్ నేత వి.హన్మంతరావు ఏపీ సీఎం చంద్రబాబును కలిశారు. నిన్న విజయవాడలో ఆయనను కలిసి.. ఏపీలోని ఒక జిల్లాకు దివంగత సీఎం దామోదరం సంజీవయ్య పేరును పెట్టాలని, స్మృతివనం నిర్మించాలని కోరారు. ఇందుకు చంద్రబాబు సానుకూలంగా స్పందించారని, దళిత సీఎం అయిన సంజీవయ్య అత్యంత నిజాయితీపరుడని వీహెచ్ పేర్కొన్నారు.

ట్రైనీ ఇంజినీర్ల అసెస్మెంట్ టెస్టును ఇన్ఫోసిస్ నిరవధికంగా వాయిదా వేసింది. మైసూర్ క్యాంపస్‌లో 350 మందిని తొలగించిన కొన్ని రోజులకే ఈ నిర్ణయం తీసుకుంది. OCTలో కంపెనీ 1000 మందిని నియమించుకుంది. వారు 3 దఫాల్లో అసెస్మెంట్ క్లియర్ చేయకుంటే ఇంటికెళ్లాల్సిందే. మొన్న ట్రైనీలను తొలగించిన <<15417347>>తీరు<<>>, ఈ అంశం లేబర్ మినిస్ట్రీకి చేరడం, దేశవ్యాప్తంగా విమర్శలు రావడంతో కంపెనీ మూడో అటెంప్టు వాయిదా వేసినట్టు తెలుస్తోంది.

AP: అన్నమయ్య (D)లో నేడు ఏనుగుల దాడిలో ముగ్గురు చనిపోయారు. అటు పార్వతీపురం మన్యం(D) జియ్యమ్మవలస(M)లో రైస్ మిల్లులోని ధాన్యం, బియ్యాన్ని గజరాజులు చెల్లాచెదురు చేశాయి. దీంతో కుంకీ ఏనుగులు ఎక్కడ? అనే ప్రశ్న ఉత్పన్నమవుతోంది. ప్రజలకు నష్టం జరగకుండా గజరాజులను కుంకీ ఏనుగులతో తరిమేస్తామన్న ప్రభుత్వం ఏం చేస్తోందని బాధితులు నిలదీస్తున్నారు. మరో ప్రాణం పోకుండా చర్యలు తీసుకోవాలని కోరుతున్నారు.

AP: వైసీపీ నేత వల్లభనేని వంశీపై మరో కేసు నమోదైంది. గన్నవరంలో తమ పేరిట ఉన్న రూ.10 కోట్ల విలువైన స్థలం కబ్జా చేశారని హైకోర్టు లాయర్ సతీమణి సుంకర సీతామహాలక్ష్మి పోలీసులకు ఫిర్యాదు చేశారు. దీంతో వంశీతో పాటు మరో 15 మందిపై పోలీసులు కేసు నమోదు చేశారు. కాగా ఇప్పటికే జైలులో ఉన్న వంశీపై అక్రమ మైనింగ్, భూకబ్జాల ఆరోపణలపై ప్రభుత్వం సిట్ ఏర్పాటు చేసింది.

పాకిస్థాన్‌తో మ్యాచులో సెంచరీతో చెలరేగిన విరాట్ కోహ్లీపై ఆసీస్ మాజీ ప్లేయర్ పాంటింగ్ పొగడ్తల వర్షం కురిపించారు. వన్డే ఫార్మాట్లో విరాట్ కన్నా ఉత్తమ బ్యాటర్‌ను తాను చూడలేదని చెప్పారు. ఆయనలో పరుగుల దాహం ఉన్నంత వరకు ఫిట్‌గానే ఉంటారన్నారు. వన్డేల్లో సచిన్ అత్యధిక పరుగుల రికార్డును బ్రేక్ చేస్తారని అభిప్రాయపడ్డారు. పాక్‌తో జరిగిన మ్యాచులో కోహ్లీ 51వ ODI సెంచరీ చేసిన సంగతి తెలిసిందే.

పాన్ ఇండియా స్టార్ ప్రభాస్ పేరుపై ఓ ఊరుందనే విషయం ఎంతమందికి తెలుసు? నేపాల్‌లో ‘ప్రభాస్’ అనే ఊరు ఉంది. ఓ తెలుగు మోటో వ్లాగర్ నేపాల్ పర్యటనలో ఉండగా అతనికి ఈ విలేజ్ కనిపించింది. దీంతో డార్లింగ్ పేరుతో ఊరు ఉందంటూ వీడియో షేర్ చేశాడు. అయితే, ప్రభాస్‌కు ఈ ఊరికీ ఎలాంటి సంబంధం లేదని తెలుస్తోంది. ఈ వీడియోను ఫ్యాన్స్ తెగ షేర్ చేస్తున్నారు. కాగా, సచిన్, కోహ్లీల పేరిట రైల్వే స్టేషన్లు ఉన్న విషయం తెలిసిందే.

టాటా గ్రూప్ నుంచి మరో కంపెనీ పబ్లిక్ ఇష్యూకు రానుంది. IPO ప్రణాళికలను ఆమోదించినట్టు టాటా క్యాపిటల్ మంగళవారం తెలిపింది. ఫ్రెష్ ఇష్యూ కింద 23 కోట్ల ఈక్విటీ షేర్లు, ఇప్పటికే ఉన్న షేర్ హోల్డర్లకు OFS కింద స్టాక్స్ ఇవ్వనుంది. రూ.1504 కోట్ల విలువైన షేర్లను రైట్స్ ఇష్యూ కింద కేటాయిస్తోంది. నోటిఫై చేసిన మూడేళ్లలో అప్పర్ లేయర్ NBFCలు IPOకు రావాలన్న RBI నిబంధనల మేరకు కంపెనీ ఈ నిర్ణయం తీసుకుంది.

TG: మార్చి 1న కొత్త రేషన్ కార్డులు ఇవ్వనున్నట్లు మంత్రి పొన్నం ప్రభాకర్ ట్వీట్ చేశారు. ముందుగా హైదరాబాద్, ఉమ్మడి రంగారెడ్డి, మహబూబ్‌నగర్ జిల్లాల్లో పంపిణీ చేయనున్నట్లు Xలో తెలిపారు. ఒకే రోజు లక్ష కొత్త కార్డులు ఇవ్వనున్నట్లు పేర్కొన్నారు. మార్చి 8 తర్వాత ఇతర ప్రాంతాల్లోనూ ఇస్తామని చెప్పారు. పదేళ్ల తర్వాత పేద బిడ్డల కల నెరవేరుతోందని రాసుకొచ్చారు.
Sorry, no posts matched your criteria.