news

News August 21, 2024

మూడో ర్యాంకుకు చేరుకున్న మంధాన

image

మహిళల వన్డే ర్యాంకింగ్స్‌లో టీమ్ ఇండియా స్టార్ బ్యాటర్ స్మృతి మంధాన ఒక ప్లేస్ ఎగబాకి 3వ స్థానానికి చేరుకున్నారు. టీ20 ర్యాంకుల్లో 4వస్థానంలో ఉన్నారు. ఇక కెప్టెన్ హర్మన్ ప్రీత్ వన్డేల్లో 9వ స్థానంలో ఉన్నారు. వన్డే బౌలింగ్‌ ర్యాంకుల్లో భారత్ నుంచి దీప్తి శర్మ(3) మాత్రమే టాప్ 10లో ఉన్నారు. టీ20 బౌలింగ్‌ విషయంలోనూ దీప్తి 3వ స్థానంలో ఉండగా రేణుకా సింగ్ 5వ ర్యాంకులో ఉన్నారు.

News August 21, 2024

‘ప్రైవేట్’లో EWS కోటా అమలు చేయట్లేదు: NTR వర్సిటీ

image

AP: ప్రైవేట్ మెడికల్ కాలేజీల్లో కన్వీనర్ కోటా కింద ఓపెన్ కేటగిరీలో భర్తీ చేసే 50 శాతం సీట్లలో EWS కోటా(10శాతం సీట్లు) అమలు చేయడం లేదని NTR హెల్త్ యూనివర్సిటీ తెలిపింది. దీనిపై ప్రభుత్వం తెచ్చిన జీవో 94ని సవాల్ చేస్తూ కొందరు విద్యార్థులు హైకోర్టుని ఆశ్రయించగా ఆ జీవోను ధర్మాసనం సస్పెండ్ చేసిందని వర్సిటీ లాయర్ హైకోర్టుకు తెలిపారు. దీనిపై కౌంటర్ దాఖలు చేయాలని NMC, ప్రభుత్వాన్ని ధర్మాసనం ఆదేశించింది.

News August 21, 2024

డీఎస్సీపై 28వేలకు పైగా అభ్యంతరాలు.. ఈ నెలాఖరుకల్లా ఫలితాలు!

image

TG: డీఎస్సీ ఆన్‌లైన్ పరీక్షలపై ఈ నెల 13 నుంచి 20 మధ్యలో 28 వేలకు పైగా అభ్యంతరాలు వచ్చాయని పాఠశాల విద్యాశాఖ వర్గాలు తెలిపాయి. ఒక్కో ప్రశ్నపై వేలాదిమంది అభ్యంతరం చెప్పడం వల్లే మొత్తం సంఖ్య ఆ స్థాయికి చేరిందని వివరించాయి. ఫలితాలను ఈ నెలాఖరుకల్లా విడుదల చేసే అవకాశం ఉందని పేర్కొన్నాయి.

News August 21, 2024

Be Alert: పెరుగుతున్న జ్వరాలు

image

TG: వైరల్ ఫీవర్స్ రాష్ట్రాన్ని వణికిస్తున్నాయి. వర్షాల కారణంగా దోమలు పెరిగి వైరల్ ఇన్ఫెక్షన్స్ ఎక్కువవుతున్నాయి. డెంగ్యూ, మలేరియా రోగులతో ప్రభుత్వాసుపత్రులు కిటకిటలాడుతున్నాయి. హైదరాబాద్, సూర్యాపేట, రంగారెడ్డి, మేడ్చల్, ఖమ్మం, నల్గొండ జిల్లాల్లో డెంగ్యూ కేసులు అధికంగా ఉన్నాయని అధికారులు చెబుతున్నారు. ఈ ఏడాది 4395 డెంగ్యూ కేసులు నమోదు కాగా వాటిలో మూడోవంతు హైదరాబాద్‌లోనే ఉండటం గమనార్హం.

News August 21, 2024

రాఖీ రోజున బ్లింకిట్ రికార్డ్ అమ్మకాలు

image

ఈ ఏడాది రాఖీ పండుగ రోజున రికార్డు స్థాయిలో నిమిషానికి 693 రాఖీలను విక్రయించినట్లు ఈ-కామర్స్ వేదిక బ్లింకిట్ ప్రకటించింది. భారత్ మాత్రమే కాక అమెరికా, కెనడా, జర్మనీ వంటి పలు దేశాల్లో తమ సంస్థ పనిచేస్తోందని, అక్కడ కూడా భారీగా ఆర్డర్లు స్వీకరించిందని బ్లింకిట్ సీఈఓ అల్బీందర్ దిండ్సా తెలిపారు. ఇక స్విగ్గీ కూడా తమ ఇన్‌స్టామార్ట్‌లో గత ఏడాదితో పోలిస్తే 5రెట్లు అధికంగా అమ్మకాలు జరిగాయని పేర్కొంది.

News August 21, 2024

కోపంతో రగిలిపోతున్నాను: రితేశ్ దేశ్‌ముఖ్

image

థానేలో ఇద్దరు చిన్నారులపై స్కూల్ పారిశుధ్య సిబ్బంది ఒకరు లైంగిక దాడి చేసిన ఘటనపై బాలీవుడ్ నటుడు రితేశ్ దేశ్‌ముఖ్ తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేశారు. కోపంతో రగిలిపోతున్నానని ట్వీట్‌లో పేర్కొన్నారు. ‘ఒక తండ్రిగా షాక్‌కు గురయ్యాను. ఇళ్ల తరహాలోనే పిల్లలకు స్కూల్ భద్రంగా ఉండాల్సిన చోటు. ఆ దుర్మార్గుడికి అత్యంత కఠిన శిక్ష విధించాలి. ఇలాంటి వాళ్లకి ఛత్రపతి శివాజీ వేసిన శిక్షలు మళ్లీ రావాలి’ అని పేర్కొన్నారు.

News August 21, 2024

దొంగలకూ ఓ స్కూల్.. రూ.లక్షల ఫీజు!

image

పిల్లల్ని బుద్ధిగా తీర్చిదిద్దేందుకు విద్యాసంస్థలు క‌ృషి చేస్తుంటాయి. కానీ చోర కళకు కూడా స్కూల్స్ ఉన్నాయంటే నమ్ముతారా? మధ్యప్రదేశ్‌లోని రాజ్‌గఢ్ జిల్లాలో మూడు ఊళ్లలో దొంగతనం నేర్పించే స్కూల్స్ ఉన్నాయి. అక్కడ చేరాలంటే సుమారు రూ.3 లక్షల వరకు ఫీజు చెల్లించాల్సిందే. నేరాలెలా చేయాలి, దొరికితే దెబ్బల్ని ఎలా తట్టుకోవాలన్నదే ఇక్కడి కోర్సు. దేశవ్యాప్తంగా అనేక నేరాల్లో నిందితులు ఈ స్కూళ్ల విద్యార్థులే!

News August 21, 2024

వారిది వృద్ధాప్యం.. కొంచెం జాలి చూపిద్దాం

image

తమ కోసమే బతుకును ధారపోసిన తల్లిదండ్రుల్ని వృద్ధాప్యంలోకి వచ్చేసరికి భారంగా భావిస్తున్నారు వారసులు. ఆస్తులు కావాలి కానీ వారి బాధ్యత మాత్రం వద్దన్నట్లుగా వ్యవహరిస్తున్నారు. వృద్ధాప్య గృహాలకు తరలించడం, నడిరోడ్డుపై వదిలేయడం వంటివి చేస్తున్నారు. నాలుగు మెతుకులు, తలదాచుకునే నీడ, ఒంట్లో ఎలా ఉంది అన్న ప్రేమపూరిత స్పర్శ.. ఇవేగా ఆ పండుటాకులు కోరుకునేది. అది కూడా చేయలేమా! నేడు వృద్ధుల దినోత్సవం.

News August 21, 2024

ఈ ప్రయాణం పట్ల చాలా కృతజ్ఞతగా ఉన్నా: మను

image

ఒలింపిక్ మెడల్స్‌తో దేశవ్యాప్తంగా స్టార్‌ అయ్యారు షూటర్ మనూ భాకర్. స్కూల్లో చదువుకునే రోజుల్లో సాధన చేస్తున్న ఫొటోను, ఒలింపిక్స్‌లో పతకం గెలుచుకున్న ఫొటోను పోలుస్తూ తాజాగా ట్విటర్‌లో పోస్ట్ పెట్టారు. ‘ఎలా మొదలైంది వెర్సస్ ఎలా కొనసాగుతోంది. ఈ ప్రయాణం పట్ల చాలా కృతజ్ఞతగా ఉన్నాను’ అని పేర్కొన్నారు. ఒలింపిక్స్‌లో షూటింగ్‌లో మెడల్ గెలిచిన తొలి మహిళగా ఆమె చరిత్ర సృష్టించిన సంగతి తెలిసిందే.

News August 21, 2024

పిడుగు పాటు నుంచి తప్పించుకోండిలా..

image

వర్షాకాలంలో పిడుగుపాటుకు ఎంతోమంది బలవుతున్నారు. ఈ నేపథ్యంలో పిడుగుల్ని తప్పించుకునేందుకు కొన్ని వాతావరణ నిపుణులు కొన్ని సూచనలు చేస్తున్నారు. ‘పిడుగులు ఎక్కువగా చెట్లు, ఎత్తైన ప్రాంతాలపై పడుతుంటాయి. ఉరుముతున్న సమయంలో బయటికి రాకుండా ఉండటం మేలు. వచ్చినా చెట్లు, టవర్లు, విద్యుత్ పరికరాలు, ఉత్పత్తులకు దూరంగా ఉండాలి. ఫోన్ మాట్లాడకూడదు. ఇంట్లోనూ ఎలక్ట్రానిక్ పరికరాలను ఆపేయడం మంచిది’ అని సూచిస్తున్నారు.

error: Content is protected !!