news

News December 10, 2024

రాహుల్ గాంధీ ఇది ఎలాంటి వంచన?: కేటీఆర్

image

TG: అదానీ-మోదీ ఫొటోలు ప్రింట్ చేసిన టీ షర్టులతో రాహుల్ గాంధీ పార్లమెంటుకు వెళ్లడం కరెక్టయినప్పుడు, అదానీ-రేవంత్ ఫొటోలతో టీషర్టులు వేసుకున్న తమను అసెంబ్లీకి ఎందుకు రానివ్వలేదని కేటీఆర్ X వేదికగా ప్రశ్నించారు. ‘రాహుల్ గాంధీ గారు ఇది ఎలాంటి వంచన? మీ అడుగుజాడల్లో నడిచి అదానీ-రేవంత్ అఫైర్‌ను బయటపెడదామనుకున్నాం. కానీ మమ్మల్ని రానివ్వలేదు. దీనికి మీరు సమాధానం చెప్పాలి’ అని పేర్కొన్నారు.

News December 10, 2024

హమాస్ వినాశనమే మా లక్ష్యం: నెతన్యాహు

image

తాము యుద్ధం ముగిస్తే హమాస్ తమపై దాడి చేస్తుందని ఇజ్రాయెల్ ప్రధాని నెతన్యాహు అన్నారు. అందుకే తాము యుద్ధం విరమించబోమని ఆయన స్పష్టం చేశారు. యుద్ధానికి 14 నెలలు పూర్తైన సందర్భంగా నెతన్యాహు మాట్లాడారు. ‘యుద్ధాన్ని ఆపితే హమాస్ కోలుకుని మళ్లీ బలపడుతుంది. అందుకే దాని సైనిక, పరిపాలన సామర్థ్యాలను తుడిచిపెట్టేస్తా. భవిష్యత్‌లో మాపై దాడులు జరగకుండా చేస్తా. హమాస్ వినాశనమే మా టార్గెట్’ అని ఆయన పేర్కొన్నారు.

News December 10, 2024

అసెంబ్లీకి కేసీఆర్ ఎప్పుడు వస్తారు?

image

TG: ప్రతిపక్ష నేత, మాజీ సీఎం కేసీఆర్ అసెంబ్లీకి ఎప్పుడు వస్తారా అని అధికార పక్షంతో పాటు రాజకీయ వర్గాలు ఎదురుచూస్తున్నాయి. నిన్న తొలి రోజు శీతాకాల అసెంబ్లీ సమావేశాలకు ఆయన హాజరు కాని సంగతి తెలిసిందే. దీంతో ‘ఆయన ఇక ఫామ్ హౌస్‌కే పరిమితం అవుతారా? తమ పార్టీ నేతలకు దిశానిర్దేశాలతోనే కాలం గడిపేస్తారా?’ అంటూ అధికార పక్షం విమర్శిస్తోంది. ఈనెల 16 నుంచి కొనసాగే సమావేశాలకైనా ఆయన వస్తారేమో చూడాలి.

News December 10, 2024

మంచు మనోజ్, మౌనికపై కేసు నమోదు

image

మంచు ఫ్యామిలీ వివాదంలో కీలక పరిణామం చోటుచేసుకుంది. తనకు ముప్పు పొంచి ఉందని, రక్షణ కల్పించాలని మోహన్‌బాబు వాట్సాప్‌లో ఇచ్చిన ఫిర్యాదుపై కొడుకు మనోజ్, కోడలు మౌనికపై FIR నమోదైంది. తనపై దాడి చేశారని, ప్రాణహాని ఉందంటూ మంచు మనోజ్ ఇచ్చిన ఫిర్యాదుపై మోహన్‌బాబుకు చెందిన 10 మంది అనుచరులపై పహాడిషరీఫ్ పోలీసులు కేసు నమోదు చేశారు.

News December 10, 2024

ప్రపంచంలో అత్యధికులు చదివేది ఇంగ్లిషే

image

ప్రపంచంలో 135 దేశాలవారు ఇంగ్లిష్‌లోనే చదువుకుంటున్నట్లు ‘డ్యులింగో లాంగ్వేజ్ రిపోర్ట్ 2024’ వెల్లడించింది. రెండో స్థానంలో స్పానిష్, మూడో ప్లేస్‌లో ఫ్రెంచ్ ఉన్నట్లు తెలిపింది. స్పానిష్‌ 33 దేశాల్లో, ఫ్రెంచ్‌ను 16 దేశాల్లో అభ్యసిస్తున్నట్లు వివరించింది. ప్రపంచంలో అత్యధిక మంది అభ్యసిస్తున్న పదో భాషగా హిందీ నిలిచింది. ఇంగ్లిష్ సర్టిఫికేషన్ కోర్సుకు ప్రాధాన్యమిస్తున్న దేశాల్లో భారత్ అగ్రస్థానంలో ఉంది.

News December 10, 2024

జబర్దస్త్ టు క్యాబినెట్: నాడు రోజా, నేడు నాగబాబు

image

AP: రాష్ట్ర క్యాబినెట్‌లో నాగబాబు చేరిక ఖాయమైంది. త్వరలోనే ఆయన బాధ్యతలు స్వీకరించనున్నారు. ఆ తర్వాత 6 నెలల్లో MLCగా ఎన్నికవ్వాల్సి ఉంటుంది. జబర్దస్త్‌ కామెడీ షోలో జడ్జీలుగా చేసిన రోజా, నాగబాబు వేర్వేరు ప్రభుత్వాల్లో మంత్రులుగా అవకాశం దక్కించుకున్నట్లవుతుంది. అప్పట్లో వీరి మధ్య మంచి సంబంధాలే ఉండగా తర్వాత రాజకీయంగా విభేదాలు తలెత్తిన విషయం తెలిసిందే.

News December 10, 2024

‘బిగ్‌బాస్’ నిలుపుదలకు హైకోర్టు నో

image

నాగార్జున హోస్ట్‌గా వ్యవహరిస్తున్న ‘బిగ్‌బాస్ రియాలిటీ షో’ ప్రసారాన్ని నిలిపేయాలని దాఖలైన పిల్‌ను హైకోర్టు కొట్టేసింది. ఆ ప్రోగ్రాం అసభ్యంగా ఉందంటూ కొన్ని ఫొటోలను చూపించి షోను ఆపేయాలంటే సాధ్యం కాదని స్పష్టం చేసింది. పిటిషనర్‌కు అశ్లీలంగా అనిపించిన సీన్లు ఇతర ప్రజలకు అసభ్యం కాకపోవచ్చంది. కేబుల్ టీవీ నియంత్రణ చట్టం ప్రకారం సంబంధింత అధికారుల ముందు పిటిషనర్ తన అభ్యంతరాలను లేవనెత్తవచ్చని పేర్కొంది.

News December 10, 2024

‘LIC బీమా సఖి’.. నెలకు రూ.7,000 స్టైఫండ్

image

మహిళా సాధికారిత లక్ష్యంగా LIC బీమా సఖి యోజన పథకాన్ని PM మోదీ ప్రారంభించారు. ఏడాదిలో లక్ష మందిని నియమించుకోనున్నట్లు LIC MD సిద్ధార్థ్ మహంతి ప్రకటించారు. టెన్త్ అర్హత కలిగి 18-70ఏళ్ల వయసున్న మహిళలు అర్హులు. వీరికి మూడేళ్లపాటు ఆర్థిక అంశాలు, బీమాపై శిక్షణ ఇస్తారు. తొలి ఏడాది ₹7K, రెండో ఏడాది ₹6K, మూడో ఏడాది ₹5K చొప్పున ప్రతినెలా స్టైఫండ్ అందిస్తారు. శిక్షణ తర్వాత LIC ఏజెంట్‌గా పనిచేయొచ్చు.

News December 10, 2024

BITCOIN: 24 గంటల్లో రూ.3.16లక్షలు లాస్

image

క్రిప్టో కరెన్సీ పెద్దన్న బిట్‌కాయిన్‌లో కన్సాలిడేషన్ కొనసాగుతోంది. 24 గంటల్లోనే $3736 (Rs.3.16L) నష్టపోయింది. నేడు మాత్రం స్వల్ప లాభాల్లో ట్రేడవుతోంది. $97,318 వద్ద ఓపెనైన BTC $97,040 వద్ద కనిష్ఠ, $98,159 వద్ద గరిష్ఠ స్థాయుల్ని అందుకుంది. $477 లాభంతో $97,960 వద్ద చలిస్తోంది. ఇక ఎథీరియమ్ 4.86, XRP 10.45, సొలానా 5.78, BNP 4.96, DOGE 9, ADA 12.73, షిబాఇను 13% మేర పతనమయ్యాయి. క్రిప్టో Mcap తగ్గింది.

News December 10, 2024

రోహిత్ శర్మ ఏ స్థానంలో ఆడాలి?

image

BGT మూడో టెస్టులో రోహిత్ శర్మ ఓపెనర్‌గా రావాలని మాజీ క్రికెటర్లు రవిశాస్త్రి, గవాస్కర్ అభిప్రాయపడ్డారు. KL రాహుల్‌ను మిడిలార్డర్‌లో ఆడించాలన్నారు. కానీ ఫామ్‌లో ఉన్న KLను ఓపెనర్‌గా కొనసాగించాలని, 3rd టెస్టులో రెడ్ కూకబురా బాల్‌తో ఆడుతారు కాబట్టి మిడిలార్డర్‌కు బ్యాటింగ్ ఈజీ అవుతుందని మరికొందరు అంటున్నారు. 2nd టెస్టులో మిడిలార్డర్‌లో బ్యాటింగ్‌కు వచ్చిన రోహిత్ రన్స్ చేయడంలో విఫలమైన సంగతి తెలిసిందే.