India's largestHyperlocal short
news App
Get daily news updates that are tailored for you based on your preferred language & location.
శ్రీహరికోటలోని షార్ నుంచి దూసుకెళ్లిన SSLV-D3 రాకెట్ ప్రయోగం విజయవంతమైంది. ఈవోఎస్-08ను సైంటిస్టులు కక్ష్యలో ప్రవేశపెట్టారు. ఉదయం 9.17 గంటలకు రాకెట్ నింగిలోకి దూసుకెళ్లగా, 4 దశల్లో ఘన, ద్రవ ఇంధనాలను ఉపయోగించి భూమికి 475 కిలోమీటర్ల ఎత్తులో ఉన్న కక్ష్యలో ఉపగ్రహాన్ని ప్రవేశపెట్టారు. మొత్తంగా 16.57 నిమిషాల్లో ప్రయోగం ముగిసింది. దీంతో సైంటిస్టులు సంతోషం వ్యక్తం చేశారు.
SSLV-D3 రాకెట్ ద్వారా EOS-08 శాటిలైట్‌ను ఇస్రో నింగిలోకి ప్రవేశపెట్టింది. దీని బరువు 175KGలు. ఇందులో ఎలక్ట్రో ఆప్టికల్ ఇన్‌ఫ్రారెడ్, గ్లోబల్ నావిగేషన్ సిస్టమ్-రిఫ్లెక్టోమెట్రీ, యూవీడోసిమీటర్ అనే 3 పేలోడ్లను అమర్చారు. సముద్రాలపై గాలులు, తేమ, హిమాలయాల్లో క్రియోస్పియర్, అగ్నిపర్వత పేలుళ్లు, పారిశ్రామిక విపత్తులు, వరదలను గుర్తించి ఫొటోలను తీసి పంపడం ఈ ప్రయోగ లక్ష్యం. ఈ మిషన్ ఏడాదిపాటు సేవలందిస్తుంది.
TG: రాష్ట్ర ప్రభుత్వం మహాలక్ష్మి పథకంలో భాగంగా అమలు చేస్తోన్న మహిళలకు ఫ్రీ బస్‌పై KTR చేసిన వ్యాఖ్యలపై కాంగ్రెస్ అభ్యంతరం వ్యక్తం చేస్తోంది. మహిళలను KTR కించపరిచారంటూ నేడు రాష్ట్రవ్యాప్త ఆందోళనకు పిలుపునిచ్చింది. అయితే ఈ ‘ఫ్రీ బస్’ ఆడవాళ్లకు ఆర్థికంగా లబ్ధి చేకూరుస్తోందని కొందరంటే, బస్సులో సీట్లే దొరకట్లేదని ఇంకొందరంటున్నారు. ఈ ఫ్రీ బస్ స్కీమ్‌పై మీ అభిప్రాయం ఏంటో కామెంట్ చేయండి.
AP: పల్నాడు(D) సత్తెనపల్లి వాసి మస్తాన్, షీబా(కేరళ) దంపతులకు ఐదో నెలలోనే బాలిక అయత్ జన్మించింది. కేవలం 500 గ్రాముల బరువు ఉండటం, అవయవాలు పూర్తిగా రూపుదాల్చకపోవడంతో ప్రత్యేక వైద్య పరికరాల సాయంతో బిడ్డను కాపాడుకున్నారు. ప్రస్తుతం బాలిక కేరళలో LKG చదువుతోంది. 2023-24లో 197 రోజులు తరగతులు నిర్వహించగా అన్ని రోజులూ హాజరైంది. దీంతో ఇంటర్నేషనల్ బుక్ ఆఫ్ రికార్డ్స్ సహా 4 రికార్డుల్లో చోటు దక్కించుకుంది.
నిన్న ఒకే రోజు 4 కొత్త సినిమాలు రిలీజవడంతో టాలీవుడ్ బాక్సాఫీస్ కళకళలాడుతోంది. హరీశ్ డైరెక్షన్‌లో రవితేజ-భాగ్యశ్రీ జంటగా ‘మిస్టర్ బచ్చన్’, పూరీ-రామ్ కాంబోలో ‘డబుల్ ఇస్మార్ట్’ ప్రేక్షకుల ముందుకు వచ్చాయి. అలాగే పా.రంజిత్ డైరెక్షన్‌లో విక్రమ్ నటించిన ‘తంగలాన్’, నార్నె నితిన్ హీరోగా ‘ఆయ్’ మూవీలు సందడి చేస్తున్నాయి. వేర్వేరు జోనర్లలో రూపొందిన ఈ సినిమాల్లో మీకు ఏది నచ్చింది? కామెంట్ చేయండి.
ట్రైనీ డాక్టర్ హత్యాచారం కేసులో CBI దర్యాప్తు ఆరంభించింది. పలువురు వైద్యులు, నర్సులు, మిత్రుల నుంచి CBI అధికారులు కీలక వివరాలు సేకరించారు. కుమార్తె మరణం గురించి సమాచారం ఎప్పుడిచ్చారో తల్లిదండ్రులను అడిగి తెలుసుకున్నారు. RGకర్ ఆస్పత్రిలో మృతురాలికి ఎవరితోనైనా విభేదాలున్నాయా అని ఆమె మిత్రురాలిని ప్రశ్నించారు. కస్టడీలో ఉన్న అనుమానితుడి కాల్ రికార్డులు, మొబైల్లో హత్యను చిత్రీకరించారేమో పరిశీలించారు.
TG: మహిళలకు ఉచిత బస్సు ప్రయాణంపై తన <<13865400>>వ్యాఖ్యలు<<>> వివాదాస్పదం కావడంపై మాజీ మంత్రి KTR స్పందించారు. ‘నిన్న పార్టీ సమావేశంలో యథాలాపంగా చేసిన వ్యాఖ్యల వల్ల మా మహిళా సోదరీమణులకు మనస్తాపం కలిగినట్లయితే విచారం వ్యక్తం చేస్తున్నాను. నా అక్కాచెల్లెమ్మలను కించపరిచే ఉద్దేశం ఎప్పుడూ లేదు’ అని ట్వీట్ చేశారు. మరోవైపు KTR వ్యాఖ్యలకు నిరసనగా కాంగ్రెస్ ఇవాళ రాష్ట్రవ్యాప్త ఆందోళనలకు పిలుపునిచ్చింది.
త్వరలో జరగనున్న వివిధ రాష్ట్రాల అసెంబ్లీ ఎన్నికల షెడ్యూల్‌ను ఈసీ ఇవాళ ప్రకటించనుంది. మధ్యాహ్నం 3 గంటలకు సీఈసీ రాజీవ్ కుమార్ ప్రెస్‌మీట్ నిర్వహించి వివరాలు వెల్లడించనున్నారు. కాగా జమ్మూకశ్మీర్, హరియాణా, మహారాష్ట్ర, ఝార్ఖండ్ రాష్ట్రాల్లో అసెంబ్లీ ఎన్నికలు జరగనున్నాయి.
దేశవ్యాప్తంగా నిన్న జెండా వందనం జరిగింది. జెండాలతో ముస్తాబైన వీధులు ఇప్పుడు బోసిపోయాయి. అయితే తొలగించిన ఆ జెండాలను ధ్వంసం చేయవద్దనే కఠిన నిబంధనలున్నాయి. కానీ గాలికి చిరిగినా, మురికిగా మారిన వాటిని మాత్రం ఫ్లాగ్ కోడ్ 2022 ప్రకారం దాన్ని గౌరవమైన పద్ధతిలో విసర్జనం చేయవచ్చు. అంటే ఖననం లేదా నదిలో వదిలేయడం, కాల్చేయడం. అయితే అది పబ్లిక్‌గా చేసేందుకు వీల్లేదు. వీడియోలు, ఫొటోలు అసలే తీయకూడదు.
<<13858551>>మూకదాడి<<>> వల్ల ధ్వంసమైన RG కర్ ఆస్పత్రి పూర్వస్థితికి చేరేందుకు 2, 3 వారాలు పట్టొచ్చని ఆస్పత్రి వర్గాలు అంటున్నాయి. 40 మంది ప్రవేశించి ఎమర్జెన్సీ, నర్సింగ్ స్టేషన్, మెడిసిన్ స్టోర్, CCTV కెమెరాలను నాశనం చేశారని పేర్కొన్నాయి. ‘హత్యాచారం జరిగిన సెమినార్ హాల్‌లో కొంతభాగం, విలువైన ఎక్స్‌రే మెషీన్లు, ఫ్రిజ్‌లు ధ్వంసం అయ్యాయి. అసలు వారెందుకు వచ్చారు? జరిగిన నష్టం తెలుసుకోవాల్సి ఉంది’ అని వెల్లడించాయి.
Sorry, no posts matched your criteria.