India's largestHyperlocal short
news App
Get daily news updates that are tailored for you based on your preferred language & location.
వెస్టిండీస్ ఆల్ ఫార్మాట్ హెడ్ కోచ్‌గా ఆ దేశ మాజీ క్రికెటర్ డారెన్ సామీ ఎంపికయ్యారు. ప్రస్తుతం ఆయన వన్డే, టీ20లకు హెడ్ కోచ్‌గా ఉన్నారు. తాజాగా టెస్టులకు కూడా సామీ కోచ్‌గా నియమితులయ్యారు. వచ్చే ఏప్రిల్ నుంచి సామీ టెస్టు టీమ్‌కి తన సేవలందిస్తారు. కాగా సామీ సారథ్యంలోనే విండీస్‌కు రెండు టీ20 WCలు వచ్చాయి. 2023 వన్డే వరల్డ్ కప్‌కు విండీస్ అర్హత సాధించకపోవడంతో విండీస్ బోర్డు ఆయనను కోచ్‌గా నియమించింది.
AP: మాజీ మంత్రి పేర్ని నాని కుటుంబమంతా పరారీలో ఉందని, వారిపై చట్టపరమైన చర్యలు తీసుకుంటామని మంత్రి కొల్లు రవీంద్ర అన్నారు. పేదల బియ్యం బొక్కేసి నాని నీతులు చెబుతున్నారని మండిపడ్డారు. YCP అంటేనే దొంగల పార్టీ అని ఆయన ఎద్దేవా చేశారు. మరోవైపు కాకినాడ పోర్టులోని స్టెల్లా షిప్‌లో 1,320 టన్నుల PDS బియ్యం ఉన్నాయని కలెక్టర్ షాన్ మోహన్ తెలిపారు. ఈ బియ్యాన్ని షిప్ నుంచి అన్‌లోడ్ చేయించి సీజ్ చేస్తామన్నారు.
దేశీయ స్టాక్ మార్కెట్లు మంగళవారం భారీగా నష్టపోయాయి. సెన్సెక్స్ 1,064 పాయింట్ల నష్టంతో 80,684 వద్ద, నిఫ్టీ 332 పాయింట్లు కోల్పోయి 24,336 వద్ద స్థిరపడ్డాయి. నిఫ్టీలోని అన్ని రంగాల షేర్లు నష్టపోయాయి. సెన్సెక్స్‌లో ఒక్క ఐటీసీ మినహా మిగిలిన 29 స్టాక్స్ రెడ్‌లోనే ముగిశాయి. బ్యాంకు, ఆటో, ఫైనాన్స్, మెటల్, పీఎస్‌యూ బ్యాంకులు 1.50% వరకు నష్టపోయాయి.
BRS, BJP సభ్యుల ఆందోళనల మధ్యే తెలంగాణ అసెంబ్లీ పలు కీలక బిల్లులకు ఆమోదం తెలిపింది. స్పోర్ట్స్ వర్సిటీ బిల్లుతో పాటు యంగ్ ఇండియా ఫిజికల్ ఎడ్యుకేషన్, విశ్వవిద్యాలయాల చట్ట సవరణ, జీఎస్టీ సవరణ బిల్లులకు ఆమోదం తెలిపింది. మరోవైపు లగచర్ల ఘటన, రైతుకు బేడీలు వేసిన ఘటనలపై చర్చ జరపాలని విపక్షాలు పట్టుబట్టాయి.
AP: మాజీ మంత్రి, ఏలూరు YCP మాజీ MLA ఆళ్ల నాని రేపు TDPలో చేరుతున్నారు. అమరావతిలో చంద్రబాబు సమక్షంలో ఆయన పార్టీ కండువా కప్పుకుంటారు. టీడీపీ అధిష్ఠానం సూచన మేరకు ఆళ్ల నాని చేరికకు తాను అంగీకరించినట్లు ఏలూరు TDP ఎమ్మెల్యే బడేటి చంటి తెలిపారు. పార్టీ నిర్ణయమే తనకు శిరోధార్యమని చెప్పారు. కానీ నాని చేరికపై పార్టీ కార్యకర్తలు అసంతృప్తితో ఉన్నారని, ఈ విషయాన్ని సీఎం దృష్టికి తీసుకెళ్లానని పేర్కొన్నారు.
కంపెనీస్ మార్కెట్ క్యాప్ ప్రకారం ప్రపంచంలోని అత్యంత విలువైన టాప్-15 కార్ బ్రాండ్లలో ఇండియా నుంచి రెండు కంపెనీలున్నాయి. ప్రపంచవ్యాప్తంగా ఎంతో క్రేజ్ సంపాదించుకున్న ఎలాన్ మస్క్‌కు చెందిన ‘టెస్లా’ $1.23 ట్రిలియన్లతో తొలి స్థానంలో నిలిచింది. ఆ తర్వాతి స్థానాల్లో టొయోటా, BYD, షావోమీ, ఫెరారీ, బెంజ్, జనరల్ మోటార్స్ ఉన్నాయి. ఇక 11వ స్థానంలో $43.12Bతో మహీంద్రా, 13వ స్థానంలో $41.81Bతో సుజుకీ నిలిచాయి.
JPC(జాయింట్ పార్లమెంటరీ కమిటీ) పార్లమెంటు ఉభయసభల ప్రతినిధులతో కూడినది. ఇది బిల్లు పరిశీలనతో పాటు సిఫార్సులు చేస్తుంది. వాటిని ప్రభుత్వం పాటించాల్సిన అవసరం లేదు. కమిటీ పదవీకాలం లేదా విధి పూర్తైన తర్వాత రద్దవుతుంది. JPC సభ్యుల సంఖ్య ఒక్కోసారి ఒక్కోలా ఉంటుంది. నేడు జమిలి బిల్లు లోక్‌సభ ఆమోదం పొందగా, JPCకి పంపేందుకు సిద్ధమని అమిత్ షా ప్రకటించారు. JPC సభ్యుల పేర్లపై సాయంత్రానికి క్లారిటీ రానుంది.
‘కన్నప్ప’ సినిమా ఎలా ఉన్నా పర్లేదని, ప్రభాస్ క్యారెక్టర్ మాత్రం తేడా రాకుండా చూసుకుంటే 5 సార్లు మూవీకి వెళ్తానని ఓ ఫ్యాన్ మంచు విష్ణుకు ట్వీట్ చేశారు. దీనిపై విష్ణు స్పందిస్తూ ‘నా సోదరుడు ప్రభాస్ క్యారెక్టర్ 100శాతం మీరు ఇష్టపడేలా ఉంటుంది. త్వరలోనే మరిన్ని వివరాలు వెల్లడిస్తా. కాస్త ఓపికగా ఉండండి’ అని పేర్కొన్నారు. ఈ సినిమాలో మోహన్ లాల్, అక్షయ్ కుమార్ తదితరులు నటిస్తున్నారు.
పార్లమెంటులో జమిలి ఎన్నిక బిల్లును ప్రవేశపెట్టిన నేపథ్యంలో స్టాక్ మార్కెట్ ఒడిదొడుకులకు లోనవుతుంది. సెన్సెక్స్ 998 పాయింట్లు నష్టపోయి 80,757 పాయింట్ల వద్ద కొనసాగుతోంది. నిఫ్టీ 291 పాయింట్లు నష్టపోయి 24,376 పాయింట్లతో కొనసాగుతోంది.
గుడ్డు ఎక్కడైనా గుండ్రంగా ఉండటాన్ని చూశారా? ఇలాంటి గుడ్డును స్కాట్లాండ్‌లోని ఒక సూపర్ మార్కెట్లో ఓ మహిళ గుర్తించారు. ఈ గుడ్డును ఆమె 150 పౌండ్లకు ఇంగ్లండ్‌కు చెందిన ఎడ్ పౌనెల్‌కు అమ్మేశారు. ఆయన దీన్ని లువెంటాస్ ఫౌండేషన్‌కు విరాళమివ్వగా దీన్ని వేలం వేస్తే 200 పౌండ్లు(రూ.21,520) వచ్చాయి. కాగా, సుమారు వంద కోట్ల గుడ్లలో ఇలాంటి గుండ్రటి గుడ్డు ఒక్కటి ఉంటుందని నిపుణులు అంచనా వేస్తున్నారు.
Sorry, no posts matched your criteria.