news

News August 8, 2024

గుడిలో ప్రదక్షిణం చేస్తున్నారా? ఇవి తెలుసుకోండి

image

గుడిలో ఎందుకు క్లాక్ వైజ్‌లోనే ప్రదక్షిణం చేస్తారో తెలుసా? ప్రదక్షిణం చేసే వ్యక్తికి మూలవిరాట్టు ఎప్పుడూ కుడివైపుగా ఉండాలి కాబట్టి. ఒకవేళ ఎడమవైపు వచ్చేలా నడిస్తే దానిని అప్రదక్షిణం అంటారు. వయసులో పెద్దవారికి సైతం కుడివైపునే నిల్చోవాలంటారు. అందుకే తనకంటే పెద్దవారైన భర్త తనకు కుడివైపున ఉండేలా భార్య నిల్చుంటుంది. అయితే, శివాలయంలో ప్రదక్షిణల తీరు వేరుగా ఉంటుంది. రేపు ఆ విషయాన్ని తెలుసుకుందాం.

News August 8, 2024

JAI HIND: రేపటి నుంచి ఇలా చేయండి..

image

స్వాతంత్ర్య దినోత్సవం సందర్భంగా కేంద్రం ‘హర్ ఘర్ తిరంగా’ కార్యక్రమం చేపడుతున్న విషయం తెలిసిందే. ఇందులో భాగంగా రేపటి నుంచి ప్రతి ఇంటిపై త్రివర్ణ పతాకాన్ని ఎగురవేయాలని పిలుపునిచ్చింది. ఈనెల 15 వరకు ఈ కార్యక్రమం నిర్వహించాలని పేర్కొంది. ప్రజలు త్రివర్ణ పతాకంతో దిగిన సెల్ఫీలను ‘హర్ ఘర్ తిరంగా’ వెబ్‌సైట్‌లో అప్‌లోడ్ చేయాలని సూచించింది.

News August 8, 2024

వక్ఫ్ బోర్డు కింద ఉన్న స్థిరాస్తులివే!

image

వక్ఫ్ బోర్డు కింద దేశవ్యాప్తంగా 8,72,324 ఆస్తులు ఉన్నాయి. ఇందులో ఉత్తర్‌ప్రదేశ్, పశ్చిమ బెంగాల్, పంజాబ్, తమిళనాడు, కర్ణాటక రాష్ట్రాల్లోనే అధికంగా ఉన్నాయి. ఉత్తర్‌ప్రదేశ్‌లో 27%( 2,32,547), బెంగాల్‌లో 9%(80,480), తెలంగాణలో 5% (45,682) ప్రాపర్టీలు కలిగి ఉంది. ఈ డేటాను వక్ఫ్ బోర్డు మేనేజ్‌మెంట్ సిస్టమ్ ఆఫ్ ఇండియా రిలీజ్ చేసింది.

News August 8, 2024

అలా జరిగితే ఫొగట్‌కు సిల్వర్ మెడల్!

image

ఒలింపిక్స్‌లో వినేశ్ ఫొగట్‌‌ను డిస్‌క్వాలిఫై చేయడంపై కోర్ట్ ఆఫ్ ఆర్బిట్రేషన్‌ విచారణ చేపట్టింది. ఈక్రమంలో తన బరువును మరోసారి కొలవాలని COAను ఆమె అభ్యర్థించగా కోర్టు అందుకు ఒప్పుకోలేదు. దీంతో తాను స్వతహాగా మూడు మ్యాచులు గెలిచి ఫైనల్‌కు వచ్చానని, తనకు సిల్వర్ మెడల్ ఇప్పించాలని ఆమె కోరారు. దీనిపై 48 గంటల్లో COA సమాధానమివ్వనుంది. అనుకూలంగా తీర్పు వస్తే ఫొగట్‌కు సిల్వర్ దక్కనుంది. HOPE FOR THE BEST

News August 8, 2024

ఈసారి ఎన్నికలను సీరియస్‌గా తీసుకుంటున్న US ఓటర్లు!

image

USలో ప్రజాస్వామ్య భవిష్యత్తు ఈ ఎన్నికలతో తేలిపోతుందని అక్కడి ఓటర్లు భావిస్తున్నట్లు అసోసియేటెడ్ ప్రెస్ సర్వేలో వెల్లడైంది. ముఖ్యంగా 45ఏళ్లకు పైబడిన వారు ఈ ఎన్నికలను సీరియస్‌గా తీసుకున్నారట. అయితే ఎవరు గెలిస్తే డెమోక్రసీకి ముప్పు అనే అంశంపై మిశ్రమ ఫలితాలు వచ్చాయి. కొందరు ట్రంప్‌కు, మరికొందరు కమలా హారిస్‌కు మద్దతు ఇస్తున్నారు. ఈ నేపథ్యంలో ఈసారి ఎన్నికలు ఆసక్తికరంగా సాగనున్నట్లు తెలుస్తోంది.

News August 8, 2024

పాప్ సింగర్ కన్సార్ట్‌పై ఉగ్రదాడికి కుట్ర.. ISIS హస్తం?

image

ఆస్ట్రియాలో పాప్ సింగర్ టేలర్ స్విఫ్ట్ కన్సార్ట్‌పై ఉగ్రదాడికి కుట్ర పన్నిన ముగ్గురు టీనేజర్లను అక్కడి అధికారులు అదుపులోకి తీసుకున్నారు. ప్రధాన నిందితుడికి (19) ఉగ్రవాద సంస్థ ISISతో సంబంధాలు ఉన్నట్లు దర్యాప్తులో తేలింది. పేలుడు పదార్థాలు, కత్తులతో దాడికి ప్లాన్ చేసినట్లు నిందితుడు వెల్లడించాడని ఇంటెలిజెన్స్ వర్గాలు తెలిపాయి. మరో ఇద్దరు అనుమానితులను (17, 15ఏళ్లు) కూడా అధికారులు ప్రశ్నిస్తున్నారు.

News August 8, 2024

BIG BREAKING: భారత్‌కు మరో పతకం

image

పారిస్‌ ఒలింపిక్స్‌లో భారత హాకీ జట్టు కాంస్య పతకం సాధించింది. సెమీస్‌లో ఓడి బ్రాంజ్ మెడల్ మ్యాచ్ ఆడిన టీమ్ ఇండియా స్పెయిన్‌పై 2-1 తేడాతో విజయం సాధించింది. దీంతో భారత్ ఖాతాలో మొత్తం 4 బ్రాంజ్ మెడల్స్ చేరాయి. 2020 టోక్యో ఒలింపిక్స్‌లోనూ భారత్ కాంస్య పతకం గెలుచుకుంది.

News August 8, 2024

రేషన్ కార్డుల విషయంలో APకి అన్యాయం: నాదెండ్ల

image

రాష్ట్ర విభజన నాటి నుంచి రేషన్ కార్డుల విషయంలో APకి అన్యాయం జరుగుతోందని మంత్రి నాదెండ్ల మనోహర్ అన్నారు. జనాభా ప్రాతిపదికన కాకుండా 2001 సెన్సెస్ ప్రకారం కేటాయింపులు చేయడంతో రేషన్ కార్డులు తగ్గిపోయాయని తెలిపారు. ప్రస్తుతం 1.47కోట్ల కుటుంబాలకు రేషన్ అందిస్తున్నామన్నారు. ప్రజల అవసరాలను దృష్టిలో పెట్టుకొని లక్ష టన్నుల కందిపప్పు సరఫరా చేయాలని కేంద్రాన్ని కోరినట్లు ఢిల్లీ పర్యటన సందర్భంగా వెల్లడించారు.

News August 8, 2024

NCP మొత్తాన్ని తీసుకొచ్చేవాడిని: అజిత్ పవార్

image

బీజేపీ, శివ‌సేన త‌న‌కు CM ప‌ద‌వి ఆఫ‌ర్ చేసుంటే మొత్తం NCPని త‌న‌వెంట‌ తీసుకొచ్చేవాడిన‌ని మ‌హారాష్ట్ర డిప్యూటీ సీఎం అజిత్ ప‌వార్ వ్యాఖ్యానించారు. సీఎం ఏక్‌నాథ్ షిండే బ‌యోగ్ర‌ఫీ విడుద‌ల సంద‌ర్భంగా ఆయ‌న ఈ వ్యాఖ్య‌లు చేశారు. రాజకీయాల్లో తాను ఏక్‌నాథ్ షిండే, దేవేంద్ర ఫ‌డ్న‌వీస్ కంటే సీనియ‌ర్‌ అని చెప్పుకొచ్చారు.

News August 8, 2024

కేరళ సీఎంకు చెక్కు అందించిన చిరంజీవి

image

కేరళ సీఎం పినరయి విజయన్‌తో మెగాస్టార్ చిరంజీవి భేటీ అయ్యారు. వయనాడ్ బాధితులను ఆదుకునేందుకు రూ.కోటి విరాళానికి సంబంధించిన చెక్‌ను సీఎంకు చిరు అందించారు. బాధితులకు అందుతున్న సహాయక చర్యలపై ఆరా తీశారు. కాగా వయనాడ్ బాధితులను ఆదుకునేలా రామ్‌చరణ్, తాను కలిసి బాధితులకు రూ.కోటి సాయం చేస్తామని ఇటీవల చిరు ప్రకటించారు.