news

News November 10, 2025

పచ్చిపాలతో ముఖానికి మెరుపు

image

పాలతో ఆరోగ్యంతో పాటు అందాన్ని కూడా రెట్టింపు చేసుకోవచ్చంటున్నారు నిపుణులు. అదెలాగో ఇప్పుడు చూద్దాం..* 2చెంచాల పచ్చిపాలు, చెంచా తేనె కలిపి ఆ పేస్ట్‌ను కాటన్ బాల్స్‌తో ముఖానికి అప్లై చేసి 15 నిమిషాల తర్వాత శుభ్రం చేసుకోవాలి. దీంతో చర్మం మృదువుగా మారుతుంది. * కొద్దిగా పచ్చిపాలు, సగం అరటి పండు వేసి మెత్తగా కలపాలి. ఆ పేస్ట్‌ను ముఖంపై అప్లై చేసి 20నిమిషాల తర్వాత కడిగేసుకుంటే ముఖం మెరుపులీనుతుంది.

News November 10, 2025

రాహుల్ గాంధీకి పనిష్మెంట్.. 10 పుష్ అప్స్

image

మధ్యప్రదేశ్‌లోని పచ్‌మర్హిలో జరిగిన INC సమావేశానికి అగ్రనేత రాహుల్ గాంధీ 20ని.లు ఆలస్యంగా వెళ్లారు. లేటుగా వచ్చిన వాళ్లు పనిష్మెంట్‌ను ఎదుర్కోవాలని ఆ ప్రోగ్రామ్ చీఫ్ సచిన్ రావు సరదాగా చెప్పారు. దీంతో ఆయన సూచన మేరకు రాహుల్ 10 పుష్ అప్స్ తీసిన తర్వాత కుర్చీలో కూర్చున్నారు. దీంతో అక్కడున్నవారు చప్పట్లతో అభినందించారు. కాగా రాహుల్ గతంలోనూ పలు కార్యక్రమాల్లో పుష్ అప్స్ చేసి కార్యకర్తల్లో జోష్ నింపారు.

News November 10, 2025

ఢిల్లీ కాలుష్యంపై జాంటీ రోడ్స్ ఆందోళన

image

ఢిల్లీ వాయు కాలుష్యంపై సౌతాఫ్రికా దిగ్గజ క్రికెటర్ జాంటీ రోడ్స్ ఆందోళన వ్యక్తం చేశారు. ‘ఢిల్లీ మీదుగా రాంచీకి వెళ్లా. ఎప్పటిలానే అక్కడి ఎయిర్ క్వాలిటీ లెవెల్స్ తక్కువగా ఉన్నాయి. దీన్ని జీర్ణించుకోవడం చాలా కష్టం. గోవాలోని చిన్న గ్రామంలో నేను నివసిస్తున్నందుకు సంతోషిస్తున్నా’ అని ట్వీట్ చేశారు. ఇటీవల ఢిల్లీ ఎయిర్ క్వాలిటీ పడిపోయిన విషయం తెలిసిందే. చాలా ప్రాంతాలు ‘వెరీ పూర్’ కేటగిరీలోనే ఉన్నాయి.

News November 10, 2025

హజ్ యాత్రపై సౌదీతో ఒప్పందం.. భారత్ కోటా ఎంతంటే..

image

హజ్ యాత్రకు సంబంధించి భారత్, సౌదీ అరేబియా మధ్య ద్వైపాక్షిక ఒప్పందం కుదిరింది. 2026 సంవత్సరానికి గాను భారత్ కోటా కింద 1,75,025 మంది యాత్రికులకు అనుమతివ్వాలని నిర్ణయించారు. ఈ మేరకు జెడ్డాలో కేంద్ర మంత్రి కిరణ్ రిజిజు, సౌదీ మంత్రి తౌఫిక్ అగ్రిమెంట్‌పై సంతకాలు చేశారు. హజ్ ఏర్పాట్ల గురించి వీరిద్దరూ సమీక్షించారు. కోఆర్డినేషన్, రవాణా మద్దతు, తీర్థయాత్ర సజావుగా సాగడం వంటి అంశాలపై చర్చించారు.

News November 10, 2025

నేటి నుంచి గ్రూప్ -3 పోస్టులకు సర్టిఫికెట్ల వెరిఫికేషన్

image

తెలంగాణలో నేటి నుంచి గ్రూప్-3 పోస్టులకు ఎంపికైన అభ్యర్థుల సర్టిఫికెట్ల వెరిఫికేషన్ చేపట్టనున్నారు. హైదరాబాద్ నాంపల్లిలోని సురవరం ప్రతాపరెడ్డి తెలుగు యూనివర్సిటీలో ఈ నెల 26వరకు నిర్వహించనున్నారు. ఉదయం 10.30 నుంచి సాయంత్రం 5.30గంటల వరకు నిర్వహిస్తారు. అభ్యర్థులు ఒరిజినల్ సర్టిఫికెట్లతో పాటు 2 జిరాక్స్ సెట్లు తీసుకెళ్లాలి.

News November 10, 2025

600 ఉద్యోగాలు.. అప్లైకి ఎల్లుండే లాస్ట్ డేట్

image

రైల్ ఇండియా టెక్నికల్ అండ్ ఎకనామిక్ సర్వీస్ లిమిటెడ్(RITES) 600 సీనియర్ అసిస్టెంట్ కాంట్రాక్ట్ పోస్టుల భర్తీకి దరఖాస్తులు కోరుతోంది. BSc, డిప్లొమా అర్హతతో పాటు పని అనుభవం గలవారు NOV 12వరకు అప్లై చేసుకోవచ్చు. అభ్యర్థుల గరిష్ఠ వయసు 40ఏళ్లు. దరఖాస్తు ఫీజు రూ.300, SC, ST, PwBDలకు రూ.100. వెబ్‌సైట్: www.rites.com/Career. మరిన్ని ఉద్యోగ నోటిఫికేషన్ల కోసం <<-se_10012>>జాబ్స్ <<>>కేటగిరీకి వెళ్లండి.

News November 10, 2025

APEDAలో ఉద్యోగాలు.. అప్లైకి రేపే లాస్ట్ డేట్

image

APEDAలో 11 బిజినెస్ డెవలప్‌మెంట్ మేనేజర్, అసోసియేట్ పోస్టులకు అప్లై చేయడానికి రేపే ఆఖరు తేదీ. పోస్టును బట్టి సంబంధిత విభాగంలో BSc, MSc (అగ్రికల్చర్, హార్టికల్చర్, వెటర్నరీ సైన్స్, ప్లాంటేషన్, ఫుడ్ ప్రాసెసింగ్, ఫారెన్ ట్రేడ్, పబ్లిక్ పాలసీ, ఫుడ్ సైన్స్/ కెమిస్ట్రీ లేదా బయోకెమిస్ట్రీ, మైక్రో బయాలజీ), PGDM, MBAతో పాటు పని అనుభవం ఉండాలి. వెబ్‌సైట్: https://apeda.gov.in/

News November 10, 2025

రూ.5,200 కోట్లతో విశాఖలో లారస్ ల్యాబ్స్

image

AP: ప్రముఖ డ్రగ్ కంపెనీ లారస్ ల్యాబ్స్ విశాఖలో దాదాపు రూ.5,200 కోట్లతో అత్యాధునిక మాన్యుఫాక్చరింగ్ యూనిట్‌ను ఏర్పాటుచేయనుంది. ఇందుకోసం ప్రభుత్వం 532 ఎకరాలను కేటాయించిందని సంస్థ ఫౌండర్ చావా సత్యనారాయణ తెలిపారు. ఔషధ కంపెనీల్లో కీలకమైన ఫర్మంటేషన్ ప్లాంట్‌నూ ఇక్కడే ఏర్పాటుచేస్తామన్నారు. ప్రస్తుతం ఏటా రూ.వెయ్యి కోట్లు ఇన్వెస్ట్ చేస్తామని, అవసరాన్ని బట్టి మరిన్ని పెట్టుబడులు పెడతామని పేర్కొన్నారు.

News November 10, 2025

సాహితీ శిఖరం నేలకొరిగింది: సీఎం రేవంత్

image

TG: అందెశ్రీ మరణంపై CM రేవంత్ దిగ్భ్రాంతి వ్యక్తం చేశారు. సాహితీ శిఖరం నేలకొరిగిందన్నారు. రాష్ట్ర సాధనలో అందెశ్రీ కోట్లాది ప్రజల గొంతుకై నిలిచారని కొనియాడారు. ఆయన రాసిన జయజయహే తెలంగాణను ప్రజా ప్రభుత్వం రాష్ట్ర గీతంగా ప్రకటించిందని గుర్తు చేసుకున్నారు. TPCC చీఫ్ మహేశ్ కుమార్, రాష్ట్ర మంత్రులు కూడా అందెశ్రీ మరణానికి సంతాపం తెలిపారు.

News November 10, 2025

ఐఆర్ 30 శాతం ప్రకటించాలి: PRTU

image

AP: హైస్కూల్ ప్లస్‌లలో లెక్చరర్లుగా అర్హత కలిగిన స్కూల్ అసిస్టెంట్లను నియమించాలని పీఆర్టీయూ డిమాండ్ చేసింది. పీఆర్సీ కమిటీని వెంటనే ఏర్పాటుచేయాలని, మధ్యంతర భృతి(IR) 30 శాతం ప్రకటించాలని కోరింది. అలాగే మోడల్ రెసిడెన్షియల్ స్కూళ్లలో హెడ్ మాస్టర్లకు ప్రత్యేక జాబ్ చార్ట్ ప్రకటించాలని APMPS HMల ఫోరం ప్రభుత్వానికి విజ్ఞప్తి చేసింది. సర్వీసులో ఉన్న టీచర్లకు టెట్ నుంచి మినహాయింపు ఇవ్వాలని కోరింది.