news

News October 31, 2024

ఆనందం, ఆరోగ్యం, ఐశ్వర్యంతో తులతూగాలి: మోదీ

image

ప్రధాని నరేంద్రమోదీ దేశ ప్రజలకు దీపావళి శుభాకాంక్షలు తెలిపారు. ఈ దివ్యమైన వెలుగుల పండుగ రోజున ప్రతి ఒక్కరూ ఆనందం, ఆరోగ్యం, ఐశ్వర్యంతో తులతూగాలని కోరుకున్నారు. లక్ష్మీగణేశుల ఆశీర్వాదంతో అందరూ సంపన్నమవ్వాలని ప్రార్థించారు. ఆయనతో పాటు కేంద్ర మంత్రులు, వివిధ రాష్ట్రాల సీఎంలు ప్రజలకు విషెస్ చెబుతున్నారు. ఏపీ Dy CM పవన్ కళ్యాణ్ పాక్, బంగ్లా‌, అఫ్గాన్‌లోని హిందువులకూ శుభాకాంక్షలు చెప్పడం తెలిసిందే.

News October 31, 2024

7 ప్రభుత్వ ఉద్యోగాలు సాధించిన రైతు బిడ్డ

image

ఈ పోటీ ప్రపంచంలో ఒక్క ప్రభుత్వ ఉద్యోగం సాధించడమే గగనం. అలాంటిది మంచిర్యాల(D) జన్నారం(M) రోటిగూడకు చెందిన సంతోష్ 7 ఉద్యోగాలు సాధించారు. అతడి పేరెంట్స్ లచ్చన్న, రాజవ్వ రైతులు. 2023లో రైల్వేలో పాయింట్‌మెన్, సింగరేణిలో జూ.అసిస్టెంట్, 2024లో గురుకులాల్లో టీజీటీ, పీజీటీ, జూ.లెక్చరర్, డిగ్రీ లెక్చరర్ ఉద్యోగాలు సాధించారు. తాజాగా TGPSCలో జూ.లెక్చరర్ ఉద్యోగానికి ఎంపికైన సంతోష్ అందులోనే చేరుతానని తెలిపారు.

News October 31, 2024

వావ్.. ఇది హైదరాబాద్‌లో జరిగిందా?

image

HYD రోడ్లు అంటే ఏమాత్రం స్థలం కనిపించినా అందులోకి దూసుకెళ్లే వాహనాలే చాలామందికి గుర్తొస్తాయి. అయితే HYDలో ట్రాఫిక్ రూల్స్ తు.చ తప్పకుండా పాటించే వాళ్లూ ఉన్నారండోయ్. జూబ్లీహిల్స్ రోడ్ నం.45 ఫ్లైఓవర్‌ కింద వాహనాలు లైన్ డిసిప్లెన్ పాటిస్తూ వెళుతున్న పైఫొటో నెట్టింట వైరలవుతోంది. ‘నమ్మలేకపోతున్నాం’ అని కొందరంటే, ‘ఇది హైదరాబాద్‌లో జరిగిందా?’ అని ఇంకొందరు ఆశ్చర్యపోతున్నారు.

News October 31, 2024

అమిత్‌ షాపై కెనడా ఆరోపణలు: US స్పందన ఇదీ

image

HM అమిత్‌షాపై కెనడా ఆరోపణలు ఆందోళన కలిగించాయని అమెరికా తెలిపింది. దీనిపై ఆ దేశాన్ని నిరంతరం సంప్రదిస్తూనే ఉంటామని పేర్కొంది. ఆందోళన ఎందుకు కలిగిందో, ఏం తెలుసుకొనేందుకు సంప్రదిస్తారో మాత్రం వివరించలేదు. భారత్‌పై ఏమీ మాట్లాడలేదు. కెనడాలో నిజ్జర్ సహా ఖలిస్థానీలపై హింస, హత్యాయత్నాలకు కుట్రలు పన్నింది <<14488317>>అమిత్ షా<<>>నే అని డిప్యూటీ ఫారిన్ మినిస్టర్ డేవిడ్ మోరిసన్ అక్కడి పార్లమెంటుకు చెప్పడం తెలిసిందే.

News October 31, 2024

చాలాకాలం తర్వాత హ్యాపీగా నిద్రపోయా: కిరణ్

image

చాలాకాలం తర్వాత సంతోషంగా నిద్రపోయానని టాలీవుడ్ హీరో కిరణ్ అబ్బవరం ట్వీట్ చేశారు. దీపావళిని సంతోషకరంగా మార్చినందుకు అందరికీ కృతజ్ఞతలు, శుభాకాంక్షలు చెప్పారు. కిరణ్ అబ్బవరం నటించిన ‘క’ సినిమా ఈ రోజు థియేటర్లలో రిలీజ్ అయ్యింది. ఈ మూవీకి ప్రేక్షకుల నుంచి మంచి రెస్పాన్స్ వస్తోంది. ఈ నేపథ్యంలోనే ఆయన ఈ ట్వీట్ చేశారు.

News October 31, 2024

మయోనైజ్ గురించి తెలుసా?

image

బర్గర్లు, శాండ్‌విచ్‌లు, సలాడ్లలో మయోనైజ్ వేసుకుని తింటారు. పచ్చి గుడ్డులోని తెల్లసొనను నూనె, వెనిగర్/నిమ్మరసం, నీటిలో కలిపితే ఇది తయారవుతుంది. దీన్ని తయారుచేసిన 3, 4 గంటల్లోనే వినియోగించాలని లేదంటే సాల్మనెల్లా, లిస్టెరియా మోనోసైటోజెన్, స్టెఫిలోకాకస్ ఆరియస్ అనే ప్రమాదకర బ్యాక్టీరియాలు వృద్ధి చెందుతాయి. ఫలితంగా డయేరియా, కడుపునొప్పి లాంటి సమస్యలు వస్తాయి. తాజాగా TG ప్రభుత్వం దీన్ని బ్యాన్ చేసింది.

News October 31, 2024

వేద పండితులకు రూ.3,000.. ఉత్తర్వులు జారీ

image

AP: రాష్ట్రంలోని వేద పండితులకు నెలకు రూ.3వేల చొప్పున నిరుద్యోగ భృతి చెల్లించేందుకు ప్రభుత్వం సిద్ధమైంది. ఈ మేరకు ఉత్తర్వులు జారీ చేసింది. దాదాపు 600 మందికి సింహాచలం, అన్నవరం, కనకదుర్గ, శ్రీకాళహస్తి, ద్వారకాతిరుమల, శ్రీశైలం, కాణిపాకం ఆలయాల నుంచి సంభావన చెల్లించాలని పేర్కొంది. ఈ సాయం పొందే పండితులు వారి నివాసానికి సమీపంలోని ఆలయంలో రోజూ గంటపాటు వేద పారాయణం చేయాలంది.

News October 31, 2024

ఈ ఆలయం దీపావళి రోజు మాత్రమే తెరుస్తారు

image

కర్ణాటకలోని హసన్‌ పట్టణంలో ఉన్న హసనాంబా ఆలయంలో దుర్గాదేవి హసనాంబాదేవిగా పూజలందుకుంటారు. ప్రతి సంవత్సరం దీపావళి సందర్భంగా మాత్రమే ఈ ఆలయం తెరుస్తారు. దీపావళి రోజు ఇక్కడ ఉత్సవాలు నిర్వహిస్తారు. అవి పదిరోజుల పాటు కొనసాగుతాయి. ఉత్సవాల సమయంలో అమ్మవారిని దర్శించుకుంటే కోర్కెలు నెరవేరుతాయని భక్తులు నమ్ముతుంటారు. మీ ప్రాంతంలో ఇలాంటి ఆలయాలు ఉన్నాయా? కామెంట్ చేయండి.

News October 31, 2024

మాజీ మంత్రి అప్పలరాజుకు తీవ్ర అస్వస్థత

image

AP: మాజీ మంత్రి, వైసీపీ నేత సీదిరి అప్పలరాజు తీవ్ర అస్వస్థతకు గురయ్యారు. నిన్న పలాసలోని ఇంటి వద్ద వ్యాయామం చేస్తుండగా కుప్పకూలారు. వెంటనే కుటుంబసభ్యులు శ్రీకాకుళంలో ఓ ప్రైవేటు ఆస్పత్రికి తరలించి ఐసీయూలో చికిత్స అందించారు. ప్రస్తుతం ఆయన ఆరోగ్యం నిలకడగా ఉన్నట్లు వైద్యులు తెలిపారు.

News October 31, 2024

పెట్టుబడులకు ఇదే మంచి సమయం: లోకేశ్

image

APలో పెట్టుబడులకు అనుకూల వాతావరణం ఉందని, పరిశ్రమలు స్థాపించాలనుకునేవారికి ఇదే మంచి సమయమని మంత్రి లోకేశ్ అన్నారు. అమెరికాలో ఆయన యూఎస్-ఇండియా బిజినెస్ కౌన్సిల్ ప్రతినిధులతో సమావేశమయ్యారు. అనంతపురంలో ఆటోమొబైల్, కర్నూలులో రెన్యువబుల్ ఎనర్జీ, విశాఖలో ఐటీ, ఫార్మా, ప్రకాశంలో బయోఫ్యూయల్, గోదావరి జిల్లాల్లో ఆక్వా పరిశ్రమలకు ప్రోత్సాహం అందించాలని కోరారు. త్వరలో అమరావతి పనులు ప్రారంభం కాబోతున్నాయన్నారు.