India's largestHyperlocal short
news App
Get daily news updates that are tailored for you based on your preferred language & location.
శివ కార్తికేయన్, సాయిపల్లవి నటించిన ‘అమరన్’ సినిమా డిసెంబర్ 5 నుంచి Netflixలో స్ట్రీమింగ్ కానున్నట్లు సమాచారం. ఒప్పందం ప్రకారం థియేటర్ రిలీజ్ (అక్టోబర్ 31) తర్వాత 28 రోజులకు OTTలోకి రావాల్సి ఉండగా, థియేటర్లలో మంచి రెస్పాన్స్ ఉండటంతో OTT రిలీజ్ తేదీని వాయిదా వేసినట్లు సినీవర్గాలు తెలిపాయి. మేజర్ ముకుంద్ వరదరాజన్ జీవితం ఆధారంగా తెరకెక్కిన ఈ మూవీ ఇప్పటివరకు ₹200crకు పైగా కలెక్షన్స్ రాబట్టింది.
న్యూజిలాండ్ లెజెండరీ పేస్ బౌలర్ టిమ్ సౌథీ టెస్ట్ క్రికెట్‌కు వీడ్కోలు పలకనున్నారు. హామిల్టన్‌లోని తమ హోం గ్రౌండ్ సెడాన్ పార్క్‌లో ఆయన ఇంగ్లండ్‌తో టెస్ట్ సిరీస్‌లో రిటైర్మెంట్ ప్రకటన చేయనున్నారు. సో, అదే ఆయనకు చివరి టెస్టు సిరీస్. 35ఏళ్ల సౌథీ న్యూజిలాండ్ తరఫున 104 టెస్టులు ఆడి 385 వికెట్లు పడగొట్టారు. ఒక ఇన్నింగ్స్‌లో 5 వికెట్ల ప్రదర్శన 15 సార్లు, 10 వికెట్ల ప్రదర్శన ఒకసారి చేశారు.
తెలుగు రాష్ట్రాల్లో హోటళ్లలో భోజనం చేయాలంటేనే భయపడాల్సి వస్తోంది. దాదాపు అన్ని రెస్టారెంట్లలోనూ నాణ్యతా లోపాలు కన్పిస్తున్నాయి. తాజాగా విజయవాడలో ‘కాకినాడ వారి సుబ్బయ్య గారి హోటల్’లో ఓ కస్టమర్‌కు భోజనంలో జెర్రి వచ్చింది. దీంతో ఫుడ్ సేఫ్టీ అధికారులు హోటల్ సీజ్ చేశారు. రుచి, శుచితో పాటు మర్యాదకు మారుపేరుగా చెప్పుకునే చోటా ఇలా జరిగితే ఇంకెక్కడ తినాలి? అని భోజన ప్రియులు ఆందోళన వ్యక్తం చేస్తున్నారు.
TG: బ్యాంకుల నుంచి మహిళా స్వయం సహాయక సంఘాలు తీసుకున్న వడ్డీ లేని రుణాలకు ప్రభుత్వం వడ్డీ డబ్బులు రిలీజ్ చేసింది. ఫిబ్రవరి, మార్చికి సంబంధించి మొత్తం వడ్డీ ₹30.70కోట్లను విడుదల చేసింది. త్వరలో ఈ డబ్బులు మహిళా సంఘాల ఖాతాల్లో జమ కానున్నాయి. అత్యధికంగా నల్గొండ జిల్లాలో 5,283 సంఘాలకు ₹1.99cr, NZBలో 5,010 గ్రూపులకు ₹1.91cr, ఖమ్మంలో 3,983 సంఘాలకు ₹1.66cr, KNRలో 3,983 గ్రూపులకు ₹1.55cr జమ కానున్నాయి.
US అధ్యక్ష ఎన్నికల్లో గెలిచిన ట్రంప్ తన టీంలోకి కీలక వ్యక్తిని తీసుకోనున్నారు. డెమొక్రటిక్ అధ్యక్ష మాజీ అభ్యర్థి, యాంటీ వ్యాక్సిన్ యాక్టివిస్ట్ రాబర్ట్ కెన్నెడీని నామినేట్ చేశారు. ఆయనకు ఆరోగ్యశాఖను అప్పగించనున్నారు. మరోవైపు, జార్జియాకు చెందిన కాంగ్రెస్‌మెన్ డగ్ కొలిన్స్‌ను వెటరన్స్ ఎఫైర్స్ కోసం నామినేట్ చేశారు. ట్రంప్ ఈసారి తన క్యాబినెట్‌లోకి మస్క్ వంటి ప్రముఖులను తీసుకుంటున్న విషయం తెలిసిందే.
AP: కార్తీక పౌర్ణమి సందర్భంగా కాకినాడ(D)లోని అన్నవరం సత్యనారాయణ స్వామి గిరి ప్రదక్షిణ వేడుక ఇవాళ జరగనుంది. లక్షన్నర మంది భక్తులు వస్తారనే అంచనాతో అధికారులు పటిష్ఠ ఏర్పాట్లు చేశారు. ఉ.8 గంటలకు స్వామి, అమ్మవార్ల ఊరేగింపు, మ.2కు కొండ దిగువన సత్యరథం ప్రారంభమవుతుంది. ఇక్కడి నుంచే 9.2KM మేర గిరిప్రదక్షిణ జరగనుంది. భక్తులకు ఆహారం, పండ్లు, తాగునీరు, మజ్జిగ అందించేందుకు స్టాల్స్ సిద్ధం చేశారు.
SBI మార్జినల్ కాస్ట్ ఆఫ్ ఫండ్ బేస్డ్ లెండింగ్ రేట్స్(MCLR)ను 5 బేసిస్ పాయింట్ల(0.05 శాతం) మేర పెంచింది. దీంతో హౌస్ లోన్ వంటి దీర్ఘకాలిక రుణాలకు సంబంధించిన ఏడాది కాల వ్యవధి MCLR 9 శాతానికి చేరింది. అలాగే 3, 6 నెలల రుణ రేట్లను అదే మేర పెంచింది. అయితే ఓవర్‌నైట్, నెల, రెండేళ్లు, మూడేళ్ల MCLR రేట్లను సవరించలేదు. పెరిగిన రేట్లు ఇవాళ్టి నుంచే అమల్లోకి వస్తాయని SBI ప్రకటించింది.
జ్యోతికృష్ణ డైరెక్షన్‌లో పవన్ కళ్యాణ్ నటిస్తోన్న ‘హరి హర వీరమల్లు’ మూవీ షూటింగ్ చివరి దశకు చేరుకుంది. ప్రస్తుతం హైదరాబాద్‌లో పవర్ స్టార్ లేని సన్నివేశాల్ని తెరకెక్కిస్తున్నారు. తదుపరి షెడ్యూల్‌లో పవన్ పాల్గొంటారని, దీంతో షూటింగ్ పూర్తవుతుందని టాలీవుడ్ వర్గాలు వెల్లడించాయి. వచ్చే ఏడాది మార్చి 28న తెలుగు, తమిళ, కన్నడ, మలయాళ, హిందీ భాషల్లో మూవీ విడుదల కానుంది.
TG: స్థానిక సంస్థల్లో బీసీ రిజర్వేషన్ల నిర్ధారణపై అధ్యయనం కోసం ప్రభుత్వం ఏర్పాటు చేసిన డెడికేటెడ్ కమిషన్ రేపటి నుంచి బహిరంగ విచారణ చేపట్టనుంది. ఉమ్మడి జిల్లాల కలెక్టరేట్ల పరిధిలో ప్రతిరోజు ఉ.11:30 నుంచి మ.3 గంటల వరకు ప్రజల నుంచి సలహాలు, వినతులు స్వీకరించనుంది. రేపు నల్గొండ, ఈనెల 17న ఖమ్మం, 18న మహబూబ్‌నగర్ జిల్లాలో బహిరంగ విచారణ నిర్వహించనుంది.
AP: మత సామరస్యానికి ప్రతీకగా నిలిచే కడప పెద్దదర్గా ఉరుసు ఉత్సవాలకు నేడు శ్రీకారం చుట్టనున్నట్లు నిర్వాహకులు తెలిపారు. రేపు గంధం, ఎల్లుండి ఉరుసు, 18న ముషాయిరా ఉంటాయని చెప్పారు. 20వ తేదీన రాత్రి ఊరేగింపు ఉంటుందన్నారు. ఇందుకోసం పటిష్ఠ ఏర్పాట్లు చేసినట్లు కలెక్టర్ చెరుకూరి శ్రీధర్ వెల్లడించారు. ఈ ఉత్సవాలకు రామ్ చరణ్, ఏఆర్ రెహమాన్ సహా పలువురు ప్రముఖులు హాజరుకానున్నారు.
Sorry, no posts matched your criteria.