India's largestHyperlocal short
news App
Get daily news updates that are tailored for you based on your preferred language & location.
కాంపా కోలా డ్రింక్ ప్రస్తుతం మార్కెట్‌లో దూసుకుపోతుంది. 18 నెలల్లోనే దీని ద్వారా రూ.1000కోట్ల రెవెన్యూ వచ్చింది. 200ML ధర కేవలం రూ.10 ఉండటం, రిలయన్స్ బ్రాండ్ కావడంతో కస్టమర్లు ఆసక్తి చూపుతున్నారు. ఇప్పటికే మార్కెట్లో 10శాతం అమ్మకాలను ఈ డ్రింక్ ఆక్రమించిందని మార్కెట్ వర్గాలు చెబుతున్నాయి. 1970-80లో ఫేమస్ అయిన కాంపా కోలాను రిలయన్స్ రిటైల్ కొనుగోలు చేసి 2023లో అమ్మకాలు ప్రారంభించింది.
కాంగ్రెస్ పార్టీ ఆదేశిస్తే, తన కుటుంబ సభ్యుల ఆశీర్వాదంతో తప్పకుండా రాజకీయాల్లోకి వస్తానని రాబర్ట్ వాద్రా అన్నారు. ప్రియాంకా గాంధీ భర్త అయినందునే ఇంతకాలం రాజకీయ చర్చల్లో తనపై విమర్శలు చేసేవారన్నారు. రాహుల్, ప్రియాంకలను చూసి ఎంతో నేర్చుకోవచ్చన్నారు. దేశంలో సెక్యులరిజం ప్రమాదంలో పడుతున్న ప్రస్తుత తరుణంలో, పార్లమెంట్‌లో పోరాడటానికి మరిన్ని గొంతుకలు కావాలని రాబర్ట్ వాద్రా అభిప్రాయపడ్డారు.
TG: మంత్రిపదవుల ఆశావహులు డోస్ పెంచి గళం విన్పిస్తున్నారు. HYD, రంగారెడ్డి జిల్లాల్లో ఎన్నికైన ఏకైక కాంగ్రెస్ నేతనైన తనకు పదవి దక్కాలని మల్‌రెడ్డి రంగారెడ్డి అన్నారు. అటు ప్రజల కోసం తపించే తాను మంత్రి పదవికి అర్హుడినని రాజగోపాల్ అన్నారు. అయితే జానారెడ్డి లాంటివారు అడ్డుకుంటున్నారని ఆరోపించారు. ఇక తనకు మినిస్ట్రీ రాకుంటే మంచిర్యాలను ముంచినట్లే అని స్థానిక నేత ప్రేమ్ సాగర్ ఇవాళ ఆవేదన వ్యక్తం చేశారు.
ఇంగ్లిష్ పుస్తకాలకు NCERT హిందీ పేర్లు పెట్టడం వివాదాస్పదమైంది. గతంలో 6వ తరగతి టెక్ట్స్‌బుక్ పేరు ఇంగ్లిష్‌లో ‘Honeysuckle’ అని ఉండగా హిందీలో ‘పూర్వీ’ అని మార్చింది. ఇది సంగీత రాగం పేరు. 1,2 తరగతుల పుస్తకాలకు మృదంగ్, 3rd క్లాస్ బుక్స్‌కు సంతూర్ అని పేర్లు పెట్టింది. ఇవి సంగీత పరికరాలు. తమిళనాడు హిందీ భాషను తీవ్రంగా వ్యతిరేకిస్తున్న వేళ NCERT పేర్లను మార్చడం అగ్నికి ఆజ్యం పోసినట్లయింది.
TG: గిగ్ వర్కర్లకు భద్రత కల్పించే బిల్లు ముసాయిదాను వెంటనే ప్రజలకు అందుబాటులో ఉంచాలని అధికారులను సీఎం రేవంత్ ఆదేశించారు. ప్రజల సలహాలు, సూచనలు, అభ్యంతరాలను పరిగణనలోకి తీసుకొని తుది ముసాయిదా రూపొందించాలని సూచించారు. సచివాలయంలో గిగ్ వర్కర్లు, యూనియన్ల ప్రతినిధులు, మంత్రులు, అధికారులతో సీఎం సమీక్ష నిర్వహించారు. గిగ్ వర్కర్లకు ఉద్యోగ భద్రత, బీమా, ఇతర హక్కులు కల్పించేలా ఈ బిల్లును రూపొందించారు.
LSG బౌలర్ దిగ్వేశ్ నోట్‌బుక్ సెలబ్రేషన్స్ కారణంగా అతడికి 2సార్లు జరిమానా పడిన సంగతి తెలిసిందే. రెండోసారి ఫైన్ ఎందుకు వేశారంటూ మాజీ క్రికెటర్ గవాస్కర్ ప్రశ్నించారు. ‘వెళ్లిపోతున్న బ్యాటర్ దగ్గరకు వెళ్లి మరీ సెలబ్రేట్ చేసుకున్నందుకు తొలిసారి జరిమానా విధించారు. మరి 2వసారి ఎవరి వద్దకూ వెళ్లకుండా తను ఉన్న చోటే సెలబ్రేట్ చేసుకుంటే మళ్లీ ఎందుకు జరిమానా విధించారు? దాని అవసరమేముంది?’ అని ప్రశ్నించారు.
AP: అమరావతి కోసం ప్రభుత్వం <<16089907>>మరో 44వేల ఎకరాలను <<>>సమీకరించనుందన్న వార్తలపై APCC చీఫ్ షర్మిల మండిపడ్డారు. ‘అరచేతిలో వైకుంఠం చూపించడం బాబుగారికే తెలిసిన విద్య. రాజధాని పేరుతో రైతుల భూముల్ని తనవారికి కట్టబెట్టి రియల్ ఎస్టేట్ చేయాలని చూసే కుట్ర ఇది. 34వేల ఎకరాల్లో అసలు రాజధాని ఎక్కడ? కూలిపోయేలా ఉన్న తాత్కాలిక కట్టడాలు, పాడుబడిన భూములు.. ఇదేనా ఆంధ్రుల ఆత్మగౌరవం?’ అని ప్రశ్నించారు.
MAR నెల అమ్మకాల్లో హ్యూండయ్ క్రెటా అదరగొట్టింది. మారుతీ సుజుకీ స్విఫ్ట్‌ను వెనక్కి నెట్టి తొలి స్థానంలో నిలిచింది. గతనెల 18,059 క్రెటా యూనిట్లు అమ్ముడవగా 2024 MAR విక్రయాలతో పోలిస్తే 9% వృద్ధి నమోదైంది. స్విఫ్ట్(17,746), టాటా పంచ్(17,714), వ్యాగన్ R(17,175), ఎర్టిగా(16,804), బ్రెజా(16,546) వరుసగా 2,3,4,5,6 స్థానాల్లో నిలిచాయి. అయితే MARలో ఓవరాల్‌గా మారుతీ కార్లే అత్యధికంగా అమ్ముడయ్యాయి.
బెంగాల్ అల్లర్ల వెనుక కుట్ర కోణం ఉందని, NIA విచారణ జరపాలని ప్రతిపక్ష BJP డిమాండ్ చేస్తోంది. ఆందోళనకారులు రూ.100 కోట్ల ఆస్తులను ధ్వంసం చేశారంది. వక్ఫ్ చట్ట సవరణను వ్యతిరేకిస్తూ బెంగాల్‌లోని పలు జిల్లాల్లో చేపట్టిన నిరసనలు హింసాత్మకంగా మారిన విషయం తెలిసిందే. ఈ ఘటనల్లో ఇప్పటివరకు 150 మంది నిందితులు అరెస్టయ్యారు. హైకోర్టు జోక్యంతో కేంద్ర భద్రతా బలగాలు రంగంలోకి దిగి పరిస్థితులను అదుపులోకి తెచ్చాయి.
JULY 3 నుంచి AUG 9 వరకు జరిగే అమర్‌నాథ్ యాత్ర-2025 కోసం రిజిస్ట్రేషన్ ప్రక్రియ మొదలైంది. ఈ యాత్రకు వెళ్లాలనుకునే వారు కచ్చితంగా ముందస్తు రిజిస్ట్రేషన్ చేసుకోవాలి. https://jksasb.nic.in/ <
Sorry, no posts matched your criteria.