news

News August 18, 2024

రేపు సింఘ్వీ నామినేషన్.. ఇవాళ సీఎంతో భేటీ

image

TG: రాష్ట్రం నుంచి రాజ్యసభ అభ్యర్థిగా కాంగ్రెస్ నేత అభిషేక్ మను <<13871444>>సింఘ్వీ<<>> రేపు నామినేషన్ దాఖలు చేయనున్నారు. ఇవాళ హైదరాబాద్ రానున్న ఆయన సీఎం రేవంత్‌తో భేటీ అవుతారు. తర్వాత ఓ హోటల్‌లో జరిగే కాంగ్రెస్ శాసనసభా పక్షం సమావేశానికి హాజరవుతారు. మంత్రులు, ఎమ్మెల్యేలు, ఎమ్మెల్సీలు, సీనియర్ నేతలు ఈ భేటీలో పాల్గొంటారు.

News August 18, 2024

నెలాఖరు నుంచి బాలయ్య యాక్షన్

image

బాబీ డైరెక్షన్‌లో బాలకృష్ణ హీరోగా రూపొందుతోన్న మూవీ కొత్త షెడ్యూల్ ఈ నెలాఖరు నుంచి హైదరాబాద్‌లో ప్రారంభం కానున్నట్లు సమాచారం. బాలయ్యతో పాటు ముఖ్య నటీనటులంతా పాల్గొంటారని తెలుస్తోంది. కీలక సన్నివేశాలతోపాటు యాక్షన్ సీక్వెన్స్‌ను చిత్రీకరిస్తారని టాలీవుడ్ టాక్. ఈ సినిమాలో ప్రగ్యా జైస్వాల్, చాందినీ చౌదరి, ఊర్వశీ రౌతేలా హీరోయిన్లుగా నటిస్తున్నారు. తమన్ మ్యూజిక్ అందిస్తున్నారు.

News August 18, 2024

ఇంటర్ సిలబస్ కుదింపు.. బోర్డు పరీక్ష ఎత్తివేత?

image

AP: ఇంటర్‌ సిలబస్, పరీక్షల విధానంలో మార్పులకు ఇంటర్ బోర్డు కసరత్తు చేస్తోంది. MPCలో గణితం(2 పేపర్లు), BiPCలో వృక్ష, జంతు శాస్త్రం సిలబస్‌లను కుదించాలని యోచిస్తోంది. NCERTకి అనుగుణంగా వాటిని ఒక్కో పేపర్‌గా మార్చాలని భావిస్తోంది. అలాగే CBSEలో 11వ తరగతికి బోర్డు పరీక్ష లేకుండా ఇంటర్నల్ ఎగ్జామ్ నిర్వహిస్తున్నారు. ఈ విధానాన్ని APలో తీసుకొస్తే విద్యార్థులపై ఒత్తిడి తగ్గుతుందనే విషయాన్ని పరిశీలిస్తోంది.

News August 18, 2024

పార్లమెంటు గోడ దూకిన యువకుడు.. అరెస్టు

image

పార్లమెంటు ఆవరణలో తీవ్ర భద్రతావైఫల్యం చోటుచేసుకుంది. Annexe భవన ప్రాంగణంలోని గోడను దూకి ఓ యువకుడు(20) లోపలికి ప్రవేశించాడు. ఈ నెల 16న చోటుచేసుకున్న ఈ ఘటన ఆలస్యంగా వెలుగుచూసింది. వెంటనే అప్రమత్తమైన CISF సిబ్బంది, అతడిని అదుపులోకి తీసుకున్నారు. నిందితుడిని యూపీకి చెందిన మనీశ్‌గా గుర్తించామని, అతడి వద్ద ఎటువంటి ఆయుధాలు లేవని అధికారులు తెలిపారు. అతడిని విచారిస్తున్నట్లు వెల్లడించారు.

News August 18, 2024

బ్రెజిల్‌లో ట్విటర్ మూసివేత

image

బ్రెజిల్‌లో తమ కార్యకలాపాలను వెంటనే ఆపేస్తున్నట్లు ట్విటర్ ప్రకటించింది. ఆ దేశ ప్రధాన న్యాయమూర్తి అలెగ్జాండ్రె డీ మొరేస్ కారణంగానే ఈ నిర్ణయం తీసుకున్నామని పేర్కొంది. ‘అక్కడ మా హక్కులు, బాధ్యతల విషయంలో తను విధించిన సెన్సార్‌షిప్ పాటించాల్సిందేనని ఆయన బెదిరించారు. తను చెప్పినట్లు చేయకుంటే మా ప్రతినిధిని అరెస్టు చేయిస్తామన్నారు. సిబ్బంది భద్రత కోసం దేశంలో ట్విటర్ మూసేస్తున్నాం’ అని స్పష్టం చేసింది.

News August 18, 2024

BIG ALERT: ఈ జిల్లాల్లో ఇవాళ భారీ వర్షాలు

image

TG: రాష్ట్రంలో మరో 5 రోజులు వర్షాలు కొనసాగుతాయని HYD వాతావరణ కేంద్రం వెల్లడించింది. ఇవాళ నిర్మల్, నిజామాబాద్, కరీంనగర్, పెద్దపల్లి, భూపాలపల్లి, ములుగు, వరంగల్, హనుమకొండ, సిద్దిపేట, వికారాబాద్, సంగారెడ్డి, మెదక్ జిల్లాల్లో భారీ వర్షాలు కురుస్తాయని తెలిపింది. మిగతా జిల్లాల్లో మోస్తరు వానలు పడతాయంది. ఉరుములు, మెరుపులతోపాటు అక్కడక్కడా పిడుగులు పడతాయంటూ ఎల్లో అలర్ట్ జారీ చేసింది.

News August 18, 2024

టీడీపీ నేత దారుణ హత్య.. ఆ పార్టీ నాయకుడే నిందితుడు

image

AP: కర్నూలు(D) పత్తికొండలో సంచలనం సృష్టించిన TDP నేత శ్రీనివాసులు <<13849384>>హత్య కేసును<<>> పోలీసులు ఛేదించారు. అదే పార్టీకి చెందిన నర్సింహులే ఈ మర్డర్ చేసినట్లు తేల్చారు. గతంలో నర్సింహులును శ్రీనివాసులు చెప్పుతో కొట్టడంతో గొడవ మొదలైంది. అలాగే శ్రీనివాసులుకు పత్తికొండ PACS ఛైర్మన్ పదవి వస్తుందనే ప్రచారాన్ని జీర్ణించుకోలేక హతమార్చాడు. కాగా YCP నేతలే చంపారని మంత్రి లోకేశ్ ఆరోపించిన విషయం తెలిసిందే.

News August 18, 2024

అమరావతికి రూ.15వేల కోట్ల అప్పునకు ప్రపంచ బ్యాంకు ఓకే!

image

AP: కేంద్ర బడ్జెట్‌లో ప్రతిపాదించిన మేరకు అమరావతి నిర్మాణానికి రూ.15వేల కోట్ల రుణం ఇచ్చేందుకు ప్రపంచ బ్యాంకు ఓకే చెప్పినట్లు తెలుస్తోంది. ఆసియా డెవలప్‌మెంట్ బ్యాంక్‌తో కలిసి ఆ మొత్తాన్ని మంజూరు చేయనున్నట్లు సమాచారం. ఆయా బ్యాంకుల ప్రతినిధులు రేపటి నుంచి ఈ నెల 27 వరకు రాజధానిలో పర్యటించి వివిధ అంశాలపై ప్రభుత్వంతో చర్చించనున్నారు. వీలైనంత త్వరలోనే రుణం మంజూరు చేసే అవకాశముంది.

News August 18, 2024

ఏపీలో 7 కొత్త ఎయిర్‌పోర్టుల నిర్మాణానికి కృషి: కేంద్ర మంత్రి రామ్మోహన్

image

AP: రాష్ట్రంలో 7 ఎయిర్‌పోర్టులు ఉండగా, కొత్తగా మరో ఏడింటిని నిర్మించేందుకు ఉన్న అవకాశాలను పరిశీలిస్తున్నామని కేంద్ర మంత్రి రామ్మోహన్‌ తెలిపారు. ‘సీఎం చంద్రబాబు ఆదేశాల మేరకు ప్రస్తుతం ఉన్న విమానాశ్రయాల్లో టెర్నినల్ కెపాసిటీలు పెంచుతున్నాం. శ్రీకాకుళం, దగదర్తి, కుప్పం, నాగార్జున సాగర్, తుని-అన్నవరం, తాడేపల్లిగూడెం, ఒంగోలులో ఎయిర్‌పోర్టుల నిర్మాణానికి కృషి చేస్తాం’ అని తెలిపారు.

News August 18, 2024

భారత్‌లోనూ పెరిగిపోతున్న DINKS జంటలు: లాన్సెట్

image

ఇద్దరూ డబ్బు సంపాదిస్తున్నా పిల్లల్ని కనొద్దని భావించే జంటల్ని DINKS(Dual Income No Kids)గా పిలుస్తారు. పిల్లల కంటే తమ ఇతర అవసరాలపై దృష్టి సారించాలని వీరు భావిస్తుంటారు. విదేశాల్లో ఎక్కువగా ఉండే ఈ సంస్కృతి ఇప్పుడు భారత్‌లోనూ పెరుగుతోందని లాన్సెట్ సంస్థ అంచనా వేసింది. దానికి తగ్గట్టు జననాల రేటు పడిపోతోందని పేర్కొంది. 1950లో భారత సంతోనాత్పత్తి రేటు 6.18 శాతం కాగా 2021కి అది 1.91శాతానికి పడిపోయింది.

error: Content is protected !!