India's largestHyperlocal short
news App
Get daily news updates that are tailored for you based on your preferred language & location.

స్టార్ హీరోయిన్ సమంత కొత్త లుక్‌లో దర్శనమిచ్చారు. బాయ్ తరహాలో ఉన్న ఆమె లుక్ ప్రస్తుతం నెట్టింట చర్చనీయాంశంగా మారింది. మ్యాగజైన్ కోసం ఆమె పోజులిచ్చినట్లు తెలుస్తోంది. కాగా అనారోగ్యం నుంచి కోలుకున్న తర్వాత ఆమె కాస్త బక్కచిక్కారు. గత కొంత కాలంగా తెలుగు సినిమాలకు దూరమయ్యారు.

TG: ఎస్సీ వర్గీకరణకు వ్యతిరేకంగా తానెప్పుడూ మాట్లాడలేదని కాంగ్రెస్ ఎమ్మెల్యే గడ్డం వివేక్ వెంకటస్వామి తెలిపారు. ఈ అంశంపై ఊహాజనితంగా కాకుండా వాస్తవాల ప్రాతిపదికన వెళ్లాలని కోరారు. తాము మాలల సమావేశం పెట్టుకుంటే తప్పేంటన్న ఆయన మాదిగలు, రెడ్లు, బీసీలు సమావేశాలు పెట్టుకోలేదా? అని ప్రశ్నించారు. వర్గీకరణ చేయాలని కేంద్ర ప్రభుత్వాన్ని మందకృష్ణ మాదిగ ఎందుకు పట్టుబట్టట్లేదని నిలదీశారు.

చియా సీడ్స్ ప్రకృతి మనకిచ్చిన వరం అని వైద్యులు చెబుతున్నారు. ‘సబ్జాలా చిన్నవిగా ఉన్నా అద్భుతమైన పోషకాలు కలిగి ఉంటాయి. ఇందులో ఉండే ఒమేగా-3 ఫ్యాటీ యాసిడ్స్, ఫైబర్, ప్రొటీన్స్, యాంటీ యాక్సిడెంట్స్ మెదడు, గుండె ఆరోగ్యాన్ని మెరుగుపరుస్తాయి. ఫైబర్ పెద్ద పేగులోని ఆరోగ్యకరమైన బాక్టీరియాను మెరుగుపరిచి జీర్ణక్రియను సక్రమంగా ఉంచుతాయి. మెగ్నీషియం ప్రశాంతంగా, సంతోషంగా ఉండేందుకు సహాయపడతాయి’ అని సూచించారు.

TG: సీఎం రేవంత్ అధ్యక్షతన జరిగిన సమావేశంలో మంత్రి ఉత్తమ్ కుమార్ అధ్వర్యంలోని సబ్ కమిటీ ఇచ్చిన కులగణన నివేదికకు మంత్రివర్గం ఆమోదం తెలిపింది. దీంతో పాటు ఏకసభ్య కమిషన్ అందజేసిన ఎస్సీ వర్గీకరణ నివేదికను ఆమోదించింది. ఈ రెండు నివేదికలపై అసెంబ్లీ ప్రత్యేక సమావేశంలో చర్చించనున్నారు. కులగణనపై తీర్మానం చేసి కేంద్రానికి పంపనున్నారు. మ.2 గంటలకు అసెంబ్లీ ప్రత్యేక సమావేశం ప్రారంభం కానుంది.

TG: మస్తాన్ సాయి నిందితుడిగా ఉన్న <<15351108>>అభ్యంతరకర వీడియోల<<>> కేసులో దర్యాప్తు కొనసాగుతోంది. రికార్డు చేసిన వీడియోలతో అమ్మాయిలను బ్లాక్ మెయిల్ చేసి అత్యాచారం చేసినట్లు, ఫిర్యాదు చేసేందుకు వెళ్తున్న వారిని బెదిరించినట్లు పోలీసులు గుర్తించారు. దాదాపు 100 మందిని మోసం చేసినట్లు అనుమానిస్తున్నారు. మస్తాన్‌ను మరోసారి కస్టడీలోకి తీసుకుంటారని సమాచారం. బాధితులెవరైనా ఉంటే తమకు ఫిర్యాదు చేయాలని పోలీసులు సూచించారు.

టాలీవుడ్ ప్రముఖ నిర్మాత దిల్ రాజు విచారణ ముగిసింది. ఆయన బ్యానర్ నుంచి రిలీజైన సినిమాల నిర్మాణ వ్యయం, ఆదాయం గురించి ఐటీ అధికారులు ఆరా తీసినట్లు తెలుస్తోంది. దిల్ రాజుకు సంబంధించిన బిజినెస్ అకౌంట్స్ వివరాలు అడిగినట్లు సమాచారం. రెండు గంటల పాటు అధికారులు ఆయనను విచారించారు.

TG: ‘PM కుసుమ్’ స్కీమ్ కింద సాగుకు యోగ్యం కాని భూముల్లో సోలార్ పవర్ ప్లాంట్లు ఏర్పాటు చేసుకునే రైతులకు ప్రభుత్వం లోన్లు ఇవ్వనుంది. దీనికోసం ఈనెల 22లోగా రెడ్కో <

TG: బీఆర్ఎస్ చీఫ్, మాజీ సీఎం కేసీఆర్‌కు ప్రధాని మోదీ లేఖ రాశారు. ఇటీవల కేసీఆర్ సోదరి సకలమ్మ మరణించడంతో సంతాప సందేశం తెలియజేశారు. అక్క మరణంతో బాధలో ఉన్న గులాబీ బాస్ కుటుంబానికి ప్రగాఢ సానుభూతి తెలిపారు.

విదేశీయులను పంపించడానికి ఏదైనా మంచి ముహూర్తం కోసం చూస్తున్నారా అంటూ అస్సాం ప్రభుత్వాన్ని సుప్రీంకోర్టు ప్రశ్నించింది. ఇంకెన్నాళ్లు వారిని నిర్బంధ కేంద్రాల్లో ఉంచుతారని అడిగింది. 2 వారాల్లోగా 63 మందిని పంపేయాలని జస్టిస్ అభయ్, ఉజ్జల్ బెంచ్ ఆదేశించింది. ‘వాళ్ల అడ్రసులు తెలియవని పంపించరా? ఆ బాధ మీకెందుకు? వాళ్ల దేశానికి పంపేయండి. ఒకరిని విదేశీయుడిగా గుర్తించాక చర్యలు తీసుకోవాల్సిందే’ అని పేర్కొంది.

TG: శాసనసభ, మండలిలో బీఆర్ఎస్ పార్టీ విప్‌లను నియమిస్తూ KCR నిర్ణయం తీసుకున్నారు. శాసనసభలో బీఆర్ఎస్ విప్‌గా కుత్బుల్లాపూర్ ఎమ్మెల్యే కేపీ వివేకానందగౌడ్, మండలిలో విప్‌గా ఎమ్మెల్సీ సత్యవతి రాథోడ్‌ను నియమించారు. తమ పార్టీ అధినేత KCR నిర్ణయాన్ని స్పీకర్‌కు ఆ పార్టీ నేతలు తెలియజేశారు.
Sorry, no posts matched your criteria.