news

News August 11, 2024

గూగుల్ పేలో హిస్టరీ డిలీట్ ఇలా చేయండి

image

☘ ప్రొఫైల్‌పై ట్యాప్ చేసి సెట్టింగ్స్‌లోకి వెళ్లి ప్రైవసీ&సెక్యూరిటీపై క్లిక్ చేయాలి
☘ డేటా & పర్సనలైజేషన్ ఆప్షన్‌ను ఎంచుకొని గూగుల్ అకౌంట్ లింక్‌పై నొక్కాలి
☘ తర్వాత మేనేజ్ యువర్ గూగుల్ పే ఎక్స్‌పీరియన్స్ పేజ్‌ను కిందకు స్క్రోల్ చేసి గూగుల్ పే లావాదేవీల హిస్టరీలోకి వెళ్లాలి
☘ అక్కడ మీరు వద్దనుకున్న లావాదేవీని డిలీట్ చేయవచ్చు
☘ కావాలంటే టైమ్ పీరియడ్‌ను ఎంచుకొని హిస్టరీ మొత్తం డిలీట్ చేయవచ్చు.

News August 11, 2024

ఫ్యామిలీ కోసం కొత్త కారు కొన్న సిరాజ్

image

టీమ్ ఇండియా పేసర్, హైదరాబాదీ మహ్మద్ సిరాజ్ కొత్త ల్యాండ్ రోవర్ కారు కొన్నారు. ఫ్యామిలీతో కలిసి షోరూమ్‌లో దిగిన ఫొటోలను సోషల్ మీడియాలో పంచుకున్న సిరాజ్ ‘డ్రీమ్ కార్’ అని క్యాప్షన్ ఇచ్చారు. ‘నా ఫ్యామిలీ కోసం డ్రీమ్ కారు కొన్నా. కలలకు లిమిట్ లేదు. హార్డ్‌వర్క్‌తో వాటిని సాకారం చేసుకోవచ్చు’ అని సిరాజ్ రాసుకొచ్చారు.

News August 11, 2024

పవిత్ర సంగమం వద్ద మళ్లీ హారతులు: ఆనం

image

AP: విజయవాడ ఇబ్రహీంపట్నం వద్ద కృష్ణా నదిలో గోదావరి జలాలు కలిసే పవిత్ర సంగమం వద్ద జల హారతులను పున:ప్రారంభించనున్నట్లు మంత్రి ఆనం రామనారాయణ రెడ్డి వెల్లడించారు. హారతులు ఇచ్చే కార్యక్రమం, ప్రారంభోత్సవం తదితర అంశాలపై రేపు చర్చించి నిర్ణయాలు తీసుకుంటామన్నారు. అటు దేవాదాయ శాఖ పరిధిలో రూ.50వేలలోపు ఆదాయం ఉన్న ఆలయాలకు ధూప దీప నైవేద్యాల నిమిత్తం గతంలో ప్రతి నెలా ఇచ్చే రూ.5వేలను రూ.10వేలకు పెంచామన్నారు.

News August 11, 2024

చై-శోభితా పెళ్లి ఎప్పుడు? నాగ్ స్పందన ఇదే

image

నాగ చైతన్య, శోభిత ధూళిపాళ్ల నిశ్చితార్థాన్ని తాము ముందుగా ప్లాన్ చేసుకోలేదని అక్కినేని నాగార్జున ఓ ఇంటర్వ్యూలో తెలిపారు. ‘ఎంగేజ్‌మెంట్‌ చేసుకోవాలని వాళ్లిద్దరూ అప్పటికప్పుడు అనుకున్నారు. దీంతో వెంటనే చేసేశాం. పెళ్లికి మాత్రం అలా కాదు. ప్రస్తుతం ఇద్దరూ వారి కెరీర్స్‌తో బిజీగా ఉన్నారు. దానికి చాలా టైమ్ పడుతుంది’ అని స్పష్టం చేశారు. చై, శోభిత రెండేళ్లుగా ప్రేమలో ఉన్నట్లు సమాచారం.

News August 11, 2024

చద్దన్నంతో ఎన్ని ఉపయోగాలో..!

image

ఇప్పుడంటే ఇడ్లీలు, దోసెలు వచ్చేశాయి కానీ ఒకప్పుడు చద్దన్నమే తెలుగువారికి అమృతం. రాత్రి వండిన అన్నం మరుసటి ఉదయానికి చద్దన్నంగా మారుతుంది. అందులో మజ్జిగో గంజో వేసుకుని మిర్చి, ఉల్లి నంజుకుని తింటే ఆ రుచే వేరు. ‘చద్దన్నం డీహైడ్రేషన్‌, అలసట, బలహీనతలను దూరం చేస్తుంది. దానిలోని పోషకాలు బీపీని తగ్గిస్తాయి. ఎముకల్ని పటిష్ఠం చేస్తాయి. పలు రకాల ఇన్‌ఫెక్షన్లను నివారిస్తాయి’ అని ఆరోగ్య నిపుణులు చెబుతున్నారు.

News August 11, 2024

16 ఏళ్ల క్రితం.. ఈరోజున చరిత్ర సృష్టించిన బింద్రా

image

సరిగ్గా 16 ఏళ్ల క్రితం.. ఇదే రోజున భారత రైఫిల్ షూటర్ అభినవ్ బింద్రా బీజింగ్ ఒలింపిక్స్‌లో చరిత్ర సృష్టించారు. 2008 ఆగస్టు 11న పురుషుల 10 మీటర్ల ఎయిర్ రైఫిల్‌ ఈవెంట్‌లో స్వర్ణం గెలిచారు. తద్వారా భారత్ తరఫున వ్యక్తిగతంగా గోల్డ్ మెడల్ సాధించిన తొలి క్రీడాకారుడిగా చరిత్రలో నిలిచిపోయారు. గతంలోనూ భారత్ స్వర్ణ పతకాలు గెలిచినా అవి జట్టుగా ఆడే హాకీ ద్వారా లభించాయి.

News August 11, 2024

అదానీ స్టాక్స్ పడిపోతాయా?

image

స్టాక్ మార్కెట్లు, అదానీ షేర్లపై హిండెన్‌బర్గ్ ఆరోపణల ప్రభావం ఎక్కువగా ఉండకపోవచ్చని ఇండీట్రేడ్ క్యాపిటల్ ఛైర్మన్ సుదీప్ బంధోపాధ్యాయ అన్నారు. మొదట్లో కొంత రియాక్షన్ కనిపించినా తర్వాత కొనుగోళ్లు పెరుగుతాయని అంచనా వేశారు. ‘స్టాక్ మార్కెట్లో గందరగోళం సృష్టించేందుకు ఆధారాలు లేకుండా చేసిన ఆరోపణలు అవి. అదానీ స్టాక్స్‌లో సెల్లింగ్ ఉండకపోవచ్చు’ అని ప్రాఫిట్ మార్ట్ రీసెర్చ్ హెడ్ అవినాశ్ అభిప్రాయపడ్డారు.

News August 11, 2024

ఘోర ప్రమాదం

image

TG: మేడ్చల్ జిల్లా గౌడవెల్లి రైల్వే స్టేషన్ వద్ద ఘోర ప్రమాదం జరిగింది. రైలు ఢీకొని తండ్రి, ఇద్దరు కుమార్తెలు మరణించారు. రాఘవేంద్రనగర్‌కు చెందిన రైల్వే లైన్‌మెన్ కృష్ణ తన ఇద్దరు కూతుళ్లను ట్రాక్‌పై కూర్చోబెట్టి పనిచేస్తున్నాడు. దూసుకొచ్చిన రైలు ముగ్గురినీ ఢీకొట్టడంతో అక్కడికక్కడే ప్రాణాలు కోల్పోయారు. ప్రమాదంపై రైల్వే పోలీసులు దర్యాప్తు చేపట్టారు.

News August 11, 2024

వినేశ్ అనర్హత: రూల్ పాటించాల్సిందేనన్న UWW

image

అథ్లెట్ల ఆరోగ్యం కోసమే బరువు నిబంధనలు తీసుకొచ్చామని ప్రపంచ రెజ్లింగ్ చీఫ్ నెనాడ్ లలోవిక్ అన్నారు. వినేశ్ ఫొగట్ డిస్‌క్వాలిఫై అయినందుకు ఆవేదన చెందారు. ‘దేశ పరిమాణంతో సంబంధం లేదు. అందరు అథ్లెట్లూ సమానమే. వినేశ్ బరువును అందరి ముందే కొలిచారు. మరి నిబంధనలు పాటించకుండా మేమేం చేయగలం? చిన్న చిన్న సర్దుబాట్లు ఉంటాయేమో గానీ బరువు నిబంధనైతే మార్చలేం. మా వైద్య కమిషన్ ఇందుకు వ్యతిరేకంగా ఉంది’ అని ఆయన అన్నారు.

News August 11, 2024

రూ.1,00,000 సాయం.. రేపే లాస్ట్ ఛాన్స్

image

TG: రాజీవ్‌గాంధీ సివిల్స్ అభయ హస్తం పథకం దరఖాస్తు గడువు ఆగస్టు 12వ తేదీ సా.5 గంటలతో ముగియనుంది. రాష్ట్రానికి చెందిన యువత సివిల్స్ ప్రిలిమ్స్‌లో ఉత్తీర్ణత సాధిస్తే ఈ స్కీం కింద రూ.లక్ష సాయాన్ని సింగరేణి తరఫున రాష్ట్ర ప్రభుత్వం అందిస్తుంది. గత నెల 20వ తేదీన CM రేవంత్, డిప్యూటీ CM విక్రమార్క ప్రారంభించారు. గతంలో విధించిన దరఖాస్తు గడువు ఈ నెల 6తో ముగియగా, అభ్యర్థుల విజ్ఞప్తితో 12 వరకు పొడిగించారు.