news

News August 6, 2024

భూముల మార్కెట్ ధరల పెంపు ఎప్పుడంటే?

image

TG: రాష్ట్రంలో భూముల మార్కెట్ ధరల పెంపు సెప్టెంబర్‌లో ఉండొచ్చని రిజిస్ట్రేషన్ శాఖ వర్గాలు తెలిపాయి. ఎంత మేర ధరలు పెంచవచ్చనే దానిపై రిజిస్ట్రేషన్ల శాఖ కసరత్తు చేస్తోంది. అనంతరం ప్రభుత్వానికి నివేదిక ఇవ్వనుంది. ఆ తర్వాత రెవెన్యూ మంత్రి సమీక్షించి తుది నిర్ణయం తీసుకుంటారు. ధరల పెంపు ప్రతిపాదనను సంబంధిత వెబ్‌సైట్‌లో ఉంచి, ప్రజాభిప్రాయం సేకరిస్తారు. ఈ ప్రక్రియకు మరో 30రోజులు పట్టే ఛాన్స్ ఉంది.

News August 6, 2024

సీఎం చంద్రబాబు కీలక నిర్ణయాలు

image

✒ చిన్న సమస్యల పరిష్కారానికి ప్రతి జిల్లాకు రూ.5 కోట్లు కేటాయింపు
✒ వైసీపీ ప్రభుత్వంలో మంజూరైన ఇళ్లపై సమగ్ర సర్వే
✒ ఇళ్లులేని పేదలను PMAY2.O పథకానికి ఎంపిక
✒ రేషన్ దుకాణాల్లో జొన్నలు, రాగులు, సజ్జలు
✒ ఏడాదిలో గ్రామాల్లో 6,721KM మేర కొత్త రోడ్లు
✒ ఎక్కడైనా సాగునీటి ప్రాజెక్టుల గేట్లు కొట్టుకుపోతే ఈఈ, ఏఈలపై వేటు
✒ త్వరలో రాష్ట్రవ్యాప్తంగా నెలరోజులపాటు వన మహోత్సవం

News August 6, 2024

హసీనా రాజీనామా.. భారత్‌కు తలనొప్పి!

image

షేక్ హసీనా పాలనలో భారత్-బంగ్లాదేశ్ మధ్య అనేక ఆర్థిక ఒప్పందాలు జరిగాయి. జల పంపకాల వివాదాలు పరిష్కారమయ్యాయి. ఇరు దేశాలను కలిపే రోడ్డు, రైల్వే ప్రాజెక్టులు వేగవంతమయ్యాయి. టెర్రరిజాన్ని అరికట్టేందుకు హసీనా మన దేశంతో కలిసి పని చేశారు. అయితే హసీనా రాజీనామాతో మాజీ PM ఖలీదా జియా (బంగ్లాదేశ్ నేషనలిస్ట్ పార్టీ) పగ్గాలు చేపట్టే అవకాశం ఉంది. ఆ పార్టీ చైనా, పాకిస్థాన్‌లకు అనుకూలంగా ఉండటం ఇండియాకు తలనొప్పే.

News August 6, 2024

ఎవ‌రీ ఖ‌లీదా జియా?

image

BNP లీడర్ ఖలీదా జియా 1991-1996, 2001-2006 మధ్య బంగ్లా ప్రధానిగా ఉన్నారు. భార‌త వ్య‌తిరేక భావాలతో జియా బంగ్లాలో ఇన్నాళ్లు రాజ‌కీయం న‌డిపారు. గ‌త ఎన్నిక‌ల్లో షేక్ హ‌సీనాకు భార‌త్ స‌హ‌క‌రించి బంగ్లా ఎన్నిక‌ల్లో జోక్యం చేసుకుంద‌ని ఆరోపిస్తూ భార‌త్ బాయ్‌కాట్‌కు పిలుపునిచ్చింది BNP. అధికార దుర్వినియోగం, ఇతర కేసులతో జియా 2018 నుంచి జైల్లో ఉన్నారు. ఆమెను రిలీజ్ చేస్తూ ప్రెసిడెంట్ తాజాగా ఆర్డర్స్ ఇచ్చారు.

News August 6, 2024

మూడు ఎమ్మెల్సీ స్థానాల ఎన్నికలకు కసరత్తు

image

తెలంగాణలో ఖాళీ అవనున్న 3 MLC స్థానాల ఎన్నికలకు ఈసీ రంగం సిద్ధం చేస్తోంది. వచ్చే ఏడాది మార్చి 29తో కరీంనగర్, మెదక్, NZB, ADB జిల్లాల పట్టభద్రుల MLC, ఇవే జిల్లాల ఉపాధ్యాయ MLC, నల్లగొండ, KMM, వరంగల్ జిల్లాల టీచర్స్ నియోజకవర్గ MLCల పదవీకాలం ముగియనుంది. SEP నుంచి ఓటరు జాబితా దరఖాస్తులు స్వీకరిస్తారు. DEC 30 తుది జాబితా విడుదల చేస్తారు. ఫిబ్రవరిలో ఎన్నికల షెడ్యూల్, మార్చిలో ఎన్నికలు జరిగే అవకాశముంది.

News August 6, 2024

బంగ్లా మాజీ క్రికెటర్ మోర్తజా ఇంటిపై దాడి

image

బంగ్లాదేశ్‌ ప్రధాని, ఆవామీ పార్టీ అధినేత షేక్ హసీనా దేశం విడిచిపెట్టినప్పటికీ అక్కడి ఆందోళనకారులు వెనక్కి తగ్గడం లేదు. ఆమె పార్టీ నేతలకు చెందిన ఇళ్లను, ఆస్తుల్ని ధ్వంసం చేస్తున్నారు. తాజాగా బంగ్లా క్రికెట్ టీమ్ మాజీ కెప్టెన్ మోర్తజా ఇంటిపై దాడి చేసి తగులబెట్టారు. మోర్తజా ఆవామీ పార్టీ తరఫున నరైల్-2 నియోజకవర్గం ఎంపీగా ఉన్నారు. మరో క్రికెటర్ లిటన్ దాస్ ఇంటిపైనా దాడి జరిగినట్లు సమాచారం.

News August 6, 2024

13,326 పంచాయతీల్లో ఒకేరోజు గ్రామ సభలు: పవన్

image

AP: ప్రతి గ్రామ పంచాయతీని బలోపేతం చేయడానికి NDA ప్రభుత్వం కట్టుబడి ఉందని డిప్యూటీ సీఎం పవన్ చెప్పారు. రాష్ట్ర చరిత్రలో ఎవరూ చేయని విధంగా ఉపాధి హామీపై 13,326 పంచాయతీల్లో త్వరలో ఒకేరోజు గ్రామ సభలు నిర్వహించి తీర్మానాలు చేస్తున్నామన్నారు. గ్రామీణ రోడ్ల మరమ్మతులతోపాటు 4,721KMల మేర రహదారులను నిర్మిస్తామని కలెక్టర్ల సదస్సులో చెప్పారు. 5.40 కోట్ల కుళాయి కలెక్షన్లు ఇవ్వాలని లక్ష్యంగా పెట్టుకున్నామన్నారు.

News August 6, 2024

గ్రూప్-1 మెయిన్స్ రాసే అభ్యర్థులకు గుడ్ న్యూస్

image

TG: గ్రూప్-1 మెయిన్స్ ఎగ్జామ్ రాసే అభ్యర్థుల కోసం టీ-శాట్ క్లాసెస్ ప్రసారం చేయనుంది. దీనికోసం 750 ఎపిసోడ్స్ సిద్ధం చేశామని టీ-శాట్ సీఈవో వేణుగోపాల్ రెడ్డి తెలిపారు. నిపుణ ఛానల్‌లో నేటి నుంచి అక్టోబర్ 19 వరకు సాయంత్రం 5 గంటల నుంచి రాత్రి 10 గంటల వరకు ప్రసారం చేస్తామన్నారు. తిరిగి అవే ఎపిసోడ్స్ విద్య ఛానల్‌లో ఉదయం 5 గంటల నుంచి 10 గంటల వరకు టెలికాస్ట్ చేస్తామన్నారు.

News August 6, 2024

మహేశ్ బాబుతో సినిమా.. విక్రమ్ రియాక్షన్ ఇదే

image

మహేశ్ బాబు, రాజమౌళి కాంబినేషన్లో మూవీ తెరకెక్కనున్న సంగతి తెలిసిందే. ‘ఈ సినిమాలో నటించాలని మీకు ఆఫర్ వచ్చిందా?’ అని హీరో విక్రమ్‌ను ప్రశ్నించగా ఆయన ఆసక్తికర సమాధానమిచ్చారు. రాజమౌళి, తాను అప్పుడప్పుడూ మాట్లాడుకుంటామని, భవిష్యత్తులో కలిసి సినిమా చేయాలనుకున్నట్లు చెప్పారు. ప్రత్యేకంగా ఒక సినిమా గురించి మాట్లాడుకోలేదని తంగలాన్ మూవీ ప్రమోషన్లలో తెలిపారు.

News August 6, 2024

జగన్‌కు జడ్+ సెక్యూరిటీ ఇస్తున్నాం: పోలీస్ శాఖ

image

AP: జగన్ సీఎంగా ఉన్నప్పుడు అదనంగా కల్పించిన భద్రతను మాత్రమే తగ్గించామని పోలీస్ శాఖ వెల్లడించింది. ప్రస్తుతం మాజీ సీఎం హోదాలో నిబంధనల ప్రకారం జడ్ ప్లస్ సెక్యూరిటీ కేటాయించామని తెలిపింది. తనకు భద్రతను పునరుద్ధరించాలని కోరుతూ జగన్ <<13783949>>హైకోర్టుకు<<>> వెళ్లడంతో అధికారులు స్పందించారు. చంద్రబాబు మాజీ సీఎంగా ఉన్నప్పుడు ఎంత భద్రత కల్పించామో ఇప్పుడు జగన్‌కు అలాగే ఇచ్చామన్నారు.