news

News February 16, 2025

IPL 2025: సీఎస్కే తొలి మ్యాచ్ ఎవరితో అంటే?

image

మార్చి 21 నుంచి ఐపీఎల్ 2025 ప్రారంభం కానున్న సంగతి తెలిసిందే. ఈ సీజన్లో సీఎస్కే తన తొలి మ్యాచ్ ముంబై ఇండియన్స్‌తో ఆడనున్నట్లు Espn Cricinfo పేర్కొంది. చెన్నైలోని చెపాక్ వేదికగా జరిగే ఈ మ్యాచులో ఐదేసి సార్లు కప్పు గెలిచిన ఈ జట్లు పోటీపడతాయని తెలిపింది. కాగా ఆర్సీబీ VS కేకేఆర్ (ఈడెన్ గార్డెన్‌లో), SRH vs RR (HYDలో) తమ తొలి మ్యాచ్‌లు ఆడే అవకాశం ఉందని చెప్పింది.

News February 16, 2025

మహిళా నిర్మాతపై విచారణకు కోర్టు ఆదేశాలు

image

ప్రముఖ బాలీవుడ్ నిర్మాత ఏక్తా కపూర్‌పై ముంబైలోని ఓ కోర్టు విచారణకు ఆదేశించింది. ఆమె నిర్మించిన ఓ వెబ్ సిరీస్‌లో భారత జవాన్లను అవమానపరిచేలా సన్నివేశాలున్నాయని వికాస్ పాఠక్ అనే యూట్యూబర్ పోలీసులకు ఫిర్యాదు చేశారు. ఆర్మీ అధికారి యూనిఫామ్‌లో ఓ నటుడితో అభ్యంతరకర సన్నివేశాలు చేయించారని అందులో పేర్కొన్నారు. ఆ ఫిర్యాదును స్వీకరించిన మేజిస్ట్రేటు కోర్టు, ఏక్తాపై విచారణ ప్రారంభించాలని పోలీసులను ఆదేశించింది.

News February 16, 2025

ఢిల్లీ రైల్వే స్టేషన్ ఘటన దిగ్భ్రాంతిని కలిగించింది: PM మోదీ

image

ఢిల్లీ రైల్వే స్టేషన్‌లో చోటుచేసుకున్న తొక్కిసలాట ఘటన పట్ల ప్రధాని మోదీ ట్విటర్లో తీవ్ర దిగ్భ్రాంతిని వ్యక్తం చేశారు. ‘సన్నిహితుల్ని కోల్పోయినవారికి నా ప్రగాఢ సానుభూతి. క్షతగాత్రులు వేగంగా కోలుకోవాలని కోరుకుంటున్నాను. బాధితులకు అధికారులు సహాయ సహకారాలు అందిస్తున్నారు’ అని పేర్కొన్నారు. అటు రక్షణమంత్రి రాజ్‌నాథ్ సింగ్ కూడా ఘటనపై ఆవేదన వ్యక్తం చేశారు. ఆ వార్త తనను కలచివేసిందని తెలిపారు.

News February 16, 2025

తండ్రులకు నా పర్సనల్ రిక్వెస్ట్: బ్రహ్మానందం

image

తండ్రులు పిల్లల్ని స్వేచ్ఛగా వదిలేయాలని నటుడు బ్రహ్మానందం ‘బ్రహ్మా ఆనందం’ ప్రెస్‌మీట్‌లో విజ్ఞప్తి చేశారు. ‘20-25 ఏళ్లు దాటాక పిల్లల్ని మన కంట్రోల్‌లో ఉంచుకోవాలన్న ఆలోచన రాకూడదు. రెక్కలు వచ్చిన పక్షులు అవే ఎగురుతాయి. ఎగరటాన్ని అలవాటు చేయాలి తప్ప ఇంత వరకే రెక్క ఉండాలంటూ నిబంధనలు పెట్టడం వల్ల మరింత గాడి తప్పే ప్రమాదం ఉంటుంది. మా పిల్లల్ని నేను ఎప్పుడూ ఒక్కసారి కూడా కొట్టలేదు’ అని వెల్లడించారు.

News February 16, 2025

హర్మన్‌ప్రీత్ అరుదైన ఫీట్

image

భారత మహిళా జట్టు కెప్టెన్ హర్మన్‌ప్రీత్ కౌర్ అరుదైన ఫీట్ సాధించారు. టీ20ల్లో 8వేల పరుగులు పూర్తి చేసిన రెండో భారత ప్లేయర్‌గా నిలిచారు. హర్మన్ కన్నా ముందు స్మృతి మంధాన ఈ మైలురాయి చేరుకున్నారు.

News February 16, 2025

BREAKING: ఢిల్లీ తొక్కిసలాటలో 15మంది మృతి

image

ఢిల్లీ రైల్వే స్టేషన్లో చోటు చేసుకున్న తొక్కిసలాటలో 15మంది మృతిచెందినట్లు లోక్‌నాయక్ జయప్రకాశ్ ఆస్పత్రి ప్రకటించింది. మృతుల్లో ముగ్గురు చిన్నారులున్నారు. కుంభమేళాకు వెళ్లే భక్తులతో స్టేషన్ కిక్కిరిసిపోవడంతో భారీ తొక్కిసలాట చోటుచేసుకున్న సంగతి తెలిసిందే. ప్రయాగరాజ్ వెళ్లే రైళ్లు రద్దయ్యాయన్న వదంతులే తొక్కిసలాటకు ప్రధాన కారణమని సమాచారం. మృతుల సంఖ్య పెరిగే అవకాశం ఉన్నట్లు తెలుస్తోంది.

News February 16, 2025

పుట్టినరోజు శుభాకాంక్షలు

image

ఈ రోజు పుట్టినరోజు జరుపుకొంటున్న అందరికీ శుభాకాంక్షలు. పరిమితుల దృష్ట్యా ఫొటో ఎంపిక కాని వారు మన్నించగలరు. > ఫొటో, పేరు, ఊరు, పుట్టిన తేదీ వివరాలతో.. teluguteam@way2news.comకు SUBJECT: BIRTHDAYతో ముందురోజు (ex: MAY 1న పుట్టినరోజు అయితే APR 30న) ఉదయం గం.8:00-08:05 లోపు మెయిల్ చేయండి. పుట్టినరోజున మీ సన్నిహితులను ఆశ్చర్యపరచండి.

News February 16, 2025

ఫిబ్రవరి 16: చరిత్రలో ఈరోజు

image

1944: భారత సినీ పితామహుడు దాదాసాహెబ్ ఫాల్కే మరణం
1954: వెస్టిండీస్ దిగ్గజ క్రికెటర్ మైకేల్ హోల్డింగ్ జననం
1956: భారత ఖగోళ శాస్త్రవేత్త మేఘనాథ్ సాహా మరణం
1961: ఆర్థిక శాస్త్రవేత్త వాసిరెడ్డి శ్రీకృష్ణ మరణం
1964: పారిశ్రామికవేత్త లగడపాటి రాజగోపాల్ జననం
1985: పాత్రికేయుడు నార్ల వెంకటేశ్వరరావు మరణం
2005: పర్యావరణ పరిరక్షణ కోసం క్యోటో ఒప్పందం అమలు

News February 16, 2025

ఈరోజు నమాజ్ వేళలు

image

తేది: ఫిబ్రవరి 16, ఆదివారం
ఫజర్: తెల్లవారుజామున 5.29 గంటలకు
సూర్యోదయం: ఉదయం 6.42 గంటలకు
దుహర్: మధ్యాహ్నం 12.30 గంటలకు
అసర్: సాయంత్రం 4.41 గంటలకు
మఘ్రిబ్: సాయంత్రం 6.18 గంటలకు
ఇష: రాత్రి 7.31 గంటలకు
NOTE: ప్రాంతాన్ని బట్టి నమాజ్ వేళల్లో స్వల్ప తేడాలుండొచ్చు.

News February 16, 2025

శుభ ముహూర్తం (ఆదివారం, 16-02-2025)

image

తిథి: బహుళ చవితి రా.12.23 వరకు
నక్షత్రం: హస్త రా.2.59 వరకు
రాహుకాలం: సా.4.30 నుంచి సా.6.00 వరకు
యమగండం: మ.12.00 నుంచి మ.1.30 వరకు
దుర్ముహూర్తం: సా.4.25 నుంచి సా.5.13 వరకు
వర్జ్యం: ఉ.9.49 నుంచి ఉ.11.35 వరకు
అమృత ఘడియలు: రా.8.22 నుంచి రా.10.08 వరకు