India's largestHyperlocal short
news App
Get daily news updates that are tailored for you based on your preferred language & location.
LSGvsCSK మ్యాచ్‌లో లక్నో బ్యాటర్లు 7 వికెట్ల నష్టానికి 166 పరుగులు చేశారు. పంత్(49 బంతుల్లో 63), మార్ష్ (25 బంతుల్లో 30), సమద్ (17 బంతుల్లో 22) రాణించారు. చెన్నై బౌలర్లలో జడేజా, పతిరణ చెరో 2, ఖలీల్, కాంబోజ్ చెరో వికెట్ తీశారు. చెన్నై విజయ లక్ష్యం 167 పరుగులు.
TG: రెవెన్యూ సిబ్బందిని దోషులుగా చూసే విధానానికి తమ ప్రభుత్వం వ్యతిరేకమని సీఎం రేవంత్ తెలిపారు. కొందరి వల్ల మొత్తం రెవెన్యూ శాఖను దోషిగా తాను చూడనని, పూర్తిగా విశ్వసిస్తున్నట్లు వెల్లడించారు. రైతుల కోసం చాలామంది రెవెన్యూ ఉద్యోగులు అహర్నిశలు కృషి చేశారని గుర్తుచేశారు. ప్రభుత్వం, అధికారులు వేర్వేరు కాదని, ఇద్దరూ కలిసి నడిస్తే ఏదైనా విజయవంతం అవుతుందని ధీమా వ్యక్తం చేశారు.
TG: మంత్రి పదవి కోసం తాము కాంగ్రెస్‌లోకి వచ్చినట్లు MLA ప్రేమ్‌సాగర్ చేసిన వ్యాఖ్యలపై MLA గడ్డం వివేక్ స్పందించారు. ‘ఘర్ వాపసీ అంటూ రాహుల్ గాంధీ ఆహ్వానిస్తే వచ్చాం. పలు స్థానాలు గెలవడంలో కీలక పాత్ర పోషించాం. బీజేపీలో ఉంటే కేంద్రమంత్రి పదవి వచ్చేది. మంత్రి పదవి అనేది అధిష్ఠానం నిర్ణయిస్తుంది. ఎవరో మాట్లాడితే మాకొచ్చే నష్టం లేదు. మా కుటుంబమే ఒక బ్రాండ్’ అని వ్యాఖ్యానించారు.
TG: 69 లక్షల కుటుంబాల రైతులకు భూభారతి చట్టాన్ని అంకితం చేస్తున్నట్లు సీఎం రేవంత్‌రెడ్డి వెల్లడించారు. రాష్ట్రంలో జరిగిన పోరాటాలన్నీ భూముల కోసమేనన్నారు. గత ప్రభుత్వం తెచ్చిన ‘ధరణి’తో రెవెన్యూ అధికారులపై దాడులు జరిగాయన్నారు. ఎంతో మంది భూములు కోల్పోయారన్నారు. ధరణిని బంగాళాఖాతంలో విసిరేస్తామని ఇచ్చిన హామీని నెరవేరుస్తున్నామని స్పష్టం చేశారు. భూభారతితో భూ సమస్యలకు శాశ్వత పరిష్కారం లభిస్తుందన్నారు.
హోమ్‌లోన్ తీసుకున్న వారికి స్టేట్ బ్యాంక్ ఆఫ్ ఇండియా గుడ్‌న్యూస్ చెప్పింది. ఇటీవల ఆర్‌బీఐ రెపోరేట్‌ను 25 బేసిస్ పాయింట్లు తగ్గించి 6 శాతానికి చేర్చిన విషయం తెలిసిందే. దానిని అనుసరిస్తూ SBI వడ్డీ రేట్లను సవరించింది. ఇవి రేపటి నుంచి అమల్లోకి రానున్నాయి. కొత్తగా రుణాలు తీసుకునేవారితో పాటు ఇప్పటికే తీసుకున్న వారికీ ఈ రేట్లు వర్తిస్తాయి. కాగా HDFC, BOI బ్యాంకులు ఇంతకుముందే వడ్డీ రేట్లను తగ్గించాయి.
పంజాబ్ కింగ్స్ జట్టుకు భారీ షాక్ తగిలింది. ఆ జట్టుకు కీలక బౌలర్ అయిన లాకీ ఫెర్గూసన్ గాయం కారణంగా టోర్నీ మొత్తానికి వైదొలగినట్లు PBKS ఫాస్ట్ బౌలింగ్ కోచ్ జేమ్స్ హోప్స్ తెలిపారు. ‘లాకీ సేవలు ప్రస్తుతానికి మాకు లేనట్లే. టోర్నీ ముగిసేలోపుగా అతడు రికవర్ అయి మళ్లీ బౌలింగ్ చేయడం కష్టమే. పెద్ద గాయమే అయిందని అనుకుంటున్నాం’ అని తెలిపారు. SRHతో మ్యాచ్ సందర్భంగా లాకీ గాయంతో మైదానం వీడిన సంగతి తెలిసిందే.
కర్ణాటకలో కాంగ్రెస్ ప్రభుత్వం ముస్లింలకు పబ్లిక్ కాంట్రాక్టుల్లో 4% రిజర్వేషన్ కల్పించిన విషయం తెలిసిందే. ఈ నిర్ణయంపై ఇవాళ PM మోదీ మాట్లాడుతూ ‘టెండర్లలో కాంగ్రెస్ మతాల వారీగా రిజర్వేషన్లు కల్పిస్తూ SC, ST, OBCల హక్కుల్ని కాలరాస్తోంది’ అని దుయ్యబట్టారు. దీనిపై ఆ రాష్ట్ర CM సిద్దరామయ్య స్పందిస్తూ ‘ఇందులో తప్పేముంది. ఆర్థికంగా, సామాజికంగా వెనకబడ్డ వారికి కాంగ్రెస్ అండగా ఉంటుంది’ అని వ్యాఖ్యానించారు.
AP: రానున్న మూడు రోజులు పలు జిల్లాల్లో పిడుగులతో కూడిన వర్షాలు కురిసే అవకాశం ఉందని APSDMA తెలిపింది. రేపు శ్రీకాకుళం, విజయనగరం, మన్యం, అల్లూరి, అనకాపల్లి, కాకినాడ, ప్రకాశం, నంద్యాల, అనంతపురం జిల్లాల్లో తేలికపాటి నుంచి మోస్తరు వానలు పడతాయని పేర్కొంది. ఈ సమయంలో ప్రజలు చెట్ల కింద ఉండొద్దని హెచ్చరించింది.
AP: అమరావతిలో స్పోర్ట్స్ సిటీ ఏర్పాటుకు ప్రభుత్వం కసరత్తు చేస్తోంది. విజయవాడ ఇబ్రహీంపట్నం వద్ద పెదలంక, చినలంకలో భూములను మంత్రి నారాయణ, MLAలు, కలెక్టర్ పరిశీలించారు. అంతర్జాతీయ క్రీడలు నిర్వహించేలా ఈ స్పోర్ట్స్ సిటీ ఉండాలని CM చెప్పారని మంత్రి వెల్లడించారు. ఇందుకోసం 2 వేల ఎకరాల అవసరం ఉంటుందని, లంక భూముల్లో సాధ్యాసాధ్యాలపై కమిటీ వేస్తున్నట్లు చెప్పారు. నివేదిక ఆధారంగా ముందుకెళ్తామన్నారు.
తెలుగు కుర్రాడు షేక్ రషీద్ ఐపీఎల్‌లో CSK జట్టు తరఫున ఈరోజు అరంగేట్రం చేస్తున్నాడు. గుంటూరుకు చెందిన ఈ యువ ఓపెనింగ్ బ్యాటర్ 2022లో భారత అండర్-19 జట్టుకు వైస్ కెప్టెన్‌గా ఉన్నాడు. సెమీస్, ఫైనల్లో రాణించి జట్టుకు కప్ అందించాడు. CSK గత ఏడాదే కొనుగోలు చేసినా అతడికి తుది జట్టులో స్థానం దక్కలేదు. ఈరోజు దక్కిన అవకాశాన్ని సద్వినియోగం చేసుకుని రషీద్ రాణించాలని తెలుగు క్రికెట్ అభిమానులు కోరుకుంటున్నారు.
Sorry, no posts matched your criteria.