India's largestHyperlocal short
news App
Get daily news updates that are tailored for you based on your preferred language & location.
TG: ఒకప్పుడు సమాజాన్ని మార్చడానికి సినిమా ఉపయోగపడేదని, ఇప్పుడు విలన్లను హీరోల్లా చూపిస్తున్నారని CPI MLA కూనంనేని సాంబశివరావు తెలిపారు. సెన్సార్ బోర్డు పూర్తిగా ఫెయిల్ అయిందన్నారు. సంధ్య థియేటర్ వద్ద రేవతి చనిపోవడం బాధాకరమని చెప్పారు. ఈ ఘటనలో సినిమా వర్సెస్ ప్రభుత్వం అనేలా చర్చ జరిగిందని చెప్పారు. విప్లవాత్మకమైన నిర్ణయాలు తీసుకోవాల్సిన అవసరం ఉందని శ్రీతేజ్‌ను పరామర్శించిన తర్వాత ఆయన చెప్పారు.
ప్రజలు తమలోని భావాలను వ్యక్తపరిచేందుకు ఎమోజీలను వినియోగిస్తుంటారు. అందులో ఎక్కువగా వాడే స్మైలీని అమెరికన్ కమర్షియల్ ఆర్టిస్ట్ హార్వే రాస్ బాల్ రూపొందించారు. 1963లో ఈ ఐకానిక్ స్మైలీ ఫేస్‌ని డిజైన్ చేశారు. నవ్వుతున్న ముఖంతో ప్రకాశవంతమైన పసుపు వృత్తాన్ని కలిగి ఉన్న ఈ డిజైన్ ఎంతో ప్రజాదరణ పొందగా, అప్పటి నుంచి ప్రపంచవ్యాప్తంగా వినియోగంలోకి వచ్చింది. దీనిని రూపొందించినందుకు హర్వేకి $45 ఇచ్చారు.
అల్లు అర్జున్‌ను ప్రశ్నించిన అనంతరం చిక్కడపల్లి పోలీసులు ఆయనను సంధ్య థియేటర్‌కు తీసుకెళ్లే అవకాశం ఉంది. ఈనెల 4న జరిగిన తొక్కిసలాట ఘటనకు సంబంధించి సీన్ రీ కన్‌స్ట్రక్షన్ చేయనున్నట్లు తెలుస్తోంది. ప్రస్తుతం బన్నీని సెంట్రల్ జోన్ డీసీపీ విచారిస్తున్నారు. అటు సంధ్య థియేటర్ వద్ద పోలీసులు భారీగా మోహరించినట్లు సమాచారం.
కోల్‌కతా RGకర్ ట్రైనీడాక్టర్ హత్యాచారం కేసు మరోటర్న్ తీసుకుంది. సెమినార్ హాల్లో క్రైమ్‌సీన్ జరగలేదేమోనని ఫొరెన్సిక్ రిపోర్టు పేర్కొన్నట్టు తెలుస్తోంది. మృతదేహం కనిపించిన హాల్లో రేప్, హత్యకు ఆధారాలు లభించలేదని సమాచారం. నిందితుడు, బాధితురాలి మధ్య గొడవ జరిగినట్టు సాక్ష్యాలు దొరకలేదని, అలాంటప్పుడు హత్యాచారం ఇక్కడే జరిగినట్టు ఎలా చెప్పగలమని అనుమానం లేవనెత్తింది. దీనిపై పూర్తి వివరాలు తెలియాల్సి ఉంది.
TG: కొడుకు శ్రీతేజ్ ఇప్పుడిప్పుడే కళ్లు తెరుస్తూ మూస్తున్నాడని అతడి తండ్రి భాస్కర్ తెలిపారు. కానీ తనను గుర్తుపట్టే స్థితిలో లేడని వాపోయారు. శ్రీతేజ్ కోలుకునేందుకు మరో 2నెలలు పట్టే అవకాశం ఉందని వైద్యులు చెప్పారన్నారు. AA టీమ్ ఇప్పటివరకు రూ.10లక్షలు ఇచ్చారని, వైద్యులతో నిత్యం మాట్లాడి ఆరా తీస్తున్నారని వెల్లడించారు. బన్నీపై కేసు వాపసు తీసుకునేందుకు తాను సిద్ధంగా ఉన్నట్లు భాస్కర్ చెప్పారు.
జనవరి 18 నుంచి జరగనున్న మహిళల అండర్-19 టీ20 వరల్డ్ కప్‌నకు బీసీసీఐ జట్టును ప్రకటించింది. ఇందులో హైదరాబాద్ అమ్మాయిలు గొంగడి త్రిష, కేసరి ధృతితో పాటు విశాఖకు చెందిన షబ్నమ్ చోటు దక్కించుకున్నారు.
జట్టు: నికీ ప్రసాద్(కెప్టెన్), సానికా చాల్కే(వైస్ కెప్టెన్), త్రిష, కమలిని, భావిక, ఈశ్వరి, మిథిల, జోషిత, సోనమ్ యాదవ్, పరుణిక సిసోడియా, ధృతి, ఆయూషి, ఆనందిత, షబ్నమ్, వైష్ణవి
PSలో అల్లు అర్జున్ విచారణ కొనసాగుతోంది. గంటన్నర నుంచి ఆయనపై ప్రశ్నల వర్షం కురిపిస్తున్నారు. తొక్కిసలాటలో రేవతి చనిపోయిన విషయం థియేటర్లో ఉన్నప్పుడు తెలియదా? మీడియా ముందు ఎవరూ చెప్పలేదని ఎందుకు చెప్పారు? అనుమతి లేకుండా రోడ్‌షో ఎందుకు చేశారు? వంటి ప్రశ్నలు అడిగినట్లు తెలుస్తోంది. బన్నీ చెప్పే సమాధానాలు కీలకంగా మారనున్నాయి. ఆయన పొంతనలేని ఆన్సర్లు చెప్తే థియేటర్‌కు తీసుకెళ్లి విచారించే అవకాశం ఉంది.
TG: మేడిగడ్డ బ్యారేజీ కుంగుబాటు విషయంలో విచారణకు హాజరు కావాలంటూ కేసీఆర్, హరీశ్ రావుకు భూపాలపల్లి జిల్లా కోర్టు ఇచ్చిన ఆదేశాలను హైకోర్టు సస్పెండ్ చేసింది. బ్యారేజీ కుంగుబాటుకు కేసీఆర్, హరీశ్ కారణమంటూ ఫిర్యాదు చేసిన రాజలింగమూర్తికి నోటీసులు జారీ చేసింది. తదుపరి విచారణను జనవరి 7కు వాయిదా వేసింది.
భారత మాజీ క్రికెటర్ వినోద్ కాంబ్లీ అనారోగ్యంతో శనివారం థానేలోని ఆకృతి ఆస్పత్రిలో చేరిన విషయం తెలిసిందే. వైద్య పరీక్షలు నిర్వహించిన వైద్యులు ఆయన బ్రెయిన్‌లో రక్తం గడ్డ కట్టినట్లు తెలిపారు. తొలుత ఆయన యూరినరీ ఇన్ఫెక్షన్, తిమ్మిర్లతో జాయిన్ అయ్యారన్నారు. కాంబ్లీ ఆరోగ్య పరిస్థితిని నిరంతరం పర్యవేక్షిస్తున్నట్లు వెల్లడించారు. ఆయనకు జీవితాంతం ఫ్రీ ట్రీట్మెంట్ ఇస్తామని ఆ ఆస్పత్రి తెలిపింది.
TG: అల్లు అర్జున్ కేసు చాలా చిన్నదని బీజేపీ ఎంపీ రఘునందన్ రావు అన్నారు. భద్రతా వైఫల్యం ఉన్న విషయాన్ని పక్కనపెట్టి హీరోను మాత్రమే ప్రభుత్వం కారణంగా చూపుతోందన్నారు. ఒక తప్పును కప్పిపుచ్చే ప్రయత్నంలో ప్రభుత్వం అనేక తప్పులు చేస్తోందని ఆరోపించారు. బన్నీ ప్రెస్‌మీట్ పెట్టడానికి వీలు లేనప్పుడు CP వీడియోలు ఎలా విడుదల చేస్తారని ప్రశ్నించారు. ప్రభుత్వం కక్షగట్టినట్లు ప్రవర్తించడం సరికాదన్నారు.
Sorry, no posts matched your criteria.