India's largestHyperlocal short
news App
Get daily news updates that are tailored for you based on your preferred language & location.

భర్త కిడ్నీని అమ్మి ప్రియుడితో <<15341180>>పారిపోయిన ఘటన<<>> మరువకముందే అదే తరహాలో మరో ఉదంతం బయటకొచ్చింది. తమిళనాడు కన్యాకుమారి(D)లో బెంజమిన్(47), సునీత(45) దంపతులు. భర్త సౌదీలో పనిచేస్తుండగా, ఇంటివద్దే ఉన్న భార్య మరొకరితో సంబంధం పెట్టుకుంది. ఇటీవల భర్త ఇంటిని అమ్మేసి డబ్బుతో పారిపోయింది. దీంతో భర్త సెల్ఫీ వీడియోలో ఆవేదన వ్యక్తం చేసి సూసైడ్ చేసుకున్నాడు. పోలీసులు కేసు దర్యాప్తు చేస్తున్నారు.

పేదల సంక్షేమం కోసం పల్లెటూర్లకు వెళ్లి పనిచేయాలని ఇన్ఫోసిస్ ఫౌండర్ నారాయణ మూర్తి విద్యార్థులకు పిలుపునిచ్చారు. చెన్నైలోని సాయి యూనివర్సిటీ కాన్వొకేషన్ ప్రోగ్రామ్‌లో మాట్లాడారు. దేశభక్తి కోసం జాతీయవాదాన్ని వదిలేయాలని సూచించారు. ‘దేశ, ప్రపంచ ప్రజలను మెరుగుపరిచేందుకు ఎంచుకున్న రంగంలో మనస్ఫూర్తిగా పనిచేయడమే దేశభక్తి. ఇంటర్ కనెక్ట్ అయిన ఈ ప్రపంచంలో జాతీయవాదాన్ని ఫాలో అవ్వడం సరికాదు’ అని ఆయన అన్నారు.

అనుమతి లేకుండా అమెరికాలో ఉంటున్న భారతీయులను తిప్పి పంపుతుండటంపై విదేశాంగ మంత్రి జైశంకర్ మాట్లాడారు. తాము ఇందుకు ప్రిపేర్ అయ్యామని, తమ వద్ద అత్యవసర ప్రణాళికలు ఉన్నాయని ఆయన రాజ్యసభలో తెలిపారు. దీనిపై 2PMకు మరోసారి ప్రకటన చేస్తారని సమాచారం. ఇప్పటికే ఈ అంశంపై PM మోదీతో ఆయన ప్రత్యేకంగా భేటీ అయ్యారు. నిన్న 104 మందిని అమృత్‌సర్‌కు US డీపోర్ట్ చేయడంపై ప్రతిపక్షాలు ఆందోళన చేపట్టాయి.

జానీ మాస్టర్‌పై కేసు పెట్టిన మహిళా కొరియోగ్రాఫర్ బిగ్ బాస్ కంటెస్టెంట్ ఆర్జే శేఖర్ బాషాపై నార్సింగి పోలీసులకు తాజాగా ఫిర్యాదు చేశారు. BNS 79, 67, IT చట్టం 72 కింద కేసు నమోదు చేసినట్లు తెలుస్తోంది. బాషా తన ఫోన్ కాల్ రికార్డ్ చేశాడని ఆమె ఫిర్యాదులో పేర్కొన్నారు. తన పరువుకు భంగం కలిగేలా వ్యాఖ్యలు చేశారన్నారు. రాజ్ తరుణ్-లావణ్య వివాదంలో శేఖర్ బాషాపై ఇప్పటికే కేసు నమోదైంది.

AP: చంద్రబాబు నటనలో ఎన్టీఆర్‌ను మించిపోయారని మాజీ సీఎం జగన్ విమర్శించారు. ప్రజలు పొరపాటున ఓటు వేసి చంద్రముఖిని నిద్రలేపారని అన్నారు. 9 నెలల పాలన తర్వాత బాబు ష్యూరిటీ.. మోసం గ్యారంటీగా మారిందని దుయ్యబట్టారు. చీటింగ్‌లో పీహెచ్‌డీ చేశారని, చంద్రబాబును నమ్మడమంటే పులి నోట్లో తల పెట్టడమేనని చెప్పారు. CBN మోసాలను, అబద్ధాలను ప్రజలకు వివరిస్తామని తెలిపారు.

TG: సీఎం రేవంత్ రెడ్డి అధ్యక్షతన ఎంసీహెచ్ఆర్డీలో సీఎల్పీ సమావేశం ప్రారంభమైంది. పార్టీ రాష్ట్ర ఇంఛార్జ్ దీపాదాస్ మున్షీ, మంత్రులు, ఎమ్మెల్యేలు, ఎమ్మెల్సీలు హాజరయ్యారు. కులగణన, ఎస్సీ వర్గీకరణను ప్రజల్లోకి ఎలా తీసుకెళ్లాలి, దుష్ప్రచారాన్ని అడ్డుకోవడంతో పాటు ఇతర అంశాలపై నేతలకు సీఎం దిశానిర్దేశం చేయనున్నారు.

నామినేటెడ్ పదవుల్లో బీసీలకు 34శాతం రిజర్వేషన్లు వర్తింపజేయాలని ఏపీ క్యాబినెట్ నిర్ణయించింది. సీఎం చంద్రబాబు అధ్యక్షతన జరుగుతోన్న క్యాబినెట్ భేటీలో దీనికి ఆమోదం లభించింది. అటు ఎంఎస్ఎంఈ పాలసీలో మార్పులు చేయాలని నిర్ణయం తీసుకుంది. ఎస్సీ, ఎస్టీ, బీసీ, మహిళా పారిశ్రామికవేత్తలకు అదనపు ప్రోత్సాహకాలు ఇచ్చి ఆదుకోనుంది.

ప్రపంచ అగ్ర కుబేరుల్లో ఒకరైన అంబానీ తన గ్యారేజీకి మరో కొత్త కారును జత చేశారు. దేశంలోనే ఎవరికీ లేని రోల్స్ రాయిస్ కలినన్ బుల్లెట్ ప్రూఫ్ కారును కొనుగోలు చేశారు. ఈ కారుకు అత్యంత పటిష్ఠమైనదన్న పేరుంది. బాంబు దాడి జరిగినా ప్రయాణికులు సురక్షితంగా ఉండేలా దీన్ని రూపొందించినట్లు చెబుతారు. దీని విలువ దాదాపు రూ.8 కోట్లు కాగా.. మార్పులతో కలిపి రూ.13 కోట్ల వరకూ అంబానీ వెచ్చించినట్లు సమాచారం.

తెలుగులో తొలి టాకీ సినిమాగా గుర్తింపు పొందిన ‘భక్త ప్రహ్లాద’ విడుదలై నేటికి 93 ఏళ్లు పూర్తయ్యాయి. హెచ్.ఎం.రెడ్డి దర్శకత్వం వహించిన ఈ సినిమాను రూ.18 వేలతో 18 రోజుల్లోనే తెరకెక్కించారు. అప్పటివరకు మూకీ చిత్రాలకే అలవాటైన జనాలకు ఇది కొత్త అనుభవాన్ని ఇచ్చింది. ఆ తర్వాత తెలుగు సినిమాల్లో పెను మార్పులు చోటుచేసుకొని అంతర్జాతీయ వేదికపై సత్తాచాటే స్థాయికి చేరుకున్నాయి.

ఆస్ట్రేలియన్ క్రికెటర్ మార్కస్ స్టొయినిస్ సంచలన నిర్ణయం తీసుకున్నారు. ఛాంపియన్స్ ట్రోఫీకి ముందు వన్డేలకు రిటైర్మెంట్ ప్రకటించారు. CTకి 15 మందితో కూడిన జాబితాలో చోటు దక్కించుకున్న అతడు అనూహ్యంగా ఈ నిర్ణయం తీసుకున్నారు. 35 ఏళ్ల ఈ ఆల్‌రౌండర్ 71 వన్డేలు ఆడి 1,495 పరుగులు చేశారు. ఒక సెంచరీతో పాటు 6 అర్ధసెంచరీలు ఉన్నాయి. మొత్తం 48 వికెట్లు తీశారు.
Sorry, no posts matched your criteria.