news

News December 23, 2024

రేపటి నుంచి సెలవులు

image

క్రిస్మస్ ఈవ్ సందర్భంగా తెలంగాణలో కొన్ని స్కూళ్లకు రేపు ఆప్షనల్ హాలిడే ఉండనుంది. ఇప్పటికే సంబంధిత పాఠశాలల నుంచి విద్యార్థుల పేరెంట్స్‌కు సమాచారం అందింది. 25, 26న పబ్లిక్ హాలిడేస్ ఉండటంతో ఆయా పాఠశాలలకు వరుసగా 3 రోజులు, మిగతావాటికి 2 రోజులు సెలవులు రానున్నాయి. అటు ఏపీలోనూ రేపు కొన్ని స్కూళ్లకు ఆప్షనల్, 25న పబ్లిక్ హాలిడే, 26న ఆప్షనల్ హాలిడే ఉండనుంది.

News December 23, 2024

విధానం రద్దుతో డ్రాపౌట్స్: UTF

image

నో డిటెన్షన్ విధానాన్ని కేంద్రం రద్దు చేయడంపై తెలంగాణ UTF స్పందించింది. ఈ విధానం రద్దు చేయడం వల్ల స్కూళ్లలో డ్రాపౌట్స్ పెరుగుతాయని, పేదలకు విద్య దూరమవుతుందని అభిప్రాయపడింది. దీని వల్ల ప్రభుత్వ విద్యాసంస్థల్లో విద్యార్థుల సంఖ్య తగ్గుతుందని ఆందోళన వ్యక్తం చేసింది. కాగా 5, 8 తరగతుల విద్యార్థులు పరీక్షల్లో తప్పనిసరి పాస్ కావాలని నో డిటెన్షన్ విధానాన్ని రద్దు చేస్తూ కేంద్రం నిర్ణయం తీసుకుంది.

News December 23, 2024

భారత సినీ చరిత్రలోనే తొలి మూవీగా ‘పుష్ప-2’

image

అల్లు అర్జున్ ‘పుష్ప-2’ మరో రికార్డు సృష్టించింది. బుక్ మై షోలో అత్యధిక టికెట్లు అమ్ముడైన చిత్రంగా నిలిచినట్లు మూవీ యూనిట్ ట్వీట్ చేసింది. భారతీయ సినిమా చరిత్రలోనే ఇది రికార్డు అని పేర్కొంది. ఇప్పటివరకు 18 మిలియన్లకు పైగా టికెట్లు బుక్ అయినట్లు వెల్లడించింది. కాగా ఈ సినిమా ఇప్పటికే రూ.1,700 కోట్లకు పైగా కలెక్షన్లు రాబట్టినట్లు సినీ వర్గాలు పేర్కొన్నాయి.

News December 23, 2024

టీమ్ ఇండియాకు బ్యాడ్ న్యూస్

image

భారత స్టార్ బౌలర్ మహ్మద్ షమీ ఆరోగ్య పరిస్థితిపై BCCI కీలక ప్రకటన చేసింది. ఆస్ట్రేలియాతో జరిగే తర్వాతి రెండు టెస్టులకూ ఆయన అందుబాటులో ఉండటం లేదని పేర్కొంది. రంజీ, SMATలో బౌలింగ్ ప్రదర్శన బాగానే ఉన్నా ఎడమ మోకాలులో వాపు గుర్తించినట్లు తెలిపింది. మడమ గాయం నుంచి కోలుకున్న ఆయనను వైద్య బృందం పరిశీలిస్తున్నట్లు వెల్లడించింది. మరోవైపు యంగ్ ప్లేయర్ తనుశ్ కోటియన్ భారత జట్టులో చేరనున్నట్లు తెలుస్తోంది.

News December 23, 2024

BIG NEWS.. త్వరలో 32,438 ఉద్యోగాలకు నోటిఫికేషన్

image

రైల్వేలో 32,438 గ్రూప్-D ఉద్యోగాల భర్తీకి RRB త్వరలో నోటిఫికేషన్ ఇవ్వనుంది. జనవరి 23 నుంచి దరఖాస్తుల స్వీకరణ ప్రారంభం కానుంది. అత్యధికంగా ట్రాక్ మెయింటైనర్ ఉద్యోగాలు-13,187, పాయింట్స్‌మెన్-5058, అసిస్టెంట్(వర్క్‌షాప్)-3077, అసిస్టెంట్(C&W) సహా మరికొన్ని ఉద్యోగాలున్నాయి. 18-36 ఏళ్లలోపు వారు దరఖాస్తు చేసుకోవచ్చు. టెన్త్ లేదా NCVT నుంచి NAC సర్టిఫికెట్, ITI ఉన్నవారు అర్హులు.

News December 23, 2024

హైకోర్టును ఆశ్రయించిన పేర్ని నాని

image

AP: రేషన్ బియ్యం అక్రమాల కేసులో పోలీసుల నోటీసులను క్వాష్ చేయాలని మాజీ మంత్రి పేర్ని నాని, ఆయన కొడుకు కిట్టు హైకోర్టును ఆశ్రయించారు. రేపు దీనిపై కోర్టు విచారణ చేయనుంది. మరోవైపు రేషన్ బియ్యం అక్రమ రవాణా కేసులో పేర్ని నాని భార్య జయసుధ ఏ1గా ఉన్నారు. రేపు ఆమె ముందస్తు బెయిల్‌ పిటిషన్‌పై జిల్లా కోర్టులో విచారణ జరగనుంది.

News December 23, 2024

మంచు మనోజ్ ఫిర్యాదులో సంచలన ఆరోపణలు!

image

TG: తన సోదరుడు విష్ణుతో పాటు ఆరుగురిపై మంచు మనోజ్ పోలీసులకు ఫిర్యాదు చేశారు. వినయ్, విజయ్, కిరణ్, రాజ్‌తో పాటు శివల పేర్లను పేర్కొన్నారు. భార్య, పిల్లలకు ప్రాణహాని ఉందన్నారు. మోహన్ బాబుకు చెందిన యూనివర్సిటీతో పాటు ట్రస్ట్‌లో నిధుల దుర్వినియోగం జరిగిందని పేర్కొన్నారు. తన ఇంటికి విద్యుత్, నీటి సరఫరా లేకుండా కుట్ర పన్నినట్లు తెలిపారు. సీసీటీవీ ఫుటేజీ కోసం హార్డ్ డిస్క్ దొంగిలించారని ఆరోపించారు.

News December 23, 2024

ఖేల్‌రత్నకు మను అర్హురాలు కాదా?

image

మనూ భాకర్.. భారత చరిత్రలో ఒకే ఒలింపిక్స్‌లో 2 మెడల్స్ సాధించిన స్టార్ షూటర్. ప్రపంచ వేదికపై తన ప్రదర్శనతో భారతీయుల గుండెల్లో చిరస్థాయిగా నిలిచారు. దేశానికి కీర్తిప్రతిష్ఠలు తెచ్చిన ఆమె పేరును ఖేల్‌ర‌త్నకు నామినేట్ చేయలేదనే వార్తలు క్రీడాభిమానులను ఆశ్చర్యానికి గురి చేస్తున్నాయి. క్రీడ‌ల్లో అత్యున్న‌త ప్ర‌ద‌ర్శ‌నకుగానూ ప్ర‌దానం చేసే ఈ అవార్డుకు ఆమె అర్హురాలు కాదా? అని ప్రశ్నిస్తున్నారు. మీరేమంటారు?

News December 23, 2024

కొత్త ఒరవడికి శ్రీకారం చుట్టిన దర్శకుడు

image

దర్శక దిగ్గజం <<14962066>>శ్యామ్ బెనగల్<<>> మరణంతో సినీలోకం విషాదంలో మునిగిపోయింది. ఆయన HYD తిరుమలగిరిలో జన్మించారు. విద్యాభ్యాసం మెహబూబ్, నిజాం కాలేజీలో చేశారు. ప్రొఫెషనల్ వర్క్ కోసం బాంబేకు షిఫ్ట్ అయ్యారు. సత్యజిత్ రే తర్వాత మిడిల్ క్లాస్ సినిమాల దర్శకుడిగా కొత్త ఒరవడికి శ్రీకారం చుట్టారు. ANR జాతీయ అవార్డుతో పాటు అనేక అవార్డులు సొంతం చేసుకున్నారు. 2006-12 మధ్య కాలంలో రాజ్యసభ ఎంపీగా చేశారు.

News December 23, 2024

BIG BREAKING: అల్లు అర్జున్‌కు పోలీసుల నోటీసులు

image

హీరో అల్లు అర్జున్‌కు చిక్కడపల్లి పోలీసులు మరోసారి నోటీసులు ఇచ్చారు. రేపు ఉదయం 11 గంటలకు విచారణకు రావాలని అందులో పేర్కొన్నారు. సంధ్య థియేటర్ తొక్కిసలాట ఘటనలో ఇప్పటికే ఆయనపై కేసు నమోదైన విషయం తెలిసిందే. తర్వాత బన్నీని అరెస్ట్ చేయగా హైకోర్టు ఆయనకు మధ్యంతర బెయిల్ ఇచ్చింది.