news

News November 10, 2025

సుదీర్ఘ షట్‌డౌన్‌కు త్వరలోనే ముగింపు: ట్రంప్

image

ప్రభుత్వ <<17882827>>షట్‌డౌన్‌‌ <<>>త్వరలోనే ముగుస్తుందని US ప్రెసిడెంట్ ట్రంప్ తెలిపారు. ఇందుకు సంబంధించిన ఒప్పందాన్ని కుదుర్చుకోనున్నట్లు చెప్పారు. అయితే ఖైదీలకు, ఇల్లీగల్స్‌కు పెద్ద మొత్తంలో డబ్బు చెల్లించేందుకు తాను ఒప్పుకోనని, ఈ విషయాన్ని డెమొక్రాట్లు అర్థం చేసుకుంటారని చెప్పారు. 40 రోజులుగా కొనసాగుతున్న సుదీర్ఘ షట్‌డౌన్ కారణంగా పలు ప్రభుత్వ <<17975561>>సర్వీసులపై<<>> తీవ్ర ప్రభావం పడింది. కార్మికులకు జీతాలు అందడం లేదు.

News November 10, 2025

MSMEలకు ఆధునిక సౌకర్యాలు

image

AP: రాష్ట్రంలోని MSMEలకు అత్యాధునిక సౌకర్యాలను అందుబాటులోకి తేవాలని ప్రభుత్వం నిర్ణయించింది. ఒకే తరహా పరిశ్రమలున్న క్లస్టర్లలో కామన్ ఫెసిలిటీ సెంటర్ల(CFC)ను ఏర్పాటుచేయనుంది. ఒక్కోదానికి ₹10కోట్లు వెచ్చించనుంది. ఇందులో కొత్త డిజైన్లు, రీసెర్చ్, టెక్నాలజీ, నైపుణ్య శిక్షణ, మార్కెటింగ్, క్వాలిటీ కంట్రోల్ తదితర సదుపాయాలు ఉంటాయి. వీటివల్ల MSMEలు అంతర్జాతీయ స్థాయిలో పోటీ పడేందుకు అవకాశం లభిస్తుంది.

News November 10, 2025

వరుసగా అబార్షన్లు అవుతున్నాయా?

image

గర్భం దాల్చిన ప్రతిసారీ అబార్షన్ అవుతుంటే కొన్ని జాగ్రత్తలు తీసుకోవాలంటున్నారు నిపుణులు. రెండోసారి అబార్షన్ జరిగితే డాక్టర్ పర్యవేక్షణలో టెస్టులు చేయించి మందులు వాడాలి. గర్భస్రావం జరిగినప్పుడు పిండాన్ని టెస్టుకి పంపి జన్యు సమస్యలున్నాయో తెలుసుకోవచ్చు. మేనరికంలో అయితే దంపతులకి టెస్టులు చేయాల్సి ఉంటుంది. వీటితో పాటు రక్తపరీక్షలు, స్కానింగ్, థైరాయిడ్ టెస్టులు జరిపి వాటికి తగ్గ ట్రీట్‌మెంట్ చేయాలి.

News November 10, 2025

భారీ జీతంతో ఉద్యోగాలు.. నోటిఫికేషన్ విడుదల

image

IAFలో ఉన్నత ఉద్యోగాల భర్తీకి ఎయిర్‌ఫోర్స్ కామన్ ఎంట్రన్స్ టెస్ట్(AFCAT)-2026 <>నోటిఫికేషన్<<>> విడుదలైంది. ఫ్లయింగ్/గ్రౌండ్ డ్యూటీ(టెక్నికల్), NCC స్పెషల్ ఎంట్రీ, గ్రౌండ్ డ్యూటీ(నాన్ టెక్నికల్) విభాగాల్లో కోర్సులు ఉన్నాయి. ఇంటర్, డిగ్రీ/బీఈ, బీటెక్ పాసైన వారు అర్హులు. వయసు 20-26ఏళ్లు ఉండాలి. రాత, మెడికల్ టెస్టుల ఆధారంగా ఎంపిక ఉంటుంది. ట్రైనింగ్‌లో ₹56,100, ఆ తర్వాత ₹1,77,500 వరకు జీతం ఉంటుంది.

News November 10, 2025

19న మహిళలకు చీరల పంపిణీ

image

TG: మాజీ ప్రధాని ఇందిరా గాంధీ జయంతి సందర్భంగా ఈ నెల 19న 65 లక్షల మంది మహిళా సంఘాల సభ్యులకు చీరల పంపిణీకి రంగం సిద్ధమైంది. ఇప్పటికే 4.10 కోట్ల మీటర్ల సేకరణ జరిగిందని, వారంలో ఉత్పత్తి పూర్తవుతుందని అధికారులు తెలిపారు. గతంలో బతుకమ్మ చీర ఖరీదు రూ.350 ఉండగా, ఇందిరా మహిళా శక్తి చీరకు రూ.480గా నిర్ణయించినట్లు పేర్కొన్నారు. కాగా భారీగా చీరల ఆర్డర్లతో చేనేత సంఘాలకు చేతి నిండా పనిదొరికినట్లయ్యింది.

News November 10, 2025

IVF ప్రక్రియలో దశలివే..

image

IVFలో 5 కీలకమైన దశలు ఉంటాయి. ఎగ్‌ స్టిమ్యులేషన్‌కు హార్మోన్ల ఇంజెక్షన్ చేసినప్పటి నుంచి బ్లడ్‌ టెస్ట్‌ చేయడానికి 9-14 రోజులు పడుతుంది. తర్వాత పిండాన్ని బదిలీ చేస్తారు. యావరేజ్‌గా IVF సైకిల్‌ కోసం 17-20 రోజుల సమయం పడుతుంది. అయితే పేషెంట్‌ కండీషన్‌ బట్టి.. సమయం మారుతూ ఉంటుంది. ఈ ప్రక్రియ ద్వారా సంతానం పొందాలనుకునేవారు ప్రోటీన్లు, ఫోలిక్‌ యాసిడ్, విటమిన్లు, మినరల్స్‌తో కూడిన సమతుల ఆహారం తీసుకోవాలి.

News November 10, 2025

చక్కెర తినడం మానేస్తే..

image

చక్కెర తినడం మానేస్తే శరీరంలో పలు మార్పులు చోటు చేసుకుంటాయని వైద్యులు చెబుతున్నారు. ‘శక్తి స్థాయిలు స్థిరంగా ఉంటాయి. ఆరోగ్యకరమైన నిద్ర ఉంటుంది. చర్మం ఆరోగ్యంగా, ప్రకాశవంతంగా మారుతుంది. ఆకలి తగ్గుతుంది. సాధారణంగా బరువు తగ్గే అవకాశం ఉంది. గుండె, కాలేయం మరింత ఆరోగ్యవంతంగా మారుతాయి. చిరాకు, ఆందోళన తగ్గి ఫోకస్ పెరుగుతుంది. అయితే ఒక్కసారిగా మానేయకుండా క్రమంగా తగ్గించాలి’ అని సూచిస్తున్నారు.

News November 10, 2025

APPLY NOW: ముంబై పోర్ట్ అథారిటీలో 116 పోస్టులు

image

ముంబై పోర్ట్ అథారిటీలో 116 గ్రాడ్యుయేట్, COPA అప్రెంటిస్ పోస్టులకు అప్లై చేయడానికి ఇవాళే ఆఖరు తేదీ. టెన్త్, ఇంటర్‌తో పాటు NCVT సర్టిఫికెట్, డిగ్రీ ఉత్తీర్ణులై ఉండాలి. COPA 105, గ్రాడ్యుయేట్ అప్రెంటిస్‌లు 11 ఉన్నాయి. NATS పోర్టల్ ద్వారా రిజిస్ట్రర్ చేసుకోవాలి. దరఖాస్తు ఫీజు రూ.100. వెబ్‌సైట్:https://mumbaiport.gov.in/

News November 10, 2025

జూబ్లీహిల్స్ బైపోల్.. రూ.వందల కోట్ల ఖర్చు!

image

TG: జూబ్లీహిల్స్ ఉపఎన్నికలో పార్టీలు రూ.వందల కోట్లు కుమ్మరిస్తున్నాయని ప్రచారం జరుగుతోంది. ఒక్కో ఓటుకు రూ.1500-2500 వరకు ఇస్తున్నాయని టాక్. ఇక్కడ మొత్తం 4 లక్షలకు పైగా ఓట్లున్నాయి. అందులో కనీసం 3 లక్షల మందికి రూ.2500 చొప్పున పంపిణీ చేసినా రూ.75Cr ఖర్చవుతుంది. ఇక ప్రచారానికి జన సమీకరణ, యాడ్స్‌కు అదనం. దీంతో ఒక్కో అభ్యర్థి రూ.100 కోట్లకు పైనే ఖర్చు చేస్తున్నట్లు సమాచారం. రేపు పోలింగ్ జరగనుంది.

News November 10, 2025

ధాన్యం నిల్వలో తీసుకోవాల్సిన జాగ్రత్తలు

image

ధాన్యాన్ని పరిశుభ్రమైన, పొడి గోనె సంచుల్లో నిల్వ చేయాలి. సంచులు గోడల నుంచి నేల నుంచి తేమ పీల్చుకోకుండా జాగ్రత్త పడాలి. ధాన్యాన్ని 1-2 అడుగుల ఎత్తు గల దిమ్మల మీద గాని బెంచీల మీద గాని పెడితే నేలలో తేమను సంచులు పీల్చుకోవు. కీటకాల నుంచి ధాన్యం రక్షణకు నిపుణుల సూచన మేరకు అప్పుడప్పుడు పొగబెట్టడం మంచిది. ఎలుకల కట్టడి ముఖ్యం. లేకుంటే ఇవి ధాన్యాన్ని తినేస్తూ వాటి విసర్జనలు, వెంట్రుకలతో కలుషితం చేస్తాయి.