news

News October 31, 2024

రుతురాజ్, జడేజాకు రూ.18 కోట్లు

image

చెన్నై సూపర్ కింగ్స్ ఐదుగురు ప్లేయర్లను రిటైన్ చేసుకుంది. రుతురాజ్ గైక్వాడ్ రూ.18 కోట్లు, పతిరణ రూ.13 కోట్లు, శివమ్ దూబే రూ.12 కోట్లు, జడేజా రూ.18 కోట్లు, ధోనీ రూ.4కోట్లు(అన్‌క్యాప్‌డ్ ప్లేయర్) వెచ్చించి అట్టిపెట్టుకుంది.

News October 31, 2024

సన్ రైజర్స్ రిటెన్షన్.. క్లాసెన్‌కు కళ్లు చెదిరే ధర

image

గత ఐపీఎల్‌లో చెలరేగిన ఐదుగురు ప్లేయర్లను సన్‌రైజర్స్ హైదరాబాద్ రిటైన్ చేసుకుంది. అత్యధికంగా క్లాసెన్ రూ.23 కోట్లు చెల్లించనుంది. పాట్ కమిన్స్ రూ.18Cr, అభిషేక్ శర్మ రూ.14Cr, నితీశ్ రెడ్డి రూ.6Cr, ట్రావిస్ హెడ్‌కు రూ.14 కోట్లు వెచ్చించి రిటైన్ చేసుకుంది.

News October 31, 2024

రషీద్ ఖాన్‌కు రూ.18 కోట్లు

image

గుజరాత్ టైటాన్స్ జట్టు తమ రిటెన్షన్ జాబితాను ప్రకటించింది. రషీద్ ఖాన్ (రూ.18.కోట్లు), శుభ్‌మన్ గిల్ (రూ.16.5 కోట్లు), సాయి సుదర్శన్ (రూ.8.5 కోట్లు), రాహుల్ తెవాటియా (రూ.4 కోట్లు), షారుఖ్ ఖాన్‌ (రూ.4 కోట్లు)లను అట్టి పెట్టుకుంది.

News October 31, 2024

వేలంలోకి వచ్చేసిన రిషభ్ పంత్

image

ఢిల్లీ క్యాపిటల్స్ మాజీ కెప్టెన్ రిషభ్ పంత్ వేలంలోకి వచ్చేశారు. డీసీ సమర్పించిన రిటెన్షన్ లిస్టులో ఆయన పేరును చేర్చలేదు. అక్షర్ పటేల్ (రూ.16.5 కోట్లు), కుల్దీప్ యాదవ్ (రూ.13.25 కోట్లు), ట్రిస్టన్ స్టబ్స్ (రూ.10 కోట్లు), అభిషేక్ పొరెల్ (రూ.4 కోట్లు)లను అట్టిపెట్టుకుంది.

News October 31, 2024

విరాట్ కోహ్లీకి రూ.21 కోట్లు

image

RCB తమ రిటెన్షన్ ప్లేయర్ల జాబితాను వెల్లడించింది. ఆ జట్టు స్టార్ ప్లేయర్ విరాట్ కోహ్లీకి రూ.21 కోట్లు చెల్లించింది. రజత్ పాటిదార్‌కు రూ.11 కోట్లు, యశ్ దయాల్‌ను రూ.5 కోట్లు చెల్లించి రిటైన్ చేసుకున్నట్లు బీసీసీఐకి తెలియజేసింది.

News October 31, 2024

బట్లర్‌కు ఝలక్ ఇచ్చిన రాజస్థాన్‌

image

రాజస్థాన్ రాయల్స్ తమ రిటెన్షన్ జాబితాను ప్రవేశపెట్టింది. కెప్టెన్ సంజూ శాంసన్‌ (రూ.18 కోట్లు)తోపాటు యశస్వీ జైస్వాల్ (రూ.18 కోట్లు), రియాన్ పరాగ్ (రూ.14 కోట్లు), ధ్రువ్ జురేల్ (రూ.14 కోట్లు), హెట్మయర్ (రూ.11 కోట్లు), సందీప్ శర్మ (రూ.4 కోట్లు)లను రిటైన్ చేసుకుంది. ఆ జట్టు విధ్వంసకర ఓపెనర్ జోస్ బట్లర్‌ను వేలానికి వదిలేసింది.

News October 31, 2024

మద్యం ధరల నిర్ణయంపై టెండర్ కమిటీ: మంత్రి కొల్లు

image

AP: ప్రజలకు నాణ్యమైన మద్యం అందించేందుకు అన్ని రకాల చర్యలు తీసుకుంటున్నామని మంత్రి కొల్లు రవీంద్ర తెలిపారు. గీత కార్మికులకు 340 మద్యం దుకాణాలకు వారం రోజుల్లో గెజిట్ నోటిఫికేషన్ జారీ చేస్తామని చెప్పారు. నవంబర్ 15లోపు ప్రక్రియ పూర్తి చేస్తామన్నారు. మద్యం ధరల స్థిరీకరణకు త్వరలో టెండర్ కమిటీ వేస్తామని తెలిపారు. ఈ కమిటీ డిస్టిలరీస్‌తో చర్చించి ధరలు నిర్ణయిస్తుందని పేర్కొన్నారు.

News October 31, 2024

రోహిత్ శర్మ ఫ్యాన్స్‌కు గుడ్ న్యూస్

image

తమ రిటెన్షన్ల జాబితాను ముంబై ఇండియన్స్ బీసీసీఐకి సమర్పించింది. హార్దిక్ పాండ్య (16.35 కోట్లు) రోహిత్ శర్మ (16.3 కోట్లు), సూర్యకుమార్ యాదవ్ (16.35 కోట్లు), తిలక్ వర్మ (రూ.8 కోట్లు), జస్ప్రీత్ బుమ్రా (రూ.18 కోట్లు)లను రిటైన్ చేసుకుంది. ఇషాన్ కిషన్‌కు మొండిచేయి చూపింది.

News October 31, 2024

నేను ప్రెసిడెంట్‌గా గెలిచేసరికి గాజా యుద్ధం ముగియాలి: ట్రంప్

image

తాను అమెరికా అధ్యక్షుడిగా గెలిచి వైట్ హౌస్‌లో అడుగుపెట్టే నాటికి గాజా యుద్ధం ముగియాలని ఆ దేశ అధ్యక్ష అభ్యర్థి డొనాల్డ్ ట్రంప్ అన్నారు. ఈ మేరకు ఇజ్రాయెల్ ప్రధాని నెతన్యాహుతో ట్రంప్ మాట్లాడినట్లు టైమ్స్ ఆఫ్ ఇజ్రాయెల్ కథనాలు ప్రచురించింది. వీలైనంత త్వరగా యుద్ధానికి ముగింపు పలకాలని ఆయన సూచించినట్లు తెలిపింది. ప్రజా సంబంధాలు బలోపేతం చేసుకోవాలని ట్రంప్ చెప్పినట్లు పేర్కొంది.

News October 31, 2024

PLEASE CHECK.. ఈ జాబితాలో మీ పేరు ఉందా?

image

APలో ముసాయిదా ఓటర్ల జాబితాను రాష్ట్ర ఎన్నికల సంఘం విడుదల చేసింది. 4.14 కోట్ల మంది ఓటర్లు ఉండగా, 2.03 కోట్ల మంది పురుషులు, 2.10 కోట్ల మంది మహిళలు, థర్డ్ జెండర్ 3394 మంది ఉన్నారు. ఈ ఓటరు జాబితాపై నవంబర్ 28 వరకూ అభ్యంతరాలు స్వీకరిస్తారు. మార్పులు, చేర్పుల అనంతరం జనవరి 6న తుది జాబితాను ప్రకటిస్తారు. ఈ లిస్టులో మీ పేరు ఉందో లేదో తెలుసుకునేందుకు ఇక్కడ <>క్లిక్<<>> చేయండి.