news

News November 4, 2025

ఆ ఊర్లో అడుగడుగునా హనుమాన్ ఆలయాలే..

image

TG: జగిత్యాల(D) వెల్లుల్ల అనే గ్రామంలో ఏ మూల చూసినా, ఏ వాడ తిరిగినా ఆంజనేయుడి గుళ్లే దర్శనమిస్తాయి. 2,500 కన్నా తక్కువ జనాభా ఉన్న ఈ ఊర్లో దాదాపు 45 హనుమాన్ ఆలయాలున్నాయి. పూర్వం ఇక్కడ నివాసమున్న బ్రాహ్మణ కుటుంబాలు తమ వంశాల వారీగా ఎవరికి వారు ఈ ఆలయాలను నిర్మించుకున్నారట. ఈ అన్ని ఆలయాల్లోనూ క్రమం తప్పకుండా పూజలు నిర్వహించడం విశేషం. ☞ ఇలాంటి ఆసక్తికర ఆధ్యాత్మిక సమాచారం కోసం <<-se_10013>>భక్తి కేటగిరీ<<>>కి వెళ్లండి.

News November 4, 2025

వరికి మానిపండు తెగులు ముప్పు.. ఎలా నివారించాలి?

image

ఇటీవల భారీ వర్షాలకు మానిపండు తెగులు వరి పంటను ఆశించి నష్టపరిచే అవకాశం ఉంది. ఈ తెగులును కలగజేసే శిలీంధ్రం వరి వెన్నులోని గింజల్లోకి ప్రవేశించి గింజలపై పసుపు రంగులో గుండ్రని ముద్ద లేత పువ్వులాగ మారుతుంది. క్రమేపీ ఇది నలుపు పొడిగా మారి వెన్నులో గింజలను నల్లగా మారుస్తుంది. మానిపండు తెగులు నివారణకు 200 లీటర్ల నీటిలో ఎకరాకు ప్రాపికొనజోల్ 200ml లేదా క్లోరోథలోనిల్ 400 గ్రాములను కలిపి పిచికారీ చేయాలి.

News November 4, 2025

పని గంటలు పెంచుతూ ఉత్తర్వులు

image

AP: రాష్ట్ర ప్రభుత్వం కార్మికుల <<17768393>>పని<<>> గంటలను 8 నుంచి 10 గంటలకు పెంచింది. నిన్నటి నుంచే ఇది అమల్లోకి వస్తుందని కార్మిక శాఖ కార్యదర్శి శేషగిరి బాబు ఉత్తర్వులు జారీ చేశారు. అయితే వారం మొత్తంలో పని గంటలు 48 దాటితే ఓటీ కింద అదనపు మొత్తాన్ని చెల్లించాలని ఏపీ షాప్స్ అండ్ ఎస్టాబ్లిష్‌మెంట్ చట్ట సవరణ చేశారు. మరోవైపు ఐదు మంది కంటే ఎక్కువ మహిళలుంటేనే వారిని రాత్రి వేళ డ్యూటీలకు అనుమతించనున్నారు.

News November 4, 2025

నేటి నుంచి ఈ రాష్ట్రాల్లో ‘సర్’

image

నేటి నుంచి 9 రాష్ట్రాలు, 3 UTల్లో ఓటరు జాబితా సమగ్ర సవరణ(<<18119990>>SIR<<>>) ప్రక్రియ ప్రారంభం కానుంది. డిసెంబర్ 4 వరకు ఇది కొనసాగనుంది. DEC 9న డ్రాఫ్ట్ ఓటరు జాబితా, ఫిబ్రవరి 7న ఫైనల్ లిస్టును EC రిలీజ్ చేయనుంది. 51 కోట్ల మంది ఓటర్లు ఇందులో భాగం కానున్నారు. పారదర్శకంగా <<18121229>>సర్<<>> చేపడతామని ఈసీ పేర్కొనగా మరోవైపు ఈ ప్రక్రియను తమిళనాడులోని స్టాలిన్ ప్రభుత్వం వ్యతిరేకిస్తోంది.

News November 4, 2025

పశువుల్లో గొంతువాపు వ్యాధి లక్షణాలు – నివారణ

image

వర్షాకాలంలో ఇది ఎక్కువగా వస్తుంది. దీనినే గురకవ్యాధి అని కూడా అంటారు. కలుషితమైన నీరు, మేత వల్ల రోగనిరోధక శక్తి తగ్గితే ఈ వ్యాధి వస్తుంది. ఈ వ్యాధి బారిన పడ్డ పశువు కంటి నుంచి నీరు, నోటి నుంచి చొంగకారుస్తుంటుంది. శ్వాస తీసుకునేటప్పుడు గురక శబ్దం వస్తుంది. తీవ్రమైన జ్వరం ఉంటుంది. గొంతు కిందకు నీరు చేరి గొంతువాపు వస్తుంది. ఈ లక్షణాలు పశువులో కనిపించిన వెంటనే వెటర్నరీ వైద్యుడిని సంప్రదించాలి.

News November 4, 2025

విశాఖలో భూప్రకంపనలు

image

AP: విశాఖలో స్వల్ప భూకంపం సంభవించింది. తెల్లవారుజామున 4 గంటల నుంచి 4.30 గంటల మధ్య పలు ప్రాంతాల్లో భూమి కంపించింది. విశాఖలోని గాజువాక, మధురవాడ, రుషికొండ, భీమిలి, కైలాసపురం, మహారాణిపేట, విశాలాక్షినగర్, అక్కయ్యపాలెం తదితర ప్రాంతాల్లో కొన్ని సెకన్ల పాటు భూమి కంపించింది. కొన్నిచోట్ల శబ్దాలు కూడా వచ్చినట్లు స్థానికులు చెబుతున్నారు. మీ ప్రాంతంలోనూ భూకంపం వచ్చినట్లు అనిపించిందా? కామెంట్ చేయండి.

News November 4, 2025

రబ్బర్ బోర్డ్‌లో 51 పోస్టులకు నోటిఫికేషన్

image

<>రబ్బర్ బోర్డ్‌<<>>లో 51 పోస్టులకు నోటిఫికేషన్ విడుదలైంది. అర్హతగల అభ్యర్థులు డిసెంబర్ 1వరకు అప్లై చేసుకోవచ్చు. పోస్టును బట్టి సంబంధిత విభాగంలో BSc, MSc, PhD, బీటెక్, BE, ME, ఎంటెక్ ఉత్తీర్ణతతో పాటు పని అనుభవం ఉండాలి. దరఖాస్తు ఫీజు గ్రూప్ ఏ పోస్టులకు రూ.1500, గ్రూప్ బీ పోస్టులకు రూ.1000, గ్రూప్ సీ పోస్టులకు రూ.500. SC, ST, PWBDలకు ఫీజు లేదు. వెబ్‌సైట్: https://recruitments.rubberboard.org.in/

News November 4, 2025

నేడు ఈ జిల్లాల్లో వర్షాలు

image

నేడు కోనసీమ, తూ.గో, ప.గో, కృష్ణా, బాపట్ల, పల్నాడు, ప్రకాశం, నెల్లూరు, ATP, చిత్తూరు, TPT జిల్లాల్లో తేలికపాటి నుంచి మోస్తరు వర్షాలు కురిసే ఛాన్సుందని APSDMA పేర్కొంది. TGలోని ఆదిలాబాద్, నిర్మల్, నిజామాబాద్, జనగామ, సిద్దిపేట, యాదాద్రి, HYD, మేడ్చల్, సంగారెడ్డి, రంగారెడ్డి, మెదక్, కామారెడ్డి, మహబూబ్ నగర్, వనపర్తి, నారాయణపేట, జోగులాంబ గద్వాల్ జిల్లాల్లో వర్షాలు కురిసే అవకాశముందని HYD IMD తెలిపింది.

News November 4, 2025

నేడు కృష్ణా జిల్లాలో పర్యటించనున్న జగన్

image

AP: మాజీ ముఖ్యమంత్రి, వైసీపీ చీఫ్ జగన్ నేడు తుఫాను ప్రభావిత ప్రాంతాల్లో పర్యటించనున్నారు. ఉదయం 9.30 గంటలకు తాడేపల్లి నివాసం నుంచి బయల్దేరి పెనమలూరు సెంటర్, ఉయ్యూరు మీదుగా కృష్ణా జిల్లాలోని పెడన నియోజకవర్గం గూడూరుకు చేరుకుంటారు. ఆ ప్రాంతంలో తుఫాను వల్ల దెబ్బతిన్న పంటల్ని పరిశీలించి రైతుల్ని పరామర్శిస్తారు. తర్వాత అవనిగడ్డ హైవే మీదుగా తాడేపల్లి నివాసానికి చేరుకుంటారు.

News November 4, 2025

ప్రతిరోజు ఈ హనుమాన్ మంత్రం పఠిస్తే..

image

‘ఓం పవన సుత హనుమాన్ కీ జై’ అనే మంత్రాన్ని నిత్యం జపించాలని పండితులు సూచిస్తున్నారు. ఫలితంగా అనూహ్యమైన శక్తి సొంతమవుతుందని అంటున్నారు. ఈ శక్తిమంతమైన మంత్రాన్ని రోజూ 108 సార్లు ఉచ్చరించడం వలన మనోబలం, ధైర్యం పెరుగుతాయని మన పురాణాలు చెబుతున్నాయి. ఈ జపం వలన తక్షణ ఫలితాలు రావడంతో పాటు, సమస్త భయాల నుంచి విముక్తి లభిస్తుందని భక్తుల ప్రగాఢ విశ్వాసం. హనుమంతుని కృపతో అడ్డంకులన్నీ తొలగిపోవాలని ఆశిద్దాం.