India's largestHyperlocal short
news App
Get daily news updates that are tailored for you based on your preferred language & location.
TG: ఆటోడ్రైవర్లకు ఇస్తానన్న ₹12వేల సాయం ఏమైందని CM రేవంత్‌ను KTR ప్రశ్నించారు. ఆటో డ్రైవర్లతో పాటు అన్ని వర్గాలను మోసగించారని విమర్శించారు. సిద్దిపేటలో అప్పుల బాధతో ఓ ఆటో డ్రైవర్ ఆత్మహత్య చేసుకున్న వార్తను షేర్ చేశారు. ‘ఇదేనా రేవంత్ నువ్వు తీసుకొచ్చిన మార్పు? పైసలతో ధగ ధగ మెరిసిన చేతుల్లోకి పురుగు మందుల డబ్బాలు రావడమే మార్పా? ఆనందమయ జీవితాల్లోకి ఆత్మహత్య ఆలోచన చొరబడటమే మార్పా?’ అని ట్వీట్ చేశారు.
తన రెండో హయాం ఎలావుంటుందో డొనాల్డ్ ట్రంప్ సంకేతాలు పంపిస్తున్నారు. శత్రు, మిత్రభేదాలేమీ లేవు. అమెరికాకు నష్టం జరుగుతుందంటే టారిఫ్స్ కొరడా ఝుళిపించడమే అజెండాగా పెట్టుకున్నారు. EU తమ నుంచి భారీ స్థాయిలో ఆయిల్, గ్యాస్ కొనాలని, లేదంటే టారిఫ్స్ తప్పవని తాజాగా బెదిరించారు. 2022 డేటా ప్రకారం EU, US వాణిజ్య లోటు $202B ఉంది. EU నుంచి US దిగుమతులు $553B ఉండగా, ఎగుమతులేమో $350Bగా ఉన్నాయి.
బంగ్లాదేశ్‌లో హిందువులపై దాడులు ఆగడం లేదు. హిందూ ఆలయాల విధ్వంసం కొనసాగుతోంది. తాజాగా మైమెన్‌సింగ్, దినాజ్‌పూర్‌లోని 3 ఆలయాల్లో 8 విగ్రహాలను ముష్కరులు ధ్వంసం చేశారు. గురు, శుక్రవారాల్లో మైమెన్‌సింగ్‌లోని 2 గుళ్లలో 3 మూల విరాట్టులను పగలగొట్టారని పోలీసులు తెలిపారు. కేసు నమోదవ్వలేదని, ఎవరినీ అరెస్టు చేయలేదన్నారు. పొలాష్‌ఖండ్ కాళీ మందిరం దాడి ఘటనలో అలాలుద్దీన్ (27)ను అరెస్టు చేసినట్టు వెల్లడించారు.
AP: గ్రామ, వార్డు సచివాలయాల్లో పనిచేసే ఉద్యోగులకు బయోమెట్రిక్ హాజరు ఆధారంగా వేతనాలు ఇవ్వనున్నారు. ఈ మేరకు డీడీవోలకు గ్రామ, వార్డు సచివాలయ శాఖ తాజాగా ఆదేశాలిచ్చింది. మొబైల్ యాప్‌లో ఉద్యోగులు నమోదు చేసిన హాజరునే పరిగణనలోకి తీసుకోవాలని స్పష్టం చేసింది.
నటుడు మోహన్‌బాబుకు ఢిల్లీ హైకోర్టు రిలీఫ్ ఇచ్చింది. ఆయన పేరు, ఫొటో, వాయిస్‌ను సోషల్ మీడియా ఖాతాలు, AI బాట్స్, వెబ్‌సైట్స్ వాడొద్దని సూచించింది. తన వ్యక్తిగత హక్కుల్ని రక్షించాలని కోరుతూ మోహన్‌బాబు ఢిల్లీ హైకోర్టులో వేసిన పిటిషన్ విచారణ సందర్భంగా కోర్టు ఈ మేరకు వ్యాఖ్యానించింది. అనుమతి లేకుండా మోహన్‌బాబుకు సంబంధించినవేవీ వాడరాదని, ఆయన కంటెంట్‌ను గూగుల్ తొలగించాలని స్పష్టం చేసింది.
ప్రభుత్వ బ్యాంకుల్లో మొండి బకాయిలు, NPAలు పెరగడానికి UPA హయాంలో అవినీతే కారణమని RBI Ex Gov రఘురామ్ రాజన్ అన్నారు. వాటిని రైటాఫ్ చేసి సమస్యను పరిష్కరించిందని మోదీ ప్రభుత్వాన్ని కొనియాడారు. వరుసగా స్కాములు బయటపడటం, గ్లోబల్ క్రైసిస్, ప్రాజెక్టులకు అనుమతుల ఆలస్యం, నిరాకరణతో NPAలు పెరిగాయని కుండబద్దలు కొట్టారు. సిస్టమ్‌ను క్లీన్ చేసేందుకు AQR అవసరమంటే జైట్లీ వెంటనే OK చెప్పేశారని గుర్తుచేసుకున్నారు.
AP రాజధాని అమరావతిలో రూ.33,137 కోట్లతో 40కి పైగా పనులు చేపట్టేందుకు రాష్ట్ర ప్రభుత్వం పాలనాపరమైన అనుమతులు జారీ చేసింది. ఇందులో రూ.768 కోట్లతో అసెంబ్లీ, రూ.1045 కోట్లతో హైకోర్టు, రూ.4688.83 కోట్లతో సచివాలయం, HOD భవనాలు, టవర్ల నిర్మాణం, మంత్రులు, న్యాయమూర్తులు, కార్యదర్శుల స్థాయి అధికారులకు నివాస భవనాల నిర్మాణం వంటివి చేపట్టనున్నారు.
TG: ధ్యానం, దాని ప్రయోజనాల గురించి అవగాహన పెంచడానికి ఏటా డిసెంబర్ 21న ప్రపంచ ధ్యాన దినోత్సవాన్ని నిర్వహించాలని ఇటీవల ఐక్యరాజ్యసమితి నిర్ణయించిన సంగతి తెలిసిందే. ఈ నేపథ్యంలో ఇవాళ హైదరాబాద్‌లోని గచ్చిబౌలి స్టేడియంలో తొలి ప్రపంచ ధ్యాన దినోత్సవం కోసం ప్రభుత్వం ఏర్పాట్లు చేసింది. ఇవాళ సా.5 గంటలకు జరిగే ఈ కార్యక్రమంలో గవర్నర్ జిష్ణుదేవ్ వర్మ, CM రేవంత్, డిప్యూటీ సీఎం భట్టి, మంత్రులు పాల్గొంటారు.
TG: అసెంబ్లీ, మండలి సమావేశాలు ఇవాళ్టితో ముగియనున్నాయి. ఈనెల 9న ప్రారంభమైన సమావేశాలు 16కు వాయిదా పడ్డాయి. 16న తిరిగి ప్రారంభమై నేడు ముగియనున్నాయి. ఈరోజు రైతు భరోసా పథకంపై అసెంబ్లీ, శాసన మండలిలో చర్చించనున్నారు. అనంతరం మంత్రివర్గం విధి విధానాలు ఖరారు చేసి, సంక్రాంతి తర్వాత నుంచి రైతుల ఖాతాల్లో డబ్బులు జమ చేయనున్నట్లు తెలుస్తోంది.
TG: ఇద్దరి కంటే ఎక్కువ సంతానం కలిగి ఉన్న వారు స్థానిక సంస్థల ఎన్నికల్లో పోటీకి అనర్హులన్న నిబంధనను కొనసాగించాలని రాష్ట్ర ప్రభుత్వం నిర్ణయించింది. ఈ రూల్‌ను మార్చాలంటూ వచ్చిన ప్రతిపాదనను రిజెక్ట్ చేసింది. ఈ నిబంధన మినహా ఇతర అంశాలతో పంచాయతీ రాజ్ చట్ట సవరణ బిల్లును అసెంబ్లీలో ప్రవేశపెట్టగా సభ ఆమోదం తెలిపింది. కాగా ఏపీలో ఇద్దరు పిల్లల నిబంధనను తొలగించిన సంగతి తెలిసిందే.
Sorry, no posts matched your criteria.