India's largestHyperlocal short
news App
Get daily news updates that are tailored for you based on your preferred language & location.
AP: బంగాళాఖాతంలో ఏర్పడిన తీవ్ర అల్పపీడనం ఉత్తర దిశగా ప్రయాణిస్తోందని వాతావరణ శాఖ తెలిపింది. దీని ప్రభావంతో వచ్చే 48 గంటలు భారీ వర్షాలు పడతాయని వెల్లడించింది. రేపు కాకినాడ, విశాఖ, అనకాపల్లి, అల్లూరి జిల్లాలకు ఆరెంజ్ అలర్ట్ జారీ చేసింది. గంటకు 35-45కి.మీ వేగంతో గాలులు వీస్తాయని పేర్కొంది. మత్స్యకారులు వేటకు వెళ్లొద్దని హెచ్చరించింది.
CM రేవంత్ తెలంగాణను భ్రష్టు పట్టిస్తున్నారని కేంద్రమంత్రి కిషన్ రెడ్డి ఫైరయ్యారు. అదానీ విషయంలో మాట్లాడే నైతిక హక్కు ఆయనకు లేదని, రూ.వంద కోట్లతో స్కిల్ యూనివర్సిటీ అభివృద్ధికి ఒప్పందం చేసుకున్నప్పుడు గుర్తు లేదా? అని ప్రశ్నించారు. రేవంత్ అయినా, రాహుల్ అయినా అదానీ అవినీతిపై ఒక్క సాక్ష్యమైనా చూపిస్తారా? అని సవాల్ విసిరారు. కాంగ్రెస్ సర్కార్ ఏడాదిలోనే ప్రజా వ్యతిరేకతను మూటగట్టుకుందన్నారు.
జమిలి ఎన్నికలపై దేశవ్యాప్త చర్చ జరుగుతున్న వేళ ఓ IRAS అధికారి చేసిన ట్విటర్ పోస్ట్ వైరలవుతోంది. ‘ఒకే దేశం- ఒకే పన్ను, ఒకే దేశం – ఒకే ఎన్నికలు తర్వాత మద్యం ప్రియుల నుంచి ఈ డిమాండ్ వస్తోంది. దయచేసి ఆలోచించండి’ అని ఆయన ట్వీట్ చేశారు. అందులో గోవాలో రూ.320లు ఉన్న వైన్ బాటిల్ కర్ణాటకలో రూ.920గా ఉంది. దీనిపై కూడా వన్ నేషన్- వన్ రేట్ అని డిమాండ్ చేస్తున్నారు.
చలి విపరీతంగా పెరిగిపోవడంతో రోడ్లపై ఉంటోన్న నిరాశ్రయుల కోసం ఢిల్లీ ప్రజలు ముందుకొచ్చారు. వారిని చలి నుంచి రక్షించేందుకు బట్టలను సేకరిస్తున్నారు. ప్రజలకు దుప్పట్లు, స్వెటర్లు, వెచ్చని బట్టలను సేకరించి అవసరమైన వారికి అందిస్తున్నారు. దీంతో చాలా మంది చలి పులి నుంచి రక్షణ పొందుతున్నారు. ఇలాంటి ఆలోచనే ఇతర నగరాల ప్రజలూ చేయాలని, నిరాశ్రయులకు సాయం చేయాలని నెటిజన్లు సూచిస్తున్నారు.
AP: టీడీపీ దివంగత నేత పరిటాల రవీంద్ర హత్యకేసు నిందితులకు హైకోర్టు బెయిల్ మంజూరు చేసింది. హత్య జరిగిన 18 ఏళ్ల తర్వాత ఐదుగురు నిందితులకు బెయిల్ ఇచ్చింది. A-3 నారాయణరెడ్డి, A-4 రేఖమయ్య, A-5 రంగనాయకులు, A-6 వడ్డే కొండ, A-8 ఓబిరెడ్డికి బెయిల్ మంజూరైంది. కాగా 2005 జనవరి 24న పరిటాల రవి అనంతపురంలోని టీడీపీ కార్యాలయంలో హత్యకు గురైన సంగతి తెలిసిందే.
TG: రాష్ట్రంలో చలి తీవ్రత నేపథ్యంలో ఆదిలాబాద్ జిల్లాలో పాఠశాల వేళల్లో ప్రభుత్వం మార్పులు చేసింది. ఉ.9.40 నుంచి సా.4.30 వరకు స్కూళ్లు నడపాలని ఆదేశించింది. ప్రస్తుతం ఉ.9.15 నుంచి సా.4.15 వరకు పాఠశాలలు నడుస్తున్నాయి. కాగా, తాము చలితో ఇబ్బందులు పడుతున్నామని, టైమింగ్స్ మార్చాలని పలు జిల్లాల విద్యార్థులు కోరుతున్నారు.
రెబల్ స్టార్ ప్రభాస్ హీరోగా ప్రశాంత్ నీల్ తెరకెక్కించిన ‘సలార్’ సినిమా ఓటీటీలో రికార్డు సృష్టించింది. హాట్‌స్టార్‌లో 300 రోజులుగా ట్రెండ్ అవుతోందని సినీవర్గాలు పేర్కొన్నాయి. ఓటీటీ చరిత్రలోనే ఇదో రికార్డని తెలిపాయి. ఈ చిత్రం గతేడాది డిసెంబర్ 22న విడుదలవగా ఈ ఏడాది జనవరి 20 నుంచి ఓటీటీలో స్ట్రీమింగ్ అవుతోంది. కాగా, ఈ చిత్ర సీక్వెల్ కోసం ఫ్యాన్స్ ఆత్రుతగా ఎదురుచూస్తున్నారు.
TG: లగచర్లలో అధికారులపై దాడి కేసులో బీఆర్ఎస్ మాజీ ఎమ్మెల్యే పట్నం నరేందర్ రెడ్డికి బెయిల్ లభించింది. ఆయనతో పాటు ఈ కేసులో ప్రధాన నిందితుడిగా ఉన్న BRS కార్యకర్త సురేశ్ సహా మొత్తం 24 మందికి బెయిల్ వచ్చింది.
AP: కానిస్టేబుల్ పోస్టుల భర్తీలో హోంగార్డులను ప్రత్యేక కేటగిరీగా పరిగణించాలని ఏపీ హైకోర్టు పోలీసు నియామక మండలిని ఆదేశించింది. ఆరు వారాల్లో ప్రత్యేక మెరిట్ జాబితా రూపొందించాలని తీర్పు చెప్పింది. కాగా, సామాజిక రిజర్వేషన్లు వర్తింపజేసి, ప్రిలిమినరీ పరీక్షలో తమకు క్వాలిఫైయింగ్ మార్కులు రాలేదంటూ తమను రాతపరీక్షలకు అనుమతించలేదని పలువురు కోర్టుకెక్కారు.
ఐకాన్ స్టార్ అల్లు అర్జున్ హిందీ బాక్సాఫీస్‌ను షేక్ చేస్తున్నారు. ఆయన నటించిన ‘పుష్ప-2’ సినిమా అక్కడి ప్రేక్షకులకు ఎంతో నచ్చేసింది. దీంతో భారీగా కలెక్షన్లు వస్తున్నాయి. ఇప్పటివరకూ ఈ సినిమాకు హిందీలో రూ.601.50 కోట్లు (నెట్) వచ్చినట్లు మేకర్స్ ప్రకటించారు. అత్యంత వేగంగా ఈ మార్కును దాటిన సినిమాగా నిలిచినట్లు వెల్లడించారు.
Sorry, no posts matched your criteria.