India's largestHyperlocal short
news App
Get daily news updates that are tailored for you based on your preferred language & location.
కొన్ని గంటల్లో బంగ్లాదేశ్ ప్రభుత్వాధినేత కాబోతున్న మహ్మద్ యూనస్‌కు గతంలో విధించిన శిక్షను అక్కడి కోర్టు ఉపసంహరించింది. గ్రామీణ్ టెలికాం వ్యవస్థాపకులైన యూనస్ ఆ సంస్థలో కార్మిక చట్టాలను ఉల్లంఘించారని షేక్ హసీనా హయాంలో ఆరు నెలల శిక్ష పడింది. తాజాగా ఆయన ప్రభుత్వాధినేతగా ఎన్నికవ్వడంతో గతంలో విధించిన శిక్షను కోర్టు వెనక్కు తీసుకుంది.
ఒలింపిక్స్‌లో వినేశ్ ఫొగట్‌పై అనర్హత వేటు వేయడంపై భారత హాకీ జట్టు మాజీ కెప్టెన్ విరెన్ రస్కిన్హా స్పందించారు. ‘ఫొగట్ బరువు తగ్గించుకునేందుకు రాత్రి ఒక్క నిమిషం కూడా నిద్రపోకుండా కష్టపడింది. టీమ్ కూడా ఆమెకు సపోర్ట్ చేసింది. గాయపడినట్లు చెప్పి పోటీ నుంచి తప్పుకోవాల్సిందని అంటున్నారు. కానీ, అలా ఉండదు. ఒలింపిక్ డాక్టర్ సర్టిఫై చేయాల్సిందే. బరువు కొలిచే ముందే ఆమె తన జుట్టు కట్ చేసింది’ అని తెలిపారు.
AP: జిల్లా యూనిట్‌గా ఎస్సీ వర్గీకరణ చేపట్టాలని టీడీపీ పొలిట్‌బ్యూరో సమావేశంలో నాయకులు నిర్ణయించారు. త్వరలోనే జన్మభూమి-2 ప్రారంభించడానికి సీఎం చంద్రబాబు ఆమోదం తెలిపారు. అలాగే పార్టీ సభ్యత్వ నమోదు చేపట్టాలని, మొదటి దశ నామినేటెడ్ పదవుల భర్తీ ప్రక్రియ మొదలుపెట్టాలనే అభిప్రాయానికి వచ్చారు.
బంగ్లా మాజీ పీఎం షేక్ హసీనాకు పట్టిన గతే ప్రధాని నరేంద్ర మోదీకి కూడా పడుతుందని మధ్యప్రదేశ్ కాంగ్రెస్ నేత సజ్జన్ సింగ్ వర్మ అన్నారు. ప్రభుత్వ విధానాలు నచ్చక బంగ్లా తరహాలోనే మోదీ ఇంటిని కూడా ఏదో ఒక రోజు ప్రజలు ఆక్రమించుకుంటారని హెచ్చరించారు. ప్రస్తుతానికి శ్రీలంక, బంగ్లాలో ఇలాంటి ఘటనలు జరిగాయని, ఈ సారి భారత్ వంతు అని ఆయన వ్యాఖ్యానించారు. ప్రస్తుతం ఆయన వ్యాఖ్యలు దుమారం రేపుతున్నాయి.
యంగ్ టైగర్ ఎన్టీఆర్ హీరోగా నటించిన ‘దేవర’ నుంచి రిలీజైన ‘చుట్టమల్లే’ సాంగ్ లిరిక్స్ అదిరిపోయాయని లిరిసిస్ట్ రామజోగయ్య శాస్త్రిని నెటిజన్లు అభినందిస్తున్నారు. ‘సరస్వతీ పుత్ర రామజోగయ్య శాస్త్రి గారు’ అని ఓ నెటిజన్ కాంప్లిమెంట్ ఇవ్వడంతో ఆయన స్పందించారు. ‘కిక్కు రా కిక్కు. మీ ప్రేమే నా నెక్స్ట్ సాంగ్‌కి ఎనర్జీ. ఆయుధ పూజ సాంగ్‌కు ఇంతకు మించి సెలబ్రేట్ చేసుకుందాం’ అని రాబోయే సాంగ్‌పై హైప్ పెంచారు.
బంగ్లాదేశ్‌లో మైనారిటీలపై దాడులు జరుగుతున్నాయనే వార్తలు ఆందోళన కలిగిస్తున్నాయని హైదరాబాద్ ఎంపీ అసదుద్దీన్ ఒవైసీ అన్నారు. అంతర్జాతీయ చట్టాలకు అనుగుణంగా మైనారిటీలను, వారి అస్తులను రక్షించాల్సిన బాధ్యత అక్కడి ప్రభుత్వంపై ఉందన్నారు. మైనారిటీల ఇళ్లను, ప్రార్థనా స్థలాలను మెజారిటీ వర్గం ప్రజలు రక్షిస్తున్నట్టు కూడా వార్తలు వస్తున్నాయని, ఇదే కొనసాగించాలని ఆకాంక్షించారు.
జపాన్‌లో భారీ భూకంపం సంభవించింది. భూకంప తీవ్రత రిక్టర్ స్కేల్‌పై 7.1గా నమోదైంది. 25 కిలోమీటర్ల లోతులో భూకంప కేంద్రం ఉన్నట్లు అధికారులు తెలిపారు. దీంతో అక్కడి ప్రభుత్వం ఆ దేశంలోని నైరుతి ప్రాంతాలకు సునామీ హెచ్చరికలు జారీ చేసింది. ప్రజలు అప్రమత్తంగా ఉండాలని, సురక్షిత ప్రాంతాలకు తరలివెళ్లాలని సూచించింది. పసిఫిక్ తీరంలోని క్యూషు, షికోకు ప్రాంతాల్లో ఒక మీటర్ వరకు సముద్రఅలలు ఎగసిపడుతాయని హెచ్చరించింది.
అక్కినేని నాగచైతన్య మరో పెళ్లికి సిద్ధం కావడంతో సమంత అభిమానులు సోషల్ మీడియా వేదికగా విమర్శలకు దిగారు. శోభితతో రిలేషన్షిప్ ఉండటం వల్లే సమంతను చైతూ వదిలేశాడని, ఇప్పటికైనా అర్థమైందా? అని ట్వీట్స్ చేస్తున్నారు. ‘తల్లికి జరిగింది చూసి కూడా మరో మహిళకు ఇదే బాధను ఎలా అందించావ్ బ్రో’ అంటూ నెటిజన్లు మండిపడుతున్నారు. సమంత చేసిన సాంగ్‌పై వచ్చిన ట్రోల్స్ వీరి పెళ్లి వార్తలపై ఎందుకు చేయట్లేదని ఫైర్ అయ్యారు.
బిహార్‌లోని అరారియా జిల్లాలో పంట పొలాల మధ్య ఉన్న ఓ బ్రిడ్జి వైరల్ అవుతోంది. పరమానంద్పూర్ గ్రామంలో ఇంకిపోయిన నది మీద రోడ్డు నిర్మాణానికి అధికారులు ముందుగా కొంత ప్రాంతాన్ని మాత్రమే సేకరించి వంతెన నిర్మించారు. తీరా రోడ్డు విస్తరణకు అవసరమైన భూమి సేకరించకుండా వదిలేశారు. దీంతో పంటపొలాల మధ్య బ్రిడ్జి ఎందుకుందంటూ వీడియో వైరల్ అవ్వడంతో అధికారులు విచారణకు ఆదేశించారు.
తన కుమారుడు నాగచైతన్య-శోభిత ధూళిపాళ్ల నిశ్చితార్థం జరిగినట్లు నాగార్జున ప్రకటించారు. ఈ రోజు ఉదయం 9.42 నిమిషాలకు ఈ శుభ కార్యక్రమం నిర్వహించినట్లు ట్వీట్ చేశారు. ఆమెను తమ కుటుంబంలోకి ఆహ్వానిస్తున్నందుకు ఎంతో సంతోషంగా ఉన్నట్లు తెలిపారు. వారిద్దరూ జీవితాంతం సుఖసంతోషాలతో ఉండాలని నాగ్ ఆశీర్వదించారు. దేవుని ఆశీర్వాదం వాళ్లకు ఎప్పుడూ ఉండాలని ఆకాంక్షించారు.
Sorry, no posts matched your criteria.