news

News February 13, 2025

లోక్‌సభ ముందుకు కొత్త IT బిల్లు

image

లోక్‌సభ ముందుకు ఆదాయపు పన్ను కొత్త బిల్లు వచ్చింది. కేంద్ర ఆర్థిక మంత్రి నిర్మలా సీతారామన్ దీనిని సభలో ప్రవేశపెట్టారు. ఇప్పటివరకు ఫైనాన్షియల్ ఇయర్, అసెస్‌మెంట్ ఇయర్ అనేవి ఉండగా ఇక నుంచి ‘ట్యాక్స్ ఇయర్’ అనే కాన్సెప్ట్ మాత్రమే ఉండనుంది. ఈ కొత్త బిల్లు వచ్చే ఏడాది ఏప్రిల్ 1 నుంచి అమల్లోకి రానుంది. అటు వచ్చే నెల 10వ తేదీ వరకు లోక్‌సభను వాయిదా వేశారు.

News February 13, 2025

వైసీపీని భయభ్రాంతులకు గురిచేసే కుట్ర: జూపూడి

image

AP: కూటమి ప్రభుత్వం చట్టాలు తెలియకుండా ప్రవర్తిస్తోందని వైసీపీ నేత జూపూడి ప్రభాకర్ రావు దుయ్యబట్టారు. వైసీపీ కేడర్‌ను భయభ్రాంతులకు గురిచేసే కుట్ర జరుగుతోందని అన్నారు. గన్నవరం దాడి విషయంలో 94 మందిపై కేసులు పెట్టారన్నారు. కోర్టులో కేసులు నడుస్తుంటే ఎలా అరెస్టు చేస్తారని ప్రశ్నించారు. సత్యవర్ధన్ నిజం చెబితే పోలీసుల చేత వేధించి కేసులు పెట్టించారని విమర్శించారు.

News February 13, 2025

పోలీసుల నోటీసులపై పోచంపల్లి రియాక్షన్

image

TG: <<15447380>>పోలీసుల నోటీసులపై<<>> MLC పోచంపల్లి శ్రీనివాస్ రెడ్డి స్పందించారు. ఫామ్ హౌజ్ తనదేనని, రమేశ్ అనే వ్యక్తికి లీజుకు ఇచ్చినట్లు వెల్లడించారు. అతను వేరే వ్యక్తికి లీజుకు ఇచ్చారనే విషయం తనకు తెలియదని పేర్కొన్నారు. తాను ఫామ్ హౌస్ వెళ్లి ఎనిమిదేళ్లు దాటినట్లు చెప్పారు. లీజు డాక్యుమెంట్లను పోలీసులకు అందించినట్లు తెలిపారు. కాగా కోడి పందేలు జరిగాయని గేమింగ్, యానిమల్ యాక్ట్ కింద ఆయనపై కేసు నమోదు చేశారు.

News February 13, 2025

అప్పుడు పంత్‌ను కాపాడి.. ఇప్పుడు చావుతో పోరాడుతున్నాడు

image

2022లో ఘోర రోడ్డు ప్రమాదం నుంచి క్రికెటర్ రిషభ్ పంత్‌ను కాపాడిన యూపీ యువకుడు రజత్(21) ప్రస్తుతం చావుతో పోరాడుతున్నాడు. తమ పెళ్లికి ఇంట్లో వాళ్లు ఒప్పుకోలేదని ఈనెల 9న ప్రియురాలు మన్నూతో కలిసి అతడు విషం తాగాడు. తీవ్ర అస్వస్థతకు గురైన వారిద్దరినీ ఉత్తరాఖండ్‌లోని రూర్కీ ఆసుపత్రిలో చేర్చించారు. ఈక్రమంలోనే నిన్న మన్నూ మృతి చెందగా రజత్ పరిస్థితి విషమంగా ఉంది.

News February 13, 2025

వంశీ అరెస్టు సరికాదు: బొత్స

image

AP: మాజీ ఎమ్మెల్యే వంశీ అరెస్టును ఖండిస్తున్నట్లు ఎమ్మెల్సీ బొత్స సత్యనారాయణ వ్యాఖ్యానించారు. ఉపసంహరించుకున్న కేసులో అరెస్ట్ చేయడం ఏంటని ఆయన ప్రశ్నించారు. కక్షపూరిత రాజకీయాలు తగవన్నారు. తొమ్మిది నెలల అధికారాన్ని కూటమి ప్రభుత్వం వృథా చేసిందని దుయ్యబట్టారు. ఎన్నికల్లో ఇచ్చిన హామీలన్నీ బూటకమేనని విమర్శించారు.

News February 13, 2025

ఉడికించిన చికెన్, గుడ్లు తినొచ్చు: మంత్రి అచ్చెన్న

image

AP: బర్డ్‌ఫ్లూపై ఆందోళన చెందాల్సిన అవసరం లేదని మంత్రి అచ్చెన్నాయుడు స్పష్టం చేశారు. ఉడికించిన చికెన్, గుడ్లు తింటే ప్రమాదం ఏమీలేదని తేల్చి చెప్పారు. బర్డ్‌ఫ్లూపై సోషల్ మీడియా, కొన్ని పత్రికలు భయాందోళనలు సృష్టిస్తున్నాయని, అలాంటి వాటిపై చర్యలు తీసుకుంటామన్నారు. కేంద్రం, శాస్త్రవేత్తలతో చర్చించామని, కోళ్లకు వ్యాధి సోకిన ప్రాంతానికి ఒక కి.మీ పరిధికే ఇది పరిమితం అవుతుందని చెప్పినట్లు వెల్లడించారు.

News February 13, 2025

తొలి లవ్ స్టోరీలో చాలా ట్విస్టులు: శివ కార్తికేయన్

image

తన లవ్ స్టోరీలో చాలా ట్విస్టులు ఉన్నాయని తమిళ హీరో శివకార్తికేయన్ వెల్లడించారు. ‘నాది వన్ సైడ్ లవ్. అప్పటికే ఆమెకు లవర్ ఉన్నాడు. దూరం నుంచే చూస్తూ ప్రేమించా. చాలా రోజుల తర్వాత ఓ షాపింగ్ మాల్‌లో కనిపించింది. అప్పటికే ఆమెకు పెళ్లి అయిపోయింది. ట్విస్ట్ ఏంటంటే ప్రేమించిన వాడిని కాకుండా వేరే వ్యక్తిని వివాహమాడింది. నాకు దొరకని అమ్మాయి ఆ వ్యక్తికీ దొరకలేదు’ అని నవ్వుతూ చెప్పారు.

News February 13, 2025

అన్‌లిమిటెడ్ పానీపూరీ.. ఎక్కడంటే?

image

వినోదాన్ని పొందేందుకు సబ్‌స్క్రిప్షన్ ఉన్నట్లుగానే పానీపూరీ తినేందుకు ఉండాలని ఓ వ్యక్తి ఆలోచించాడు. నాగ్‌పూర్‌కు చెందిన ఓ వ్యాపారి రూ.99,000 చెల్లిస్తే జీవితాంతం అన్‌లిమిటెడ్ పానీపూరీ ఇవ్వనున్నట్లు ప్రకటించాడు. ఒకేసారి డబ్బు చెల్లించాలని పేర్కొన్నాడు. ఈ ఆఫర్ తీసుకున్నవారు ఏ సమయంలోనైనా షాప్‌కి వచ్చి పానీపూరీ తినొచ్చని తెలిపాడు. గతంలోనూ బాహుబలి పానీపూరీ పేరుతో ఆయన క్యాష్ ప్రైజ్‌లు ప్రకటించారు.

News February 13, 2025

వైట్‌హౌస్‌లో పిల్లలతో అధ్యక్షులు

image

అమెరికా అధ్యక్షుడి అధికారిక నివాసమైన ‘వైట్‌హౌస్’కు ఎలాన్ మస్క్ తన చిన్న కుమారుడిని తీసుకొచ్చిన విషయం తెలిసిందే. అయితే ఎంతో ప్రతిష్ఠాత్మక ప్రదేశంలో కొన్నేళ్లుగా అధ్యక్షులు, అధికారుల పిల్లలు సందడి చేయడం కామన్ అయిపోయింది. 2009లో ఒబామా ఇద్దరు కూతుళ్లతో, 1994లో బిల్ క్లింటన్ కూతురు చెల్సీ, 1978లో జిమ్మీ కార్టర్ తన కూతురు అమీతో, 1963లో కెనడీ తన కొడుకుతో కలిసి వైట్‌హౌస్‌లో సందడిగా గడిపారు.

News February 13, 2025

ప్రభాస్ న్యూ లుక్ అదిరిందిగా..!

image

పాన్ ఇండియా స్టార్ ప్రభాస్ హీరోగా హను రాఘవపూడి తెరకెక్కిస్తోన్న ‘ఫౌజీ’ సినిమాలో తాను నటిస్తున్నట్లు సీనియర్ నటుడు అనుపమ్ ఖేర్ తెలిపారు. డార్లింగ్‌, డైరెక్టర్‌తో దిగిన ఫొటోలను ఆయన Xలో షేర్ చేశారు. ఇప్పటివరకూ ఈ చిత్రంలోని ప్రభాస్ లుక్ రివీల్ కాలేదు. ఫొటోలో సైడ్ క్రాఫ్ హెయిర్ స్టైల్‌తో ట్రిమ్మ్‌డ్ బియర్డ్‌తో ఫార్మల్‌ డ్రైస్‌లో డార్లింగ్ కనిపించారు. ప్రభాస్ లుక్ బాగుందని ఫ్యాన్స్ అంటున్నారు.