news

News April 15, 2025

కంచ గచ్చిబౌలిపై మోదీ కామెంట్స్.. మంత్రుల కౌంటర్

image

TG: కాంగ్రెస్ ప్రభుత్వం బుల్డోజర్లతో అడవులను ధ్వంసం చేస్తోందన్న ప్రధాని మోదీ వ్యాఖ్యలపై మంత్రులు కౌంటరిచ్చారు. కంచ గచ్చిబౌలి భూముల్లో తాము చెట్లు నరకలేదని, జంతువులను చంపట్లేదని స్పష్టం చేశారు. అడవులను పెంచి ప్రకృతిని కాపాడటమే తమ ప్రభుత్వ లక్ష్యమని చెప్పారు. కంచ గచ్చిబౌలిలో అసలు అటవీ భూమి లేదని, బీజేపీ నేతలు తప్పుడు సమాచారం వ్యాప్తి చేస్తున్నారని మరో మంత్రి శ్రీధర్ బాబు మండిపడ్డారు.

News April 15, 2025

IPL: నేడు పంజాబ్, కోల్‌కతా మధ్య పోరు

image

IPLలో ఇవాళ PBKS, KKR తలపడనున్నాయి. ఈ రెండు జట్ల మధ్య ఇప్పటి వరకూ 33 మ్యాచులు జరగ్గా KKR 21, PBKS 12 మ్యాచుల్లో నెగ్గాయి. గత 4 సీజన్లలో అయితే చెరో 4 విజయాలు దక్కించుకున్నాయి. గాయంతో ఫెర్గూసన్ దూరమవడం PBKSకు ప్రతికూలంగా మారే అవకాశం ఉంది. మరోవైపు ఆ జట్టు మాక్స్‌వెల్ నుంచి మంచి నాక్ ఆశిస్తోంది. అటు బెస్ట్ AVG, ఎకానమీతో బౌలింగ్ చేస్తున్న KKR స్పిన్నర్లు పంజాబ్‌ బ్యాటర్లను కట్టడి చేసే అవకాశం ఉంది.

News April 15, 2025

నేడు కాంగ్రెస్ శాసన సభాపక్ష సమావేశం

image

TG: రాష్ట్ర కాంగ్రెస్ శాసన సభాపక్ష సమావేశం ఇవాళ ఉ.11గంటలకు CM రేవంత్ రెడ్డి అధ్యక్షతన జరగనుంది. ప్రభుత్వం అమలు చేస్తున్న సన్నబియ్యం, ఇందిరమ్మ ఇళ్లు పథకాలతో పాటు భూభారతి, SC వర్గీకరణ, BCలకు 42శాతం రిజర్వేషన్లు వంటి అంశాలను ప్రజల్లోకి తీసుకెళ్లడంపై ప్రజాప్రతినిధులకు CM దిశానిర్దేశం చేయనున్నారు. అలాగే కొన్ని జిల్లాల్లో నేతల మధ్య నెలకొన్న వివాదాలు, పార్టీ అంతర్గత విషయాలపైనా చర్చించే అవకాశముంది.

News April 15, 2025

ఐక్యరాజ్య సమితిలో ఘనంగా అంబేడ్కర్ జయంతి

image

డా.BR అంబేడ్కర్ జయంతిని భారత ప్రభుత్వం ఐక్యరాజ్య సమితిలో నిర్వహించింది. UN ప్రధాన కార్యాలయం(న్యూయార్క్)లో జరిగిన ఈ కార్యక్రమానికి ప్రపంచ నాయకులు హాజరయ్యారు. భారత్ తరఫున కేంద్ర‌మంత్రి రాందాస్ అథవాలే పాల్గొని అంబేడ్కర్ గొప్పతనాన్ని, ఆయన ఆశయ సాధనకు PM మోదీ చేస్తోన్న కృషిని వివరించారు. మరోవైపు అంబేడ్కర్ సేవలను కొనియాడుతూ న్యూయార్క్ నగరం APR 14ను డా.భీమ్‌రావ్ రామ్‌జీ అంబేడ్కర్ దినోత్సవంగా ప్రకటించింది.

News April 15, 2025

IPL-2025: ఇప్పటి వరకు Highlights

image

* అత్యధిక పరుగులు: పూరన్ (357)
* అత్యధిక వికెట్లు: నూర్ అహ్మద్(12)
* అత్యధిక వ్యక్తిగత స్కోర్: అభిషేక్ శర్మ(141)
* అత్యధిక సిక్సులు: పూరన్(31)
* అత్యధిక ఫోర్లు: సాయి సుదర్శన్(31)
* శతకాలు: 3(ప్రియాన్ష్ ఆర్య, అభిషేక్, ఇషాన్ కిషన్)
* బెస్ట్ బౌలింగ్: మిచెల్ స్టార్క్(5-35)
* బెస్ట్ బ్యాటింగ్ స్ట్రైక్ రేట్: కరుణ్ నాయర్(222.50)
* టేబుల్ టాపర్: GT

News April 15, 2025

ఇలా పొదుపు చేస్తే.. ఆర్థిక సమస్యలకు చెక్!

image

ఉద్యోగమైనా, వ్యాపారం అయినా పొదుపు చేయకపోతే అనుకోకుండా వచ్చే ఆర్థిక సమస్యలను ఎదుర్కోలేం. అందుకే నెలనెలా వచ్చే ఆదాయంలో 20 శాతం కచ్చితంగా పొదుపునకు కేటాయించాలి. మిగతా 80 శాతం డబ్బునే ఇతరత్రా ఖర్చులకు వాడాలి. అందులోనూ అనవసరమైన ఖర్చులున్నాయా? అని ప్రతినెలా చెక్ చేస్తూ వాటిని తగ్గించుకోవాలి. హంగులు, ఆర్భాటాలు, కోరికలు తగ్గించుకుంటే భవిష్యత్తులో ఆర్థికపరమైన సమస్యలు దరిచేరవని నిపుణులు చెబుతున్నారు.

News April 15, 2025

ప్రొటీన్ ఫుడ్ ఎక్కువగా తింటే వచ్చే అనర్థాలివే!

image

ప్రొటీన్‌‌ ఫుడ్ శరీరానికి మేలు చేసినా మోతాదుకు మించితే ఆరోగ్య సమస్యలు వస్తాయని వైద్యులు చెబుతున్నారు. ప్రొటీన్ ఎక్కువైతే తీవ్రమైన దాహం కలిగి, ఫలితంగా తాగే నీటి వల్ల కిడ్నీలపై భారం పడుతుంది. అలాగే, నోటి దుర్వాసనకూ ప్రొటీన్‌లోని ఆమ్లాలు కారణమవుతాయి. మరోవైపు మలబద్ధకం సమస్య కూడా వేధిస్తుంది. అధిక ప్రొటీన్‌ వల్ల శరీరంలో వేడి పెరిగి ఒళ్లు నొప్పులొస్తాయి.
NOTE: కేజీ శరీరబరువుకు 0.8గ్రా. ప్రొటీన్ అవసరం.

News April 15, 2025

బైడెన్ వల్లే రష్యా- ఉక్రెయిన్ యుద్ధం: ట్రంప్

image

అమెరికా మాజీ అధ్యక్షుడు జోబైడెన్ పాలనపై US అధ్యక్షుడు ట్రంప్ తీవ్ర ఆరోపణలు చేశారు. 2020 ఎన్నికల్లో రిగ్గింగ్ జరిగి బైడెన్ అధ్యక్షుడు అవ్వడం వల్లే రష్యా-ఉక్రెయిన్ యుద్ధం మొదలైందన్నారు. ఈ యుద్ధానికి తనకు ఎలాంటి సంబంధం లేకపోయినా ఆయా దేశాల్లో మరణాలు, విధ్వంసం ఆపడానికి శ్రద్ధగా పని చేస్తున్నట్లు వివరించారు. అలాగే, బైడెన్, ఉక్రెయిన్ అధ్యక్షుడు జెలెన్‌స్కీ ఈ యుద్ధం పట్ల వ్యవహరించిన తీరును ఆయన ఎండగట్టారు.

News April 15, 2025

ధోనీ మరో రికార్డ్.. POTM అవార్డ్ నూర్‌కు ఇవ్వాల్సిందన్న మహీ

image

LSGతో మ్యాచ్‌లో 11 బంతుల్లోనే 26 రన్స్ చేసిన ధోనీని POTM అవార్డ్ వరించింది. దీంతో IPL చరిత్రలో ఈ అవార్డ్ అందుకున్న ఓల్డెస్ట్ ప్లేయర్‌(43yrs 281d)గా ఆయన నిలిచారు. గతంలో ఈ రికార్డ్ లెగ్ బ్రేక్ బౌలర్ ప్రవీణ్ తాంబే(43yrs 60d) పేరిట ఉండేది. మరోవైపు, ధోనీ మాట్లాడుతూ.. ‘నాకు ఈ అవార్డ్ ఎందుకు ఇచ్చారు? నూర్ అహ్మద్ అద్భుతంగా బౌలింగ్ చేశారు’ అని అన్నారు. అతను 4 ఓవర్లలో 13 పరుగులే ఇచ్చారు.

News April 15, 2025

రాజధాని పనులు ఊపందుకుంటున్నాయి: మంత్రి నారాయణ

image

AP: రాజధాని అమరావతి పనులు ఊపందుకుంటున్నాయని మంత్రి నారాయణ తెలిపారు. ‘రాజధానిలో ప్రస్తుతం 3 వేల మంది కార్మికులు, 500 యంత్రాలు పని చేస్తున్నాయి. ఈ నెలాఖరుకు 15 వేల మంది కార్మికులు నిర్మాణ పనుల్లో పాల్గొంటారు. మూడేళ్లలో రాజధాని పనులు పూర్తి చేస్తాం’ అని వెల్లడించారు. అలాగే మైలవరం నియోజకవర్గంలో స్పోర్ట్స్ సిటీ ఏర్పాటుకు పరిశీలిస్తున్నట్లు మంత్రి వివరించారు.