India's largestHyperlocal short
news App
Get daily news updates that are tailored for you based on your preferred language & location.

పాన్ ఇండియా స్టార్ ప్రభాస్ హీరోగా నటించిన బ్లాక్‌బస్టర్ మూవీ ‘సలార్’ రీ రిలీజ్‌కు సిద్ధమైంది. మార్చి 21న ఈ చిత్రాన్ని రీ రిలీజ్ చేస్తున్నట్లు మేకర్స్ ప్రకటించారు. ప్రశాంత్ నీల్ తెరకెక్కించిన ఈ మూవీలో శ్రుతిహాసన్ హీరోయిన్‌గా నటించారు. 2023 డిసెంబర్ 22న విడుదలైన ఈ మూవీ బాక్సాఫీస్ వద్ద రూ.700 కోట్లకుపైగా కలెక్షన్లు రాబట్టింది. దీనికి పార్ట్-2 కూడా ఉంటుందని మేకర్స్ ప్రకటించారు.

TG: KRMB (కృష్ణా నదీ యాజమాన్య బోర్డు) సమావేశం అసంపూర్తిగా ముగిసింది. హైదరాబాద్ జలసౌధలో ఏపీ జలవనరులశాఖ ప్రత్యేక ప్రధాన కార్యదర్శి, టీజీ నీటిపారుదలశాఖ ముఖ్య కార్యదర్శితో బోర్డు ఛైర్మన్ రాహుల్ జైన్ సమావేశమయ్యారు. ఇందులో తెలంగాణ తన వాదనలు వినిపించగా, ఏపీ మాత్రం ఎలాంటి వాదనలు వినిపించలేదు. పూర్తి వివరాలతో రేపు సమావేశానికి రావాలని ఇరు రాష్ట్రాలను బోర్డు కోరింది.

పాకిస్థాన్‌తో మ్యాచ్ అనగానే రన్ మెషీన్ విరాట్ కోహ్లీ పూనకంతో సెంచరీల మోత మోగిస్తుంటారు. నిన్న కూడా CTలో పాకిస్థాన్‌తో మ్యాచులో సెంచరీతో ఇండియాను గెలిపించారు. అయితే, కోహ్లీ బ్యాటింగ్‌పై ఓ పాకిస్థానీ తన ఆవేదనను వెళ్లగక్కారు. ‘ఈ విరాట్ కోహ్లీ ఎప్పుడూ మనపైనే ఎందుకు ఎక్కువ కసిగా ఆడతాడు. మనం అతడిని ఏమైనా బాధపెట్టామా? మనమేం చేశాం’ అని ప్రశ్నిస్తూ ట్వీట్ చేశాడు. దీనికి మీరు COMMENTలో సమాధానం చెప్పండి.

కరోనా టైంలో ఎక్కువగా వినిపించిన పేరు వర్క్ ఫ్రం హోం(WFH). కొన్ని కీలక రంగాలు తప్ప చాలా మంది ఉద్యోగులు ఈ విధానంలో పనిచేశారు. ఇప్పుడు అంతా రివర్స్ అయ్యింది. చాలా కంపెనీలు WFH మోడ్‌ను ఎత్తివేస్తూ, ఉద్యోగులంతా ఆఫీసులకు వచ్చి పనిచేయాలని స్పష్టం చేస్తున్నాయి. దీంతో దేశంలో WFH పూర్తిగా ఉండదా? హైబ్రిడ్ మోడల్ ఉద్యోగాలు ఉంటాయా? అనే చర్చ మొదలైంది. WFH ఉద్యోగాలపై మీ అభిప్రాయం ఏంటి?

TG: MLC ఎన్నికల్లో KCR, KTR, హరీశ్, కవిత సహా ఇతర BRS నేతలు ఎవరికి ఓటేస్తారని CM రేవంత్ ప్రశ్నించారు. కరీంనగర్‌లో మాట్లాడుతూ ‘ఎన్నికల్లో కాంగ్రెస్‌ను ఓడించాలని BRS నేతలు చెబుతున్నారు. వారు ఎవరిని గెలిపించడానికి ప్రయత్నిస్తున్నారో చెప్పాలి. ఉప ఎన్నికలు వస్తే గెలుస్తామని అంటున్న వాళ్లు ఎమ్మెల్సీ ఎన్నికల్లో ఎందుకు పోటీ చేయడం లేదు? కేసులకు భయపడి బీజేపీకి మద్దతు ఇస్తున్నారు’ అని ఆరోపించారు.

తమ ఉత్పత్తుల ధరలను స్వల్పంగా పెంచాలని Nestle India యోచిస్తోంది. కాఫీ, కోకో, వంట నూనెల ద్రవ్యోల్బణాన్ని ఎదుర్కొనేందుకు ఈ నిర్ణయం తీసుకున్నట్లు ఆ సంస్థ MD సురేశ్ నారాయణన్ తెలిపారు. ద్రవ్యోల్బణం, అధిక ఉత్పత్తి ధరల కారణంగా తమకు లాభాలు తగ్గాయని పేర్కొన్నారు. కేంద్రం వ్యక్తిగత ఆదాయ పన్నులను తగ్గించడంతో వినియోగదారుల వద్ద డబ్బులు మిగులుతాయని, దీంతో తమ ఉత్పత్తుల వినియోగం పెరిగే ఛాన్సుందని అంచనా వేశారు.

ఫూల్ మఖానా అంటే తనకు ఎంతో ఇష్టమని, ఏడాదిలో 300 రోజులు అదే తింటానని ప్రధాని నరేంద్ర మోదీ తెలిపారు. ఇది ఆరోగ్యానికి ఎంతో ప్రయోజనమని చెప్పారు. బిహార్‌లోని భాగల్‌పూర్‌లో ఆయన మాట్లాడారు. ‘దేశంలో చాలామంది బ్రేక్‌ఫాస్ట్‌లో మఖానా తింటున్నారు. దీని ఉత్పత్తి ఇంకా పెరగాలి’ అని పేర్కొన్నారు. కాగా బిహార్‌లో మఖానా బోర్డు ఏర్పాటు చేస్తున్నట్లు ఇటీవల కేంద్ర మంత్రి నిర్మలా సీతారామన్ వార్షిక బడ్జెట్‌లో ప్రకటించారు.

AP: ఫైబర్‌నెట్ ఛైర్మన్ జీవీ రెడ్డి తన పదవికి రాజీనామా చేశారు. అలాగే టీడీపీకి, పార్టీ పదవులను కూడా వదులుకుంటున్నట్లు తెలిపారు. వ్యక్తిగత కారణాలతోనే రాజీనామా చేస్తున్నట్లు వెల్లడించారు. ఇకపై పూర్తిగా న్యాయవాద వృత్తిలో కొనసాగుతానని ప్రకటించారు. కాగా ఫైబర్‌నెట్ ఎండీ, IAS దినేశ్ కుమార్ అవినీతికి పాల్పడ్డారని జీవీ రెడ్డి ఆరోపించారు. దీనిపై జీవీ రెడ్డిని సీఎం చంద్రబాబు మందలించినట్లు సమాచారం.

TG: మోడల్ స్కూళ్లలో 6వ తరగతిలో ప్రవేశాలు, 7-10వ తరగతి వరకు ఖాళీగా ఉన్న సీట్ల భర్తీ కోసం దరఖాస్తుల స్వీకరణ కొనసాగుతోంది. ఈ నెల 28వ తేదీతో ముగియనున్న గడువు తేదీని మార్చి 10వ తేదీ వరకు పొడిగిస్తూ ప్రభుత్వం జీవో జారీ చేసింది. OC విద్యార్థులు రూ.200, SC, ST, BC, PHC, EWS విద్యార్థులు రూ.125 ఫీజు చెల్లించాల్సి ఉంటుంది. దరఖాస్తు చేసేందుకు ఇక్కడ <

ఎన్టీఆర్ బావమరిది నార్నె నితిన్, సంగీత్ శోభన్ ప్రధాన పాత్రల్లో నటిస్తోన్న యూత్‌ఫుల్ ఎంటర్‌టైనర్ ‘మ్యాడ్ స్క్వేర్’ టీజర్ విడుదలకు సిద్ధమైంది. రేపు మధ్యాహ్నం 3.33 గంటలకు టీజర్ విడుదల చేస్తామని మేకర్స్ ప్రకటించారు. కళ్యాణ్ శంకర్ తెరకెక్కిస్తోన్న ఈ చిత్రం మార్చి 29న విడుదల కానుంది. ఈ సినిమాను సితార ఎంటర్‌టైన్మెంట్స్ బ్యానర్‌పై నాగవంశీ నిర్మిస్తున్నారు.
Sorry, no posts matched your criteria.