news

News November 10, 2025

వారంతా మూర్ఖులు: ట్రంప్

image

తన పాలసీ టారిఫ్‌లను వ్యతిరేకించే వారంతా మూర్ఖులేనని అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ అన్నారు. వీటి వల్లనే అమెరికా మరింత సంపన్న దేశంగా మారడంతో పాటు అత్యంత గౌరవనీయ దేశంగా మారిందని చెప్పారు. టారిఫ్‌ల వల్ల లక్షల కోట్ల డాలర్లు వస్తున్నాయని ప్రతి అమెరికన్‌కూ కనీసం 2వేల డాలర్ల చొప్పున డివిడెంట్ ఇస్తామని పేర్కొన్నారు. త్వరలోనే 37 ట్రిలియన్ డాలర్ల రుణాలను చెల్లించడం ప్రారంభిస్తామన్నారు.

News November 10, 2025

శంకరుడి దశావతారాలు మీకు తెలుసా?

image

1. మహాకాలుడు – మహాకాళి,
2. తార్ – తార,
3. బాలభువనేశుడు – బాలభువనేశ్వరి,
4. షోడశశ్రీవిద్యేశుడు – షోడశశ్రీవిద్యేశ్వరి,
5. భైరవుడు – భైరవి,
6. చిన్న మస్తకుడు – చిన్న మస్తకి,
7. ధూమవంతుడు – ధూమవతి,
8. బగలాముఖుడు – బగళాముఖి,
9. మాతంగుడు – మాతంగి, 10. కమలుడు – కమల.

News November 10, 2025

శివయ్యను ఎలా పూజిస్తే సంతోషిస్తాడు?

image

శివుడికి కొన్ని పూలంటే చాలా ఇష్టం. మారేడు దళాలతో పూజిస్తే ఆయన వెంటనే అనుగ్రహిస్తాడట. శంఖం పూలు సమర్పిస్తే సంతోషపడతాడట. నాగమల్లి పూలతో పూజిస్తే పుణ్య కార్యాలు చేసిన ఫలితం ఉంటుందట. సంపెంగ పూలు పెడితే ప్రసన్నమవుతాడని, జిల్లేడు పూలు సమర్పిస్తే, పోయిన జన్మలో చేసిన పాపాలు తొలగిపోతాయని భక్తుల ప్రగాఢ విశ్వాసం. ఇలా ఇష్టమైన వాటితో ఆరాధిస్తే శివయ్య సంతోషించి, శుభాలు కలుగజేస్తాడని పండితులు చెబుతున్నారు.

News November 10, 2025

ఏపీ టుడే

image

* ఇవాళ సీఎం చంద్రబాబు అధ్యక్షతన క్యాబినెట్ సమావేశం. సీఐఐ సమ్మిట్, మొంథా తుఫాన్ ప్రభావంతో పంట నష్టాలపై అంచనాలు, పరిహారంపై చర్చకు అవకాశం. అమరావతి అభివృద్ధి కోసం రుణ ప్రతిపాదనకు ఆమోదం తెలిపే ఛాన్స్.
* ఇవాళ, రేపు మొంథా తుఫాను ప్రభావిత ప్రాంతాల్లో కేంద్ర బృందం రెండుగా విడిపోయి పర్యటన. నేడు బాపట్లలో టీమ్-1, కృష్ణా, ఏలూరు, తూర్పు గోదావరిలో టీమ్-2 పంట నష్టాలపై అంచనా వేయనున్నాయి.

News November 10, 2025

సఫారీలపై మన రికార్డు పేలవమే..

image

ఈ నెల 14 నుంచి దక్షిణాఫ్రికాతో టెస్టు సిరీస్ ప్రారంభం కానున్న నేపథ్యంలో గత రికార్డులు టీమ్ ఇండియాను ఆందోళనకు గురిచేస్తున్నాయి. ఇప్పటివరకు 16 సిరీస్‌లు జరగగా 8 సార్లు సఫారీలదే విజయం. ఇండియా 4 సార్లు గెలవగా, మరో నాలుగు సిరీస్‌లు డ్రాగా ముగిశాయి. చివరిగా ఆడిన సిరీస్ డ్రాగా ముగియడం భారత్‌కు ఊరటనిస్తోంది. కాగా WTC డిఫెండింగ్ ఛాంపియన్‌ను గిల్ సేన ఓడించాలంటే అన్ని విభాగాల్లోనూ రాణించాల్సిన అవసరం ఉంది.

News November 10, 2025

బహు భార్యత్వ నిషేధిత బిల్లుకు అస్సాం క్యాబినెట్ ఆమోదం

image

బహు భార్యత్వ(పాలిగామీ) నిషేధిత బిల్లుకు అస్సాం క్యాబినెట్ ఆమోదం తెలిపింది. ఈ నెల 25న అసెంబ్లీలో బిల్లును ప్రవేశపెడుతామని CM హిమంత బిస్వ శర్మ తెలిపారు. దీనిని ఉల్లంఘించి రెండు లేదా అంతకంటే ఎక్కువ పెళ్లిళ్లు చేసుకుంటే ఏడేళ్ల జైలు శిక్ష విధిస్తామన్నారు. ఎస్టీలకు తప్పా అందరికీ ఇది వర్తిస్తుందన్నారు. రాష్ట్రంలో 6వ షెడ్యూల్ వర్తించే ప్రాంతాలకు ప్రస్తుతం ఈ బిల్లు నుంచి మినహాయింపు ఉంటుందని చెప్పారు.

News November 10, 2025

నవంబర్ 10: చరిత్రలో ఈరోజు

image

1798: తెలుగు సాహిత్యానికి విశేష సేవ చేసిన ఆంగ్లేయుడు ఛార్లెస్ ఫిలిప్ బ్రౌన్ జననం
1848: జాతీయోద్యమ నాయకుడు సురేంద్రనాథ్ బెనర్జీ జననం
1904: బహురూపధారణ(డ్యుయల్ రోల్) ప్రక్రియను ప్రవేశపెట్టిన రంగస్థల నటుడు వైద్యుల చంద్రశేఖరం జననం
1979: స్వాతంత్ర్య సమర యోధుడు, విశాఖ ఉక్కు ఉద్యమ నేత తెన్నేటి విశ్వనాథం మరణం (ఫొటోలో)
1993: కథా రచయిత రావిశాస్త్రి మరణం
* ప్రపంచ సైన్స్ దినోత్సవం

News November 10, 2025

బిహార్: 122 స్థానాల్లో 1,302 మంది బరిలోకి

image

బిహార్‌లో రెండో విడత ఎన్నికల పోలింగ్ రేపు జరగనుంది. 20 జిల్లాల పరిధిలోని 122 స్థానాలకు పోలింగ్ జరగనుండగా సుమారు 3.7 కోట్ల మంది ఓటర్లు తమ ఓటు హక్కును వినియోగించుకోనున్నారు. మొత్తం 1,302 మంది అభ్యర్థులు బరిలో ఉండగా వారిలో 136 మంది మహిళలు కావడం గమనార్హం. 45,399 కేంద్రాలలో పోలింగ్ జరగనుంది. గత ఎన్నికల్లో ఈ 122 స్థానాల్లో బీజేపీ 42, ఆర్జేడీ 33, జేడీయూ 20, కాంగ్రెస్ 11 సీట్లు గెలుచుకుంది.

News November 10, 2025

పుట్టినరోజు శుభాకాంక్షలు

image

ఈ రోజు పుట్టినరోజు జరుపుకుంటున్న అందరికీ శుభాకాంక్షలు. పరిమితుల దృష్ట్యా ఫొటో ఎంపిక కాని వారు మన్నించగలరు. > ఫొటో, పేరు, ఊరు, పుట్టిన తేదీ వివరాలతో.. teluguteam@way2news.comకు SUBJECT: BIRTHDAYతో ముందురోజు (ex: MAY 1న పుట్టినరోజు అయితే APR 30న) ఉదయం గం.8:00-08:05 లోపు మెయిల్ చేయండి. పుట్టినరోజున మీ సన్నిహితులను ఆశ్చర్యపర్చండి.

News November 10, 2025

పవన్ పర్యటనలో అపశ్రుతిపై కలెక్టర్ క్లారిటీ

image

AP: డిప్యూటీ సీఎం పవన్ పర్యటనలో కాన్వాయ్ మహిళ కాలిపై నుంచి దూసుకెళ్లిందంటూ జరుగుతున్న ప్రచారం అవాస్తవమని చిత్తూరు కలెక్టర్ సుమిత్ స్పష్టం చేశారు. పర్యటనలో జనాల తాకిడికి మహిళ సృహతప్పి పడిపోగా తొక్కిసలాటలో కాలికి గాయమైందన్నారు. బాధితురాలిని వెంటనే పలమనేరు ప్రభుత్వ ఆసుపత్రికి తరలించి అన్ని పరీక్షలు నిర్వహించినట్లు తెలిపారు. ఎడమ కాలుకు చిన్న గాయమైందని, ప్రస్తుతం ఆమె ఆరోగ్యం నిలకడగా ఉందని చెప్పారు.