news

News December 10, 2024

CMగా ఉన్నన్నాళ్లూ ఆ పని చేయనివ్వను: స్టాలిన్

image

పదవిలో ఉన్నంత వరకు మదురైలోని మేలూరులో టంగ్‌స్టన్ మైనింగ్‌‌ జరగనివ్వనని TN CM MK స్టాలిన్ అన్నారు. హిందుస్థాన్ జింక్‌కు కేంద్రం మైనింగ్ హక్కులు ఇవ్వడాన్ని వ్యతిరేకిస్తూ అసెంబ్లీలో DMK ప్రవేశపెట్టిన తీర్మానంపై మాట్లాడారు. ‘ఆందోళన తెలియజేసినప్పటికీ రాష్ట్ర అనుమతి లేకుండా కేంద్రం ఈ నిర్ణయం తీసుకోవడం తగదు. 2022లో రాష్ట్రం దీనిని జీవ వైవిధ్య వారసత్వ ప్రాంతంగా గుర్తించింది’ అని తీర్మానంలో పేర్కొన్నారు.

News December 10, 2024

అన్నదమ్ముల మధ్య గొడవలు సహజం: మోహన్ బాబు

image

ఏ ఇంట్లోనైనా అన్నదమ్ముల మధ్య గొడవలు సహజమని మంచు మోహన్ బాబు అన్నారు. తమ కుటుంబంలో చెలరేగిన వివాదంపై ఆయన మాట్లాడుతూ ‘మా ఇంట్లో జరుగుతున్న చిన్న తగాదా ఇది. దీనిని పరిష్కరించుకుంటాం. ఇళ్లలో గొడవలు జరిగితే అంతర్గతంగా పరిష్కరించుకుంటారు. గతంలో ఎన్నో కుటుంబాల గొడవలు పరిష్కరించా. వారు కలిసేలా చేశా’ అని తెలిపారు. జల్‌పల్లిలో ఆయన ఇంటి వద్ద పోలీసులు భారీ బందోబస్తు ఏర్పాటు చేశారు.

News December 10, 2024

భారీగా పెరిగిన బంగారం ధరలు

image

హైదరాబాద్ బులియన్ మార్కెట్‌లో బంగారం, వెండి ధరలు భారీగా పెరిగాయి. 22 క్యారెట్ల 10 గ్రాముల గోల్డ్ రేటు రూ.750 పెరిగి రూ.72,050కు చేరింది. 24 క్యారెట్ల 10 గ్రాముల పసిడి ధర రూ.820 పెరగడంతో రూ.78,600 పలుకుతోంది. కేజీ సిల్వర్ రేటు ఏకంగా రూ.4వేలు పెరిగి రూ.1,04,000కు చేరింది. గత 10 రోజుల వ్యవధిలో ఈ స్థాయిలో పెరగడం ఇదే తొలిసారి. తెలుగు రాష్ట్రాల్లోని ప్రధాన నగరాల్లో దాదాపు ఇవే ధరలు ఉన్నాయి.

News December 10, 2024

స్పామ్ కాల్స్‌ బెడద.. తెలుగు స్టేట్స్ టాప్!

image

తెలుగు రాష్ట్రాల ప్రజలకు స్పామ్ కాల్స్ ఇబ్బందిగా మారాయి. ఎయిర్‌టెల్ స్పామ్ రిపోర్ట్ ప్రకారం అత్యధికంగా స్పామ్ కాల్స్ గుర్తించిన రాష్ట్రాల్లో తెలంగాణ & ఆంధ్రప్రదేశ్‌ రెండో స్థానంలో ఉన్నాయి. ముఖ్యంగా పురుషులు(76%), అందులోనూ 36-60 ఏళ్ల మధ్యనున్న వారినే టార్గెట్ చేస్తున్నట్లు గుర్తించారు. ఈ స్పామ్ కాల్స్ రోజూ ఉదయం 11 నుంచి 3PM వరకు వస్తాయని తెలిసింది. వీకెండ్స్‌లో తక్కువగా కాల్స్ వస్తాయని వెల్లడైంది.

News December 10, 2024

పొద్దున్నే లెమన్ వాటర్ తాగుతున్నారా..

image

పరగడపున గోరువెచ్చని నీటిలో నిమ్మరసం కలుపుకొని సేవించడం చాలామందికి అలవాటు. దానిని తాగేటప్పుడు కొన్ని జాగ్రత్తలు తీసుకోవాలని నిపుణులు అంటున్నారు. కాపర్, అల్యూమినియం గ్లాసుల్లో దీనిని తీసుకోవద్దు. పులుపు ఆ లోహాలను కరిగిస్తుంది. దాంతో అవి రక్తంలో కలవొచ్చు. చర్మ సమస్యలుంటే పుల్లని పానీయాలు తీసుకోవద్దు. ఎసిడిటీ ఉంటే అది మరింత ఎక్కువ కావొచ్చు. లెమన్ వాటర్‌ను వెంటనే తాగకపోతే విటమిన్-సి తగ్గిపోవచ్చు.

News December 10, 2024

మా కుటుంబ సమస్యలకు త్వరలోనే పరిష్కారం: మంచు విష్ణు

image

తమ కుటుంబంలో చిన్నపాటి సమస్యలు తలెత్తాయని, త్వరలోనే అన్నీ పరిష్కారం అవుతాయని మంచు విష్ణు తెలిపారు. దుబాయ్ నుంచి హైదరాబాద్‌కు చేరుకున్న అనంతరం ఆయన మీడియాతో మాట్లాడారు. ఫ్యామిలీ వివాదాన్ని పెద్దగా చిత్రీకరించడం తగదని అన్నారు. మోహన్ బాబు, మనోజ్ మధ్య వివాదం జరగగా, ఇరువురూ పోలీసులకు ఫిర్యాదు చేయడంతో <<14837635>>కేసులు నమోదైన<<>> సంగతి తెలిసిందే.

News December 10, 2024

షమీని వెంటనే ఆస్ట్రేలియాకు పంపండి: పాక్ మాజీ క్రికెటర్

image

భారత జట్టుకు మహ్మద్ షమీ సేవలు ఎంతో అవసరమని పాక్ మాజీ క్రికెటర్ బాసిత్ అలీ అన్నారు. వెంటనే ఆయనను ఆస్ట్రేలియా పంపాలని సూచించారు. ‘షమీని ఆడించాలనుకుంటే దయచేసి ఇప్పుడే పంపండి. మూడో టెస్టులోనే ఆయనను ఆడించండి. నాలుగో టెస్టుకు ఆడిస్తే లాభం ఉండదు. భారత పేసర్ల బృందాన్ని ముందుండి నడిపిస్తారు’ అని ఆయన పేర్కొన్నారు. కాగా BGTలో చివరి రెండు టెస్టులకు షమీ ఎంపికవుతారని టాక్.

News December 10, 2024

STOCK MARKETS: ఆటో, మీడియా షేర్లు డౌన్

image

స్టాక్‌మార్కెట్ సూచీలు ఫ్లాటుగా మొదలయ్యాయి. సెన్సెక్స్ 81,576 (+68), నిఫ్టీ 24,636 (+20) వద్ద ట్రేడవుతున్నాయి. ఆటో, మీడియా, O&G సూచీలు ఎరుపెక్కాయి. ఫైనాన్స్, IT, ఫార్మా, రియాల్టి, హెల్త్‌కేర్ రంగాలు కళకళలాడుతున్నాయి. నిఫ్టీ ADV/DEC రేషియో 29:21గా ఉంది. శ్రీరామ్ ఫైనాన్స్, అపోలో హాస్పిటల్స్, బజాజ్ ఫిన్‌సర్వ్, INFY, టాటా మోటార్స్ టాప్ గెయినర్స్. M&M, ONGC, GRASIM, BAJAJ AUTO, TECHM టాప్ లూజర్స్.

News December 10, 2024

ప్రభుత్వ స్కూళ్లలో టీచర్ల ఫొటోలు ప్రదర్శించాలి: విద్యాశాఖ

image

TG: ప్రభుత్వ స్కూళ్లలో పనిచేస్తున్న టీచర్ల ఫొటోలు, వివరాలను ఆయా స్కూళ్లలో ప్రదర్శించాలని పాఠశాల విద్యాశాఖ ఆదేశాలు జారీ చేసింది. నకిలీ టీచర్లు, ఫేక్ అటెండెన్స్‌ను అరికట్టేందుకు ఈ నిర్ణయం తీసుకుంది. వివరాలు ప్రదర్శించడం వల్ల టీచర్ల వివరాలు విద్యార్థులతో పాటు తనిఖీలకు వచ్చే ఉన్నతాధికారులు, ప్రజాప్రతినిధులకు కూడా తెలుస్తాయని భావిస్తోంది.

News December 10, 2024

ఎంపీతో తన స్థాయి తగ్గిందన్న కృష్ణయ్య.. మళ్లీ అదే పదవి!

image

బీసీ ఉద్యమ నేత కృష్ణయ్య BJP నుంచి రాజ్యసభ స్థానాన్ని తీసుకోవడం చర్చనీయాంశంగా మారింది. ఇటీవల ఆయన YCPకి, రాజ్యసభకు రాజీనామా చేసిన విషయం తెలిసిందే. ఆ సందర్భంగా కృష్ణయ్య <<14226660>>మాట్లాడుతూ<<>> తన 50 ఏళ్ల పోరాటంలో ఎంపీ చిన్న పదవని చెప్పారు. దాని వల్ల తన స్థాయి తగ్గిందన్న ఆయన ఇప్పుడు మళ్లీ అదే పదవి తీసుకోవడం కరెక్టేనా అని పలువురు ప్రశ్నిస్తున్నారు. TDP, YCP, ఇప్పుడు బీజేపీలో చేరికపై విమర్శిస్తున్నారు.