news

News February 15, 2025

HEADLINES TODAY

image

అక్రమ వలసదారుల్ని వెనక్కి తీసుకొస్తాం: పీఎం మోదీ
భారత్‌కు ఎఫ్-35 విమానాలిచ్చేందుకు సిద్ధం: ట్రంప్
TG: మోదీ జన్మత: బీసీ కాదు: సీఎం రేవంత్
TG: కేసీఆర్‌కు తెలంగాణలో జీవించే హక్కు లేదు: సీఎం రేవంత్
TG: కాంగ్రెస్ రాష్ట్ర ఇన్‌ఛార్జిగా మీనాక్షి నటరాజన్ నియామకం
AP: మేం ప్రజాస్వామ్యవాదులం: సీఎం చంద్రబాబు
AP: అన్నమయ్య జిల్లాలో యువతిపై యాసిడ్ దాడి
కుంభమేళాలో 50 కోట్లు దాటిన భక్తుల సంఖ్య

News February 15, 2025

వాలంటైన్స్ డే.. ఎక్కువగా అమ్ముడైనవి ఇవే

image

వాలంటైన్స్ వీక్ సందర్భంగా ఆన్‌లైన్ అమ్మకాలు జోరుగా సాగాయి. ఇవాళ ప్రేమికుల రోజున రోజెస్, చాక్లెట్స్, టెడ్డీ బేర్స్, జువెల్లరీ, బుక్స్, డి-టాన్ కిట్స్ ఎక్కువగా అమ్ముడైనట్లు ఈకామర్స్ సంస్థలు వెల్లడించాయి. నిమిషానికి 581 చాక్లెట్లు, 324 రోజెస్ ఆర్డర్లు వచ్చినట్లు స్విగ్గీ తెలిపింది. తాము ఢిల్లీ, ముంబై, బెంగళూరులో హోమ్ డేట్ నైట్ ఆఫర్లు ప్రకటించగా రెస్పాన్స్ బాగుందని జొమాటో ప్రకటించింది.

News February 15, 2025

ప్రేమికుల రోజున వారు స్త్రీలను హింసించేవారు!

image

నేడంటే ‘ప్రేమికుల రోజు’న ప్రేమిస్తున్నారు కానీ ప్రాచీన రోమన్లు ఫిబ్రవరి 13 నుంచి 15 మధ్య రోజుల్లో స్త్రీలను దారుణంగా హింసించేవారు. ఈ 3రోజుల్ని సంతానోత్పత్తి పండుగగా వారు భావించేవారు. జంతువుల్ని బలి ఇవ్వడంతో పాటు స్త్రీలను తోలు ఊడిపోయేలా కొరడాలతో కొట్టడం వల్ల సంతాన సామర్థ్యం పెరుగుతుందని మూఢంగా నమ్మేవారు. దీంతో మహిళలు నరకం చవిచూసేవారు. కాలక్రమేణా ఆ దురాచారం అంతరించింది.

News February 15, 2025

గురుదక్షిణగా నాకు ప్రియురాలుగా ఉండు.. టీచర్ ఒత్తిడి

image

బిహార్ కిసాన్‌గంజ్(D)లో వికాస్ అనే టీచర్ 12వ తరగతి విద్యార్థినితో అనుచితంగా ప్రవర్తించాడు. ఏకలవ్యుడు గురువుకు బొటన వేలును కోసి ఇచ్చినట్లుగా తనకు గురుదక్షిణగా ప్రియురాలిగా ఉండాలని కోరాడు. బాలిక మేనేజ్‌మెంట్‌కు ఫిర్యాదుచేసినా పట్టించుకోలేదు. దీంతో అతనిపై చర్యలు తీసుకోవాలని ఆమె పేరెంట్స్, గ్రామస్థులు స్కూల్ ఎదుట ఆందోళన చేశారు. ఉన్నతాధికారులు ఈ ఘటనపై స్పందించి విచారణ చేస్తామని హామీ ఇచ్చారు.

News February 15, 2025

ప్రేమలో పడ్డారా? ఇలా తెలుసుకోండి!

image

మొబైల్‌లో చాట్ చేస్తూ నవ్వుకుంటున్నామంటే చాలు వీడు ప్రేమలో ఉన్నాడు అని మన పెద్దవాళ్లు డిసైడ్ చేసేస్తుంటారు. మీరు మీమ్స్ చూసి నవ్వుకుంటున్నారన్న విషయం వారికి తెలియదు. కానీ, ప్రేమలో పడినవారి శరీరంలో కొన్ని మార్పులు కనిపిస్తాయని BBC ఓ కథనంలో పేర్కొంది. బుగ్గలు ఎరుపెక్కితే, గుండె వేగంగా కొట్టుకుంటే, చేతులు జిగురులా అతుక్కుంటే.. అవి ప్రేమలో పడ్డారనడానికి సంకేతం అని పేర్కొంది.

News February 14, 2025

స్వర్ణాంధ్ర-స్వచ్చాంధ్ర ర్యాంకులు ప్రకటించిన ప్రభుత్వం

image

AP: స్వర్ణాంధ్ర-స్వచ్చాంధ్రలో భాగంగా 14 సూచికల ఆధారంగా జిల్లాలకు ప్రభుత్వం ర్యాంకులు కేటాయించింది. వ్యక్తిగత మరుగుదొడ్ల నిర్మాణం, పబ్లిక్ టాయిలెట్స్, డోర్ టు డోర్ వేస్ట్ కలక్షన్స్, సాలిడ్ వేస్ట్ సెగ్రిగేషన్, క్లీన్ విలేజ్, సహా పలు అంశాలకు పాయింట్లు కేటాయించి ర్యాంకులు ప్రకటించారు. 200 పాయింట్లకు 129 పాయింట్లతో ఎన్టీఆర్ జిల్లా మొదటి స్థానంలో, 81 పాయింట్లతో అల్లూరి జిల్లా 26వ స్థానంలో నిలిచాయి.

News February 14, 2025

ఏ జిల్లాకు ఏ ర్యాంక్ వచ్చింది?

image

AP: ఎన్టీఆర్-1, విశాఖ-2, ఈస్ట్ గోదావరి-3, అనంతపురం-4, అన్నమయ్య-5, శ్రీకాకుళం-6, కడప-7, గుంటూరు-8, బాపట్ల-9, నెల్లూరు-10లో ఉన్నాయి. ఆ తర్వాతి స్థానాల్లో వెస్ట్ గోదావరి, అనకాపల్లి, తిరుపతి, కాకినాడ, ఏలూరు, కృష్ణా, కోనసీమ, మన్యం, శ్రీ సత్యసాయి, పల్నాడు, కర్నూలు, ప్రకాశం, నంద్యాల, విజయనగరం, చిత్తూరు, అల్లూరి జిల్లాలు ఉన్నాయి.

News February 14, 2025

TGSRTCకి రూ.21.72 కోట్ల టోకరా.. ‘గో రూరల్’ ఆస్తులు సీజ్

image

TGSRTC బస్సులపై ప్రకటనల పేరుతో గో రూరల్ ఇండియా రూ.21.72 కోట్ల మోసానికి పాల్పడింది. యాడ్స్ ద్వారా వచ్చిన ఆదాయాన్ని ఆర్టీసీకి ఇవ్వకుండా తమ అనుబంధ కంపెనీలకు మళ్లించుకుని వ్యాపారం చేసినట్లు ఈడీ గుర్తించింది. దీంతో ఆ సంస్థకు చెందిన రూ.6.47 కోట్ల విలువైన స్థిరాస్తులను తాత్కాలికంగా జప్తు చేసింది. ఈ కేసుపై దర్యాప్తు చేస్తున్నట్లు పేర్కొంది.

News February 14, 2025

మున్షీ స్థానంలో మీనాక్షి

image

TG: ఏఐసీసీ తెలంగాణ వ్యవహారాల ఇన్‌ఛార్జిగా దీపాదాస్ మున్షీ స్థానంలో మీనాక్షి నటరాజన్‌ను కాంగ్రెస్ అధిష్ఠానం నియమించింది. ఈ మేరకు ఏఐసీసీ కార్యదర్శి కేసీ వేణుగోపాల్ ఉత్తర్వులు జారీ చేశారు. ఈమె రాహుల్ గాంధీ టీమ్‌లో కీలకంగా ఉన్నారు. కొంతకాలంగా మున్షీ తీరుపై రాష్ట్ర కాంగ్రెస్ నేతలు ఫిర్యాదులు చేస్తున్నట్లు సమాచారం.

News February 14, 2025

వచ్చేవారం భారత్-బంగ్లా ‘సరిహద్దు’ చర్చలు

image

సరిహద్దు సమస్యలపై భారత్-బంగ్లాదేశ్ ఈ నెల 17-20 తేదీల మధ్యలో చర్చలు నిర్వహించనున్నాయి. సరిహద్దుల్లో కంచె నిర్మాణం, BSF జవాన్లపై బంగ్లా దుండగుల దాడి వంటి అంశాలు ఈ సమావేశంలో చర్చకు వచ్చే అవకాశం ఉంది. ఢిల్లీలోని BSF ప్రధాన కార్యాలయంలో జరిగే సమావేశంలో డైరెక్టర్ జనరల్ స్థాయి అధికారులు పాల్గొంటారని కేంద్ర ప్రభుత్వ వర్గాలు తెలిపాయి. హసీనా ప్రభుత్వం కుప్పకూలాక ఇరు దేశాల మధ్య ఇదే తొలి అగ్రస్థాయి సమావేశం.