India's largestHyperlocal short
news App
Get daily news updates that are tailored for you based on your preferred language & location.
TG: తన కుటుంబం కోసం 8 ఏళ్లు సినిమాల్లో కష్టపడ్డానని మనోజ్ అన్నారు. ‘కొన్నాళ్లుగా ఇంటి నుంచి మా కుటుంబం దూరంగా ఉంటోంది. నా ముందే నా కుటుంబ సభ్యుల్ని, ఉద్యోగుల్ని తిట్టారు. విష్ణు అనుచరులే సీసీ ఫుటేజ్ మాయం చేశారు. మోహన్ బాబు యూనివర్సిటీ(MBU)లో ఆర్థిక అవకతవకలు జరుగుతున్నాయి. అందులోని బాధితులకు నేను అండగా ఉన్నాను. అందుకే నాపై తప్పుడు ఆరోపణలు చేస్తున్నారు’ అని మనోజ్ అన్నారు. మనోజ్ రాసిన లెటర్ pdf కోసం ఇక్కడ <
తన తండ్రి మోహన్ బాబు ఎప్పుడూ విష్ణుకే మద్దతుగా ఉన్నారని మనోజ్ అన్నారు ‘నా త్యాగాలు ఉన్నా నాకు అన్యాయం, పరువు నష్టం జరిగింది. కుటుంబ వివాదాల పరిష్కారం కోసం చర్చలు జరపాలని మా నాన్నను కోరినా పట్టించుకోలేదు. నేను 4నెలల కిందటే ఇంటికి వచ్చాననేది అవాస్తవం. నా ఫోన్ లొకేషన్ చూస్తే ఇది తెలుస్తుంది. నాపై, నా భార్యపై చేసిన ఆరోపణలు నిరాధారమైనవి. నా పరువు, మర్యాదలు తీసే ప్రయత్నంలో భాగం’ అని లేఖలో రాశారు.
శబరిమల వెళ్లే మహిళల భద్రత పట్ల కేరళ ప్రభుత్వం కీలక నిర్ణయం తీసుకుంది. పంబా బేస్‌లో ప్రత్యేక వసతి సదుపాయాన్ని కల్పించింది. ఈ వసతి గృహంలో 50మంది మహిళలు విశ్రాంతి తీసుకునేలా ఏర్పాట్లు చేసి సోమవారం ప్రారంభించింది. అయ్యప్ప మాలధారులతో వచ్చే మహిళలు తమవారు తిరిగొచ్చే వరకు పంపా బేస్, హిల్ టాప్ వద్ద వాహనాల్లోనే ఎదురు చూడాల్సి వచ్చేది. తాజా నిర్ణయంతో మహిళలకు ఆ కష్టాలు తీరనున్నాయి.
AP: సెకీతో విద్యుత్ కొనుగోలు ఒప్పందాల విషయంలో తనపై అవాస్తవాలు ప్రచురించాయంటూ పలు మీడియా సంస్థలపై రూ.100 కోట్లకు మాజీ సీఎం జగన్ పరువు నష్టం దావా వేశారు. వెంటనే ఆ కథనాలు తొలగించి బేషరతుగా క్షమాపణ చెప్పేలా ఆదేశించాలని ఢిల్లీ హైకోర్టులో పిటిషన్ దాఖలు చేశారు. దీంతో న్యాయమూర్తి ఈనాడు, ఆంధ్రజ్యోతిలకు నోటీసులిచ్చారు. తదుపరి విచారణను ఈ నెల 16కు వాయిదా వేశారు.
AP: నాగబాబును మంత్రివర్గంలోకి తీసుకోవడంపై మాజీ మంత్రి అంబటి రాంబాబు సెటైర్ వేశారు. ‘ప్రభుత్వం అంటే మల్టీ స్టారర్ మూవీ అనుకుంటున్నారు.. పాపం’ అని Xలో వ్యంగ్యాస్త్రాలు సంధించారు. దీనికి చంద్రబాబు, పవన్ కళ్యాణ్, నారా లోకేశ్, నాగబాబును ట్యాగ్ చేశారు.
పెద్దవారికి రోజుకు 7-8 గంటల నిద్ర సరిపోతుందని నిపుణులు చెబుతున్నారు. అతి నిద్ర గుండెకు చేటు చేస్తుందని, వెన్నునొప్పి వస్తుందని అంటున్నారు. దీంతో పాటు టైప్-2 మధుమేహానికి కారణమవుతుందట. ఎక్కువ సమయం నిద్రలో ఉంటే ‘సెరెటోనిన్’ స్థాయులు తగ్గి మైగ్రేన్ వంటి సమస్యలొస్తాయని హెచ్చరిస్తున్నారు. 9గంటలకు పైగా నిద్రపోయి లేస్తే బద్ధకం ఆవరించి ఆ రోజంతా అలసటగా ఉంటుందట. మీరు ఎన్ని గంటలు నిద్రపోతారో కామెంట్ చేయండి.
అడిలైడ్ టెస్టులో IND ఓటమి తర్వాత రోహిత్ కెప్టెన్సీపై ప్రశ్నలు లేవనెత్తుతున్న వేళ మాజీ క్రికెటర్ కపిల్ దేవ్ అతనికి అండగా నిలిచారు. ‘రోహిత్ కెప్టెన్సీని అనుమానించొద్దు. అతను కొత్తగా నిరూపించడానికి ఏం లేదు. తిరిగి దృఢంగా పుంజుకుంటారని భావిస్తున్నా. ఒకట్రెండు ప్రదర్శనలతో కెప్టెన్సీని అనుమానిస్తే, అతను 6నెలల కిందటే టీ20 వరల్డ్ కప్ సాధించాడు. మరి దానిపై మనం ఏం ప్రశ్నిస్తాం’ అని కపిల్ అన్నారు.
రామ్‌గోపాల్ వర్మ మరోసారి తనదైన శైలిలో వ్యాఖ్యానించారు. పుష్ప-2 నిర్మాతల్లో ఒకరైన నవీన్ యెర్నేనితో దిగిన ఫొటోను సోషల్ మీడియాలో పోస్ట్ చేసిన ఆయన ఇండియన్ సినిమా చరిత్రలో టాలెస్ట్ మెగా ప్రొడ్యూసర్ అని క్యాప్షన్ ఇచ్చారు. కాసేపటికే ఆ ఫొటోను ట్యాగ్ చేస్తూ నవీన్ తాను సినిమాలు తీస్తున్న స్టార్ హీరోల కంటే ఎత్తుగా ఉన్నారని చమత్కరించారు.
AP: రాష్ట్రంలో నిర్వహిస్తున్న రెవెన్యూ సదస్సుల్లో భారీగా ఫిర్యాదులు వస్తున్నట్లు అధికారులు చెబుతున్నారు. 4రోజుల్లో మొత్తం 19,403ఫిర్యాదులు వచ్చాయని, వాటిలో తిరుపతి జిల్లా నుంచి అత్యధికంగా 2,873ఉన్నాయన్నారు. ఇప్పటి వరకు 170ఫిర్యాదులు పరిష్కరించినట్లు తెలిపారు. 1,012గ్రామాల్లో నిర్వహించిన సదస్సులకు 62,868మంది ఫిర్యాదులు అందజేశారన్నారు. భూహక్కులకు సంబంధించి 37% సమస్యలు ఉన్నట్లు అధికారులు చెప్పారు.
కొన్ని సార్లు విత్ డ్రా చేసినప్పుడు ఏటీఎంల నుంచి చిరిగిన నోట్లు వస్తుంటాయి. ఆ సమయంలో టెన్షన్ పడకుండా ఆ ఏటీఎం లింక్ అయిన బ్యాంక్‌కు వెళ్లి విత్ డ్రా చేసిన టైం, తేదీ వివరాలతో ఫామ్ నింపితే మంచి నోట్లు ఇస్తారు. అలాగే చిరిగిన, పాడైపోయిన నోట్లనూ ఫామ్ నింపకుండానే మార్చుకోవచ్చు. బ్యాంకులు లేదా రిజర్వ్ బ్యాంక్ కార్యాలయాల్లో ఎలాంటి ఫీజు చెల్లించకుండా గరిష్ఠంగా రూ.5వేల వరకు ఇలా మార్చుకునేందుకు వీలుంది.
Sorry, no posts matched your criteria.