India's largestHyperlocal short
news App
Get daily news updates that are tailored for you based on your preferred language & location.
IPL: ముంబై చేతిలో ఓటమితో బాధలో ఉన్న ఢిల్లీ కెప్టెన్ అక్షర్ పటేల్‌కు మరో షాక్ తగిలింది. స్లో ఓవర్ రేట్ కారణంగా BCCI రూ.12 లక్షల ఫైన్ విధించింది. ఈ సీజన్‌లో జరిమానా పడిన ఆరో కెప్టెన్‌గా నిలిచారు. ఈ జాబితాలో పరాగ్, శాంసన్(RR), పాండ్య(MI), పంత్(LSG), పాటీదార్(RCB) ఉన్నారు. కాగా 3సార్లు స్లో ఓవర్ రేట్ మెయింటేన్ చేస్తే కెప్టెన్‌పై ఓ మ్యాచ్ బ్యాన్ విధించే నిబంధనను బీసీసీఐ తొలగించిన విషయం తెలిసిందే.
PNBకి రూ.13వేల కోట్లు ఎగ్గొట్టి పారిపోయిన మెహుల్ ఛోక్సీని బెల్జియం అధికారులు <<16091808>>అరెస్ట్<<>> చేసిన విషయం తెలిసిందే. దీంతో అతడిని తమకు అప్పగించాలని భారత్ లేఖ రాసిందని అక్కడి ప్రభుత్వం నిర్ధారించింది. దీనిపై త్వరలోనే నిర్ణయం తీసుకుంటామని, ప్రస్తుతం ఛోక్సీపై న్యాయపరమైన చర్యలకు సిద్ధమవుతున్నట్లు పేర్కొంది. కాగా గతంలో అతడి కోసం జారీ చేసిన ఇంటర్‌పోల్ రెడ్ నోటీసులు డిలీట్ కాగా ఈడీ, సీబీఐ మాత్రం వేట ఆపలేదు.
TG: వివాదాస్పదమైన కంచ గచ్చిబౌలి భూముల వ్యవహారంపై సుప్రీంకోర్టులో రాష్ట్ర ప్రభుత్వం అఫిడవిట్ దాఖలు చేసింది. దీనిపై ఈనెల 16న విచారణ జరగనుంది. ఆ భూములు HCU పరిధిలోనివంటూ ఇటీవల పెద్దఎత్తున ఆందోళనలు జరిగాయి. దీన్ని సుమోటోగా స్వీకరించిన SC తదుపరి ఆదేశాలు ఇచ్చేవరకు ఆ ప్రాంతంలో చెట్లను కొట్టొద్దని CSను ఆదేశించింది. ఈనేపథ్యంలో భూములు ప్రభుత్వానివేనంటూ సర్కార్ అఫిడవిట్ ఫైల్ చేసినట్లు తెలుస్తోంది.
భారత కుబేరులకు ఈ ఏడాది కలిసిరావట్లేదు. 2025లో ఇప్పటివరకు అంబానీ, అదానీ, నాడార్ తదితర సంపన్నులు మొత్తంగా రూ.2.63లక్షల కోట్ల సంపద కోల్పోయారు. ట్రంప్ టారిఫ్స్ ఎఫెక్ట్‌తో ఈక్విటీ మార్కెట్ల నుంచి ఫారిన్ ఇన్వెస్టర్లు తప్పుకోవడం, ప్రపంచ దేశాల మధ్య ట్రేడ్ వార్ తదితర అంశాలు తీవ్ర ప్రభావం చూపాయి. అత్యధికంగా శివ్ నాడార్ రూ.90 వేల కోట్లు, ఆ తర్వాత అదానీ రూ.55 వేల కోట్లు, అంబానీ రూ.30 వేల కోట్లు నష్టపోయారు.
గవర్నర్లు పంపే బిల్లులపై 3 నెలల్లోగా నిర్ణయం తీసుకోవాలంటూ రాష్ట్రపతికి సుప్రీంకోర్టు విధించిన గడువు <<16073336>>తీర్పుపై<<>> కేంద్రం రివ్యూకు వెళ్లనున్నట్లు తెలుస్తోంది. ఇందుకు సంబంధించి పిటిషన్ వేయనున్నట్లు జాతీయ మీడియా పేర్కొంది. SC తీర్పు రాష్ట్రపతి నిర్ణయాధికారాన్ని తొలగించేలా ఉందని కేంద్రం భావిస్తోంది. ఈ విషయమై ప్రెసిడెంట్‌తో చర్చిస్తామని AG వెంకటరమణి తెలిపారు. పిటిషన్ దాఖలుపై మాత్రం ఆయన క్లారిటీ ఇవ్వలేదు.
ఉగ్రవాది తహవూర్ రాణా వాయిస్ నమూనాలను ఎన్ఐఏ సేకరిస్తున్నట్లు సమాచారం. ముంబైలో ఉగ్రదాడులకు కుట్ర పన్నేందుకు డేవిడ్ హెడ్లేతో రాణా మాట్లాడిన కాల్ రికార్డింగ్స్ భారత నిఘా వర్గాల వద్ద ఉన్నాయి. వాటిలో ఉన్నది రాణా గొంతే అని ధ్రువీకరించేందుకు వాయిస్ నమూనాలను సేకరిస్తున్నట్లు తెలుస్తోంది. అతడే అని ధ్రువీకరించిన అనంతరం భారత్ నుంచి ఆ దుశ్చర్యకు సహకరించిన మరింతమంది వివరాల్ని రాబట్టే అవకాశం ఉంది.
నిండు చూలాలైన భార్యను హత్య చేశాడో కిరాతక భర్త. వైజాగ్‌లోని పీఎంపాలెం పీఎస్ పరిధిలో ఉంటున్న జ్ఞానేశ్వర్, అనూషది ప్రేమపెళ్లి. గత కొన్ని రోజులుగా వారి మధ్య మనస్పర్థలు నెలకొన్నాయి. నెలలు నిండిన భార్యను జ్ఞానేశ్వర్ ఈరోజు దారుణంగా గొంతునులిమి హత్య చేశాడు. ఆమెకు ఒంట్లో బాలేదని కుటుంబీకులకు చెప్పాడు. వారు ఆస్పత్రికి తరలించేసరికే అనూష మృతిచెందింది. జ్ఞానేశ్వర్ నేరాన్ని అంగీకరించినట్లు పోలీసులు తెలిపారు.
TG: గ్రూప్-1 పరీక్షల్లో పెద్ద కుంభకోణం జరిగిందని, CBI విచారణ జరపాలని BRS MLA కౌశిక్ రెడ్డి డిమాండ్ చేశారు. ప్రిలిమ్స్, మెయిన్స్‌కు వేర్వేరు హాల్‌టికెట్లు ఎందుకిచ్చారని ప్రభుత్వాన్ని ప్రశ్నించారు. కోఠి కాలేజీ 18, 19 సెంటర్లలో 1490 మంది రాస్తే 74 మంది ఎలా ఎంపికయ్యారని నిలదీశారు. 654 మందికి ఒకే మార్కులు ఎలా వస్తాయని, కాంగ్రెస్ నేత రాములు నాయక్ కోడలికి ST కేటగిరీలో నం.1 ర్యాంక్ వచ్చిందని ఆయన చెప్పారు.
కాంపా కోలా డ్రింక్ ప్రస్తుతం మార్కెట్‌లో దూసుకుపోతుంది. 18 నెలల్లోనే దీని ద్వారా రూ.1000కోట్ల రెవెన్యూ వచ్చింది. 200ML ధర కేవలం రూ.10 ఉండటం, రిలయన్స్ బ్రాండ్ కావడంతో కస్టమర్లు ఆసక్తి చూపుతున్నారు. ఇప్పటికే మార్కెట్లో 10శాతం అమ్మకాలను ఈ డ్రింక్ ఆక్రమించిందని మార్కెట్ వర్గాలు చెబుతున్నాయి. 1970-80లో ఫేమస్ అయిన కాంపా కోలాను రిలయన్స్ రిటైల్ కొనుగోలు చేసి 2023లో అమ్మకాలు ప్రారంభించింది.
కాంగ్రెస్ పార్టీ ఆదేశిస్తే, తన కుటుంబ సభ్యుల ఆశీర్వాదంతో తప్పకుండా రాజకీయాల్లోకి వస్తానని రాబర్ట్ వాద్రా అన్నారు. ప్రియాంకా గాంధీ భర్త అయినందునే ఇంతకాలం రాజకీయ చర్చల్లో తనపై విమర్శలు చేసేవారన్నారు. రాహుల్, ప్రియాంకలను చూసి ఎంతో నేర్చుకోవచ్చన్నారు. దేశంలో సెక్యులరిజం ప్రమాదంలో పడుతున్న ప్రస్తుత తరుణంలో, పార్లమెంట్‌లో పోరాడటానికి మరిన్ని గొంతుకలు కావాలని రాబర్ట్ వాద్రా అభిప్రాయపడ్డారు.
Sorry, no posts matched your criteria.