news

News December 10, 2024

రాజ్య‌స‌భ ఛైర్మ‌న్ తొల‌గింపు నిబంధ‌న‌లు ఇవే

image

రాజ్య‌స‌భ ఛైర్మ‌న్‌పై విప‌క్షాలు ప్ర‌వేశ‌పెట్టిన అవిశ్వాస తీర్మానం నెగ్గాలంటే ఓటింగ్ సంద‌ర్భంగా ఆ రోజు స‌భ‌కు హాజ‌రైన‌వారిలో సగం కంటే ఎక్కువ మంది మ‌ద్ద‌తు అవ‌స‌రం. రాజ్య‌స‌భ ఆమోదం అనంత‌రం ఇదే తీర్మానం లోక్‌స‌భలో సాధార‌ణ మెజారిటీతో నెగ్గాలి. ఈ ప్ర‌క్రియ అంతా కూడా Article 67(b), 92, 100 ద్వారా జ‌రుగుతుంది. విప‌క్షాల‌కు బ‌లం లేక‌పోవ‌డంతో రాజ్య‌స‌భ‌లో తీర్మానం నెగ్గే ప‌రిస్థితి లేదు.

News December 10, 2024

చలికాలంలో ఈ జ్యూస్ తాగితే…

image

ఆరోగ్య పరిరక్షణలో ఉసిరిని మించింది లేదని ఆయుర్వేదం చెబుతోంది. పరగడపున దీని జ్యూస్ తాగితే చాలా బెనిఫిట్స్ ఉంటాయి. చలికాలంలో రెగ్యులర్‌గా తీసుకుంటే జబ్బు పడకుండా కాపాడుతుంది. మెటబాలిజాన్ని మెరుగుపరిచి బరువు తగ్గేందుకు సాయపడుతుంది. ఇందులోని విటమిన్-సి బోలెడంత ఇమ్యూనిటీని ఇస్తుంది. ఉదర సమస్యలు తొలగించి మలబద్ధకాన్ని తరిమేస్తుంది. కాలేయ, కంటి ఆరోగ్యాన్ని మెరుగుపరుస్తుంది. స్ట్రెస్‌నూ తొలగిస్తుంది.

News December 10, 2024

HIGH ALERT.. భారీ వర్షాలు

image

బంగాళాఖాతంలో ఏర్పడిన అల్పపీడనం తీవ్ర అల్పపీడనంగా మారినట్లు AP విపత్తుల నిర్వహణ సంస్థ తెలిపింది. ఇది వచ్చే 24 గంటల్లో శ్రీలంక-తమిళనాడు తీరాల వైపు కదులుతుందంది. దీని ప్రభావంతో రేపు NLR, అన్నమయ్య, CTR, TPTY, ELR, కృష్ణా, NTR, GNT, బాపట్ల, పల్నాడు జిల్లాల్లో తేలికపాటి నుంచి మోస్తరు వర్షాలు పడతాయంది. ఎల్లుండి నుంచి NLR, ATP, శ్రీసత్యసాయి, YSR, అన్నమయ్య, చిత్తూరు, TPTY జిల్లాల్లో భారీ వర్షాలు పడతాయంది.

News December 10, 2024

Stock Market: చివర్లో రికవరీ

image

దేశీయ బెంచ్ మార్క్ సూచీలు మంగ‌ళ‌వారం ఫ్లాట్‌గా ముగిశాయి. ఉద‌యం నుంచి మ‌ధ్నాహ్నం వ‌ర‌కు Lower Lowsతో నేల‌చూపులు చూసిన సూచీలకు కీల‌క ద‌శ‌లో సపోర్ట్ లభించింది. అనంతరం రివ‌ర్స‌ల్ తీసుకోవ‌డంతో ప్రారంభ న‌ష్టాల‌ నుంచి రికవర్ అయ్యాయి. చివ‌రికి సెన్సెక్స్ 1.59 పాయింట్ల లాభంతో 81,510 వ‌ద్ద‌, నిఫ్టీ 9 పాయింట్ల న‌ష్టంతో 24,610 వ‌ద్ద స్థిర‌ప‌డ్డాయి. రియ‌ల్టీ, ఐటీ, పీఎస్‌యూ బ్యాంకుల షేర్లు రాణించాయి.

News December 10, 2024

ఈ నొప్పి గుండెపోటు కాదు.. భయపడకండి!

image

గుండెపోటు మరణ వార్తలు ఎక్కువవడంతో ఛాతి నొప్పి వచ్చినా కొందరు ఆందోళన చెందుతుంటారు. అయితే, గుండె కండరాలకు అవసరమైనంత రక్తం లభించనప్పుడు కూడా ఇలా ఛాతిలో నొప్పి వస్తుందని, దీనిని ఆంజినా పెక్టోరిస్ అంటారని వైద్యులంటున్నారు. ‘ఇది ఛాతీలో ఒత్తిడి వల్ల వచ్చే నొప్పి మాత్రమే. నడవడం, వ్యాయామం చేయడం వల్ల శారీరక శ్రమ పెరిగి ఇలాంటివి జరుగుతుంటాయి. 5-10 నిమిషాలు విశ్రాంతి తీసుకుంటే సరిపోతుంది’ అని తెలిపారు.

News December 10, 2024

పవన్ కళ్యాణ్‌కు బెదిరింపులు.. మద్యం మత్తులో నిందితుడు

image

AP: పవన్ కళ్యాణ్‌ను చంపేస్తానని <<14834003>>హత్యా బెదిరింపులకు<<>> పాల్పడిన వ్యక్తిని మల్లికార్జునరావుగా పోలీసులు గుర్తించారు. అతని మానసిక పరిస్థితి సరిగ్గా లేదని తెలుస్తోంది. మల్లికార్జున రావు మద్యం మత్తులో బెదిరింపు కాల్స్ చేసినట్లు గుర్తించారు. గతంలో అతనిపై ఓ కేసు నమోదైనట్లు సమాచారం. మరోవైపు నిందితుడిపై కఠిన చర్యలు తీసుకోవాలని హోంమంత్రి అనిత ఆదేశించారు.

News December 10, 2024

వంగవీటి రాధకు ఎమ్మెల్సీ పదవి?

image

AP: సీఎం చంద్రబాబు ఆఫీసుకు వంగవీటి రాధ కాసేపట్లో వెళ్లనున్నారు. రాధకు ఎమ్మెల్సీ పదవిని ఆఫర్ చేసే అవకాశం ఉందని రాజకీయ వర్గాల్లో చర్చ జరుగుతోంది. ఈ నేపథ్యంలో వారి మధ్య భేటీలో ఏయే అంశాలు చర్చకు వస్తాయనే దానిపై ఆసక్తి నెలకొంది.

News December 10, 2024

టీమ్ ఇండియా ప్లేయర్ సుదర్శన్‌కు సర్జరీ

image

టీమ్ ఇండియా క్రికెటర్ సాయి సుదర్శన్‌కు సర్జరీ జరిగింది. ‘నాకు శస్త్రచికిత్స చేసిన వైద్యులకు, చేయించిన బీసీసీఐకి, అండగా నిలిచిన గుజరాత్ టైటాన్స్ ఫ్యామిలీకి కృతజ్ఞతలు’ అంటూ ఆయన ఓ ఫొటోను సోషల్ మీడియాలో పోస్ట్ చేశారు. ఇది చూసిన ఫ్యాన్స్, నెటిజన్లు ఆయన త్వరగా కోలుకోవాలని కామెంట్లు పెడుతున్నారు. కాగా IPL మెగావేలానికి ముందే సుదర్శన్‌ను గుజరాత్ టైటాన్స్ రూ.8.50 కోట్లకు రిటైన్ చేసుకుంది.

News December 10, 2024

ఉద్యోగులను తొలగించలేదు: YES MADAM

image

పనిలో ఒత్తిడికి లోనవుతున్నామని చెప్పిన ఉద్యోగులను <<14833339>>తొలగించడంపై<<>> ‘YES MADAM’ కంపెనీపై తీవ్ర విమర్శలొచ్చిన విషయం తెలిసిందే. పక్కా ప్రణాళికతోనే ఇలా చేశారంటూ నెటిజన్లు మండిపడ్డారు. దీంతో సదరు కంపెనీ స్పందిస్తూ ఎవరినీ తొలగించలేదని స్పష్టం చేసింది. అయితే, ఉన్నట్టుండి ఉద్యోగాలు కోల్పోయిన వంద మందికి ఉద్యోగాలిచ్చేందుకు సిద్ధమని ‘MAGICPIN’ అనే మరో కంపెనీ లింక్డ్‌ఇన్‌లో పోస్ట్ చేసింది.

News December 10, 2024

బాక్సింగ్ డే టెస్ట్.. ఫస్ట్ డే టికెట్లన్నీ సేల్

image

ఆస్ట్రేలియాలో బాక్సింగ్ డే టెస్టుకు ఉన్న క్రేజే వేరు. ఆ మ్యాచ్ తొలి రోజుకు సంబంధించి టికెట్లన్నీ ఇప్పటికే అమ్ముడుపోయినట్లు క్రికెట్ ఆస్ట్రేలియా ట్వీట్ చేసింది. ఈ నెల 26న మెల్‌బోర్న్ వేదికగా భారత్‌తో మ్యాచ్ జరగనుండగా ఇక్కడ సిట్టింగ్ కెపాసిటీ లక్షగా ఉంది. మ్యాచ్‌కు 15 రోజుల ముందే టికెట్లన్నీ అమ్ముడవడం గమనార్హం. కాగా మూడో టెస్టు ఈ నెల 14న గబ్బా స్టేడియంలో జరగనుంది.