news

News April 15, 2025

HEADLINES

image

* AP: అంబేడ్కర్ విదేశీ విద్యాదీవెన పథకాన్ని మళ్లీ తీసుకొస్తాం: CM CBN
* TG: ‘భూభారతి’తో భూ సమస్యలకు శాశ్వత పరిష్కారం: CM రేవంత్
* TG: 56 SC కులాలను 3గ్రూపులుగా విభజిస్తూ సర్కార్ GO
* AP: వక్ఫ్ సవరణ చట్టాన్ని సవాల్ చేస్తూ సుప్రీంకోర్టులో వైసీపీ పిటిషన్
* కంచ గచ్చిబౌలి అడవులను ప్రభుత్వం బుల్డోజర్లతో ధ్వంసం చేస్తోంది: PM
* IPL: లక్నోపై CSK విజయం

News April 15, 2025

IPL: చెన్నై వరుస పరాజయాలకు బ్రేక్

image

CSK వరుస పరాజయాలకు(5) బ్రేక్ పడింది. లక్నోతో జరిగిన మ్యాచ్‌లో 5 వికెట్ల తేడాతో గెలుపొందింది. 167 పరుగుల లక్ష్యంతో బరిలోకి దిగిన చెన్నై 19.3 ఓవర్లలో ఛేదించింది. చివర్లో దూబే(43*), ధోనీ(26*) బౌండరీలతో మెరిపించి జట్టును విజయతీరాలకు చేర్చారు. త్రిపాఠి, జడేజా నిరాశపరిచినా రచిన్ రవీంద్ర(37), షేక్ రషీద్(27) రాణించారు. ఈ గెలుపుతో CSK ప్లే ఆఫ్స్ ఆశలు సజీవంగా ఉన్నాయి.

News April 15, 2025

మయన్మార్‌లో ఇంకా 1.25 లక్షల ట్రక్కుల శిథిలాలు!

image

మయన్మార్‌లో భూకంపం సృష్టించిన విధ్వంసం అంతాఇంతా కాదు. దాని వల్ల కూలిన భవనాల శిథిలాలు ఇంకా 1,25,000 ట్రక్కుల మేర మిగిలే ఉన్నాయని ఐక్యరాజ్యసమితి తాజాగా ప్రకటించింది. 10వేల ఇళ్లు ధ్వంసమయ్యాయని పేర్కొంది. మయన్మార్‌లోని మండాలయ్, సగైంగ్ లై నగరాల్లో రెండు వారాల క్రితం 7.7 తీవ్రతతో సంభవించిన భూకంపం కారణంగా 3600మందికి పైగా మృతిచెందగా 60వేలమందికి పైగా నిరాశ్రయులైన సంగతి తెలిసిందే.

News April 15, 2025

మోదీపై ఉత్తరాఖండ్ వక్ఫ్ బోర్డ్ ఛైర్మన్ ప్రశంసలు

image

వక్ఫ్ చట్ట సవరణను ఉత్తరాఖండ్ వక్ఫ్ బోర్డ్ ఛైర్మన్ షాదాబ్ షామ్స్ స్వాగతించారు. పేద ముస్లింల బాధను పీఎం మోదీ అర్థం చేసుకున్నారని కొనియాడారు. దీంతో దశాబ్దాలుగా ధనిక, పలుకుబడి ఉన్న ముస్లింలు కబ్జా చేసిన వక్ఫ్ ఆస్తులకు మోక్షం కలుగుతుందన్నారు. ఆ ప్రాపర్టీస్ ఇక పేదలకు ఉపయోగకరంగా మారుతాయన్నారు. వక్ఫ్ చట్ట సవరణపై దేశవ్యాప్తంగా ముస్లిం సంఘాలు నిరసన తెలుపుతున్న వేళ ఆయన వ్యాఖ్యలు ప్రాధాన్యం సంతరించుకున్నాయి.

News April 15, 2025

పవన్ కళ్యాణ్ ఇంటికి అల్లు అర్జున్

image

ఏపీ Dy.CM పవన్ కళ్యాణ్ నివాసానికి(హైదరాబాద్‌) హీరో అల్లు అర్జున్ ఈరోజు సతీసమేతంగా వెళ్లారు. పవన్ చిన్న తనయుడు మార్క్ శంకర్ సింగపూర్‌ అగ్నిప్రమాదంలో గాయపడిన సంగతి తెలిసిందే. ఈ నేపథ్యంలోనే పవన్ కుటుంబాన్ని బన్నీ, ఆయన భార్య స్నేహ పరామర్శించి, చిన్నారి ఆరోగ్యంపై ఆరా తీసినట్లు సమాచారం.

News April 14, 2025

బుకింగ్స్ వివాదం.. OYO ఫౌండర్‌పై కేసు నమోదు

image

OYO ఫౌండర్ రితేశ్ అగర్వాల్‌పై రాజస్థాన్‌లో కేసు నమోదైంది. తప్పుడు సమాచారంతో మోసం చేశారని జైపూర్‌కు చెందిన సంస్కార రిసార్ట్స్ యజమాని మాధవ్ జైన్ ఫిర్యాదు చేశారు. 2019లో ఓయోతో సంవత్సర కాలానికి ఒప్పందం చేసుకున్నామన్నారు. కానీ 2019-20, 2020-21లోనూ తమ రిసార్ట్స్‌ బుకింగ్స్‌ ఓయోలో చూపించారన్నారు. దీంతో రూ.2.66 కోట్ల GST బిల్లు పెండింగ్‌లో ఉన్నట్లు నోటీసులు వచ్చాయని ఫిర్యాదులో పేర్కొన్నారు.

News April 14, 2025

సూర్య ‘రెట్రో’ ట్రైలర్ రిలీజ్ ఎప్పుడంటే?

image

కార్తీక్ సుబ్బరాజు డైరెక్షన్‌లో విలక్షణ నటుడు సూర్య నటిస్తున్న మూవీ రెట్రో. టీజర్‌తోనే మంచి రెస్పాన్స్ తెచ్చుకున్న మూవీ ట్రైలర్‌ను ఈ నెల 18న విడుదల చేయనున్నట్లు చిత్ర యూనిట్ వెల్లడించింది. పూజా హెగ్డే హీరోయిన్‌గా నటిస్తున్న ఈ సినిమా ఆడియో ఫంక్షన్, ట్రైలర్ రిలీజ్ అదేరోజు జరగనుంది. సంతోష్ నారాయణన్ మ్యూజిక్ అందిస్తున్న ఈ మూవీ మే 1న గ్రాండ్‌గా రిలీజ్ కానుంది.

News April 14, 2025

SRHకు కీలక ప్లేయర్ దూరం

image

సన్‌రైజర్స్ హైదరాబాద్‌కు కీలక స్పిన్నర్ అయిన జంపా గాయంతో జట్టు నుంచి వైదొలిగారు. ఆయన స్థానంలో జట్టు యాజమాన్యం కర్ణాటక బ్యాటర్ స్మరణ్ రవిచంద్రన్‌ను రీప్లేస్‌మెంట్‌గా తీసుకుంది. ఇక రుతురాజ్ స్థానంలో సీఎస్కే ఆయుష్ మాత్రేను తీసుకున్న సంగతి తెలిసిందే. ఈ మార్పుల్ని ఐపీఎల్ అధికారిక ట్విటర్ హ్యాండిల్ ధ్రువీకరించింది.

News April 14, 2025

జుట్టుకు హెన్నా పెడుతున్నారా?

image

తెల్ల జుట్టు ఉన్నవారు సహజమైన ఎరుపు రంగు కోసం హెన్నా వాడుతుంటారు. కానీ మరీ ఎక్కువగా వాడితే అది జుట్టుకు ప్రతికూలంగా మారే ప్రమాదం ఉంటుందని శిరోజ నిపుణులు హెచ్చరిస్తున్నారు. ‘హెన్నాను మరీ ఎక్కువ వాడటం వల్ల శిరోజాల్లోని సహజమైన మృదుత్వం పోయి గరుకుగా మారిపోతుంది. జుట్టు విరిగిపోతుంటుంది. సున్నితమైన చర్మం కలిగినవారిలో దురదలూ రావొచ్చు. హెన్నా సహజమైనదే అయినా పరిమితంగా వాడటం మంచిది’ అని సూచిస్తున్నారు.

News April 14, 2025

డయాబెటిస్‌పై కీలక ప్రకటన చేసిన IDF

image

ఇంటర్నేషనల్ డయాబెటిస్ ఫెడరేషన్(IDF) కీలక ప్రకటన చేసింది. టైప్-5 మధుమేహం అనే కొత్తరకం వ్యాధిని కనుగొన్నట్లు ప్రకటించింది. ఈ వ్యాధి లక్షణాలేంటో ఇంకా పూర్తిస్థాయిలో బహిర్గతం చేయలేదు. కాగా బరువు తక్కువ ఉన్నవారిలోనూ, వారసత్వంగా మధుమేహం లేని వారిలో ఇది సోకే ప్రమాదముందని తెలిపింది. ఈ వ్యాధి సోకితే ఇన్సూలిన్ లోపంతో పాటు, బరువు తగ్గే అవకాశముందని డాక్టర్లు వెల్లడించారు.