news

News December 28, 2024

దివ్యాంగులకు షాక్.. సదరం సర్టిఫికెట్ల జారీ నిలిపివేత

image

AP: సామాజిక పింఛన్ల తనిఖీ పూర్తయ్యే వరకు దివ్యాంగులకు సదరం సర్టిఫికెట్ల జారీ ప్రక్రియను నిలిపివేస్తున్నట్లు వైద్యారోగ్య శాఖ ప్రకటించింది. దీంతో కొత్త పింఛన్ల కోసం ఎదురుచూస్తున్న దివ్యాంగులకు నిరాశ ఎదురుకానుంది. పింఛన్‌దారులలో అనర్హులు ఉన్నట్లు ప్రభుత్వం భావిస్తోంది. దీంతో జనవరి నుంచి మే వరకు పింఛన్ల తనిఖీ చేయనున్నట్లు సమాచారం. తొలుత రూ.15వేలు అందుకునే లబ్ధిదారులకు పరీక్షలు నిర్వహిస్తారట.

News December 28, 2024

లైంగిక వేధింపులు.. నటుడు అరెస్ట్

image

లైంగిక వేధింపుల కేసులో క‌న్నడ బుల్లితెర న‌టుడు చరిత్ బాలప్పను BNGL పోలీసులు అరెస్ట్ చేశారు. ప్రేమ పేరుతో మోసం చేసి లైంగిక దాడికి పాల్పడ్డాడని ఓ యువతి ఫిర్యాదు చేసింది. డబ్బులు ఇవ్వాలని వేధించేవాడని, ప్రైవేట్ వీడియోలు లీక్ చేస్తామని బెదిరించాడని ఆమె పేర్కొంది. ఇతను కన్నడలో పాపులర్ ‘ముద్దులక్ష్మీ’తోపాటు తెలుగులో పలు సీరియళ్లలో నటించాడు. గతంలో నటి మంజును పెళ్లాడి విడాకులు తీసుకున్నాడు.

News December 28, 2024

స్టాక్స్‌కు దూరం.. FDలకే మన్మోహన్ మొగ్గు

image

ఆర్థికవేత్తగా తన సంస్కరణలతో దేశాన్ని ముందుకు నడిపించిన మన్మోహన్ సింగ్ స్టాక్‌మార్కెట్‌కి ఎప్పుడూ దూరంగా ఉండేవారు. అందులో ఒడిదుడుకులతో నిద్ర కోల్పోవడం తనకు ఇష్టం లేదని 1992లో పార్లమెంటులో ఆయన చెప్పారు. తన డబ్బును ఫిక్స్‌డ్ డిపాజిట్లు, పోస్టాఫీస్ సేవింగ్స్ స్కీమ్స్‌లో మాత్రమే పెట్టేవారు. 2019 నాటికి ఆయన మొత్తం ఆస్తి విలువ రూ.15కోట్లు. అందులో FDల్లో రూ.7 కోట్లు, పోస్టాఫీస్‌లో రూ.12 లక్షలు ఉంది.

News December 28, 2024

నేడు మన్మోహన్ అంత్యక్రియలు

image

మాజీ ప్రధాని మన్మోహన్ సింగ్ అంత్యక్రియలను ఇవాళ ఉదయం 11.45 గంటలకు ఢిల్లీలోని నిగమ్‌బోధ్ ఘాట్‌లో జరగనున్నాయి. సైనిక లాంఛనాలతో అంతిమ సంస్కారాలు నిర్వహించేందుకు కేంద్రం ఏర్పాట్లు చేసింది. తొలుత మన్మోహన్ పార్థీవ దేహాన్ని ఆయన నివాసం నుంచి AICC కార్యాలయానికి తరలిస్తారు. అక్కడ ప్రజల సందర్శనార్థం కొద్దిసేపు ఉంచి నిగమ్‌బోధ్ ఘాట్‌కు తీసుకెళ్తారు.

News December 28, 2024

రెండు పార్టులుగా VD12 మూవీ: నాగవంశీ

image

గౌతమ్ తిన్ననూరి డైరెక్షన్‌లో విజయ్ దేవరకొండ నటిస్తున్న VD12 మూవీ రెండు పార్ట్‌లుగా రాబోతోందని నిర్మాత నాగవంశీ వెల్లడించారు. అయితే రెండు పార్టుల్లో వేర్వేరుగా కథ ఉంటుందని తెలిపారు. ప్రస్తుతం తొలి భాగం 80 శాతం షూటింగ్ పూర్తయ్యిందన్నారు. మార్చిలో మూవీ విడుదలకు ప్లాన్ చేస్తున్నామని, ఒకవేళ హరిహరవీరమల్లు రిలీజ్ ఉంటే వాయిదా వేస్తామని చెప్పారు.

News December 28, 2024

TG టెట్ అభ్యర్థులకు కీలక సూచనలు

image

JAN 2 నుంచి 20 వ‌ర‌కు టెట్ పరీక్ష జరగనుంది. ఉ.9 నుంచి 11.30 వ‌ర‌కు, మ‌.2 నుంచి 4.30 వ‌ర‌కు రెండు సెషన్లలో నిర్వహిస్తారు. అభ్యర్థులను గంటన్నర ముందే పరీక్ష కేంద్రంలో అనుమతిస్తారు. ఎగ్జామ్ ప్రారంభానికి 15 నిమిషాల ముందే గేట్ల‌ను క్లోజ్ చేస్తారు. అభ్య‌ర్థులు త‌ప్ప‌నిస‌రిగా హాల్ టికెట్‌తో పాటు బ్లాక్ లేదా బ్లూ బాల్ పాయింట్ పెన్, గుర్తింపు కార్డు తీసుకెళ్లాలి. ఎల‌క్ట్రానిక్ ప‌రిక‌రాల‌కు అనుమ‌తి లేదు.

News December 28, 2024

డెబ్యూ మ్యాచ్‌లోనే చరిత్ర సృష్టించిన SA ప్లేయర్

image

సౌతాఫ్రికా ఆల్‌రౌండర్ కోర్బిన్ బాష్ అరంగేట్ర మ్యాచ్‌లోనే రికార్డు సృష్టించారు. పాక్‌తో జరుగుతున్న తొలి టెస్టు ఫస్ట్ ఇన్నింగ్స్‌లో 4 వికెట్లు తీసిన అతను 9వ స్థానంలో బ్యాటింగ్‌కు దిగి 81* రన్స్ చేశారు. క్రికెట్ హిస్టరీలో ఇలా మొదటి మ్యాచ్‌లోనే 4 వికెట్లు, హాఫ్ సెంచరీ చేసిన తొలి ఆటగాడిగా నిలిచారు. అలాగే డెబ్యూ మ్యాచ్‌లో 9వ ప్లేస్‌లో బ్యాటింగ్‌కు దిగి అత్యధిక స్కోరు చేసిన ప్లేయర్‌గానూ నిలిచారు.

News December 28, 2024

English Learning: Antonyms

image

✒ Encumbrance× Incentive, stimulant
✒ Efface× Retain, Maintain
✒ Eloquence× Halting, Stammering
✒ Enormous× Diminutive, negligible
✒ Endeavour× Cease, quit
✒ Equivocal× Obvious, lucid
✒ Epitome× Increment, expansion
✒ Eradicate× Secure, plant
✒ Fallacy× Veracity, Truth

News December 28, 2024

TG ప్రజాప్రతినిధులకు టీటీడీ గుడ్‌న్యూస్

image

తిరుమల శ్రీవారి దర్శనానికి తెలంగాణ ప్రజాప్రతినిధుల సిఫారసు లేఖలను అనుమతించకపోవడంపై విమర్శలు వస్తుండటంతో టీటీడీ స్పందించింది. ఇకపై వారానికి రెండు సార్లు తెలంగాణ మంత్రులు, ఎమ్మెల్యేలు, ఎంపీలు, ఎమ్మెల్సీల సిఫారసు లేఖలను అనుమతించాలని నిర్ణయించింది. ఇటీవల మాజీ మంత్రి శ్రీనివాస్‌గౌడ్, మంత్రి కొండా సురేఖ కూడా ఈ అంశంపై అసంతృప్తి వ్యక్తం చేసిన విషయం తెలిసిందే.

News December 28, 2024

సుమతీ నీతి పద్యం- తాత్పర్యం

image

సిరి తా వచ్చిన వచ్చును
సలలితముగ నారికేళ సలిలము భంగిన్
సిరి తా పోయిన పోవును
కరి మ్రింగిన వెలగపండు కరణిని సుమతీ!
తాత్పర్యం: టెంకాయ లోపలికి నీరు వచ్చినట్లు సంపద తెలియకుండానే వస్తుంది. ఏనుగు మింగిన వెలగపండులోని గుజ్జు మాదిరి సంపద తెలియకుండానే మాయమవుతుంది.