India's largestHyperlocal short
news App
Get daily news updates that are tailored for you based on your preferred language & location.
TG: కేంద్రం ప్రతిపాదించిన వక్ఫ్ సవరణ బిల్లును ముస్లింలు తిరస్కరిస్తున్నారని కాంగ్రెస్ అగ్రనేత షబ్బీర్ అలీ పేర్కొన్నారు. రాష్ట్రంలోని పలువురు ముస్లిం వర్గ నేతలతో చర్చించిన అనంతరం ఆయన ఈ మేరకు వ్యాఖ్యానించారు. ‘చర్చల్లో ముస్లిం నేతలు వక్ఫ్ సవరణను అంగీకరించలేదు. కేవలం వ్యతిరేకించడమే కాక బిల్లును తిరస్కరించాలని తీర్మానించారు. వారి అభిప్రాయాల్ని సీఎం రేవంత్‌కు తెలియజేస్తా’ అని స్పష్టం చేశారు.
TG: కాళేశ్వరం ప్రాజెక్టుపై జస్టిస్ ఘోష్ కమిషన్ రేపటి నుంచి బహిరంగ విచారణను ప్రారంభించనుంది. విజిలెన్స్ డీజీ సీవీ ఆనంద్‌ను 4 గంటలపాటు విచారించిన కమిషన్, పూర్తిస్థాయి నివేదిక ఇవ్వాలని ఆదేశించింది. త్వరలోనే కేసీఆర్, హరీశ్ రావు, మాజీ సీఎస్ సోమేశ్ కుమార్‌కు నోటీసులు ఇచ్చేందుకు రంగం సిద్ధం చేస్తున్నట్లు సమాచారం. మేడిగడ్డ ఎందుకు కుంగిందన్న అంశంపైనే కమిషన్ ప్రధానంగా దృష్టి సారిస్తున్నట్లు తెలుస్తోంది.
మాజీ సీఎం కరుణానిధి గురించి కేంద్ర మంత్రి రాజ్‌నాథ్ సింగ్ పొగిడినట్టు డీఎంకే నేతలు కూడా మాట్లాడలేరని CM స్టాలిన్ అన్నారు. కరుణానిధి శత జయంతి స్మారక నాణాన్ని రాజ్‌నాథ్ విడుదల చేశారు. కేంద్రంలో సమాన అధికార భాగస్వామ్యం, రాష్ట్ర హక్కులపై దృఢంగా నిలబడి సమైఖ్య స్ఫూర్తి బలోపేతానికి కృషి చేసిన వ్యక్తి కరుణానిధి అని కొనియాడారు. దీంతో రాజ్‌నాథ్ వ్యాఖ్యలను స్టాలిన్ ప్రశంసించారు.
మలయాళ నటుడు మోహన్‌లాల్ శ్వాస సంబంధిత సమస్యలతో కొచ్చిలోని ఓ ప్రైవేటు ఆస్పత్రిలో చేరిన సంగతి తెలిసిందే. తీవ్ర జ్వరం, కండరాల నొప్పులతో ఆయన బాధపడుతున్నారని, రద్దీ ప్రదేశాల్లోకి వెళ్లొద్దని వైద్యులు హెచ్చరించారని సమాచారం. వైరల్ రెస్పిరేటరీ ఇన్ఫెక్షన్ సోకినట్లు వైద్యులు ధ్రువీకరించినట్లు తెలుస్తోంది. ఆస్పత్రి నుంచి అధికారిక ప్రకటన రావాల్సి ఉండగా, లాల్ ఆరోగ్యంపై ఆయన అభిమానుల్లో ఆందోళన వ్యక్తమవుతోంది.
జపనీయులు జీవితం క్రమశిక్షణగా, బద్ధకం రాకుండా ఉండేందుకు 6 సూత్రాలను అనుసరిస్తుంటారు. అవి..
1. తమ ఉనికికి కారణాన్ని తెలుసుకోవడం
2. చేసే పనిలో రోజూ 1శాతమైనా పురోగతి సాధించడం
3. 25 నిమిషాల పాటు పనిచేసి, 5 నిమిషాలు రెస్ట్ తీసుకోవడం
4. పొట్ట 80శాతం నిండినట్లు అనిపించగానే తినడం ఆపేయడం
5. పనుల్ని కొత్త కోణంలో ఆలోచించడం
6. తప్పులుంటే అంగీకరించడం, సరిదిద్దుకోవడం
నాని లేటెస్ట్ మూవీ ‘సరిపోదా శనివారం’ ట్రైలర్ బాగుండటంతో కథేంటోనన్న ఆసక్తి చాలామందిలో నెలకొంది. మూవీలో ప్రతినాయక పాత్రలో చేస్తున్న ఎస్‌జే సూర్య ఓ ఇంటర్వ్యూలో స్టోరీ వెల్లడించారు. ‘ఓ అబ్బాయికి కోపమెక్కువ. కంట్రోల్ చేసుకోలేడు. దీంతో వారంలో శనివారం మాత్రమే కోప్పడాలని, మిగతారోజులు శాంతంగా ఉండాలని అతడి తల్లి చెబుతుంది. వారమంతా సైలెంట్‌గా ఉండే ఆ కుర్రాడు, శనివారం మారిపోతుంటాడు. అదే కథ’ అని వివరించారు.
మణిపుర్ ఇంఫాల్ వ్యాలీలో మైతీ తెగది మెజారిటీ వర్గం. వీరి రిజర్వేషన్ల డిమాండ్ కుకీ తెగతో హింసకు దారి తీసింది. అయితే నార్త్ ఈస్ట్ విజన్ ప్లాన్ 2047 ముసాయిదాలో ‘చిన్ స్టేట్ ఆఫ్ మణిపుర్’ అని ప్రస్తావించారు. చిన్ అంటే కుకీ తెగ (ఒకే జాతి సమూహం). వీరు మయన్మార్ నుంచి కాకుండా మణిపూర్ నుంచి వచ్చినట్టు పేర్కొనడం వివాదాస్పదమైంది. దీంతో, ఈ డ్రాఫ్ట్‌ను వెనక్కి తీసుకున్నట్టు సీఎం బీరెన్ సింగ్ తెలిపారు.
పాకిస్థాన్ ప్రభుత్వం హంటింగ్ క్యాట్స్‌ను నియమించుకుంటోంది. పార్లమెంటు భవనంలో ఎలుకల బెడద పెరగడంతో వాటిని వేటాడేందుకు పిల్లులే మార్గమని భావిస్తోంది. ఈమేరకు రూ.12లక్షల బడ్జెట్ కూడా కేటాయించింది. పార్లమెంటు భవనంలో పలు కార్యాలయాల్లోని ఫైళ్లను ఎలుకలు కొరికేశాయి. దీంతో అధికారులకు ఎలుకల సమస్య పెద్ద తలనొప్పిగా మారింది.
2 కి.మీ దూరంలో ఉన్న శత్రువుల్ని కాల్చగల ఏఐ రోబోను యూపీలోని ITM కాలేజీకి చెందిన విద్యార్థులు రూపొందించారు. ఉక్కు, ఫైబర్, ఇతర లోహాలతో దీన్ని రూపొందించామని, రూ. 1.8 లక్షలు ఖర్చయిందని వారు వివరించారు. శత్రువుల్ని గుర్తించిన అనంతరం భుజంపై ఉండే 18ఎంఎం ఎలక్ట్రానిక్ మెషీన్ గన్ ద్వారా రోబో వారిపై కాల్పులు జరుపుతుందని తెలిపారు. దేశ సరిహద్దుల్లో ఉపయోగపడేలా దీని నమూనాను రక్షణ శాఖకు పంపిస్తామని పేర్కొన్నారు.
జమ్మూకశ్మీర్ మాజీ సీఎం మెహబూబా ముఫ్తీ కుమార్తె ఇల్తిజా ముఫ్తీ త్వరలో జరగనున్న అసెంబ్లీ ఎన్నికల్లో పోటీ చేయనున్నారు. పీడీపీ అధ్యక్షుడు మాజీ ముఖ్యమంత్రి ముఫ్తీ మహ్మద్ సయీద్ వారసురాలిగా మెహబూబా ముఫ్తీ JK మొదటి మహిళా సీఎంగా బాధ్యతలు నిర్వర్తించారు. తాజాగా ఆమె వారసురాలిగా ఇల్తిజా బెజ్బెహర అసెంబ్లీ స్థానం నుంచి పోటీ చేయనున్నారు. PDP 7 స్థానాలకు అభ్యర్థులను ప్రకటించింది.
Sorry, no posts matched your criteria.