India's largestHyperlocal short
news App
Get daily news updates that are tailored for you based on your preferred language & location.
దేశీయ స్టాక్ మార్కెట్లు సోమవారం ఫ్లాట్‌గా ముగిశాయి. సెన్సెక్స్ రోజంతా 80,333 వద్ద సపోర్ట్ తీసుకుంటూ 80,558 మధ్య 12 పాయింట్ల కోల్పోయింది. చివరకు 80,424 వద్ద ఫ్లాట్‌గా ముగిసింది. నిఫ్టీ ఉదయం 56 పాయింట్ల గ్యాప్ అప్‌తో ప్రారంభం కాగా 24,523 వద్ద సపోర్ట్ తీసుకుంటూ 24,600 మధ్య రేంజ్‌బౌండ్ అయ్యింది. చివరికి 38 పాయింట్ల లాభంతో 24,579 వద్ద స్థిరపడింది.
రిటైల్ కంపెనీలు ఉద్యోగుల సంఖ్యను తగ్గించుకుంటున్నాయి. FY24లో 12 లైఫ్‌స్టైల్, గ్రాసరీ, క్విక్‌సర్వీస్ రెస్టారెంట్లు దాదాపుగా 26వేల మందిని తొలగించాయి. రిలయన్స్, టైటాన్, పేజ్, రేమండ్, స్పెన్సర్ మొత్తం వర్క్‌ఫోర్స్ FY23లో 455000 ఉండగా FY24లో 429000కు తగ్గింది. కస్టమర్లు ఫ్యాషన్ దుస్తులు, ఎలక్ట్రానిక్స్, ఇతర ఉత్పత్తుల కొనుగోళ్లను తగ్గించడంతో కంపెనీలు ఈ నిర్ణయం తీసుకున్నాయని ఇండస్ట్రీ వర్గాల సమాచారం.
TG: సాంకేతిక కారణాలతో కొంతమంది రైతులకు రుణమాఫీ జరగలేదని మంత్రి ఉత్తమ్ కుమార్ రెడ్డి తెలిపారు. ఆ సమస్యలు పరిష్కరించాలని మండల వ్యవసాయాధికారులకు ఇప్పటికే ఆదేశాలు జారీ చేశామన్నారు. ఆ తర్వాత రుణమాఫీ చేస్తామని స్పష్టం చేశారు. ఇక ప్రభుత్వంపై ఆర్థికభారం ఉన్నా రుణాలు మాఫీ చేశామని మంత్రి జూపల్లి వెల్లడించారు. పథకంపై బీఆర్ఎస్ తప్పుడు ప్రచారం చేస్తోందని HYDలో నిర్వహించిన ప్రెస్‌మీట్‌లో మండిపడ్డారు.
జావెలిన్ త్రోలో 92.97 మీటర్లతో పాకిస్థానీ నదీమ్ స్వర్ణం సాధించారు. అతడి రికార్డును బద్దలు కొట్టేందుకు నీరజ్ శక్తివంచన లేకుండా శ్రమించాడని 3సార్లు పారాలింపిక్స్ విజేత దేవేంద్ర ఝఝారియా అన్నారు. 93 మీటర్లు ఈటెను విసిరేందుకు ట్రై చేయడంతోనే తర్వాత నాలుగు ప్రయత్నాల్లో అతడు ఫౌల్ అయ్యారని తెలిపారు. రెండో దఫాలోనే 89 మీటర్లు విసిరి రెండో స్థానంలో నిలిచిన అతడు స్వర్ణం కోసం ప్రయత్నించడం సబబేనని వివరించారు.
ముడా కేసులో సీఎం సిద్దరామయ్యపై విచారణ జరపడానికి గవర్నర్ ఇచ్చిన ఆదేశాలు రాజ్యాంగ విరుద్ధమని సీఎం తరఫు న్యాయవాదులు కర్ణాటక హైకోర్టు దృష్టికి తీసుకెళ్లారు. అసలు ఈ విషయంలో ఆయన ఎలాంటి కారణం చూపలేదన్నారు. గవర్నర్ క్యాబినెట్ నివేదికలకు కట్టుబడి ఉండాలని, సిద్దరామయ్య విషయంలో ఆయన చట్టవిరుద్ధంగా విచారణకు ఆదేశించారని వాదించారు.
AP: అనకాపల్లి(D) కైలాసపట్నంలోని అనాథాశ్రమంలో కలుషితాహారం తినడం వల్ల విద్యార్థులు <<13890531>>మరణించడంపై<<>> వైసీపీ చీఫ్ జగన్ దిగ్భ్రాంతి వ్యక్తం చేశారు. ఈ ఘటనలో ప్రభుత్వ నిర్లక్ష్యం స్పష్టంగా కనిపిస్తోందని, స్కూళ్లలో పర్యవేక్షణ కొరవడిందని విమర్శించారు. మరణించిన పిల్లల కుటుంబాలను ఆదుకోవాలని డిమాండ్ చేశారు. బురదజల్లుడు కార్యక్రమాలు మానుకొని వ్యవస్థల పనితీరుపై దృష్టిసారించాలన్నారు.
కోల్‌కతాలో హత్యాచారానికి గురైన ట్రైనీ డాక్టర్ తల్లిదండ్రులను మూడు గంటలపాటు ఆస్పత్రి వద్ద ఎందుకు వెయిట్ చేయించారంటూ ఆర్జీ కర్ మెడికల్ కాలేజీ మాజీ ప్రిన్సిపల్ డా. సందీప్ ఘోష్‌ను సీబీఐ ప్రశ్నించింది. ఘటనా స్థలానికి వచ్చిన వారిని ఆపడం వెనుక ఉన్నకారణాలపై ఆరా తీసింది. ‘ఈ ఘటనపై మీ మొదటి రియాక్షన్ ఏంటి? ముందుగా మీరు ఎవర్ని సంప్రదించారు?’ అంటూ ఘోష్‌ను సీబీఐ ప్రశ్నించింది.
ప్రపంచ ఫొటోగ్రఫీ దినోత్సవం రోజున మెగాస్టార్ చిరంజీవి తన తండ్రి ఫొటోను Xలో పోస్ట్ చేశారు. బ్లాక్ అండ్ వైట్ యుగంలో ఈ ఫొటోను తన ఆగ్ఫా కెమెరాలో తీసినట్లు పేర్కొన్నారు. ఆయన హీరోలా కనిపించారని తెలిపారు. ఫొటోలు టైమ్ ట్రావెల్ చేసే మిషన్స్ వంటివని రాసుకొచ్చారు.
AP: వచ్చే ఎన్నికల్లో YCPకి ఐదు సీట్లు కూడా రావని MLA విష్ణుకుమార్ రాజు జోస్యం చెప్పారు. ఆ పార్టీని BJPలో విలీనం చేస్తామంటే ఒప్పుకోబోమని, తీవ్రంగా వ్యతిరేకిస్తామని తెలిపారు. దోచుకున్న రూ.లక్షల కోట్ల డబ్బును జగన్ బెంగళూరు ప్యాలెస్‌లో దాచుకున్నారని ఆరోపించారు. ఆ ప్యాలెస్‌పై రైడ్ చేయకుండా CBI, CID, ACB ఏం చేస్తున్నాయని ప్రశ్నించారు. జగన్ విమానంలో ప్రయాణిస్తున్నప్పుడు కూడా చెక్ చేయాలని డిమాండ్ చేశారు.
హోమ్ లోన్లు తీసుకునే వారికి 1.2 రెట్లు అదనపు రుణం ఇవ్వనున్నట్లు స్టేట్ బ్యాంక్ ఆఫ్ ఇండియా ప్రకటించింది. ఇందుకోసం ఫ్లెక్సీ పేకు దరఖాస్తు చేసుకోవాలని వెల్లడించింది. మారటోరియం సమయంలో కేవలం వడ్డీ మాత్రమే చెల్లిస్తే సరిపోతుందని తెలిపింది. భవిష్యత్ ఆశలను ప్రస్తుత జీతం అడ్డుకోలేదంటూ SBI ఓ పోస్టర్‌ను రిలీజ్ చేసింది. హోమ్ లోన్ల కోసం 1800112018 లేదంటే వెబ్‌సైటు/సమీప బ్రాంచ్‌ను సంప్రదించాలని సూచించింది.
Sorry, no posts matched your criteria.