news

News October 29, 2024

కేటీఆరే నాకు క్షమాపణ చెప్పాలి: బండి సంజయ్

image

TG: తనకు KTR లీగల్ నోటీసులు పంపడాన్ని BJP MP బండి సంజయ్ తప్పుబట్టారు. రాజకీయ విమర్శలు చేస్తే నోటీసులు పంపిస్తారా? అని ప్రశ్నించారు. తాను చేసిన వ్యాఖ్యల్లో తప్పు లేదని చెప్పుకొచ్చారు. తాను ఎక్కడా కేటీఆర్ పేరు ప్రస్తావించలేదని, తనకే KTR బహిరంగ క్షమాపణ చెప్పాలని బండి సంజయ్ డిమాండ్ చేశారు. లీగల్ నోటీసులు వెనక్కి తీసుకోవాలన్నారు.

News October 29, 2024

హైకోర్టులో వైసీపీ ఎంపీకి ఊరట

image

AP: పుంగనూరు అల్లర్ల కేసులో వైసీపీ ఎంపీ మిథున్ రెడ్డికి ఊరట లభించింది. ఆయనతో పాటు మరో ఐదుగురికి హైకోర్టు ముందస్తు బెయిల్ మంజూరు చేసింది.

News October 29, 2024

టాటాలే స్ఫూర్తి.. రూ.20,000 కోట్లు దాతృత్వం

image

రియల్ ఎస్టేట్ దిగ్గజం అభిషేక్ లోధా కుటుంబం దాతృత్వ కార్యక్రమాల కోసం రూ.20,000 కోట్లు వెచ్చించనున్నట్లు ప్రకటించింది. మాక్రోటెక్ డెవలపర్స్‌లో 18-19 శాతం వాటాను సేవా సంస్థ ‘లోధా ఫిలాంథ్రోపీ ఫౌండేషన్’‌కు బదిలీ చేస్తామంది. మహిళా సాధికారత, విద్య తదితర కార్యక్రమాలపై ఆ మొత్తాన్ని వెచ్చిస్తామని తెలిపింది. ఈ విషయంలో తమకు టాటాలే ఆదర్శమని అభిషేక్ చెప్పారు.

News October 29, 2024

టపాసులు కాలుస్తున్నారా?

image

దీపావళి వచ్చేసింది. పిల్లలంతా ఓ చోటకు చేరి సందడిగా గడుపుతూ టపాసులు కాల్చుతుంటారు. అయితే, కొందరు సరదా కోసం టపాసులను మూగజీవాలపైకి విసురుతూ ఆనందపడుతుంటారు. వాటి శబ్దానికి వీధి కుక్కలు, ఆవులు, ఇతర జీవాలు భయంతో బిక్కుబిక్కుమంటూ గడుపుతుంటాయి. కాబట్టి, వాటిపై క్రాకర్స్ విసిరి ఇబ్బందిపెట్టకుండా ఆనందంగా పండుగ జరుపుకోండి. దీంతోపాటు రోడ్డుపై ప్రజల రాకపోకలను గమనిస్తూ, వృద్ధులకు దూరంగా టపాసులు కాల్చుకోండి.

News October 29, 2024

RECORD: రూ.50వేల కోట్లు దాటేసిన iPhones ఎగుమతులు

image

iPhones ఎగుమతుల్లో భారత్ రికార్డులు సృష్టిస్తోంది. FY25లో తొలి 6 నెలల్లోనే రూ.50వేల కోట్ల ($6bns) విలువైన ఇండియా మేడ్ ఫోన్లను ఎగుమతి చేసినట్టు తెలిసింది. ఇదే జోరు కొనసాగితే FY24 నాటి $10bns రికార్డు బ్రేకవ్వడం ఖాయమే. మన దేశంలో ఫాక్స్‌కాన్, పెగాట్రాన్, టాటా ఎలక్ట్రానిక్స్ iPhones ఉత్పత్తి చేస్తున్నాయి. ఒకప్పుడు అమెరికాకు $5.2mnsగా ఉండే వార్షిక ఎగుమతులు FY25 ఐదు నెలల్లోనే $2.88bnsకు చేరాయి.

News October 29, 2024

భారీగా డిప్యూటీ కలెక్టర్ల బదిలీ

image

AP: రాష్ట్రంలో 32 మంది డిప్యూటీ కలెక్టర్లను బదిలీ చేస్తూ ప్రభుత్వం ఉత్తర్వులు జారీ చేసింది. ఏడుగురికి ఏపీ సీఆర్డీఏలో పోస్టింగ్ ఇస్తూ సీఎస్ నీరబ్ కుమార్ ఉత్తర్వులు జారీ చేశారు. ఏపీఐఐసీ EDగా రచన, ప్రోటోకాల్ డైరెక్టర్‌గా మోహన్ రావు, శ్రీకాళహస్తి టెంపుల్ ఈవోగా బాపిరెడ్డి, శిల్పారామం సొసైటీ సీఈవోగా స్వామినాయుడు, సీసీఎల్ఏ సహాయ కార్యదర్శిగా లక్ష్మారెడ్డిని నియమించారు.

News October 29, 2024

DANGER: ఈ 3 ఫుడ్స్ తింటున్నారా?

image

HYDలో మోమోస్ తిని ఓ మహిళ మృతి, పలువురి అస్వస్థత వార్తలు ఆందోళన కలిగిస్తున్నాయి. స్ట్రీట్ ఫుడ్స్‌లో ప్రధానంగా షావర్మా, మోమోస్, పానీపూరీ తినడం వల్ల ఆరోగ్య సమస్యలు వస్తాయని వైద్యులు చెబుతున్నారు. అపరిశుభ్రమైన షావర్మాతో ఫుడ్ పాయిజనింగ్ అయ్యే ఛాన్సుంది. మోమోస్ వల్ల జీర్ణాశయ సమస్యలు, అపరిశుభ్ర పానీపూరీ వల్ల వాంతులు, అతిసారం వస్తుందంటున్నారు. తాజా, శుభ్రమైనవి తీసుకుంటే ప్రమాదాన్ని తగ్గించవచ్చు.

News October 29, 2024

ఈ రైళ్లకు తేడా తెలుసా?

image

నీలి, గోధుమ రంగు ICF బోగీలు ప్యాసింజర్, ఎక్స్‌ప్రెస్ రైళ్లలో కనిపిస్తాయి. గంటకు గరిష్ఠంగా 70 KM వేగంతో వెళ్లగలవు. ఎయిర్ బ్రేకులు వినియోగిస్తారు. మెయింటనెన్స్ ఖర్చు ఎక్కువగా ఉంటుంది. రాజధాని, ఇతర సూపర్ ఫాస్ట్ ప్రీమియం ట్రైన్లలో ఎరుపు రంగులోని LHB కోచ్‌లు కనిపిస్తాయి. యాంటీ టెలిస్కోపిక్ డిజైన్ ఆధారంగా తయారుచేయడం వల్ల యాక్సిడెంట్ అయినప్పుడు బోగీలు ఒకదానిపైకి ఒకటి పడవు. గంటకు 200 KM వేగంతో వెళ్లగలవు.

News October 29, 2024

OLAలో జాయినవుతా! షరతులు వర్తిస్తాయన్న కమెడియన్!

image

OLA ఎలక్ట్రిక్ CEO భవీశ్, కమెడియన్ కునాల్ <<14291792>>వివాదం<<>>లో మరో మలుపు! OLAలో పనిచేయాలన్న ఆఫర్‌ను యాక్సెప్ట్ చేస్తున్నానని కునాల్ తెలిపారు. ఇన్ని వేలసార్లు తన పేరును ట్యాగ్ చేయడంతో తప్పడం లేదన్నారు. ‘ఓలా కచ్చితంగా సేవల సంక్షోభాన్ని పరిష్కరించాలి. అన్ని స్కూటర్ల రిపేర్లను 7 రోజుల్లో పూర్తిచేయాలి. లేదంటే రోజుకు రూ.500/ టెంపరరీ స్కూటర్ ఇవ్వాలి. బైక్, సర్వీసెస్‌కు ఇన్సూరెన్స్ ఇవ్వాలి’ అని కండీషన్లు పెట్టారు.

News October 29, 2024

రైల్వే స్టేషన్లలో రద్దీ నియంత్రణకు SCR చర్యలు

image

దీపావళి వేళ రైల్వే స్టేషన్లలో ప్రయాణికులతో రద్దీ నెలకొనే అవకాశం ఉండటంతో సౌత్ సెంట్రల్ రైల్వే ప్రత్యేక చర్యలు చేపట్టింది. SECBAD, HYD, కాచిగూడ, విజయవాడ, గుంటూరు, తిరుపతి వంటి స్టేషన్లలో ప్రత్యేక RPF సిబ్బంది రద్దీని నియంత్రిస్తారు. స్టేషన్లలో స్పెషల్ లైన్లు ఏర్పాటు చేస్తారు. టికెట్ కౌంటర్లను కూడా పెంచినట్లు SCR తెలిపింది. పండగ కోసం 850 స్పెషల్ ట్రైన్లు, అదనపు బోగీలు ఏర్పాటు చేసినట్లు వివరించింది.