news

News February 5, 2025

టాటా అల్ట్రా E.12: సస్టేనబుల్ ఎలక్ట్రిక్ మొబిలిటీ

image

దేశ లాజిస్టిక్స్ విభాగంలో సరికొత్త అవసరాలను తీర్చే తాజా సమర్పణ టాటా అల్ట్రా E.12. పూర్తి స్థాయి ఎలక్ట్రిక్ ట్రక్..జీరో ఉద్గారాలు, అధునాతన సాంకేతికత, భద్రత మరియు స్థిరమైన చలనశీలతను అందిస్తుంది. పూర్తి-ఎలక్ట్రిక్ డ్రైవ్‌ట్రెయిన్‌తో అమర్చబడి, కార్బన్ ఫుట్ ప్రింట్ ను తగ్గించి, సమర్థవంతంగా పనిచేస్తుంది. అల్ట్రా E.12 విస్తారమైన స్థలం, పరిధితో అత్యుత్తమ డ్రైవింగ్ సౌకర్యాన్ని అందిస్తుంది.

News February 5, 2025

Ace pro EV: విప్లవాత్మక లాస్ట్-మైల్ డెలివరీ

image

టాటా మోటార్స్ Ace Pro EV ని పరిచయం చేసింది, ఇది సమర్థవంతమైన లాస్ట్-మైల్ డెలివరీ కోసం రూపొందించిన అద్భుతమైన ఎలక్ట్రిక్ వాణిజ్య వాహనం. 155+ కి.మీ. పరిధి, 750 కిలోల బెస్ట్-ఇన్-క్లాస్ పేలోడ్ మరియు ADAS తో సహా అధునాతన భద్రతా లక్షణాలు కలవు. స్మార్ట్ కనెక్టివిటీ, మల్టిపుల్ బాడీ కాన్ఫిగరేషన్‌లతో, జీరో ఎమిషన్స్ ను కొనసాగిస్తూ లాభదాయకత పెంచుతుందని వినియోగదారులకు మాటిస్తోంది.

News February 5, 2025

ఢిల్లీ బీజేపీదే.. మెజారిటీ ఎగ్జిట్ పోల్స్

image

ఢిల్లీలో బీజేపీ అధికారం చేపట్టనుందని మెజారిటీ ఎగ్జిట్ పోల్స్ అంచనా వేస్తున్నాయి. చాణక్య స్ట్రాటజీస్ ప్రకారం బీజేపీకి 39-44, పీపుల్ పల్స్ 51-60, మ్యాట్రిజ్ 35-40, పీపుల్స్ ఇన్ సైట్ 40-44, రిపబ్లిక్ పీ మార్క్ 39-49, పోల్ డైరి 42-50, జేవీసీ పోల్ 39-45 సీట్లు వస్తాయని పేర్కొన్నాయి. కాగా కేకే సర్వే మాత్రం ఆమ్ ఆద్మీ పార్టీకి 39, బీజేపీకి 22 సీట్లు వస్తాయని అంచనా వేసింది.

News February 5, 2025

ఢిల్లీలో కమలానికే పీఠం: చాణక్య స్ట్రాటజీస్

image

ఢిల్లీ అసెంబ్లీ ఎన్నికల్లో BJPదే విజయమని చాణక్య స్ట్రాటజీస్ తెలిపింది. బీజేపీకి 39-44 సీట్లు వస్తాయని పేర్కొంది. ఆప్‌ 25-28 స్థానాలు దక్కించుకుంటుందని అంచనా వేసింది. కాంగ్రెస్‌కు 2-3 సీట్లు వచ్చే ఆస్కారముందని తెలిపింది. అలాగే పీపుల్స్ పల్స్ సర్వే బీజేపీ 51-60 సీట్లు గెలుచుకుంటుందని అంచనా వేసింది. ఆప్ 10-19 స్థానాలకే పరిమితమవుతుందని పేర్కొంది. కాంగ్రెస్‌కు ఒక్క సీటు కూడా రాదని తెలిపింది.

News February 5, 2025

SWIGGY నికర నష్టం రూ.799 కోట్లు

image

FY25 మూడో త్రైమాసికంలో ఫుడ్ అగ్రిగేటర్ కంపెనీ స్విగ్గీ నష్టాలు మరింత పెరిగాయి. గతేడాది ఇదే టైంలో రూ.574 కోట్లు నష్టం చవిచూడగా ఈసారి నికర నష్టం రూ.799 కోట్లకు చేరుకుంది. FY25 Q3లో రూ.3,700 కోట్లుగా ఉన్న ఖర్చులు ఇప్పుడు రూ.4,898 కోట్లకు పెరగడమే నష్టాలకు కారణమని సమాచారం. ఆపరేషన్స్ రెవెన్యూ మాత్రం 31% వృద్ధిరేటుతో రూ.3049 కోట్ల నుంచి రూ.3993 కోట్లకు పెరిగింది. టాప్‌లైన్ సైతం 11% గ్రోత్‌ నమోదు చేసింది.

News February 5, 2025

‘మిర్రర్ హ్యాండ్’ సిండ్రోమ్ గురించి తెలుసా?

image

ఎవరి చేయికైనా ఐదు వేళ్లు ఉండటం సహజం. కొందరికి 6 కూడా ఉంటుంటాయి. అయితే, ‘మిర్రర్ హ్యాండ్’ సిండ్రోమ్ సోకిన వారికి చేతికి ఇరువైపులా ఒకే విధంగా వేళ్లుంటాయి. ఈ అరుదైన వ్యాధి వల్ల ఒక్క హ్యాండ్‌కు 8 ఫింగర్స్ ఉంటాయి. బొటనవేలు ఉండదు. దీనికి కచ్చితమైన కారణం తెలియనప్పటికీ అల్ట్రాసౌండ్ ద్వారా జననానికి ముందే గుర్తించవచ్చు. దీనిని శస్త్రచికిత్స ద్వారా నార్మల్‌గా మార్చేయవచ్చు.

News February 5, 2025

నాగ చైతన్య రెండో పెళ్లిపై సమంత ఏమన్నారంటే?

image

మాజీ భర్త నాగ చైతన్య రెండో పెళ్లిపై సమంత స్పందించారు. చైతూకు శోభితతో పెళ్లి అయిన నేపథ్యంలో అసూయ పడుతున్నారా? అని ఓ ఇంటర్వ్యూలో ప్రశ్నించగా.. ‘లేదు. నా జీవితంలో అసూయకు చోటు లేదు. చెడుకు మూల కారణం అసూయ అని భావిస్తాను. నా జీవితంలో దాన్ని భాగం కావడాన్ని కూడా అంగీకరించను. అలాంటి వాటి గురించి ఆలోచించను’ అని సమంత అన్నారు. శోభితను నాగ చైతన్య గతేడాది DECలో రెండో పెళ్లి చేసుకున్న విషయం తెలిసిందే.

News February 5, 2025

UCC: మొదటి ‘సహ జీవనం’ జోడీ నమోదు

image

ఉత్తరాఖండ్‌లో UCC అమల్లోకి వచ్చిన 9 రోజుల తర్వాత సహజీవనం చేస్తున్న మొదటి జోడీ తమ బంధాన్ని రిజిస్టర్ చేసుకుంది. మరో రెండు జంటల అప్లికేషన్లు పరిశీలనలో ఉన్నాయని తెలిసింది. నిబంధనల ప్రకారం UCC అమల్లోకి వచ్చిన నెల రోజుల్లోనే ‘లివిన్ కపుల్స్’ రిజిస్టర్ చేసుకోవాల్సి ఉంటుంది. గడువు దాటితే 6 నెలల వరకు జైలుశిక్ష, రూ.25వేల ఫైన్ లేదా ఆ రెండూ విధించొచ్చు. ఇక మంగళవారం నాటికి 359 పెళ్లిళ్లు నమోదయ్యాయి.

News February 5, 2025

ముగిసిన ఢిల్లీ ఎన్నికల పోలింగ్

image

ఢిల్లీ అసెంబ్లీ ఎన్నికల పోలింగ్ ముగిసింది. సాయంత్రం 5 గంటల వరకు 58 శాతం పోలింగ్ నమోదైనట్లు ఎన్నికల అధికారులు వెల్లడించారు. సాయంత్రం 6 గంటల వరకు క్యూలో ఉన్న వారికి ఓటు వేసే అవకాశం కల్పించనున్నారు. సా.6.30 గంటల తర్వాత ఎగ్జిట్ పోల్స్ వెల్లడి కానున్నాయి.

News February 5, 2025

తండ్రి అయ్యేందుకు 11వేల కి.మీలు ప్రయాణం

image

దక్షిణ చిలీలోని ‘పార్క్ టంటాకో’ అటవీ ప్రాంతాల్లో ఉండే డార్విన్స్ కప్పలకు ప్రాణాంతక కైట్రిడ్ ఫంగస్ సోకినట్లు 2023లో గుర్తించారు. దీంతో ఈ జాతి అంతరించిపోకుండా ఉండేందుకు చేపట్టిన ఎమర్జెన్సీ మిషన్‌లో మగ కప్పలను యూకేకు తరలించారు. దీనికోసం బోటు, విమానం, కారులో ఇలా 11వేల కి.మీలకు పైగా ప్రయాణించాయి. ఎట్టకేలకు ఈ అసాధారణ విధానం ద్వారా యూకేలో 33 పిల్లలు జన్మనిచ్చాయి. ఇవి 2గ్రాముల కంటే తక్కువ బరువుంటాయి.