news

News April 14, 2025

బెంగాల్ అల్లర్లు.. NIA విచారణకు BJP డిమాండ్

image

బెంగాల్ అల్లర్ల వెనుక కుట్ర కోణం ఉందని, NIA విచారణ జరపాలని ప్రతిపక్ష BJP డిమాండ్ చేస్తోంది. ఆందోళనకారులు రూ.100 కోట్ల ఆస్తులను ధ్వంసం చేశారంది. వక్ఫ్ చట్ట సవరణను వ్యతిరేకిస్తూ బెంగాల్‌లోని పలు జిల్లాల్లో చేపట్టిన నిరసనలు హింసాత్మకంగా మారిన విషయం తెలిసిందే. ఈ ఘటనల్లో ఇప్పటివరకు 150 మంది నిందితులు అరెస్టయ్యారు. హైకోర్టు జోక్యంతో కేంద్ర భద్రతా బలగాలు రంగంలోకి దిగి పరిస్థితులను అదుపులోకి తెచ్చాయి.

News April 14, 2025

అమర్‌నాథ్ యాత్ర-2025 రిజిస్ట్రేషన్ ప్రారంభం

image

JULY 3 నుంచి AUG 9 వరకు జరిగే అమర్‌నాథ్ యాత్ర-2025 కోసం రిజిస్ట్రేషన్ ప్రక్రియ మొదలైంది. ఈ యాత్రకు వెళ్లాలనుకునే వారు కచ్చితంగా ముందస్తు రిజిస్ట్రేషన్ చేసుకోవాలి. https://jksasb.nic.in/ <>సైట్‌లో<<>> పాస్‌పోర్ట్ సైజ్ ఫొటో, హెల్త్ సర్టిఫికెట్, OTP సమర్పించి రిజిస్ట్రేషన్ చేసుకోవచ్చు. ఐదుగురు లేదా అంతకంటే ఎక్కువ మంది కలిసి గ్రూప్ రిజిస్ట్రేషన్ కూడా చేసుకునే వెసులుబాటు కూడా ఉంది.

News April 14, 2025

కాసేపట్లో వర్షం

image

TG: హైదరాబాద్ నగరంలోని పలు ప్రాంతాల్లో కాసేపట్లో వర్షం కురిసే అవకాశం ఉందని వాతావరణ కేంద్రం తెలిపింది. ఎల్బీనగర్, కాప్రా, ఉప్పల్, మల్కాజ్‌గిరి, ఉస్మానియా యూనివర్సిటీ, కంటోన్మెంట్, పటాన్‌చెరు ప్రాంతాల్లో తేలికపాటి నుంచి మోస్తరు వర్షాలు కురుస్తాయని పేర్కొంది. మెదక్, సంగారెడ్డి, వికారాబాద్, మేడ్చల్, కామారెడ్డి, సిద్దిపేట జిల్లాల్లోనూ వర్షాలు పడతాయని అంచనా వేసింది.

News April 14, 2025

LSG ఫ్యాన్స్‌కి గుడ్‌న్యూస్.. టీమ్‌లోకి స్పీడ్‌స్టర్!

image

IPL: లక్నో ఫ్యాన్స్‌కు గుడ్‌న్యూస్. పేసర్ మయాంక్ యాదవ్ ఎంట్రీ దాదాపుగా ఖరారైందట. వెన్ను, కాలివేలు గాయాల నుంచి కోలుకున్న మయాంక్.. ఏప్రిల్ 19న RRతో మ్యాచ్‌లో యాక్షన్‌లో దిగుతారని తెలుస్తోంది. మయాంక్ ఎంట్రీతో లక్నో బౌలింగ్ విభాగం మరింత పటిష్ఠంగా మారుతుందని ఫ్యాన్స్ ఆశిస్తున్నారు. గత ఐపీఎల్ సీజన్లో మయాంక్ గంటకు గరిష్ఠంగా 156.7 కి.మీ. వేగంతో బంతులు విసిరి అందరినీ ఆశ్చర్యపరిచారు.

News April 14, 2025

BJP అంబేడ్కర్‌కు శత్రువు : మల్లికార్జున్ ఖర్గే

image

బీజేపీ, RSS భారత రాజ్యాంగ నిర్మాత అంబేడ్కర్‌కు శత్రువులని AICC అధ్యక్షుడు మల్లికార్జున్ ఖర్గే అన్నారు. 1952 ఎన్నికల్లో ఆయన ఓటమికి V.Dసావర్కర్, SA డాంగే కారణమన్నారు. ఈ విషయాన్ని అంబేడ్కర్ స్వయంగా ఓ లేఖలో పేర్కొన్నారని తెలిపారు. దేశవ్యాప్తంగా కులగణన చేయాలని, ప్రైవేట్ విద్యాసంస్థల్లోనూ SC, ST, OBCలకు రిజర్వేషన్లు అమలు చేసే చర్యలు చేపట్టాలని మల్లికార్జున్ ఖర్గే డిమాండ్ చేశారు.

News April 14, 2025

రూ.75 లక్షలు తీసుకుని నితిన్ హ్యాండిచ్చాడు: నిర్మాత

image

హీరో నితిన్‌పై నిర్మాత, డైరెక్టర్ వశిష్ఠ తండ్రి సత్యనారాయణరెడ్డి సంచలన ఆరోపణలు చేశారు. తన కొడుకు దర్శకత్వంలో సినిమా చేసేందుకు రూ.75 లక్షలు అడ్వాన్స్ తీసుకుని నితిన్ హ్యాండిచ్చారని చెప్పారు. ఆ సమయంలో ‘అఆ’ పెద్ద హిట్టవడంతో వశిష్ఠతో చేస్తే రేంజ్ పడిపోతుందని వద్దన్నారని పేర్కొన్నారు. అప్పట్లో ఆ ప్రాజెక్టు కోసం రూ.2 కోట్లు ఖర్చుచేసినట్లు తెలిపారు. తర్వాత వశిష్ఠ ‘బింబిసార’తో హిట్ కొట్టాడని చెప్పారు.

News April 14, 2025

అంబేడ్కర్ విదేశీ విద్యా దీవెన పథకాన్ని మళ్లీ తీసుకొస్తాం: CM

image

AP: అంబేడ్కర్ విదేశీ విద్యా దీవెన పథకాన్ని మళ్లీ ప్రారంభిస్తామని CM చంద్రబాబు ప్రకటించారు. గుంటూరు(D) పొన్నెకల్లులో మాట్లాడుతూ ‘పేదలకు అండగా ఉంటాం. రెసిడెన్షియల్ స్కూళ్లలో నాణ్యమైన విద్య, భోజనం అందిస్తాం. అమరావతికి ప్రతిష్టాత్మక వర్సిటీలు, కాలేజీలను తీసుకొస్తాం’ అని తెలిపారు. చరిత్రలో ఎప్పుడూ చూడని రాజకీయం 2019-24 మధ్య చూశానని, తనలాంటి వాళ్లు కూడా బయటకు రాని పరిస్థితి ఉండేదని వ్యాఖ్యానించారు.

News April 14, 2025

ట్రైన్ వెయిటింగ్ లిస్టులో రకాలు..

image

*వెయిటింగ్ లిస్టు (WL): ఇది సాధారణంగా ఉండేది.
*జనరల్ (GNWL): ట్రైన్ స్టార్ట్ అయ్యే/దగ్గరి స్టేషన్ నుంచి ప్రయాణించే వారు ఈ లిస్టులో ఉంటారు.
*పూల్డ్ కోటా (PQWL): ట్రైన్ రూట్ మధ్యలో ఉండే స్టేషన్స్‌లో ఎక్కేవారికి ఈ లిస్ట్ వర్తిస్తుంది.
*రోడ్ సైడ్ స్టేషన్ (RSWL): చిన్న, రోడ్డుసైడ్ స్టేషన్స్ నుంచి ఎక్కేవారికి,
>GNWLలో టికెట్స్ కన్ఫమ్ అయ్యే అవకాశం ఎక్కువగా
ఉంటుందట.

News April 14, 2025

హంతకుడి ఎన్‌కౌంటర్.. ఈ ‘లేడీ సింగం’ గురించి విన్నారా?

image

కర్ణాటక హుబ్బళ్లిలో ఐదేళ్ల చిన్నారిపై రేప్ అటెంప్ట్ చేసి చంపిన నిందితుడిని <<16090804>>ఎన్‌కౌంటర్<<>> చేసింది PSI అన్నపూర్ణ. ఆస్పత్రిలో బాలిక మృతదేహాన్ని చూసి ఆమె ఏడ్చేశారు. నిందితుడు రితేశ్ కోసం వేట కొనసాగించారు. లొంగిపోమని కోరగా రితేశ్ పోలీసులపై రాళ్లు రువ్వాడు. దీంతో అన్నపూర్ణ రితేశ్‌పై కాల్పులు జరపగా రెండు బుల్లెట్లు తగిలి అతడు హతమయ్యాడు. అందరూ అన్నపూర్ణను లేడీ సింగం అంటూ ప్రశంసిస్తున్నారు.

News April 14, 2025

40ల్లో జాబు ఎందుకు పోతుందో వివరించిన CEO

image

40, ఎర్లీ 50 వయసుండే ప్రొఫెషనల్స్ జాబులు కోల్పోవడంపై బాంబే షేవింగ్ కంపెనీ CEO శాంతను దేశ్‌పాండే స్పందించారు. ఎక్కువ సీనియారిటీ, అధిక జీతాల కారణంగానే ఉద్యోగాలు కోల్పోతారన్నారు. బాధ్యతలు ఎక్కువగా ఉండే వయసులో జాబ్ పోవడంపై విచారం వ్యక్తం చేశారు. జాబ్ పోకుండా ఉండాలంటే.. AIలో నైపుణ్యం పెంచుకోవడం, ఎక్కువ పొదుపు, ఎంటర్‌‌పెన్యూరియల్ మైండ్‌సెట్ పెంచుకోవాలన్నారు.