news

News November 10, 2025

BIG ALERT: మరో తుఫాను.. మళ్లీ వర్షాలు!

image

AP: మొంథా తుఫాను విధ్వంసం నుంచి కోలుకోక ముందే రాష్ట్రాన్ని మరో ముప్పు వెంటాడుతోంది. ఈ నెల 19/20వ తేదీన బంగాళాఖాతంలో అల్పపీడనం ఏర్పడే అవకాశం ఉందని ఇస్రో వాతావరణ నిపుణులు వెల్లడించారు. ఇది తుఫానుగా బలపడి ఈనెల 25 నాటికి తీరం దాటొచ్చని, కోస్తా జిల్లాలపై ప్రభావం ఉంటుందని తెలిపారు. అలాగే మరో నాలుగైదు రోజుల్లో శ్రీలంక సమీపంలో అల్పపీడనం ఏర్పడుతుందని, దీనివల్ల రాష్ట్రంలో వర్షాలు కురవొచ్చని అంచనా వేశారు.

News November 10, 2025

BEMLలో 100 పోస్టులు.. అప్లైకి ఎల్లుండే లాస్ట్ డేట్

image

భారత్ ఎర్త్ మూవర్స్ లిమిటెడ్(<>BEML<<>>) 100 జూనియర్ ఎగ్జిక్యూటివ్ కాంట్రాక్ట్ పోస్టులకు దరఖాస్తులు కోరుతోంది. అర్హతగల అభ్యర్థులు ఎల్లుండి వరకు అప్లై చేసుకోవచ్చు. పోస్టును బట్టి సంబంధిత విభాగంలో బీఈ, బీటెక్ ఉత్తీర్ణతతో పాటు పని అనుభవం ఉండాలి. గరిష్ఠ వయోపరిమితి 29 ఏళ్లు. రిజర్వేషన్ గలవారికి ఏజ్‌లో సడలింపు ఉంది. ఈ నెల 15, 16 తేదీల్లో బెంగళూరులో ఇంటర్వ్యూ నిర్వహిస్తారు. వెబ్‌సైట్: https://bemlindia.in/

News November 10, 2025

నాకు రుమటాయిడ్ ఫీవర్ సమస్య ఉంది: బీజేపీ ఎంపీ

image

TG: తాను చిన్నతనం నుంచే రుమటాయిడ్ ఫీవర్‌‌తో బాధపడుతున్నట్లు BJP MP విశ్వేశ్వర్ రెడ్డి తెలిపారు. దీని ప్రభావం మోకాళ్లు, గుండెపై ఉంటుందన్నారు. మెడిసిన్ వాడటంతో మోకాళ్ల నొప్పులు తగ్గాయని వెల్లడించారు. తాజా పరీక్షల్లో గుండె సమస్య ఉందని తేలినట్లు చెప్పారు. వాల్వ్ మార్పిడి చేయాల్సి ఉందని, ఇవాళ ఆపరేషన్ జరగనుందని వెల్లడించారు. ఎవరూ ఆందోళన చెందవద్దని, శ్రేయోభిలాషులు గమనించాలని సూచించారు.

News November 10, 2025

ఆరికకు చిత్త గండం, ఆడదానికి పిల్ల గండం

image

ఆరిక(ఒక రకమైన చిరుధాన్యం) పండాలంటే, అవి పక్వానికి వచ్చే సమయంలో చిత్తా నక్షత్రం ప్రవేశంలో వర్షాలు బాగా కురవాలి. అప్పుడు వర్షాలు లేకుంటే పంట నాశనమవుతుంది. అందుకే ఆరిక పంటకు ఆ సమయం గండం వంటిది. అలాగే ఒక స్త్రీ జీవితంలో ప్రసవం అత్యంత కీలకమైన, ప్రమాదకరమైన ఘట్టం. దానినే పిల్ల గండంగా పేర్కొన్నారు. జీవితంలో కొన్ని దశలలో కొన్ని విషయాలకు సహజంగానే పెద్ద సవాళ్లు ఎదురవుతాయని ఈ సామెత తెలియజేస్తుంది.

News November 10, 2025

పాప నివారణ కోసం చదవాల్సిన శివ మంత్రం

image

క‌రచరణా కృతం వా కాయ‌జం క‌ర్మజం వా
శ్రవ‌న్నయ‌న‌జం వా మాన‌సం వా
ప‌ర‌ధాం విహితం విహితం వా
స‌ర్వ మేత‌త క్షమ‌స్వ
జ‌య జ‌య క‌రుణాబ్దే శ్రీ మ‌హ‌దేవ్ శంభో
చేతులు, కాళ్లు, మాటలు, చెవులు, కళ్లు, పనులు, మనస్సు.. వీటి ద్వారా తెలిసో, తెలియకో మనం ఎన్నో తప్పులు చేస్తుంటాం. ఆ అన్నీ తప్పులకు క్షమాపణ కోరుతూ, పరమేశ్వరుడిని ప్రార్థిస్తే.. వాటి ద్వారా వచ్చే దోషాలను ఈశ్వరుడు రాకుండా ఆపుతాడని భక్తుల ప్రగాఢ విశ్వాసం.

News November 10, 2025

ఫెదరర్ రికార్డును దాటేసిన జకోవిచ్

image

టెన్నిస్ దిగ్గజ ప్లేయర్ నొవాక్ జకోవిచ్ సంచలనం సృష్టించారు. ఏథెన్స్ ఓపెన్ టోర్నీలో విజేతగా నిలిచి కెరీర్‌లో 101వ సింగిల్స్ టైటిల్ అందుకున్నారు. ఇటలీ ప్లేయర్ ముసెట్టితో జరిగిన ఫైనల్లో 4-6, 6-3, 7-5 తేడాతో విజయం సాధించారు. దీంతో హార్డ్ కోర్టులపై జకోవిచ్ సాధించిన టైటిల్స్ సంఖ్య 72కు చేరింది. పురుషుల సింగిల్స్‌లో ఇదే అత్యధికం. తర్వాతి స్థానంలో ఫెదరర్(71) ఉన్నారు.

News November 10, 2025

కలలో శివయ్య కనిపిస్తే..?

image

‘కలలో శివుడిని/శివ లింగాన్ని చూడటం పవిత్రమైన సంకేతం. కలలో శివలింగం కనిపిస్తే దీర్ఘకాల సమస్యలు త్వరలో పరిష్కారమవుతాయి. పరమేశ్వరుని దర్శనం లభిస్తే, మీ ఆదాయం పెరిగి, అకస్మాత్తుగా ధనలాభం కలుగుతుంది. శివాలయం కనిపిస్తే అనారోగ్య సమస్యల నుంచి ఉపశమనం లభిస్తుంది. అలాగే శివుని మెడలో పాము కనిపిస్తే ఆర్థిక లాభాలుంటాయి. త్రిశూలం కనిపిస్తే సమస్యల నుంచి విముక్తి లభిస్తుంది’ అని స్వప్న శాస్త్రం చెబుతోంది.

News November 10, 2025

వారంతా మూర్ఖులు: ట్రంప్

image

తన పాలసీ టారిఫ్‌లను వ్యతిరేకించే వారంతా మూర్ఖులేనని అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ అన్నారు. వీటి వల్లనే అమెరికా మరింత సంపన్న దేశంగా మారడంతో పాటు అత్యంత గౌరవనీయ దేశంగా మారిందని చెప్పారు. టారిఫ్‌ల వల్ల లక్షల కోట్ల డాలర్లు వస్తున్నాయని ప్రతి అమెరికన్‌కూ కనీసం 2వేల డాలర్ల చొప్పున డివిడెంట్ ఇస్తామని పేర్కొన్నారు. త్వరలోనే 37 ట్రిలియన్ డాలర్ల రుణాలను చెల్లించడం ప్రారంభిస్తామన్నారు.

News November 10, 2025

శంకరుడి దశావతారాలు మీకు తెలుసా?

image

1. మహాకాలుడు – మహాకాళి,
2. తార్ – తార,
3. బాలభువనేశుడు – బాలభువనేశ్వరి,
4. షోడశశ్రీవిద్యేశుడు – షోడశశ్రీవిద్యేశ్వరి,
5. భైరవుడు – భైరవి,
6. చిన్న మస్తకుడు – చిన్న మస్తకి,
7. ధూమవంతుడు – ధూమవతి,
8. బగలాముఖుడు – బగళాముఖి,
9. మాతంగుడు – మాతంగి, 10. కమలుడు – కమల.

News November 10, 2025

శివయ్యను ఎలా పూజిస్తే సంతోషిస్తాడు?

image

శివుడికి కొన్ని పూలంటే చాలా ఇష్టం. మారేడు దళాలతో పూజిస్తే ఆయన వెంటనే అనుగ్రహిస్తాడట. శంఖం పూలు సమర్పిస్తే సంతోషపడతాడట. నాగమల్లి పూలతో పూజిస్తే పుణ్య కార్యాలు చేసిన ఫలితం ఉంటుందట. సంపెంగ పూలు పెడితే ప్రసన్నమవుతాడని, జిల్లేడు పూలు సమర్పిస్తే, పోయిన జన్మలో చేసిన పాపాలు తొలగిపోతాయని భక్తుల ప్రగాఢ విశ్వాసం. ఇలా ఇష్టమైన వాటితో ఆరాధిస్తే శివయ్య సంతోషించి, శుభాలు కలుగజేస్తాడని పండితులు చెబుతున్నారు.