news

News November 12, 2024

చైనాలో అతి పెద్ద షాపింగ్ డే గురించి తెలుసా?

image

వాలంటైన్స్ డేకి పోటీగా చైనాలో 1993లో సింగిల్స్ డే వేడుకలు మొదలయ్యాయి. బ్యాచిలర్స్‌గా ఉన్నవారు ఈ రోజున భారీగా షాపింగ్ చేస్తుంటారు. మొదలైనప్పటి నుంచి ఏటేటా ఈ రోజుకు ప్రాధాన్యం పెరుగుతూ వస్తోంది. ఈ ఏడాది అక్టోబరు 14న ప్రారంభమై నిన్న ముగిసిన వేడుకలు చైనా చరిత్రలో సుదీర్ఘ సింగిల్స్ డే వేడుకలుగా నిలిచాయి. గత ఏడాది 156.4 బిలియన్ డాలర్ల షాపింగ్ జరగగా, ఈసారి వ్యాపారం దాన్ని మించిపోతుందని అంచనా.

News November 12, 2024

సచిన్, కోహ్లీ రికార్డు బ్రేక్ చేసిన గుర్బాజ్

image

బంగ్లాదేశ్‌పై మూడో వన్డేలో సెంచరీ చేసిన అఫ్గాన్ ఓపెనర్ రహ్మానుల్లా గుర్బాజ్ ఓ అరుదైన రికార్డును నెలకొల్పారు. వన్డేల్లో అతి తక్కువ వయసు(22Y 349D)లో 8 సెంచరీలు చేసిన రెండో ప్లేయర్‌గా నిలిచారు. ఈ క్రమంలో సచిన్(22Y 357D), కోహ్లీ(23Y 27D)లను అధిగమించారు. సౌతాఫ్రికా క్రికెటర్ డికాక్ 22Y 312Dలోనే ఈ ఘనత సాధించి అగ్రస్థానంలో ఉన్నారు. కాగా మూడో వన్డేలో గెలిచిన అఫ్గాన్ 2-1తో సిరీస్ గెలుచుకుంది.

News November 12, 2024

శాంసన్‌పై ప్రశ్నకు మనసులు గెలిచేలా గౌతీ జవాబు

image

సంజూ శాంసన్ వరుస సెంచరీల వెనక తన ఘనతేమీ లేదని టీమ్ఇండియా కోచ్ గౌతమ్ గంభీర్ అన్నారు. అదంతా అతడి ప్రతిభేనని ప్రశంసించారు. ‘సంజూ ఫామ్‌ కోసం నేను చేసిందేమీ లేదు. అతడు సమర్థుడు. మనం చేయాల్సిందల్లా అతడిని సరైన స్థానంలో క్రీజులోకి పంపించి ఎంకరేజ్ చేయడమే. సంజూ చాలా శ్రమిస్తారు. ఇది అంతం కాదు ఆరంభం. భారత్ కోసం అతడిలాగే ఆడాలని కోరుకుంటున్నా. ప్రెజర్లోనూ యువ ఆటగాళ్లు రాణించడం శుభసూచకం’ అని పేర్కొన్నారు.

News November 12, 2024

వందేభారత్ ఫుడ్.. పనీర్ కర్రీ చూడండి!

image

వందేభారత్ రైళ్లలో ఫుడ్ దారుణంగా ఉంటోందని ప్రయాణికులు వాపోతున్నారు. రూ.220 తీసుకుని నాసిరకం ఆహారం పెడుతున్నారని ఓ నెటిజన్ సోషల్ మీడియాలో పోస్ట్ చేశారు. పనీర్ కర్రీ నీళ్లలాగా ఉందని, దీన్ని ఎలా తినాలని ప్రశ్నించారు. మెనూ ఛాయిస్ కూడా ఉండట్లేదని వాపోయారు. రైళ్లలో కంటే ఇంటి నుంచే ఫుడ్ తీసుకెళ్లడం బెటర్ అని పలువురు సూచిస్తున్నారు.

News November 12, 2024

ఒక్కరోజే రూ.1,470 తగ్గిన బంగారం ధర

image

ఇవాళ హైదరాబాద్ మార్కెట్లో బంగారం ధరలు భారీగా తగ్గాయి. 10 గ్రా. 24 క్యారెట్ల పసిడి రూ.1,470 తగ్గి రూ.77,290కి చేరింది. 22 క్యారెట్ల గోల్డ్ రూ.1,350 తగ్గి రూ.70,850 పలుకుతోంది. అటు కేజీ వెండి రేటు రూ.2,000 తగ్గి రూ.లక్షకు చేరింది.

News November 12, 2024

షారుఖ్‌కు బెదిరింపులు.. నిందితుడు అరెస్ట్

image

స్టార్ హీరో షారుఖ్ ఖాన్‌ను చంపేస్తామంటూ <<14551902>>బెదిరింపు<<>> కాల్ చేసిన వ్యక్తిని ముంబై పోలీసులు అరెస్టు చేశారు. ఛత్తీస్‌గఢ్‌ రాయ్‌పూర్‌కు చెందిన ఫైజల్ ఖాన్ ఇటీవల రూ.50 లక్షలు డిమాండ్ చేస్తూ బాంద్రా పోలీస్ స్టేషన్‌కు ఫోన్ చేశాడు. దబ్బులివ్వకుంటే షారుఖ్‌ను చంపేస్తానన్నాడు. దీంతో అతనిపై FIR నమోదైంది. అయితే తన మొబైల్ పోయిందని, అందులో నుంచి ఎవరో కాల్ చేశారని ఫైజల్ చెబుతున్నాడు.

News November 12, 2024

BGTకి ప్రాధాన్యం.. పాక్ కోచ్ అసహనం

image

ఆస్ట్రేలియాలో పాక్ ఇటీవల వన్డే సిరీస్ గెలుచుకున్న సంగతి తెలిసిందే. అయినప్పటికీ అక్కడి మీడియాలో పెద్దగా ప్రాధాన్యం దక్కలేదు. దీనిపై ఆ జట్టు కోచ్ జాసన్ గిలెస్పీ అసహనం వ్యక్తం చేశారు. ‘ఇండియాతో ఆడే BGTపై పెట్టిన దృష్టిని మా వన్డే సిరీస్‌పై ఆస్ట్రేలియా మీడియా పెట్టలేదు. పాక్‌తో వన్డేలకు కనీస ప్రమోషన్స్ చేయాలి కదా? క్రికెట్ ఆస్ట్రేలియాకు భారతే ముఖ్యం అన్నది తేటతెల్లమైంది’ అని పేర్కొన్నారు.

News November 12, 2024

RGVపై మరో ఫిర్యాదు

image

డైరెక్టర్ రాంగోపాల్ వర్మపై రాష్ట్ర తెలుగు రైతు ఉపాధ్యక్షుడు నూతలపాటి రామారావు తుళ్లూరు పోలీస్ స్టేషన్‌లో ఫిర్యాదు చేశారు. చంద్రబాబు, పవన్ కళ్యాణ్, లోకేశ్‌పై ఆయన సోషల్ మీడియాలో అసభ్యకరంగా పోస్టులు పెట్టారని తెలిపారు. గేదెల ముఖాలకు వీరి ఫొటోలను పెట్టి అవమానించారని పేర్కొన్నారు. ఆర్జీవీపై చట్టపరమైన చర్యలు తీసుకోవాలని కోరారు. కాగా ప్రకాశం జిల్లాలో ఆర్జీవీపై <<14581839>>కేసు నమోదైన<<>> విషయం తెలిసిందే.

News November 12, 2024

STOCK MARKETS: రియాల్టి షేర్ల జోరు

image

దేశీయ బెంచ్‌మార్క్ సూచీలు తీవ్ర ఆటుపోట్లకు లోనవుతున్నాయి. క్షణాల్లోనే పెరుగుతూ తగ్గుతున్నాయి. గ్లోబల్ మార్కెట్ల నుంచి నెగటివ్ సిగ్నల్స్ రావడం, CPI డేటా రావాల్సి ఉండటమే ఇందుకు కారణాలు. సూచీల గమనం తెలియకపోవడంతో ఇన్వెస్టర్లు ఆచితూచి వ్యవహరిస్తున్నారు. సెన్సెక్స్ 79,582 (+86), నిఫ్టీ 24,166 (+25) వద్ద ట్రేడవుతున్నాయి. రియాల్టి, ఐటీ, మీడియా, హెల్త్‌కేర్ షేర్లు పెరిగాయి. ఆటో, FMCG సూచీలు తగ్గాయి.

News November 12, 2024

చినాబ్ రైల్వే బ్రిడ్జిపై మాక్ డ్రిల్

image

J&Kలోని చినాబ్ నదిపై నిర్మించిన ప్రపంచంలోనే అత్యంత ఎత్తైన రైల్వే బ్రిడ్జిపై ఇవాళ భద్రతా దళాలు మాక్ డ్రిల్ నిర్వహించాయి. ఏదైనా విపత్తు సంభవిస్తే ఎలా అప్రమత్తం కావాలనేది చేసి చూపించాయి. SOG, CRPF 126bn, GRP, RPF, SDRF, ఫైర్&ఎమ‌ర్జెన్సీ, మెడిక‌ల్ బృందాలు డ్రిల్‌లో పాల్గొన్నాయి. నదీ గర్భం నుంచి 359M ఎత్తులో 1,315M పొడవుతో దీన్ని నిర్మించారు. దీనిపై 4 నెలల కిందట రైలు సర్వీసులు ప్రారంభమయ్యాయి.