news

News August 20, 2024

కోల్‌కతా ఘటనపై ఫేక్ లెటర్‌.. సీబీఐ ప్రకటన

image

కోల్‌కతాలో ట్రైనీ డాక్టర్‌‌పై హత్యాచార ఘటనకు సంబంధించి CBI ప్రకటన పేరిట ఓ లేఖ సోషల్ మీడియాలో తెగ వైరలవుతోంది. అయితే, ఈ లెటర్ ఫేక్ అని సీబీఐ క్లారిటీ ఇచ్చింది. ఏసీబీ డీఐజీ కార్యాలయం నుంచి రిలీజైనట్లు ఉన్న ఈ లెటర్ వాట్సాప్‌లో చక్కర్లు కొడుతోంది. ఢిల్లీలోని సీబీఐ హెడ్‌క్వార్టర్స్ ఈ కేసును దర్యాప్తు చేస్తోందని తెలిపింది. ప్రజలు ఈ లేఖను నమ్మొద్దని పేర్కొంది.

News August 20, 2024

Stock Market: గరిష్ఠాల వైపు పరుగులు

image

స్టాక్ మార్కెట్లు భారీ లాభాల్లో ముగిశాయి. మళ్లీ జీవితకాల గరిష్ఠాల వైపు పరుగులు పెడుతున్నాయి. నేటి ఉదయం 80,722 వద్ద మొదలైన BSE సెన్సెక్స్ చివరికి 378 పాయింట్ల లాభంతో 80,802 వద్ద ముగిసింది. 24,648 వద్ద ఓపెనైన NSE నిఫ్టీ 126 పాయింట్లు ఎగిసి 24,698 వద్ద క్లోజైంది. SBI లైఫ్, HDFC లైఫ్, బజాజ్ ఫిన్‌సర్వ్, ఇండస్‌ఇండ్ బ్యాంక్, శ్రీరామ్ ఫిన్ టాప్ గెయినర్స్. ఎయిర్‌టెల్, ONGC, అపోలో హాస్పిటల్స్ నష్టపోయాయి.

News August 20, 2024

నాగ చైతన్య- శోభిత పెళ్లి ఎప్పుడు?

image

నాగ చైతన్య, శోభిత డెస్టినేషన్ వెడ్డింగ్‌కు ప్లాన్ చేస్తున్నట్లు తెలుస్తోంది. రాజస్థాన్/మధ్యప్రదేశ్, లేదా విదేశాల్లో సరైన వేదిక కోసం ఇరు కుటుంబాలు వెతుకుతున్నట్లు సమాచారం. ఈ ఏడాది చివరిలో లేదా ఫిబ్రవరి/మార్చి ముహూర్తాల్లో వివాహం జరుగుతుందని వారి సన్నిహితులు చెబుతున్నారు. ఈ నెల 8న వారి ఎంగేజ్‌మెంట్ జరగగా, పెళ్లికి కాస్త సమయం తీసుకుంటామని నాగార్జున వెల్లడించిన విషయం తెలిసిందే.

News August 20, 2024

కేజ్రీవాల్ జుడీషియల్ కస్టడీ మరోసారి పొడిగింపు

image

లిక్కర్ స్కాం కేసులో అరెస్టైన ఢిల్లీ సీఎం అరవింద్ కేజ్రీవాల్ జుడీషియల్ కస్టడీని మరోసారి పొడిగించారు. ఈనెల 27 వరకు కస్టడీని పొడిగిస్తూ ఢిల్లీలోని రౌస్ అవెన్యూ కోర్టు తీర్పు వెలువరించింది. లిక్కర్ స్కాం కేసులో జూన్ 26 కేజ్రీవాల్‌ను సీబీఐ అరెస్ట్ చేసింది. మరోవైపు ఇదే కేసులో అరెస్టైన బీఆర్ఎస్ MLC కవిత రిమాండ్‌ను కూడా ఈనెల 27 వరకు కోర్టు పొడిగించింది.

News August 20, 2024

ఇన్ఫోసిస్ ‘పవర్’ ప్రోగ్రామ్: ఫ్రెషర్స్‌కు రూ.9 లక్షల ప్యాకేజీ!

image

ఫ్రెషర్స్ కోసం ‘పవర్’ పేరిట ఇన్ఫోసిస్ స్పెషల్ ప్రోగ్రామ్ తీసుకురానున్నట్లు సమాచారం. కోడింగ్, ప్రోగ్రామింగ్, సాఫ్ట్‌వేర్‌ ఛాలెంజింగ్స్‌లో స్కిల్ ఉన్నవారికి ప్రాధాన్యత ఇవ్వనున్నట్లు కంపెనీ వర్గాలు వెల్లడించాయి. పరీక్ష, ఇంటర్వ్యూ తర్వాత ఎంపికైన వారికి ₹4-6.5లక్షల నుంచి ₹9లక్షల వరకూ వార్షిక ప్యాకేజీ ఉంటుందని తెలిపాయి. గతేడాది TCS ప్రైమ్ పేరిట ₹9-11లక్షల ప్యాకేజీతో ఇదే తరహా ప్రోగ్రామ్‌ తీసుకొచ్చింది.

News August 20, 2024

22న రాష్ట్రవ్యాప్త నిరసనలకు BRS పిలుపు

image

TG: రైతు రుణమాఫీపై బీఆర్ఎస్ నిరసనలకు పిలుపునిచ్చింది. ఈనెల 22న రాష్ట్రవ్యాప్తంగా ధర్నాలు చేయాలని నిర్ణయించింది. 40శాతం మందికి రుణమాఫీ కాలేదని బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ ఆరోపించారు. రైతులందరికీ తక్షణమే రుణాలు మాఫీ చేయాలని డిమాండ్ చేశారు.

News August 20, 2024

అందుకే విగ్రహ వివాదానికి తెరలేపారు: బండి

image

TG: రుణమాఫీపై చర్చను పక్కదారి పట్టించేందుకే విగ్రహాల వివాదాన్ని తెరపైకి తెచ్చారని కేంద్రమంత్రి బండి సంజయ్ ఆరోపించారు. ‘సెక్రటేరియట్‌లో రాజీవ్ గాంధీ విగ్రహం పెడతామని రేవంత్ అంటే.. తమ ప్రభుత్వం వచ్చాక KTR తీసేస్తామంటున్నారు. కాంగ్రెస్, BRS కూడబలుక్కునే ఈ వివాదానికి తెరలేపాయి. ప్రజలు ఆలోచించాలి. ఆరు గ్యారంటీలపైనే రాష్ట్రంలో చర్చ జరగాలి. ప్రజలకు కావాల్సింది విగ్రహాలు కాదు.. హామీల అమలు’ అని అన్నారు.

News August 20, 2024

హరియాణా ఎన్నికల్లో వినేశ్ పోటీ?

image

ఒలింపిక్స్ ఫైనల్‌కు ముందు అధిక బరువుతో అనర్హత వేటుపడ్డ రెజ్లర్ వినేశ్ ఫొగట్ రాజకీయాల్లోకి వస్తారని వినికిడి. హరియాణా అసెంబ్లీ ఎన్నికల్లో ఓ ప్రధాన పార్టీ నుంచి బరిలోకి దిగే అవకాశం ఉందని ఆమె సన్నిహితులు చెప్పారని IANS తెలిపింది. ఆమెతో పాటు భజరంగ్ పునియా సైతం రాజకీయ రణరంగంలోకి రావొచ్చని వెల్లడించింది. బబితా ఫొగట్‌ (బీజేపీ)పై వినేశ్, యోగేశ్వర్ దత్‌ (బీజేపీ)పై భజరంగ్ పోటీని కొట్టిపారేయలేమని పేర్కొంది.

News August 20, 2024

వేణుస్వామిపై పోలీసులకు ఫిర్యాదు చేసిన మూర్తి

image

ప్రముఖ జ్యోతిషుడు వేణుస్వామి, అతని భార్య శ్రీవాణి తనపై తప్పుడు ఆరోపణలు చేశారని జర్నలిస్టు మూర్తి పోలీసులను ఆశ్రయించారు. తాను రూ.5 కోట్లు డిమాండ్ చేశానని ప్రకటన చేయడంపై జూబ్లీహిల్స్ పోలీస్ స్టేషన్‌లో వీరిపై ఫిర్యాదు చేసినట్లు ఆయన X వేదికగా తెలిపారు. వేణుస్వామి చేసిన ఆరోపణలు పూర్తిగా కల్పితమని ఆయన స్పష్టం చేశారు. నిజాలేంటో త్వరలోనే బహిర్గతమవుతాయన్నారు.

News August 20, 2024

ఇవి చెక్ చేస్తే హోటల్‌లో సేఫ్‌గా ఉండొచ్చు!

image

హోటల్‌లో ఉన్నప్పుడు సీక్రెట్ కెమెరాలు ఉంటే ఇలా తెలుసుకోండి. అనుమానాస్పద వస్తువులు, అద్దాలు చెక్ చేయండి. అద్దంపై వేలు పెడితే టచ్ అయినట్లు ఉండొద్దు. దాచిన కెమెరాలను చీకట్లో మెరిసే, లేదా LED లైట్లను టార్చ్ ద్వారా గుర్తించొచ్చు. ఇంటర్నెట్‌తో పనిచేసే కెమెరాలను WIFI ఆన్ చేసి స్కాన్ చేస్తే తెలుస్తాయి. కెమెరాకు దగ్గర్లో ఫోన్ మాట్లాడితే కాల్‌కు అంతరాయం కలిగిస్తాయి. డిటెక్టర్ యాప్ ద్వారా తెలుసుకోవచ్చు.