news

News August 21, 2024

రియాక్టర్ పేలుడు.. ఐదుగురు మృతి

image

AP: అనకాపల్లిలోని అచ్యుతాపురం ఫార్మా కంపెనీలో రియాక్టర్ పేలిన <<13908795>>ఘటనలో<<>> మృతుల సంఖ్య ఐదుకు చేరింది. కొంతమంది పరిస్థితి విషమంగా ఉండటంతో మరణాల సంఖ్య మరింత పెరిగే అవకాశం ఉంది. పేలుడు ధాటికి భారీగా మంటలు చెలరేగడంతో పలువురు కార్మికులు చిక్కుకుపోయారు. 8 అగ్నిమాపక యంత్రాలతో సిబ్బంది మంటలను అదుపులోకి తీసుకువచ్చేందుకు ప్రయత్నిస్తున్నారు. ప్రమాద సమయంలో విధుల్లో ఉన్న వారి వివరాలను యాజమాన్యం సేకరిస్తోంది.

News August 21, 2024

DANGER: రోజూ మద్యం తాగుతున్నారా?

image

కొందరు క్రమం తప్పకుండా మద్యం తాగి తూగుతుంటారు. అయితే, 60 ఏళ్ల తర్వాత రోజూ ఆల్కహాల్ సేవిస్తే త్వరగా చనిపోతారని జామా నెట్‌వర్క్ సర్వేలో వెల్లడైంది. 1,35,103 మందిపై సర్వే నిర్వహించగా డైలీ డ్రింకింగ్ 33% అకాల మరణాన్ని పెంచుతుందని, క్యాన్సర్‌తో చనిపోయే ప్రమాదం 39% పెరిగిందని తేలింది. అప్పుడప్పుడు తాగితే అకాల మరణం పొందేందుకు 10% ఛాన్స్ ఉంది. అందుకే మద్యానికి దూరంగా ఉండండి, ఎక్కువకాలం జీవించండి. SHARE IT

News August 21, 2024

రూ.2లక్షల పైనున్న వాళ్లకు అప్పుడే రుణమాఫీ: మంత్రి

image

TG: రాష్ట్రంలో 41,78,892 మంది రైతులు రుణాలు తీసుకున్నట్లు బ్యాంకులు నివేదిక ఇచ్చాయని మంత్రి తుమ్మల తెలిపారు. అధికారులు రుణమాఫీ కాని కుటుంబాల ఇళ్లకు వెళ్లి నిర్ధారించి జాబితా రూపొందిస్తారని వెల్లడించారు. అనంతరం వారికీ మాఫీ చేస్తామన్నారు. రూ.2లక్షలు కంటే ఎక్కువున్న వాళ్లు పైమొత్తాన్ని చెల్లిస్తే రూ.2లక్షలు మాఫీ అవుతుందన్నారు. తెల్ల రేషన్ కార్డు లేకున్నా మాఫీ చేస్తున్నామని స్పష్టం చేశారు.

News August 21, 2024

వారికి మాత్రమే రుణమాఫీ ఆగింది: తుమ్మల

image

TG: ఇప్పటివరకు 22 లక్షల మంది రైతుల ఖాతాల్లో రుణమాఫీ డబ్బులు జమ చేశామని వ్యవసాయ శాఖ మంత్రి తుమ్మల నాగేశ్వరరావు తెలిపారు. ఆధార్, బ్యాంక్ ఖాతాల్లో తప్పులున్న వారికి మాత్రమే రుణమాఫీ ఆగిందన్నారు. దీనికి సంబంధించి రైతులు వ్యవసాయాధికారులకు దరఖాస్తు చేసుకోవాలని సూచించారు. వాటిని సరిదిద్ది మాఫీ చేయాలని అధికారులను ఆదేశించినట్లు మంత్రి వెల్లడించారు.

News August 21, 2024

వైద్యుల ఆందోళనను జవాన్లతో ముడిపెట్టిన TMC

image

వైద్యురాలిపై హత్యాచారానికి నిరసగా ఆందోళన చేస్తున్న వైద్యవర్గాలను ఎలా సముదాయించాలో TMCకి అర్థమవ్వడం లేదు. అందుకే జవాన్లతో పోలిక పెట్టింది. ‘సమ్మెను ఆపాలని కోరుతున్నాం. మీకో ప్రశ్న. పుల్వామా ఘటనలో అసలు న్యాయమే జరగలేదు. అలాగని జవాన్లు సరిహద్దుల్ని వదిలేసి వీ వాంట్ జస్టిస్ అంటూ నిరసనకు దిగితే ఎలా ఉంటుందో చెప్పండి’ అని TMC నేత కునాల్ ఘోష్ అన్నారు. ఆర్జీకర్ ఘటనపై పార్టీ వైఖరేంటో ఆయనే వివరిస్తున్నారు.

News August 21, 2024

కొత్త పార్టీని ఏర్పాటు చేస్తా: చంపై సోరెన్

image

బీజేపీలో చేరుతారనే ప్రచారం నేపథ్యంలో ఝార్ఖండ్ మాజీ సీఎం చంపై సోరెన్ కొత్త పార్టీని ఏర్పాటు చేయనున్నట్లు ప్రకటించారు. తన ముందు మూడు ఆప్షన్లు ఉన్నాయని చెప్పారు. అయితే తాను ఇప్పుడే రిటైర్ కాబోనని తెలిపారు. కొత్త పార్టీని ఏర్పాటు చేసి బలోపేతం చేస్తానని, అవసరమైతే కూటమికి సిద్ధమని పేర్కొన్నారు. హేమంత్ సోరెన్ తిరిగి బాధ్యతలు స్వీకరించడంతో చంపైకి JMMలో ప్రాధాన్యత తగ్గిందని సన్నిహిత వర్గాలు తెలిపాయి.

News August 21, 2024

వైసీపీ సీసీ కెమెరా బిల్లులు కూడా చెల్లించలేదు: హోంమంత్రి అనిత

image

AP: వైసీపీ ప్రభుత్వం సీసీ కెమెరాల బిల్లులు కూడా చెల్లించలేదని హోంమంత్రి అనిత విమర్శించారు. హోంశాఖపై సీఎం సమీక్ష అనంతరం ఆమె మీడియాతో మాట్లాడారు. వైసీపీ నేతలు మహిళల భద్రత గురించి మాట్లాడటం హాస్యాస్పదమని అన్నారు. గతంలో 15వేల సీసీ కెమెరాలు ఉంటే కొన్ని పనిచేయట్లేదని చెప్పారు. రద్దీగా ఉండే ప్రాంతాలు, నేరాలు జరిగేందుకు అవకాశం ఉన్న ప్రాంతాల్లో సీసీ కెమెరాల ఏర్పాటు చేయాలని నిర్ణయించినట్లు పేర్కొన్నారు.

News August 21, 2024

ఇకపై ‘BJP నేత కేటీఆర్’ అనాలి: కోమటిరెడ్డి

image

TG: BRS వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్‌ను ఇకపై ‘BJP నేత కేటీఆర్’ అనాలని మంత్రి కోమటిరెడ్డి వెంకటరెడ్డి అన్నారు. కుటుంబం కోసం బీఆర్ఎస్ పార్టీ బీజేపీలో విలీనం అవుతోందని అని ఆయన ఆరోపించారు. తాను కేటీఆర్ ఫామ్ హౌస్‌లోకి వెళ్లి చూశానని, అది 25 ఎకరాలు ఉందని మంత్రి అన్నారు. సీఎం రేవంత్‌కు కూడా ఫామ్ హౌస్ ఉందని విమర్శిస్తున్నవారు, ఆ ఫామ్ హౌస్ ఎక్కడుందో చూపించాలని ఆయన డిమాండ్ చేశారు.

News August 21, 2024

రేపు రాత్రి ఢిల్లీకి CM రేవంత్

image

TG: ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి రేపు రాత్రి ఢిల్లీకి వెళ్లనున్నారు. అక్కడ ఏఐసీసీ పెద్దలతో సమావేశం కానున్నారు. తెలంగాణ కాంగ్రెస్ చీఫ్ ఎన్నికతో పాటు మంత్రివర్గ విస్తరణ గురించి చర్చించే అవకాశం ఉంది. టీపీసీసీ చీఫ్‌గా ఉన్న రేవంత్ సీఎం కావడంతో ఆ స్థానంలో మరో వ్యక్తిని నియమించేందుకు పార్టీ అధిష్ఠానం కసరత్తులు చేస్తోంది.

News August 21, 2024

విద్యార్థులకు శుభవార్త.. నెలకు రూ.1000 స్కాలర్‌షిప్

image

ఏపీ, TGలోని ప్రభుత్వ, అనుబంధ స్కూళ్లలో చదువుతున్న 8వ క్లాస్ విద్యార్థులు NMMS స్కాలర్‌షిప్‌కు అర్హులు. ప్రైవేట్, కేంద్రీయ, నవోదయ, గురుకులాలు, వసతితో కూడిన స్కూళ్లలో చదివేవారు అనర్హులు. పేరెంట్స్ వార్షికాదాయం ₹3.5లక్షలకు మించకూడదు. 7వ క్లాస్‌లో 55% మార్కులు సాధించి ఉండాలి. ఎంపికైతే 9వ తరగతి నుంచి ఇంటర్ సెకండియర్ వరకు నెలకు ₹వెయ్యి ఇస్తారు. APలో SEP 6 వరకు, <>TGలో<<>> NOV 9 వరకు దరఖాస్తు చేసుకోవచ్చు.

error: Content is protected !!