news

News October 31, 2024

క్రికెటర్ ఇంట్లో దొంగతనం

image

ఇంగ్లండ్ క్రికెట్ ఆల్‌రౌండర్ బెన్ స్టోక్స్ ఇంట్లో దొంగతనం జరిగింది. అక్టోబర్ 17న ENG నార్త్ ఈస్ట్‌లోని తన ఇంట్లో‌కి మాస్క్‌లతో వచ్చిన కొందరు జువెలరీ, కొన్ని విలువైన వస్తువులు చోరీ చేశారని స్టోక్స్ వెల్లడించారు. చోరీ సమయంలో తన భార్య, ఇద్దరు పిల్లలు ఇంట్లో ఉన్నారని, అదృష్టం కొద్దీ వాళ్లకు ఏమీ కాలేదని చెప్పుకొచ్చారు. అయినప్పటికీ ఈ ఘటన వాళ్లను మానసికంగా దెబ్బతీసిందని పేర్కొన్నారు.

News October 31, 2024

చెన్నైకి పంత్?

image

IPL: భారత వికెట్ కీపర్ రిషభ్ పంత్ చెన్నై సూపర్ కింగ్స్‌కు వెళ్లే అవకాశం ఉంది. పంత్ కోసం ధోనీ CSK యాజమాన్యంతో సంప్రదింపులు జరుపుతున్నారని తెలిసింది. ఢిల్లీ కెప్టెన్‌గా ఉన్న పంత్‌ను ఆ టీం వదులుకోవాలని నిర్ణయించుకుందని cricbuzz తెలిపింది. అక్షర్ పటేల్, కుల్దీప్ యాదవ్, స్టబ్స్, మెక్‌గుర్క్, పొరెల్‌ను రిటైన్ చేసుకోనున్నట్లు పేర్కొంది.

News October 31, 2024

మ.12.06గంటలకు ‘గేమ్ ఛేంజర్’ టీజర్?

image

మెగాపవర్ స్టార్ రామ్ చరణ్ తేజ్ హీరోగా నటిస్తున్న ‘గేమ్ ఛేంజర్’ నుంచి అప్డేట్ వచ్చింది. దీపావళి కానుకగా ఈరోజు మధ్యాహ్నం 12.06గంటలకు అంటూ యూనిట్ ఓ ట్వీట్ చేసింది. అయితే గతంలో దీపావళి కానుకగా టీజర్ రిలీజ్ చేస్తామని ప్రకటించడంతో ఈరోజు వచ్చేది టీజర్ అని తెలుస్తోంది. డైరెక్టర్ శంకర్ తెరకెక్కిస్తున్న ఈ మూవీలో కియారా అడ్వాణీ హీరోయిన్ నటిస్తుండగా దీనిపై భారీ అంచనాలు నెలకొన్నాయి.

News October 31, 2024

నీతి, నిజాయితీగా పనిచేస్తా: టీటీడీ ఛైర్మన్

image

AP: గత ప్రభుత్వం తిరుమలలో అరాచకాలు సృష్టించిందని టీటీడీ నూతన ఛైర్మన్ బీఆర్ నాయుడు ఆరోపించారు. తాను నీతి, నిజాయితీతో పనిచేస్తానని చెప్పారు. ‘గతంలో రెగ్యులర్‌గా తిరుమల వెళ్లేవాడిని. కానీ గత ఐదేళ్లుగా ఒక్కసారి కూడా వెళ్లలేదు. తిరుమల ఆలయ పవిత్రతను వైసీపీ దెబ్బతీయడంతోనే నేను కొండకు వెళ్లలేదు. శ్రీవాణి ట్రస్టును రద్దు చేయాలనే ఆలోచన ఉంది. చంద్రబాబు సలహాలు, సూచనలతో ముందుకెళ్తా’ అని ఆయన పేర్కొన్నారు.

News October 31, 2024

ఈ స్వీట్ కేజీ ధర రూ.56,000

image

లక్నోలోని ‘ఛప్పన్ భోగ్’ షాపులో అమ్మే ‘ఎక్సోటికా’ స్వీట్ ఇండియాలోనే ఖరీదైన మిఠాయిగా గుర్తింపు పొందింది. కేజీ ధర రూ.56,000. అఫ్గాన్ నుంచి పిస్తా, తుర్కియే నుంచి హాజెల్ నట్స్, ఇరాన్ నుంచి మమ్రా బాదం, అమెరికా నుంచి బ్లూబెర్రీస్, సౌతాఫ్రికా నుంచి మకాడమియా గింజలను దిగుమతి చేసుకుంటారు. కొన్ని గ్రాముల బంగారాన్ని సైతం మిక్స్ చేసి స్వీట్ తయారు చేస్తారు. కేజీ బాక్సులో 10 గ్రా. బరువున్న 100 ముక్కలు ఉంటాయి.

News October 31, 2024

విమానాలకు బాంబు బెదిరింపులు.. భారత్ కీలక నిర్ణయం

image

విమానాలకు వరుస బాంబు బెదిరింపులపై భారత్ ఎఫ్‌బీఐ, ఇంటర్ పోల్ సాయాన్ని కోరింది. ఖలిస్థానీలకు వీటితో సంబంధం ఉందేమోనన్న కోణంలోనూ దర్యాప్తు చేపట్టాలని ఎఫ్‌బీఐని అభ్యర్థించింది. కాగా ఇప్పటివరకు దేశవ్యాప్తంగా 410కిపైగా విమానాలకు బాంబు బెదిరింపులు వచ్చాయి. ఢిల్లీ, ముంబై, కోల్‌కతా, చెన్నై, హైదరాబాద్, బెంగళూరు తదితర ఎయిర్‌పోర్టులకు బెదిరింపులు వచ్చినట్లు తెలుస్తోంది.

News October 31, 2024

STOCK MARKETS: పండగ రోజూ…

image

దేశీయ స్టాక్ మార్కెట్లు నష్టాల్లో ట్రేడవుతున్నాయి. గ్లోబల్ మార్కెట్ల నుంచి నెగటివ్ సిగ్నల్సే అందాయి. బీఎస్ఈ సెన్సెక్స్ 79,739 (-202), ఎన్ఎస్ఈ నిఫ్టీ 24,292 (-48) వద్ద చలిస్తున్నాయి. IT, AUTO, FMCG షేర్లపై సెల్లింగ్ ప్రెజర్ నెలకొంది. ఫార్మా, మీడియా, హెల్త్‌కేర్ షేర్లు జోరు ప్రదర్శిస్తున్నాయి. TECHM, HCL TECH, TCS, INFY, WIPRO టాప్ లూజర్స్. సిప్లా, LT, ONGC, పవర్‌గ్రిడ్, హీరోమోటో టాప్ గెయినర్స్.

News October 31, 2024

రాష్ట్రాల్లో స్పెషల్ పిండి వంటలు!

image

దీపావళి అంటే కేవలం దీపాలు వెలిగించి టపాసులు పేల్చడమే కాదు. పిండి వంటలకూ ప్రత్యేకమే. పండుగ సందర్భంగా దేశంలోని వివిధ రాష్ట్రాల్లో వెరైటీ పిండి వంటలు, స్వీట్లు చేస్తుంటారు. అవేంటో తెలుసుకుందాం. TGలో అరిసెలు, APలో తీపి గవ్వలు, కర్ణాటకలో హొలిగె, తమిళనాడులో ఒక్కరాయ్ &దీపావళి మరుందు, ఒడిశాలో కాకరపిత్త& రసబలి, రాజస్థాన్లో మావ కచోరీ చేస్తుంటారు.

News October 31, 2024

లక్ష్మీ పూజ ఎప్పుడు చేయాలంటే?

image

దీపావళి సందర్భంగా ఇళ్లలో, షాపుల్లో లక్ష్మీ పూజలు చేస్తుంటారు. అయితే, పూజ చేసేందుకు సరైన సమయాన్ని పురోహితులు సూచించారు. వేద పంచాంగం ప్రకారం ప్రదోషకాలం ఈరోజు సాయంత్రం 5:36 నుంచి 8:11 వరకు, శుభ ముహూర్తం సాయంత్రం 5:31 నుంచి 9:55 గంటల వరకు ఉందన్నారు. ఈ నేపథ్యంలో సాయంత్రం 5:31-9:55 గంటల మధ్య లక్ష్మీపూజ చేయడం శుభప్రదమని వెల్లడించారు.

News October 31, 2024

TTD బోర్డులో జనసేన కోటా నుంచి ముగ్గురికి చోటు

image

జనసేన కోటాలో టీటీడీ పాలకమండలిలో ముగ్గురికి అవకాశం లభించింది. తెలంగాణకు చెందిన బొంగునూరి మహేందర్ రెడ్డి, పార్టీ వ్యవస్థాపక సభ్యురాలు అనుగోలు రంగశ్రీ, పవన్ కళ్యాణ్ సన్నిహితుడు ఆనంద్ సాయికి చోటు కల్పించారు. మహేందర్ రెడ్డి 2009 నుంచి యువరాజ్యంలో చురుగ్గా పని చేశారు. శ్రీకాకుళం జిల్లాకు చెందిన ఆనంద్ సాయి యాదాద్రి ఆలయ పునర్నిర్మాణంలో ఆర్కిటెక్ట్‌గా పని చేశారు.