news

News February 3, 2025

గ్రూప్-1 ఫలితాల వెల్లడికి లైన్ క్లియర్

image

TG: గ్రూప్-1 పరీక్ష ఫలితాల విడుదలకు లైన్ క్లియర్ అయింది. నియామకాలపై వివిధ రకాల అభ్యంతరాలతో పలువురు అభ్యర్థులు దాఖలు చేసిన రెండు పిటిషన్లను సుప్రీంకోర్టు కొట్టివేసింది. దీంతో త్వరలోనే గ్రూప్-1 ఫలితాలు విడుదల కానున్నాయి.

News February 3, 2025

ఇది రాహుల్ అవివేకానికి నిదర్శనం: కిషన్ రెడ్డి

image

యూపీఏ ప్రభుత్వంలోని వైఫల్యాలను ఎన్డీఏ ప్రభుత్వానికి ఆపాదించడం రాహుల్ గాంధీ అవివేకానికి నిదర్శనమని కేంద్ర మంత్రి కిషన్ రెడ్డి విమర్శించారు. కాంగ్రెస్ హయాంలో పదేళ్లలో 2.9 కోట్ల ఉద్యోగాల సృష్టి జరిగితే ఎన్డీఏ పాలనలో ఒక్క 2024లోనే 4.9 కోట్లు సృష్టించినట్లు ఆర్బీఐ నివేదిక పేర్కొందని Xలో తెలిపారు. వివిధ రంగాల్లో కాంగ్రెస్‌ ప్రభుత్వ పాలనతో పోలిస్తే NDA ప్రభుత్వంలోనే ఉపాధిలో వృద్ధి ఉందని వెల్లడించారు.

News February 3, 2025

వీటి పూర్తి పేర్లు మీకు తెలుసా?

image

నిత్యం ఏదోచోట మనం వినియోగించే వస్తువుల కంపెనీల ఫుల్‌ఫామ్స్ చాలా మందికి తెలియదు. అందులో కొన్నింటి గురించి తెలుసుకుందాం. TVS- తిరుక్కురుంగుడి వెంగారం సుందరం, SYSKA- శ్రీ యోగి సంత్ కృపా అనంత్, WIPRO- వెస్ట్రన్ ఇండియా పామ్ రిఫైన్డ్ ఆయిల్స్ లిమిటెడ్, HDFC- హౌసింగ్ డెవలప్‌మెంట్ ఫైనాన్స్ కార్పొరేషన్, PAYTM- పే థ్రూ మొబైల్, MRF- మద్రాస్ రబ్బర్ ఫ్యాక్టరీ. మీకు ఇంకేమైనా తెలిస్తే కామెంట్ చేయండి.

News February 3, 2025

వైసీపీ ‘ఫీజు పోరు’ మార్చి 12కు వాయిదా

image

AP: విద్యార్థులకు వెంటనే ఫీజు రీయింబర్స్‌మెంట్‌ ఇవ్వాలని కోరుతూ, ఈనెల 5న తలపెట్టిన ‘ఫీజు పోరు’ కార్యక్రమాన్ని వైసీపీ మార్చి 12కి వాయిదా వేసింది. ఈ మేరకు Xలో ప్రకటన రిలీజ్ చేసింది. రాష్ట్రంలోని మెజారిటీ జిల్లాల్లో ఎమ్మెల్సీ ఎన్నికల కోడ్‌ అమలులో ఉన్న నేపథ్యంలో ఈ నిర్ణయం తీసుకున్నట్లు తెలిపింది. ఈ కార్యక్రమానికి అనుమతి ఇవ్వాలని కోరినా, ఎన్నికల సంఘం నుంచి ఎలాంటి స్పందన రాలేదని పేర్కొంది.

News February 3, 2025

పరీక్ష లేకుండానే లక్షన్నర జీతంతో ఉద్యోగాలు

image

NTPCలో 475 ఇంజినీరింగ్ ఎగ్జిక్యూటివ్ ట్రైనీ పోస్టుల భర్తీకి దరఖాస్తుల ప్రక్రియ కొనసాగుతోంది. బీటెక్‌లో 65శాతం పర్సెంటేజీ కలిగి ఉండాలి. ఎలాంటి రాత పరీక్ష లేకుండా గేట్ స్కోర్ ఆధారంగా ఉద్యోగాలకు ఎంపిక చేస్తారు. రిజర్వేషన్ బట్టి వయోపరిమితి ఉంది. అప్లికేషన్ ఫీజు: జనరల్, ఓబీసీ, ఈడబ్ల్యూఎస్ అభ్యర్థులకు రూ.300. ఈ నెల 13 వరకు అప్లికేషన్లు స్వీకరిస్తారు. జీతం గరిష్ఠంగా రూ.1,40,000. <>వెబ్‌సైట్<<>>: careers.ntpc.co.in/recruitment/

News February 3, 2025

బీసీల పొట్ట కొట్టడానికే తప్పుడు లెక్కలు: ఆర్. కృష్ణయ్య

image

TG: రాష్ట్ర ప్రభుత్వం ప్రకటించిన కులగణన లెక్కలు తప్పు అని MP ఆర్.కృష్ణయ్య ఆరోపించారు. ‘KCR చేసిన సర్వేలో 52% BCలు ఉన్నారు. మురళీధర్, మండల్ కమిషన్ రిపోర్ట్ ప్రకారమూ అంతే శాతం ఉన్నారు. కాంగ్రెస్ ప్రభుత్వం 42 శాతమే బీసీలు ఉన్నట్లు చూపిస్తోంది. BCల పొట్ట కొట్టడానికే తప్పుడు లెక్కలు చూపిస్తున్నారు. EWS రిజర్వేషన్లు కాపాడేందుకు BCలకు అన్యాయం చేస్తున్నారు. ఈ లెక్కలను మళ్లీ రివ్యూ చేయాలి’ అని కోరారు.

News February 3, 2025

ఏపీ బ్రాండ్ అంబాసిడర్‌గా ఉండేందుకు సిద్ధం: సోనూసూద్

image

సామాన్యుల కోసం తన ఫౌండేషన్ పని చేస్తుందని, AP బ్రాండ్ అంబాసిడర్‌గా ఉండేందుకు తాను సిద్ధమని సోనూసూద్ చెప్పారు. ఎమర్జెన్సీ లైఫ్ సేవింగ్ కోసం అంబులెన్సులు ఇచ్చినట్లు పేర్కొన్నారు. అటు, సోనూసూద్‌ను కలవడం సంతోషంగా ఉందని, ఆయన తన ఫౌండేషన్ ద్వారా 4 అంబులెన్సులు ఇవ్వడం పట్ల సీఎం చంద్రబాబు ధన్యవాదాలు తెలిపారు. దీంతో మారుమూల గ్రామాల్లో అందిస్తున్న వైద్య సేవలకు బలం చేకూర్చినట్లు అయిందన్నారు.

News February 3, 2025

రేపు ఢిల్లీకి మంత్రి నారా లోకేశ్

image

AP: మంత్రి నారా లోకేశ్ రేపు సా.4.30 గంటలకు ఢిల్లీ వెళ్లనున్నారు. అక్కడ కేంద్ర మంత్రి అశ్వినీ వైష్ణవ్‌తో సా.5.45 గంటలకు భేటీ కానున్నారు. రాష్ట్రానికి రైల్వే బడ్జెట్‌లో కేటాయింపులపై ధన్యవాదాలు తెలపడంతో పాటు పలు అంశాలపై చర్చించనున్నట్లు సమాచారం. రాత్రి 9 గంటలకు తిరిగి లోకేశ్ విజయవాడ బయల్దేరనున్నారు. రైల్వే బడ్జెట్‌లో రాష్ట్రానికి రూ.9,417 కోట్లు కేటాయించిన విషయం తెలిసిందే.

News February 3, 2025

మత మార్పిడులపై సంచలన బిల్లు

image

మతమార్పిడులపై సంచలన బిల్లును రాజస్థాన్ ప్రభుత్వం అసెంబ్లీలో ప్రవేశపెట్టింది. ఆ బిల్లు ప్రకారం మత మార్పిడి చేసుకోవాలని నిర్ణయించుకున్నవారు దాదాపు 2 నెలల ముందు కలెక్టర్‌కు దరఖాస్తు చేసుకోవాల్సి ఉంటుంది. సొంతంగా నిర్ణయం తీసుకున్నామని, ఎవరి బలవంతం లేదని తెలిపితేనే అనుమతి లభిస్తుంది. ఎస్సీలు, తెగలు, మహిళలు, మైనర్లను బలవంతంగా మత మార్పిడులకు ప్రోత్సహిస్తే 2-10 ఏళ్ల జైలు శిక్ష, రూ.25వేల జరిమానా ఉంటుంది.

News February 3, 2025

ఎక్స్‌లెంట్ ఇన్నింగ్స్.. థాంక్యూ సాహా: BCCI

image

వృద్ధిమాన్ సాహా ఇటీవల అంతర్జాతీయ క్రికెట్ నుంచి రిటైరైన విషయం తెలిసిందే. ఈ క్రమంలో ఆయన సేవలను కొనియాడుతూ BCCI పోస్టర్ విడుదల చేసింది. సాహాది అద్భుతమైన కెరీర్, ఎక్స్‌లెంట్ ఇన్నింగ్స్ అని పేర్కొంది. భారత జట్టుకు అందించిన సేవలకు థాంక్స్ చెప్పింది. భవిష్యత్తు మంచిగా సాగాలని కోరుకుంటున్నట్లు విష్ చేసింది. సాహా 28ఏళ్ల పాటు స్కూల్, కాలేజ్, యూనివర్సిటీ తదితర లెవెల్స్‌లో క్రికెట్ ఆడారు.