news

News August 17, 2024

అసలేంటీ ముడా స్కామ్?

image

మైసూర్ అభివృద్ధి కోసం ‘ముడా’ భూమి సేకరించింది. బదులుగా 50:50 పరిహారం ప్రకటించింది. అంటే ఎకరం తీసుకుంటే అర ఎకరం అభివృద్ధి చెందిన భూమి తిరిగిస్తారు. లేదంటే ఆర్థిక ప్యాకేజీ ఎంచుకోవచ్చు. <<13875697>>సిద్దరామయ్య<<>> భార్య పార్వతి నుంచి తీసుకున్న భూమికి 14 సైట్లు కేటాయించడం వివాదంగా మారింది. ప్రజలకు తక్కువ డబ్బు ఇచ్చారని, కొందరికి ఇవ్వలేదని, తక్కువ రేటుకు సన్నిహితులకు భూములు అమ్మేశారని అధికారులపై ఆరోపణలు ఉన్నాయి.

News August 17, 2024

ప్రభాస్-హను మూవీ స్టార్ట్

image

పాన్ ఇండియా స్టార్ ప్రభాస్ హీరోగా హను రాఘవపూడి తెరకెక్కించనున్న కొత్త సినిమా పూజా కార్యక్రమాలతో మొదలైంది. ఈ కార్యక్రమంలో పాల్గొన్న ప్రభాస్ కొత్త లుక్ ఆకట్టుకుంటోంది. మైత్రీ మూవీ మేకర్స్ ఈ సినిమాను నిర్మిస్తున్నారు. దీనికి సంబంధించిన అప్డేట్ ఈరోజు సాయంత్రం 4.05 గంటలకు ఉంటుందని మేకర్స్ ప్రకటన చేశారు.

News August 17, 2024

కోల్‌కతా ఘటన.. సీబీఐ విచారణకు మాజీ ప్రిన్సిపల్

image

కోల్‌కతా ట్రైనీ వైద్యురాలి హత్యాచారంపై సీబీఐ దర్యాప్తు ముమ్మరమైంది. ఘటన జరిగిన ఆర్జీ కర్ మెడికల్ కాలేజీ మాజీ ప్రిన్సిపల్ సందీప్ ఘోష్ సీబీఐ విచారణకు హాజరయ్యారు. ఆయనను అధికారులు విచారిస్తున్నారు. మరోవైపు ఘటనను నిరసిస్తూ దేశవ్యాప్తంగా వైద్యసిబ్బంది ఆందోళనలు కొనసాగుతున్నాయి.

News August 17, 2024

కలిచివేసే PHOTO

image

TG: ఉదయాన్నే తల్లిదండ్రులకు టాటా చెప్పి ఆనందంగా స్కూల్‌కు బయలుదేరిన ఓ విద్యార్థిని కాసేపటికే మృత్యు ఒడికి చేరుకుంది. రోడ్డు ప్రమాదంలో ఆ చిన్నారి చెయ్యి నిర్జీవంగా వేలాడుతున్న ఫొటో అందరినీ కలచివేస్తోంది. హైదరాబాద్ హబ్సిగూడలో వెనక నుంచి కంటైనర్ ఢీకొట్టడంతో ఓ ఆటో ముందు వెళ్తున్న బస్సు కిందకి చొచ్చుకెళ్లింది. దీంతో ఆటోలో ఉన్న టెన్త్ విద్యార్థిని సాత్విక అక్కడికక్కడే దుర్మరణం పాలైంది.

News August 17, 2024

భార్య కొడుతోందని పారిపోయాడు.. చివరికి

image

భార్య రోజూ కొడుతూ మానసికంగా హింసిస్తోందని ఓ వ్యక్తి ఇంటి నుంచి పారిపోయాడు. ఈ ఘటన బెంగళూరులో జరిగింది. సాఫ్ట్‌వేర్ ఇంజినీర్‌ విపిన్ గుప్తా ఈ నెల 4న తిరుమల శ్రీవారికి తలనీలాలు సమర్పించి కనిపించకుండా పోయాడు. దీంతో భార్య పోలీసులకు ఫిర్యాదు చేసింది. వారు అతడిని నోయిడాలో గుర్తించి BNGకు రప్పించారు. భార్య వేధింపులు తట్టుకోలేక పారిపోయానని అతను చెప్పాడు. పోలీసులు ఇద్దరికీ కౌన్సెలింగ్ ఇచ్చి పంపించారు.

News August 17, 2024

భూ కుంభకోణంలో సిద్దరామయ్యకు షాక్

image

కర్ణాటక సీఎం సిద్దరామయ్యకు షాక్. ముడా భూ కుంభకోణం కేసులో ఆయన విచారణ ఎదుర్కోనున్నారు. సమాచార హక్కు కార్యకర్త ఫిర్యాదు మేరకు సీఎంపై విచారణకు గవర్నర్ థావర్ చంద్ గహ్లోత్ అనుమతి ఇచ్చారు. ముఖ్యమంత్రి కార్యాలయం దీనిని ధ్రువీకరించింది. మరిన్ని వివరాలు తెలియాల్సి ఉంది.

News August 17, 2024

జాతీయ అవార్డుపై రిషబ్ కీలక నిర్ణయం

image

కన్నడ స్టార్ హీరో రిషబ్ శెట్టి కీలక నిర్ణయం తీసుకున్నారు. తనకు వచ్చిన జాతీయ అవార్డును రాష్ట్రంలోని దేవ నర్తకులకి, దివంగత హీరో పునీత్ రాజ్ కుమార్‌కి, కన్నడ ఆడియన్స్‌కి అంకితం చేస్తున్నట్లు ప్రకటించారు. జాతీయ అవార్డు గెలవడం ఎంతో సంతోషాన్ని ఇచ్చిందన్నారు. తన ప్రయాణంలో భాగమైన ప్రతి ఒక్కరికీ ధన్యవాదాలు తెలియజేశారు. హొంబలే ఫిల్మ్స్ ‘కాంతార’ను నిర్మించగా భారీ విజయాన్ని అందుకున్న విషయం తెలిసిందే.

News August 17, 2024

రామ్ చరణ్ ‘గేమ్ ఛేంజర్’ రిలీజ్ అప్డేట్

image

మెగా పవర్ స్టార్ రామ్ చరణ్ హీరోగా, కియారా హీరోయిన్‌గా నటిస్తుండగా శంకర్ తెరకెక్కిస్తోన్న ‘గేమ్ ఛేంజర్’ నుంచి అప్డేట్ వచ్చింది. శంకర్ బర్త్ డే సందర్భంగా నిర్మాణ సంస్థ ‘SVC’ ఆయనకు విషెస్ తెలియజేస్తూ ఈ ఏడాది క్రిస్మస్‌కు మూవీ రిలీజ్ అవుతుందని ప్రకటించింది. దీంతో ఎట్టకేలకు సినిమా రిలీజ్ తేదీ వచ్చేసిందని ఫ్యాన్స్ ఖుషీ అవుతున్నారు. ఈ చిత్రానికి తమన్ మ్యూజిక్ అందిస్తున్నారు.

News August 17, 2024

హరీశ్ రావు క్యాంప్ ఆఫీసుపై దాడి.. రాహుల్ గాంధీపై KTR ఫైర్

image

TG: హరీశ్ రావు క్యాంప్ ఆఫీసుపై జరిగిన <<13874861>>దాడి<<>> ఘటనపై కేటీఆర్ మండిపడ్డారు. ‘ఒకవైపు రాహుల్ గాంధీ మొహబ్బత్ (ప్రేమ) కా దుకాణ్ అని మాట్లాడుతుంటే ఆయన పార్టీ TGలో నఫ్రత్ (ద్వేషం) కా దుకాణ్ అంటూ హింసను ప్రేరేపిస్తోంది. రాజ్యాంగ పరిరక్షకుడినని చెప్పుకొనే రాహుల్ చేస్తున్న రాజ్యాంగ పరిరక్షణ ఇదేనా? తన పార్టీ చేస్తున్న ఈ కార్యక్రమాలకు రాహుల్ సిగ్గుతో తలదించుకోవాలి’ అని ఫైరయ్యారు.

News August 17, 2024

హరియాణాలో హ్యాట్రిక్‌పై మోదీ గురి

image

హరియాణాలో హ్యాట్రిక్ కొట్టాలని BJP కసరత్తు మొదలుపెట్టింది. ప్రధాన నాయకత్వంతో మోదీ శుక్రవారం రాత్రి హై లెవల్ మీటింగ్ నిర్వహించారు. నడ్డా, అమిత్ షా, రాజ్‌నాథ్, మనోహర్ లాల్‌తో ఎన్నికల వ్యూహం గురించి చర్చించారు. బీజేపీ గత వారమే రాష్ట్ర శాఖకు కొత్త అధ్యక్షుడు, ఎన్నికల ఇన్‌ఛార్జ్‌ను నియమించింది. రాష్ట్రంలో విపక్ష కూటమి బలపడటం, కుల సమీకరణాలు మారడం, అధికార పక్షంపై వ్యతిరేకత ఆ పార్టీకి సవాల్‌గా మారాయి.

error: Content is protected !!