India's largestHyperlocal short
news App
Get daily news updates that are tailored for you based on your preferred language & location.

ఒక్కసారిగా వాతావరణం మారడంతో ఇంట్లో ఒక్కరైనా జలుబు, దగ్గు, ఫ్లూ వంటి లక్షణాలతో బాధపడుతున్నారు. తెలుగు రాష్ట్రాల్లో ఉష్ణోగ్రతలు పడిపోవడంతో ఈ వ్యాధులు వేగంగా వ్యాపిస్తున్నాయి. ఈక్రమంలో పిల్లలు, పెద్దలు స్వెటర్లు & వెచ్చని దుస్తులు ధరించడం ఉత్తమం. చల్లటి ఆహారాలు, పానీయాలకు దూరంగా ఉండండి. వేడి నీటితో ఆవిరి పట్టండి. సమస్య తీవ్రంగా ఉంటే స్వీయ వైద్యం చేయకుండా వెంటనే వైద్యుడిని సంప్రదించాలి.

హురున్ గ్లోబల్ రిచ్ లిస్ట్ 2025లో 5స్థానంలో నిలిచిన రోష్నీ నాడార్‌కు సుమారు రూ. 2.84 లక్షల కోట్ల సంపద ఉంది. 27 ఏళ్లకే HCL CEO బాధ్యతలు చేపట్టిన ఆమె సంస్థను లాభాల బాట పట్టిస్తూ ధనిక మహిళల్లో ఒకరిగా ఎదిగారు. మరోవైపు సామాజిక సేవలోనూ ముందున్నారు. ఫోర్బ్స్, ఫార్చ్యూన్ జాబితాల్లో చోటు దక్కించుకున్న ఆమె గతేడాది ఫ్రాన్స్ అత్యున్నత పౌర పురస్కారం ‘షెవెలియర్ డె లా లీజియన్ డి-హానర్’ అందుకున్నారు.

AP: మొంథా తుఫాన్ వల్ల రాష్ట్రంలోని 24 జిల్లాల్లో 1,64,505 హెక్టార్లలో పంటలు దెబ్బతిన్నట్లు వ్యవసాయశాఖ గుర్తించింది. కృష్ణా జిల్లాలో అత్యధికంగా 31వేల హెక్టార్లలో, కోనసీమలో 29,537, కాకినాడలో 21,422 హెక్టార్లలో పంట నష్టం జరిగింది. తుఫాన్ ప్రభావిత 6 జిల్లాల్లో కేంద్ర హోంశాఖ సంయుక్త కార్యదర్శి పౌసుమీ బసు నేతృత్వంలోని 8 మంది సభ్యుల బృందం.. ఇవాళ, రేపు పర్యటించి పంట నష్టంపై కేంద్రానికి నివేదిక ఇవ్వనుంది.

స్వింగ్ జరా, కావాలయ్యా వంటి సూపర్‌హిట్ సాంగ్స్‌తో యూత్‌ను అట్రాక్ట్ చేసిన మిల్కీ బ్యూటీ తమన్నా మరోసారి సిల్వర్ స్క్రీన్‌ను షేక్ చేయడానికి రెడీ అవుతున్నట్టు తెలుస్తోంది. చిరంజీవి, అనిల్ రావిపూడి కాంబినేషన్‌లో తెరకెక్కుతున్న ‘మన శంకర వరప్రసాద్ గారు’ సినిమాలో స్పెషల్ సాంగ్ చేయనున్నట్టు టాక్. ప్రత్యేక సెట్‌లో సాంగ్ షూట్ చేయడానికి అనిల్ రెడీ అవుతున్నారట. దీనిపై అధికారిక ప్రకటన రావాల్సి ఉంది.

ఏపీ స్కిల్ డెవలప్‌మెంట్ కార్పొరేషన్ ఆధ్వర్యంలో జర్మనీలో మెకానిక్ ఉద్యోగాలను భర్తీ చేయనున్నారు. ఐటీఐ/డిప్లొమా/బీటెక్ అర్హతతో పాటు పని అనుభవం గల అభ్యర్థులు ఇవాళ్టి వరకు అప్లై చేసుకోవచ్చు. వయసు 18 నుంచి 40ఏళ్ల మధ్య ఉండాలి. నెలకు రూ.2.50లక్షల నుంచి రూ.3 లక్షల వరకు జీతం చెల్లిస్తారు. వెబ్‌సైట్: https://naipunyam.ap.gov.in/

AP: పల్నాడు(D) రాజుపాలెం(M) రెడ్డిగూడెం వద్ద మరో బస్సు ప్రమాదం జరిగింది. హైదరాబాద్ నుంచి బాపట్ల వెళ్తున్న ప్రైవేట్ ట్రావెల్స్ బస్సు అదుపుతప్పి రోడ్డు పక్కకు దూసుకెళ్లి ఒరిగిపోయింది. రోడ్డు విస్తరణ పనులకు ఏర్పాటుచేసిన పైపులను తగిలి బస్సు ఆగిపోయింది. దీంతో అప్రమత్తమైన 30 మంది ప్రయాణికులు అత్యవసర ద్వారాల నుంచి బయటకు దూకేశారు. ఎవరికీ గాయాలు కాకపోవడంతో అందరూ ఊపిరిపీల్చుకున్నారు.

HR డిపార్ట్‌మెంట్ చేసిన పొరపాటు గురించి ఓ ఉద్యోగి చేసిన పోస్ట్ వైరల్ అవుతోంది. ‘మా కంపెనీ ఆఫ్‌బోర్డింగ్ ఆటోమేషన్ టూల్‌ను టెస్ట్ చేస్తోంది. లైవ్ మోడ్ నుంచి టెస్ట్ మోడ్‌కు మార్చడాన్ని మర్చిపోయింది. దీంతో ‘మీ చివరి పని దినం వెంటనే అమల్లోకి వస్తుంది’ అని CEO సహా 300 మందికి ఈమెయిల్స్ వచ్చాయి. అయితే తప్పు తెలుసుకుని తర్వాత మరో మెసేజ్ చేసింది. ఎవరినీ తొలగించలేదని చెప్పింది’ అని రెడిట్‌లో రాసుకొచ్చాడు.

ప్రకృతి సేద్యంలో పెద్ద పురుగులు, చీడపీడల నివారణకు బ్రహ్మాస్త్రాన్ని రైతులు ఉపయోగిస్తున్నారు. బ్రహ్మాస్త్రం తయారీకి కావాల్సిన పదార్థాలు
☛ దేశవాళీ ఆవు లేదా నాటు ఆవు మూత్రం – 10 లీటర్లు
☛ వేప ఆకులు – 2 కిలోలు
☛ సీతాఫలం ఆకులు – 2 కిలోలు
☛ పల్లేరు(బిల్వపత్రం) ఆకులు – 2 కిలోలు
☛ ఉమ్మెత్త ఆకులు – 2 కిలోలు అవసరం.

గత కొన్ని రోజులుగా తగ్గుతూ వస్తోన్న బంగారం ధరలు ఇవాళ భారీగా పెరిగాయి. హైదరాబాద్ బులియన్ మార్కెట్‌లో 24 క్యారెట్ల 10 గ్రాముల బంగారం ధర రూ.1,200 పెరిగి రూ.1,23,220కి చేరింది. 22 క్యారెట్ల 10 గ్రాముల గోల్డ్ రేటు రూ.1,100 ఎగబాకి రూ.1,12,950 పలుకుతోంది. అటు కేజీ వెండిపై రూ.2,000 పెరిగి రూ.1,67,000గా ఉంది. రెండు తెలుగు రాష్ట్రాల్లో దాదాపు ఇవే ధరలున్నాయి.

TG: కవి అందెశ్రీ అంత్యక్రియలను ప్రభుత్వ లాంఛనాలతో నిర్వహించాలని సీఎం రేవంత్ రెడ్డి నిర్ణయించారు. అందుకు తగిన ఏర్పాట్లు చేయాలని సీఎస్‌ను ఆదేశించారు. అందెశ్రీ అంత్యక్రియలు ఇవాళ సాయంత్రం జరిగే అవకాశం ఉంది. ఆయన రచించిన ‘జయజయహే తెలంగాణ’ పాటను రేవంత్ సర్కార్ రాష్ట్ర గీతంగా ప్రకటించిన విషయం తెలిసిందే.
Sorry, no posts matched your criteria.