news

News April 15, 2025

పవన్ కళ్యాణ్ ఇంటికి అల్లు అర్జున్

image

ఏపీ Dy.CM పవన్ కళ్యాణ్ నివాసానికి(హైదరాబాద్‌) హీరో అల్లు అర్జున్ ఈరోజు సతీసమేతంగా వెళ్లారు. పవన్ చిన్న తనయుడు మార్క్ శంకర్ సింగపూర్‌ అగ్నిప్రమాదంలో గాయపడిన సంగతి తెలిసిందే. ఈ నేపథ్యంలోనే పవన్ కుటుంబాన్ని బన్నీ, ఆయన భార్య స్నేహ పరామర్శించి, చిన్నారి ఆరోగ్యంపై ఆరా తీసినట్లు సమాచారం.

News April 14, 2025

బుకింగ్స్ వివాదం.. OYO ఫౌండర్‌పై కేసు నమోదు

image

OYO ఫౌండర్ రితేశ్ అగర్వాల్‌పై రాజస్థాన్‌లో కేసు నమోదైంది. తప్పుడు సమాచారంతో మోసం చేశారని జైపూర్‌కు చెందిన సంస్కార రిసార్ట్స్ యజమాని మాధవ్ జైన్ ఫిర్యాదు చేశారు. 2019లో ఓయోతో సంవత్సర కాలానికి ఒప్పందం చేసుకున్నామన్నారు. కానీ 2019-20, 2020-21లోనూ తమ రిసార్ట్స్‌ బుకింగ్స్‌ ఓయోలో చూపించారన్నారు. దీంతో రూ.2.66 కోట్ల GST బిల్లు పెండింగ్‌లో ఉన్నట్లు నోటీసులు వచ్చాయని ఫిర్యాదులో పేర్కొన్నారు.

News April 14, 2025

సూర్య ‘రెట్రో’ ట్రైలర్ రిలీజ్ ఎప్పుడంటే?

image

కార్తీక్ సుబ్బరాజు డైరెక్షన్‌లో విలక్షణ నటుడు సూర్య నటిస్తున్న మూవీ రెట్రో. టీజర్‌తోనే మంచి రెస్పాన్స్ తెచ్చుకున్న మూవీ ట్రైలర్‌ను ఈ నెల 18న విడుదల చేయనున్నట్లు చిత్ర యూనిట్ వెల్లడించింది. పూజా హెగ్డే హీరోయిన్‌గా నటిస్తున్న ఈ సినిమా ఆడియో ఫంక్షన్, ట్రైలర్ రిలీజ్ అదేరోజు జరగనుంది. సంతోష్ నారాయణన్ మ్యూజిక్ అందిస్తున్న ఈ మూవీ మే 1న గ్రాండ్‌గా రిలీజ్ కానుంది.

News April 14, 2025

SRHకు కీలక ప్లేయర్ దూరం

image

సన్‌రైజర్స్ హైదరాబాద్‌కు కీలక స్పిన్నర్ అయిన జంపా గాయంతో జట్టు నుంచి వైదొలిగారు. ఆయన స్థానంలో జట్టు యాజమాన్యం కర్ణాటక బ్యాటర్ స్మరణ్ రవిచంద్రన్‌ను రీప్లేస్‌మెంట్‌గా తీసుకుంది. ఇక రుతురాజ్ స్థానంలో సీఎస్కే ఆయుష్ మాత్రేను తీసుకున్న సంగతి తెలిసిందే. ఈ మార్పుల్ని ఐపీఎల్ అధికారిక ట్విటర్ హ్యాండిల్ ధ్రువీకరించింది.

News April 14, 2025

జుట్టుకు హెన్నా పెడుతున్నారా?

image

తెల్ల జుట్టు ఉన్నవారు సహజమైన ఎరుపు రంగు కోసం హెన్నా వాడుతుంటారు. కానీ మరీ ఎక్కువగా వాడితే అది జుట్టుకు ప్రతికూలంగా మారే ప్రమాదం ఉంటుందని శిరోజ నిపుణులు హెచ్చరిస్తున్నారు. ‘హెన్నాను మరీ ఎక్కువ వాడటం వల్ల శిరోజాల్లోని సహజమైన మృదుత్వం పోయి గరుకుగా మారిపోతుంది. జుట్టు విరిగిపోతుంటుంది. సున్నితమైన చర్మం కలిగినవారిలో దురదలూ రావొచ్చు. హెన్నా సహజమైనదే అయినా పరిమితంగా వాడటం మంచిది’ అని సూచిస్తున్నారు.

News April 14, 2025

డయాబెటిస్‌పై కీలక ప్రకటన చేసిన IDF

image

ఇంటర్నేషనల్ డయాబెటిస్ ఫెడరేషన్(IDF) కీలక ప్రకటన చేసింది. టైప్-5 మధుమేహం అనే కొత్తరకం వ్యాధిని కనుగొన్నట్లు ప్రకటించింది. ఈ వ్యాధి లక్షణాలేంటో ఇంకా పూర్తిస్థాయిలో బహిర్గతం చేయలేదు. కాగా బరువు తక్కువ ఉన్నవారిలోనూ, వారసత్వంగా మధుమేహం లేని వారిలో ఇది సోకే ప్రమాదముందని తెలిపింది. ఈ వ్యాధి సోకితే ఇన్సూలిన్ లోపంతో పాటు, బరువు తగ్గే అవకాశముందని డాక్టర్లు వెల్లడించారు.

News April 14, 2025

వీసాకోసం ఎదురుచూస్తున్న భారతీయులకు ట్రంప్ షాక్

image

అమెరికాలో హెచ్-1బీ వీసా, గ్రీన్ కార్డు కోసం ఎదురుచూస్తున్న భారతీయులకు ఆ దేశాధ్యక్షుడు ట్రంప్ షాకిచ్చారు. EB-5 అన్‌రిజర్వ్‌డ్ విభాగంలోని భారత అప్లికెంట్లకు అర్హత సమయాన్ని ఆరు నెలలకు కుదించారు. చైనీయులకు కటాఫ్ డేట్ మార్చని యంత్రాంగం, భారతీయులకు మాత్రం 2019 నవంబరు 1 నుంచి 2019 మే 1కి కుదించింది. దీంతో గ్రీన్ కార్డ్ లేదా హెచ్-1బీ వీసాకు అప్లై చేసుకునేవారికి అది లభించే అవకాశం మరింత సన్నగిల్లనుంది.

News April 14, 2025

IPL: CSK టార్గెట్ ఎంతంటే..

image

LSGvsCSK మ్యాచ్‌లో లక్నో బ్యాటర్లు 7 వికెట్ల నష్టానికి 166 పరుగులు చేశారు. పంత్(49 బంతుల్లో 63), మార్ష్ (25 బంతుల్లో 30), సమద్ (17 బంతుల్లో 22) రాణించారు. చెన్నై బౌలర్లలో జడేజా, పతిరణ చెరో 2, ఖలీల్, కాంబోజ్ చెరో వికెట్ తీశారు. చెన్నై విజయ లక్ష్యం 167 పరుగులు.

News April 14, 2025

రెవెన్యూ సిబ్బందిని విశ్వసిస్తున్నాం: రేవంత్

image

TG: రెవెన్యూ సిబ్బందిని దోషులుగా చూసే విధానానికి తమ ప్రభుత్వం వ్యతిరేకమని సీఎం రేవంత్ తెలిపారు. కొందరి వల్ల మొత్తం రెవెన్యూ శాఖను దోషిగా తాను చూడనని, పూర్తిగా విశ్వసిస్తున్నట్లు వెల్లడించారు. రైతుల కోసం చాలామంది రెవెన్యూ ఉద్యోగులు అహర్నిశలు కృషి చేశారని గుర్తుచేశారు. ప్రభుత్వం, అధికారులు వేర్వేరు కాదని, ఇద్దరూ కలిసి నడిస్తే ఏదైనా విజయవంతం అవుతుందని ధీమా వ్యక్తం చేశారు.

News April 14, 2025

మంత్రి పదవి కోసం పార్టీలోకి రాలేదు: వివేక్

image

TG: మంత్రి పదవి కోసం తాము కాంగ్రెస్‌లోకి వచ్చినట్లు MLA ప్రేమ్‌సాగర్ చేసిన వ్యాఖ్యలపై MLA గడ్డం వివేక్ స్పందించారు. ‘ఘర్ వాపసీ అంటూ రాహుల్ గాంధీ ఆహ్వానిస్తే వచ్చాం. పలు స్థానాలు గెలవడంలో కీలక పాత్ర పోషించాం. బీజేపీలో ఉంటే కేంద్రమంత్రి పదవి వచ్చేది. మంత్రి పదవి అనేది అధిష్ఠానం నిర్ణయిస్తుంది. ఎవరో మాట్లాడితే మాకొచ్చే నష్టం లేదు. మా కుటుంబమే ఒక బ్రాండ్’ అని వ్యాఖ్యానించారు.